30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనేది థియేటర్ల సాక్షిగా అభిమానులకు నేర్పించబోతున్నాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం 'వావా మేరే బావా' అనే ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. (చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో)
ఇందులో పోర్ల జోలికి వెళ్లొద్దంటూనే ప్రదీప్ ముద్దుగా ముద్దుగుమ్మలతో డ్యాన్స్ చేయడం విశేషం. ఆ ముగ్గురు భామలెవరో కాదు, తెలుగు బుల్లితెరను ఏలుతున్న ముగ్గురు టాప్ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి. ఇంకేముందీ.. యాంకర్లందరూ ఒకేచోట చేరి స్టెప్పులేస్తే ఆ జోష్ ఎలా ఉంటుందో చూపించాడు ప్రదీప్. ప్రస్తుతం ఈ వావా మేరే బావా పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సాంగ్‌ను మీరు కూడా మరోసారి వినేయండి. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ వచ్చిందని ఏడ్చాను: ప్రదీప్)
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment