Telugu Famous Anchors Names List and Their Remuneration - Sakshi
Sakshi News home page

Tollywood Anchors Remuneration: టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్లు వీళ్లే..!

Published Sat, Oct 22 2022 5:04 PM | Last Updated on Sat, Oct 22 2022 9:09 PM

Telugu Famous Anchors Names List and Their Remuneration - Sakshi

టాలీవుడ్‌లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు. టాలీవుడ్‌లో ఏ ఈవెంట్‌ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్‌ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒ‍క్క ఈవెంట్‌కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. 

 సుమ కనకాల:  ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్‌కు దాదాపు రూ.3.5 నుంచి  4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. 

 ప్రదీప్ మాచిరాజు: మేల్ యాంకర్స్‌లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్‌కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

 అనసూయ భరద్వాజ్:  జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2-3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది.

రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్  రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. 

 రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్‌ షోతో క్రేజ్ సంపాదించిన రవి కేరీర్‌ పరంగా ఇప్పుడు కాస్త వెనుకబడ్డారు. అయినప్పటికీ ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.

శ్యామల: టాలీవుడ్‌లో ఫేమస్‌ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది.

మంజూష: టాలీవుడ్‌ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్‌గా తెలుగులో ఫేమస్ అయింది.

వర్షిని: టాలీవుడ్‌ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement