చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ బుధవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శేఖర్ మాస్టర్‌ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. శేఖర్ మాట్లాడుతూ నేను విజయవాడలో పుట్టి పెరిగిన వాడినేనని అన్నారు. నగరానికి వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటానన్నారు. కార్యక్రమంలో శేఖర్ మాస్టర్‌తోపాటు టీడీపీ మైనార్టీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్.హుస్సేన్ బాషా(బాషీ)తోపాటు ఉల్లి ప్రసాద్, ఉల్లి సుధాకర్, పలువురు డ్యాన్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment