
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’కు బిగ్‌బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో రాహుల్ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్ పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: రాహుల్‌కు సుమ గ్రీన్ చాలెంజ్)