లాక్‌డౌన్ వల్ల చాలామందికి పూట గడవలేని పరిస్థితి నెలకొంది. కళను నమ్ముకుని జీవనం సాగిస్తోన్న ఎంతోమంది డ్యాన్సర్లు కూడా పని లేక పస్తులు ఉండాల్సిన దుస్థితి వచ్చింది. అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే డ్యాన్సర్లు కడుపు మాడ్చుకునే పరిస్థితికి రావడాన్ని చూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చలించిపోయాడు. డ్యాన్సర్లకు తానున్నాంటూ అండగా నిలబడ్డాడు. నిత్యావసర సరుకుల కోసం తనను సంప్రదించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు.
"గత కొద్దిరోజులుగా డ్యాన్సర్లకు పని లేదు. అలాగే షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. ఏ డ్యాన్సర్ అయినా సరే, మీకు నిత్యావసర సరుకులు అవసరమైతే కింది నంబర్‌కు ఫోన్ చేయండి. కాల్ చేసి సరుకులు తీసుకెళ్లండి. లాక్‌డౌన్ ఉంది కాబట్టి హైదరాబాద్‌లో ఉన్నవారికే సరుకులు ఇవ్వడం సాధ్యమవుతుంది. బయట పరిస్థితులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరూ బయట అడుగు పెట్టకండి" అని శేఖర్ మాస్టర్ విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment