Shekar Mastar
-
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం...!
-
శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్కి ఫిదా అయినా తమన్నా
-
‘రాజంపేట రాణి'పాట బాగుంది: శేఖర్ మాస్టర్
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్‌గా శాంతి కుమార్ అందిరికీ పరిచయమే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సినివుమా దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రంలోని ‘రాజంపేట రాణిని’ అంటూ సాగే మాస్ బీట్ పాటను చూశా. సంగీతం, కొరియోగ్రఫీ చాలా బావుంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. జబర్దస్త్ నుంచి వెళ్లిన వేణు ‘బలగం’ చిత్రంతో పెద్ద పేరు తెచ్చుకున్నాడు శాంతి కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ ‘జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు , పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. శేఖర్ మాస్టర్ ఈ మాస్ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. -
రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే
టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ (53) ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. 1,500కి పైగా సినిమాల్లోని పాటలకి పని చేసిన ఆయన.. తర్వాత పలు డాన్స్ రియాలిటీ షోలతో మెరిశారు. కరోనా సమయంలో ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది. ఆ తర్వాత రాకేశ్ మాస్టరే సొంతంగా పలు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని పలు వీడియోలు అందులో పోస్ట్‌చేసే వారు. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కడ ఆయన మామగారు పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు. (ఇదీ చదవండి: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్) '1996లో కొంత మంది యువకులను గ్రూప్‌గా తయారు చేసి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రాకేశ్ మాస్టర్ వచ్చాడు. నాది విజయవాడు.. శేఖర్ మాస్టర్ మా ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. దీంతో శేఖర్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. శేఖర్‌కు కూడా డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో నేనే అతన్ని రాకేశ్ మాస్టర్ వద్దకు చేర్చాను. ఇలా వారిద్దరూ సినీ పరిశ్రమలో పేరుపొందారు. ఆ రోజుల్లోనే వారి కష్టంతో వచ్చిన డబ్బు నా చేతికి ఇచ్చేవారు.. దానిని నేనే దాచి హైదరాబాద్‌లోని బోరుబండలో ఇళ్లు కొన్నాను. అందులోనే కొద్దిరోజులు అందరం కలిసే ఉన్నాం. ఆ తర్వాత నేను విజయవాడ వెళ్లిపోయాను. ఈ మధ్య ఎస్ఆర్కే పేరుతో రాకేశ్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు. దాని నుంచి మంచి ఆదాయం వస్తుంది. కొద్దిరోజుల క్రితం నా వద్దకు ఒక ఖాళీ అగ్రిమెంట్ పేపర్‌తో రాకేశ్ మాస్టర్ వచ్చి ఇలా అన్నాడు. 'మామయ్య నువ్వు చనిపోతే నీ కుంటుంబాన్ని నేను కాపాడుతా... ఒకవేళ నేనే ముందు చనిపోతే నీవు అన్యాయం అయిపోతావ్ కాబట్టి ఈ అగ్రిమెంట్ పేపర్ తీసుకో .. నేను చనిపోయిన తర్వాత ఈ ఖాళీ పేపర్లో నీకు ఇష్టం వచ్చింది రాసుకో అన్నాడు.' (ఇదీ చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?) కొడుకు మాదిరి చూసుకున్న వాడే నేడు లేడు.. ఈ ఆస్తులు తనకెందుకు అంటూ ఆ అగ్రిమెంట్ పేపర్‌ను శేఖర్,సత్య మాస్టర్ ముందే ఆ పెద్దాయన చింపేశాడు. తను కష్టపడి సంపాధించిన ఆస్తి రాకేశ్ మాస్టర్ బిడ్డలకే చెందుతుందని ఆయన తెలిపాడు. ఆయన శిష్యులుగా పిల్లల బాధ్యతను తీసుకుంటామని శేఖర్,సత్య మాస్టర్లు ప్రకటించారు. -
రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి రియాక్ట్ అయిన శేఖర్ మాస్టర్
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొద్దిరోజుల క్రితం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసింది. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: 'పుష్ప' పాటకు మనవాళ్ల డ్యాన్స్.. స్టాండింగ్ ఒవేషన్‌తో అమెరికన్స్) ఈ సందర్భంగా తను శిష్యులు అయినటువంటి శేఖర్ మాస్టర్‌తో పాటు సత్య మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. రాకేష్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన మరణం తర్వాత శేఖర్ మాస్టర్ తొలిసారి ఇలా గుర్తుచేసుకున్నారు. 'నేను, సత్య ఇద్దరం విజయవాడలో డ్యాన్స్‌కు సంబంధించి బేసిక్స్ వరకు నేర్చుకున్నాం. డ్యాన్స్ అంటే మక్కువతో హైదరాబాద్‌కు వచ్చాం. మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు రాకేష్మాస్టర్ ఆశ్రయం కల్పించి, డ్యాన్స్ నేర్పించారు. రాకేశ్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. మాది 8 ఏళ్ల అనుబంధం. మీరు యూట్యూబ్‌లో ఆయన డ్యాన్స్‌ను చూసింది 5 శాతమే. ఆయనకు ఉన్న టాలెంట్ చాలామందికి తెలియదు. మొదట్లో నేను ప్రభుదేవా మాస్టర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రాకేశ్ మాస్టర్ని అభిమానించడం ప్రారంభించా. ఆయన మా గురవు అని చెప్పుకుంనేందకు ఎప్పటికీ గర్వంగానే ఫీలవుతాము. ఆ రోజుల్లో డ్యాన్స్ తప్పా మాకు మరో ప్రపంచం లేదు. అప్పట్లో ఆయన పెళ్లి కూడా మేమే చేశాం. ఎప్పుడూ రాకేశ్ మాస్టర్ దగ్గరే ఉండేవాళ్లం. ఆయన ఎక్కడున్నా బాగుండాలనే కోరుకునే వాళ్లం, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంతలా ఆయనతో అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వారు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టి ఏదేదో రాసేస్తున్నారు. దయచేసి మీకు వాస్తవాలు తెలిస్తేనే రాయండి. లేదంటే రాయకండి. ప్లీజ్.. ఇకనైనా ఆపేయండి' అని శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) -
రాకేశ్ మాస్టర్ భౌతికకాయానికి నివాళిలు అర్పించిన శేఖర్ మాస్టర్
-
నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్
టాలీవుడ్లో దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ పరిశ్రమ నుంచి ఆయనకు సోషల్ మీడియా ద్వార పలువురు సంతాపం ప్రకటించారు. గతంలో ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న విషయాలను అభిమానులు షేర్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ చనిపోయన తర్వాత ఏం జరుగుతుందో ఓ ఇంటర్వ్యూలో ముందే ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్ మాస్టర్) 'నా మరణం తర్వాత శేఖర్, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారు. కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వారికి ఏడుపు రాకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచిమాటలు చెబుతూ.. ఎప్పుడెప్పుడూ డెడ్‌బాడీని తీసేస్తారా..? అక్కడి నుంచి వెళ్లిపోదామా? అని' ఉంటారని చెప్పుకొచ్చాడు. జానీ మాస్టర్‌కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు.. దీంతో జెండూ బామ్‌ను పూసుకొని మ్యానేజ్ చేస్తాడని తెలిపాడు. ఇలా తన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వాళ్లందరూ చాలా రిలాక్స్ అవుతారని గతంలో తెలిపాడు. మెడికల్ కాలేజీకి మృతదేహం తన మరణం తర్వాత డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చెందాలని, అందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపాడు. కాబట్టి తన శిష్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు. తన అంత్యక్రియలకు వారెవరూ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. చివరకు తన కుమారుడు కూడా చితికి నిప్పు పెట్టాల్సిన పని లేదన్నాడు. తన అస్తికలు తీసుకొని గంగానదిలో కలపాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అలాంటి వాటిపై నమ్మకం లేదు.. అందుకే మరణానంతరం తన డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చేరాలని నిర్ణయించుకున్నానన్నాడు. దీంతో కొంతమంది మెడికల్ విద్యార్థులకు శవ పంచనామాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇలా అందరూ శరీర దానం చేయడం వల్ల మెడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) -
ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్ మాస్టర్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో తను చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పారు. ఇప్పుడా మాటాలు వైరల్ అవుతున్నాయి. తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియోను ముందే తీశామని తెలిపాడు. తన మామగారు (భార్య తండ్రి) సమాధి పక్కన ఒక వేప మొక్కన నాటాడట. తను మరణించాక ఆ చెట్టు కిందే సమాధి చేయాలని ఓ ఇంటర్వ్యూలో కోరాడు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) తన తమ్ముడంటే చాలా ఇష్టమని తను చనిపోయినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపాడు. తర్వాత తన అమ్మ చనిపోవడంతో జీవితం మీద విరక్తి పుట్టిందని చెప్పేవాడు. ఇలా తన కుటుంబ సభ్యుల్లో అక్క కుమారుడితో పాటు తండ్రి కూడా మరణించడంతో చావు అంటే భయం లేకుండా పోయిందని తెలుపుతూ.. ఆ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టాడు. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) -
Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతను డిస్కో డాన్సర్‌ని చూసి డ్యాన్సర్‌గా మారాలని అనుకున్నారు. కానీ డ్యాన్స్ ఎవరు నేర్పుతారు..? ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే వైవిధ్యమైన పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి అక్కడ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. కేవలం రూ. 5 ఫీజుతో చాలా మంది విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అందుకోసం మద్రాసు వెళ్లిపోయారు. తన టాలెంట్‌కి అక్కడ విలువ లేదని మళ్లీ తిరుపతికి వచ్చి ఇన్స్టిట్యూట్ను నడిపారు. (ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత) రాకేష్ మాస్టర్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే.. ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము ఏంటో చూపించాలని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు రాకేష్ మాస్టర్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయం అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే. శేఖర్ మాస్టర్‌తో విబేదాలు టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ కూడా ఆయన శిష్యుడే.. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్ పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఒకరోజు ఫేస్బుక్ లైవ్ చాట్‌లో రాకేష్ మాస్టర్‌తో మీ గొడవ ఏమిటి? అని ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. తనపై మాస్టర్‌కు ఉన్న కోపానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మాటల చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపాడు. గొడవకు కారణం ఇప్పటికీ సస్పెన్సే రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ శేఖర్‌తో గొడవకు గల కారణాలను తెలపకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య ఏం జరిగింది? అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవారు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్‌పై ఫైర్ అయ్యేవారు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేశారు
‘‘ధర్మపురి పేరుతో జగత్గారు సినిమా తీశారని తెలియగానే ఆశ్చర్యం కలిగింది. గోదావరి తీరాన పురాతనమైన ధర్మపురి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆలయం పేరుతో వస్తున్న ‘1996 ధర్మపురి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1996 ధర్మపురి’. శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి దర్శకుడు మారుతి, నిర్మాతలు వై.రవి శంకర్, యస్.కె.యన్, సెవెన్ హిల్స్ సతీష్, రచయిత డార్లింగ్ స్వామి, నటుడు జీవీ అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమాను సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వారికి, గీతా ఆర్ట్స్ వారికి థ్యాంక్స్’’ అన్నారు చిత్ర నిర్మాత భాస్కర్. ‘‘ప్రస్థానం’తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ‘1996 ధర్మపురి’ చాలా బాగా వచ్చింది’’ అన్నారు జగత్. ‘‘చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి, నా ప్రతిభని బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు గగన్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1271266370.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: మాటల్లో చెప్పలేని తిట్లు, భౌతిక దాడి చేసింది.. వాపోయిన హీరో నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్ కాదు! -
కళావతి స్టెప్ ను రీక్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
టెన్షన్ పడుతున్న అరియాన, తగ్గేదే లే అంటున్న శేఖర్ మాస్టర్!
► బిగ్‌బాస్ బజ్‌లో టెన్షన్ పడుతున్న అరియాన గ్లోరీ, తొలి ఎలిమినేట్ కంటెస్టెంట్‌తో మాజీ కంటెస్టెంట్ చిట్‌చాట్ ► హోయలు పోతున్న బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ► బ్లాక్ డ్రెస్‌లో రష్మి ఫొటోషూట్, ఫిదా చేస్తున్నా యాంకర్మ ► చీరకట్టులో యాంకర్ వర్షిణీ ► అల్లు అర్జున్‌తో శేఖర్ మాస్టర్, తగ్గేదే లే అంటున్న ఈ టాప్ కొరియోగ్రాఫర్ ► రోమియో.. జూలియట్ అంటూ ప్రేమకథలు చెబుతున్న ఊర్వశి రౌతెల View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sekhar Master (@sekharmaster) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) -
షాకింగ్ న్యూస్.. శేఖర్ మాస్టర్ని చంపేసిన గూగుల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పుల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. స్టెప్పులతో వెండితెరపై, పంచ్‌లతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతాడు. అందుకే టాలీవుడ్లో ఏ కొరియోగ్రాఫర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ శేఖర్ మాస్టర్ సొంతం. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్‌కి గూగుల్ షాకిచ్చింది. గూగుల్ శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే.. ఆయన ఫోటోతో పాటు పుట్టిన రోజు 1963 అని, చనిపోయిన రోజు జూలై 8,2003 అని వస్తుంది. ఇది చూసి శేఖర్ అభిమానులు అవాక్కాయ్యారు. అసలు విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ జేవీ శేఖర్ని అందరూ మాస్టర్ శేఖర్ అని పిలిచేవారు. దాదాపు 50పైగా చిత్రాల్లో నటించిన ఆయన జూలై 8, 2003లో మరణించారు. ఆయన వికీపీడియాలో గూగుల్ పొరపాటున కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటోని అప్లోడ్ చేసింది. గూగుల్ చేసిన తప్పు పట్ల శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
స్టార్ మా ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తెలుసా ?
స్టార్ మా లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ‘డాన్స్ ప్లస్’ సంగ్రామం గ్రాండ్ ఫైనల్స్ అద్భుతంగా అలరించబోతున్నాయి. 21 వారాలపాటు ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రేక్షకులకు ఓ సరికొత్త డాన్స్ ప్రపంచాన్ని సృష్టించి, ఉర్రూతలూగించిన సెన్సేషనల్ షో ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తేల్చడానికి స్టార్ మా సర్వం సిద్ధం చేసింది. కొత్త టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ‘డాన్స్ ప్లస్’.. టైటిల్ ఎవరు గెలుస్తారా అన్న ప్రేక్షకుల ఎదురుచూపుకు ముగింపు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,344 డిజిటల్ ఎంట్రీల నుంచి ఆడిషన్స్ నిర్వహించి 18 టీమ్స్ తో మొదలైన ఈ రసవత్తరమైన పోటీ దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి ప్రతిభ గల డాన్సర్లకు ఓ మంచి మంచి వేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షో గా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంది. ఫైనల్స్ కి అర్హత సంపాదించిన 5 టీం లలో విజేతను తేల్చే ఫైనల్స్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక పండగలా జరిగాయి. తను ఎక్కడున్నా ఎంతో సందడి చేసే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇక ప్రతి టీం ని సపోర్ట్ చేసేందుకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ "జానకి కలగనలేదు" హీరో అమరదీప్, "జాతిరత్నాలు" సినిమా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, ప్రముఖ నాట్యకారిణి సంధ్య రాజు, సినిమా సెలబ్రిటీ నటాషా దోషి ఫైనల్స్ ని పోటీ లా కాకుండా ఒక సంబరంలా మార్చేశారు. ఎంత పండగలా అనిపించినా పోటీని ఎదుర్కొనే ప్రతి కంటెస్టెంట్... తమ టాలెంట్ తో ఈ షోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తనదైన శైలిలో ప్రతి ఎపిసోడ్ నీ ఇంటరెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఓంకార్ ఫైనల్స్ ని మరింత పదునైన వ్యూహాలతో రసవత్తరంగా నడిపించారు. రఘు మాస్టర్, యష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, ముమైత్ ఖాన్, యాని మాస్టర్, మోనాల్ గజ్జర్ న్యాయ నిర్ణేతలుగా వున్న ఈ వేదిక టైటిల్ ని, 20 లక్షల రూపాయల నగదు బహుమతిని ఎవరికి అందచేసింది? ఎవరి హంగామా ఏమిటి? ఎవరు ఏయే పాటలకు ఎలాంటి కొత్త కొత్త స్టెప్స్ వేశారు? టీమ్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సెలెబ్రిటీల హడావిడి ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే స్టార్ మా లో "డాన్స్ ప్లస్" ఫైనల్స్ తప్పక చూడాలి. గుర్తుంచుకోండి... ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి "డాన్స్ ప్లస్" గ్రాండ్ ఫినాలే మీకు పరిపూర్ణమైన వినోదాన్ని అందించబోతోంది. -
డ్యాన్సర్లకు శేఖర్ మాస్టర్ సాయం!
-
లాక్డౌన్ తిప్పలు: డ్యాన్సర్లకు శేఖర్ మాస్టర్ సాయం!
లాక్డౌన్ వల్ల చాలామందికి పూట గడవలేని పరిస్థితి నెలకొంది. కళను నమ్ముకుని జీవనం సాగిస్తోన్న ఎంతోమంది డ్యాన్సర్లు కూడా పని లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి వచ్చింది. అందరికీ ఎంటర్టైన్మెంట్ అందించే డ్యాన్సర్లు కడుపు మాడ్చుకునే పరిస్థితికి రావడాన్ని చూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చలించిపోయాడు. డ్యాన్సర్లకు తానున్నాంటూ అండగా నిలబడ్డాడు. నిత్యావసర సరుకుల కోసం తనను సంప్రదించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. "గత కొద్దిరోజులుగా డ్యాన్సర్లకు పని లేదు. అలాగే షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. ఏ డ్యాన్సర్ అయినా సరే, మీకు నిత్యావసర సరుకులు అవసరమైతే కింది నంబర్‌కు ఫోన్ చేయండి. కాల్ చేసి సరుకులు తీసుకెళ్లండి. లాక్డౌన్ ఉంది కాబట్టి హైదరాబాద్‌లో ఉన్నవారికే సరుకులు ఇవ్వడం సాధ్యమవుతుంది. బయట పరిస్థితులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరూ బయట అడుగు పెట్టకండి" అని శేఖర్ మాస్టర్ విజ్ఞప్తి చేశాడు. -
అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేస్తున్నారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి ఇటీవల హీరో అర్జున్, నటి ఖుబ్బూ మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. (చదవండి : గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్) ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ.. ‘మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి’ అని కోరారు. అలాగే తన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు విసిరారు. తన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. -
తోట బావి వద్ద...
యాంకర్ రవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తోట బావి’. గౌతమి హీరోయిన్గా నటించారు. అంజి దేవండ్ల దర్శకత్వం వహించారు. గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై ఆలూర్ ప్రకాష్ గౌడ్ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని డ్యాన్స్ మాస్టర్ శేఖర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తోటబావి’ టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్‌లుక్ బావుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, యూనిట్‌కి పేరు తీసుకురావాలి’’ అన్నారు. అంజి దేవండ్ల మాట్లాడుతూ– ‘‘యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. రవిగారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమాను బాగా తీయగలిగాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీపడలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘కథ, కథనాలను దర్శకుడు చాలా ఆసక్తిగా రాసుకుని, అదే తరహాలో సినిమా రూపొందించాడు. సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు ఆలూర్ ప్రకాష్ గౌడ్. ‘‘టైటిల్ లాగే సినిమా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది’’ అన్నారు రవి. శివశంకర్ మాస్టర్, ఈ చిత్రానికి కెమెరా: చిడతల నవీన్, సంగీతం: దిలీప్ బండారి, సహనిర్మాతలు: దౌలు (విష్ణుప్రియ హోటల్), చిన్న స్వామి, అభినేష్ .బి. ∙గౌతమి, రవి -
దుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ బుధవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శేఖర్ మాస్టర్‌ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. శేఖర్ మాట్లాడుతూ నేను విజయవాడలో పుట్టి పెరిగిన వాడినేనని అన్నారు. నగరానికి వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటానన్నారు. కార్యక్రమంలో శేఖర్ మాస్టర్‌తోపాటు టీడీపీ మైనార్టీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్.హుస్సేన్ బాషా(బాషీ)తోపాటు ఉల్లి ప్రసాద్, ఉల్లి సుధాకర్, పలువురు డ్యాన్స్ విద్యార్థులు పాల్గొన్నారు. -
దసరా బుల్లోడా?
విదేశాల్లో షూటింగ్... అందులోనూ ఒకటీ రెండు రోజులు కాదు... ఏకంగా నెల రోజులు. హీరోగా తొలి చిత్రం చేస్తున్న అఖిల్‌కు మొదటి సినిమా షూటింగే ఇప్పుడు మధురానుభూతిగా మారింది. స్పెయిన్‌లో ఈ కొత్త చిత్రం షూటింగ్ ముగించుకొని, ఈ యువ హీరో ఇప్పుడు ఇంటి ముఖం పట్టారు. అఖిల్‌కు సన్నిహితుడైన హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడైన వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. తొలి సినిమాకే విదేశాల్లో షూటింగ్లో పాల్గొనడం సహజంగానే అఖిల్‌కు ఆనందాన్నిస్తోంది. స్పెయిన్‌లో ఏకధాటిగా జరిగిన ఈ షూటింగ్లో కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్లు, పాటలు చిత్రీకరించారు. విశేషం ఏమిటంటే, అక్కడ షూటింగ్ జరుగుతుండగా, నాగ్, అమల కలసి షూటింగ్ స్పాట్‌కు వెళ్ళారు. ‘‘మా అమ్మా నాన్న కలసి స్పెయిన్‌లో మా షూటింగ్ సెట్స్‌కు రావడం నాకెంతో గర్వంగా అనిపించింది’’ అని అఖిల్ చెప్పారు కూడా! శేఖర్ మాస్టర్‌తో డ్యాన్సులు, స్పెయిన్‌లోని అద్భుతమైన మష్రూమ్ బిల్డింగ్ దగ్గర స్టంట్ మాస్టర్ రవివర్మతో యాక్షన్ సీన్లు, హీరోయిన్ సాయేషా సైగల్తో పాటలు - ఇవన్నీ అఖిల్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. వేగంగా షూటింగ్ చేసే వినాయక్ నుంచి ఈ కొత్త హీరో చాలానే నేర్చుకున్నట్లున్నారు. హీరో నితిన్ కూడా స్పెయిన్‌కు వచ్చి వెళ్ళడం,షూటింగ్లో ఉండగానే అమితాబ్ - దీపికా పదుకొనేల ‘పికూ’ చిత్రం బాగుందని తెలిసి ఆ సినిమా ఆడుతున్న హాలు కోసం వెతుక్కోవడం - ఇవన్నీ అఖిల్‌కు తీపి గుర్తులే! అన్నట్లు, ఈ సినిమా టైటిల్ ‘మిస్సైల్’ అంటూ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని సాక్షాత్తూ నితిన్ ట్వీట్ చేశారు. ఇంకా టైటిల్ ఏదీ నిర్ణయించలేదన్నారు. టైటిల్ మాటెలా ఉన్నా, శరవేగపు షూటింగ్లో మిస్సైల్‌ను తలపిస్తున్న ఈ చిత్రం దసరా పండుగకల్లా ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం ఉందట!