Green Challenge
-
గ్రీన్ చాలెంజ్ తరుణమిదే..ఎలాంటి మొక్కలు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: వానా కాలం సీజన్ మొదలైంది. గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటిన్నర జనాభాకు చేరువైన సిటీలో హరితం శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల 42 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతిఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణ వేత్తలు స్పష్టంచేస్తున్నారు. కాగా మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా..నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అంతగా దోహదం చేయలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హరితహారంలో ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రేటర్లో ఉన్న గ్రీన్‌బెల్ట్ 20 నుంచి 30 శాతానికి పెంచాలని స్పష్టంచేస్తున్నారు. లక్ష్యం చేరని హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 2016 నుంచి ఏటా హరితహారం చేపట్టారు. ఐదేళ్లుగా సుమారు మూడు కోట్ల మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి,కలబంద,క్రోటన్,పూల మొక్కల వంటి చిన్నమొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీప్రదేశాలు,చెరువులు,పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి,పర్యావరణ వేత్త హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి,ఆక్సీజన్ అందించేవి,కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. గ్రీన్‌చాలెంజ్ ఇలా... ► నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. ► తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ► సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ►నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. ► నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. -
Green India Challenge: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్
-
నయా సవాల్: నేను సైతం అంటున్న త్రిష
ప్రస్తుతం దేశంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి ప్రాణ వాయువును కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. కేవలం అంతటితోనే ఆగకుండా.. స్వయంగా మొక్కలు నాటుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కదలిరావాలంటూ తమ మిత్రులకు, ఇతర రంగాల ప్రముఖులకు సవాలు విసురుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రముఖులను సైతం పర్యవరణ బాట పట్టిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు విసురుతూ.. వారిచేత మొక్కలు నాటిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణీ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ సవాలును ప్రకాశ్ పలువురు నటులతో పాటు నటీమణులకు విసిరారు. దీనిలో భాగంగానే ఆయన సవాలును స్వీకరించిన దక్షణాది బ్యూటీ త్రిష.. తాను సైతం అంటూ బరిలోకి దిగారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా త్రిష తన ఫాంహౌస్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. (కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు) ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు త్రిష. ఇక ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంట్ జాబితాలో కన్నడ నటుడు మోహన్‌లాల్, తమిళ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్ రమ్యకృష్ణ ఉన్నారు. కాగా 2004లో వర్షం మూవీలో హీరోయిన్గా నటించి టాలీవుడ్లో తన ప్రస్తానాన్ని ఆరంభించిన త్రిష.. అనతికాలంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాన్ని దక్కించున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషాల్లోనూ నటిస్తున్నారు. -
కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు
-
కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలును బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ స్వీకరించారు. షాద్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సంతోష్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ మట్టిమనుషులని, మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉందని కొనియాడారు. తనకు ఇష్టమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ఐదారేండ్లలోనే రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ మార్చారని అన్నారు. (ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మరికొంత మందికి ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు విసిరారు. ఈ జాబితాలో కన్నడ నటుబు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష ఉన్నారు. తన అభిమానులకు కూడా మొక్కలు నాటి, పది మందితో మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా హరితహారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలువురు ప్రముఖులు సైతం మొక్కలు నాటుతున్నారు. -
ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్
సాక్షి, సంగారెడ్డి: గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా జిన్నారం మండలం ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దుండిగల్ సమీపంలోని ఖాజీపేట అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి యంగ్ రెబల్ స్టార్ సోమవారం పరిశీలించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి మొక్కలు నాటారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను తన తండ్రి దివంగత యూవీఎస్‌రాజు పేరు మీద ప్రభాస్ దత్తత తీసుకున్నారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలను అందించడమే కాకుండా, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను దత్తతకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (నిర్మాతలను నామినేట్ చేసిన శర్వానంద్) కాగా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. ఇక ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మార్చనున్నారు. (ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్) -
నిర్మాతలను నామినేట్ చేసిన శర్వానంద్
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్‌లో సోమవారం హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పార్కును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొనే తాను స్వతహాగా మొక్కలు నాటానని శర్వానంద్ తెలిపారు. భవిష్యత్తులో గాలి కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని అలాంటిది రాకూడదంటే ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పొల్గొన్నారు. ఈ చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని నిర్మాతలు అనిల్ సుంకర, గోపిఆచంట, ప్రమోద్, వంశీ, సుధాకర్ చెరుకూరిలకు శర్వానంద్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించడమే కాకుండా దత్తత తీసుకుంటాననడం గొప్ప విషయమని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. (నాగ్ మామ చాలెంజ్ యాక్సెప్టెడ్) -
నాగ్ మామ చాలెంజ్ యాక్సెప్టెడ్
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అక్కినేని సమంత మొక్కలు నాటారు. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత శనివారం జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతోపాటు తన సహనటులు, మహానటి కీర్తి సురేష్, మరో హీరోయిన్ రష్మీక మందాన, తన స్నేహితురాలు శిల్పారెడ్డికి మూడు మొక్కలు నాటాల్సిందిగా సవాలు విసిరారు. (సమంత బ్యూటీ థెరపీ వీడియో ) ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని సమంత కొనియాడారు. అంతేకాదు 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' చెయిన్‌ను కొనసాగించేలా ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలంటూ ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు. View this post on Instagram I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge 🍃 from Nag mama 💚 I planted 3 saplings. Further I am nominating @keerthysureshofficial @rashmika_mandanna @shilpareddy.official to plant 3 trees & continue the chain special thanks to @MPsantoshtrs garu for taking this intiative. A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Jul 11, 2020 at 6:18am PDT -
ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు సినీ నటి, రచయిత రేణూ దేశాయ్. ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ మూడో దశలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను.. బ్రహ్మానందం, రేణూ దేశాయ్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఉదయ భాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి రేణూ శుక్రవారం ఉదయం తన కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ) హరితహారంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ప్రతి ఒక్కరు తమకి తాము ఛాలెంజ్ విసురుకొని మొక్కలు నాటాలని రేణూ విజ్ఞప్తి చేశారు. ఇక ఆద్యతో కలిసి రేణూ మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మంత్రి కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రభాస్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి లాంటి ఎందరో సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరించి మరి కొందరికి సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) View this post on Instagram We all need to do it 😊 A post shared by renu desai (@renuudesai) on Jul 2, 2020 at 11:24pm PDT -
ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ 3వ విడతలో భాగం యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆయన స్వీకరించారు. ఇందులో భాగంగా మణికొండలోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను బ్రహ్మానందం షేర్ చేశారు. కాగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. (చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్) ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రభాస్, వీవీ వినాయక్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్ స్వీకరించి మరి కొందరికి సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (ఎన్టీఆర్‌కు సుమ గ్రీన్ చాలెంజ్) -
గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రష్మి
-
అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేస్తున్నారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి ఇటీవల హీరో అర్జున్, నటి ఖుబ్బూ మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. (చదవండి : గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్) ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ.. ‘మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి’ అని కోరారు. అలాగే తన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు విసిరారు. తన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. -
చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆదివారం ఉదయం మొక్కలు నాటారు. వినాయక్‌తో పాటు నటుడు కాదంబరి కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతీ ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాలని వినాయక్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడంపై ప్రకృతి ప్రేమికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్ వంటి ప్రముఖులు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మరికొంతమందికి సవాల్ విసిరిన సంగత తెలిసిందే. -
9.7 కి.మీ.. 12 నిమిషాలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి–బంజారాహిల్స్‌లో ఉన్న కేర్ ఆస్పత్రి మధ్య మార్గం..అనునిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు 25కు మించదు. పగటి పూట, పీక్ అవర్స్‌లో ఆ వేగం 20కు చేరదు. ఈ సమయానికి అదనంగా ట్రాఫిక్ జామ్స్, సిగ్నల్ టైమింగ్స్ ఉంటాయి. ఎలా చూసినా కనీసం 40 నుంచి 50 నిమిషాలు ప్రయాణానికి పడుతుంది. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ గుండె (లైవ్ హార్ట్) కోసం నగర ట్రాఫిక్ పోలీసులు బుధవారం ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా ఈ 9.7 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 12 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ ప్రకటించారు. ఉదయం మొదలైన ‘ఆపరేషన్’... నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ బుధవారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి గుండె మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్రచికిత్స ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుండగా... డోనర్ ఇస్తున్న గుండె ఉదయం 9.31 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్నిస్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 9.00 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి. టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ... డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 9.7 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళడానికి సిద్ధమైంది. అలానే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు. ఇదీ ప్రయాణించిన మార్గం... ఉదయం 9.31 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ఆనంద్ టాకీస్, రసూల్‌పుర, ప్రకాష్‌నగర్, బేగంపేట, పంజగుట్ట మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.43 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని కేర్ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో కేవలం 12 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాస్సేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రాణం కాపాడటానికి ట్రాఫిక్ పోలీసులు చూపిన చొరవను బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం కొనియాడింది. -
గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’కు బిగ్‌బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో రాహుల్ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్ పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: రాహుల్‌కు సుమ గ్రీన్ చాలెంజ్) -
ఎన్టీఆర్‌కు సుమ గ్రీన్ చాలెంజ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో ఎన్టీఆర్‌కు యాంకర్ సుమ కనకాల గ్రీన్ చాలెంజ్ విసిరారు. హరిత ఉద్యమంలో భాగంగా సినీనటి జయసుధ చేసిన సవాల్‌ను స్వీకరించిన సుమ బుధవారం బేగంపేటలో మొక్కలు నాటారు. అశోక, వేప, కదంబం మొక్కలు నాటిన ఆమె ఎన్టీఆర్‌తో పాటు నటి మంచులక్ష్మీ, బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్, బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్‌లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. కాగా, హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ గ్రీన్ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. అంతేకాకుండా వారు మరికొంత మందికి గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేశారు. (చదవండి: విజయ్ దేవరకొండకు గ్రీన్ చాలెంజ్) -
విజయ్ దేవరకొండకు మరో చాలెంజ్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు విజయ్ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ గ్రీన్ చాలెంజ్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన అరవింద్‌కుమార్ సోమవారం పీవీ ఘాట్ సమీపంలో మొక్కలు నాటారు. అనంతరం విజయ్ తోపాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కుడా ఉద్యోగులను ఆ చాలెంజ్‌కు నామినేట్ చేశారు. కాగా, గతంలోనూ తనను గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేయడంతో విజయ్ దేవరకొండ మొక్క నాటారు. హరితహారంలో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ నిరుడు విజయ్ను గ్రీన్ చాలెంజ్‌కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలంటూ ఇటీవల విజయ్ ట్విటర్ వేదికగా గళం విప్పారు. విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ నెల 1న విడుదలైంది. ఆయన ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్, పూరి జగన్నాథ్ సినిమాల్లో నటిస్తున్నారు.