సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలును బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ స్వీకరించారు. షాద్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సంతోష్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ మట్టిమనుషులని, మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉందని కొనియాడారు. తనకు ఇష్టమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన ఐదారేండ్లలోనే రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ మార్చారని అన్నారు. (ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మరికొంత మందికి ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాలు విసిరారు. ఈ జాబితాలో కన్నడ నటుబు మోహన్‌లాల్, తమిళ్ నటుడు సూర్య, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష ఉన్నారు. తన అభిమానులకు కూడా మొక్కలు నాటి, పది మందితో మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా హరితహారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలువురు ప్రముఖులు సైతం మొక్కలు నాటుతున్నారు.
కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ ప్రశంసలు
Published Thu, Oct 1 2020 12:14 PM | Last Updated on Thu, Oct 1 2020 2:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment