![Rakesh Master Asked Advance Where To Bury - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/19/1.jpg.webp?itok=ST2gEdzV)
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో తను చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పారు. ఇప్పుడా మాటాలు వైరల్ అవుతున్నాయి. తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియోను ముందే తీశామని తెలిపాడు. తన మామగారు (భార్య తండ్రి) సమాధి పక్కన ఒక వేప మొక్కన నాటాడట. తను మరణించాక ఆ చెట్టు కిందే సమాధి చేయాలని ఓ ఇంటర్వ్యూలో కోరాడు.
(ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్)
తన తమ్ముడంటే చాలా ఇష్టమని తను చనిపోయినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపాడు. తర్వాత తన అమ్మ చనిపోవడంతో జీవితం మీద విరక్తి పుట్టిందని చెప్పేవాడు. ఇలా తన కుటుంబ సభ్యుల్లో అక్క కుమారుడితో పాటు తండ్రి కూడా మరణించడంతో చావు అంటే భయం లేకుండా పోయిందని తెలుపుతూ.. ఆ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టాడు.
(ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?)
Comments
Please login to add a commentAdd a comment