టీఆర్‌ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆదివారం ఉదయం మొక్కలు నాటారు. వినాయక్‌తో పాటు నటుడు కాదంబరి కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేశారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతీ ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాలని వినాయక్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడంపై ప్రకృతి ప్రేమికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్ వంటి ప్రముఖులు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మరికొంతమందికి సవాల్ విసిరిన సంగత తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment