
టాలీవుడ్ బెస్ట్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఒకరు. ఎలాంటి పాటయినా సరే తన స్టెప్పులతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాడు. అలా ఎన్నో హిట్ సాంగ్స్‌కు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు. కానీ ఈ మధ్య మాత్రం తన డిఫరెంట్ స్టెప్పుల వల్ల విమర్శలపాలవుతూ వస్తున్నాడు. పుష్ప 2లో 'పీలింగ్స్..', డాకు మహారాజ్‌లో 'దబిడి దిబిడి..', రాబిన్‌హుడ్‌లో 'అదిదా సర్‌ప్రైజు..' పాటలు ఆన్‌లైన్‌లో విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాయి.
కొరియోగ్రఫీపై ట్రోలింగ్
స్టెప్పులు శృతిమించాయన్నది నెటిజన్ల వాదన. రానురానూ శేఖర్ మాస్టర్ ఇలా తయారవుతున్నాడేంటి? ఆడవారితో స్టెప్పులు వేయించేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి కదా, ఆమాత్రం తెలీదా? అని మండిపడ్డారు. ఈ వివాదంపై శేఖర్ మాస్టర్ తొలిసారిగా స్పందించాడు. ఓ షోలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఏ పాటను ఎలా చేయాలో అలాగే చేస్తాం.. అన్ని సాంగ్స్ ఒకేలా చేయము.
బాగోలేదని చెప్పడం ఈజీనే..
మాస్ సాంగ్‌ను ఒకలా.. డ్యుయెట్‌ను మరోలా.. ఇంకో సాంగ్ ఉంటే ఇంకోలా.. అలా ఒక్కోటి ఒక్కోరకంగా చేస్తాం. మీరు బాగోలేదని రాసేయడానికి, చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కానీ నాకు, నా వెనకాల ఉన్న టీమ్‌కు ఎంతో కష్టమని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. మీరు బాధపడకండి మాస్టర్.. మేమెప్పుడూ మీకు తోడుగా ఉంటాం అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్