సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేస్తున్నారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి ఇటీవల హీరో అర్జున్, నటి ఖుబ్బూ మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు.
(చదవండి : గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్)
ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ.. ‘మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి’ అని కోరారు. అలాగే తన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు విసిరారు. తన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment