Pudding And Mink Pub Raid: Rahul Sipligunj Talks With Media Over Banjarahills Rave Party - Sakshi
Sakshi News home page

Rahul Sipligunj: ఈ డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేదు, ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లాను

Published Sun, Apr 3 2022 5:53 PM | Last Updated on Thu, Mar 9 2023 3:56 PM

Drugs Case: Rahul Sipligunj Talks With Media Over Banjarahills Rave Party - Sakshi

Rahul Sipligunj Talks With Media Over Drugs Case: బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​ రేవ్‌ పార్టీ టాలీవుడ్‌లో సంచలనం రేపుతుంది. ఈ పార్టీలో ఫుడింగ్‌ అండ్ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు.

చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన..

వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సాక్షి టీవీతో మాట్లాడాడు. డ్రగ్స్‌ వ్యవహరంతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగిన ఈ పార్టీకి తl కుటుంబ సభ్యులతో​ కలిసి హాజరయ్యానని, తన ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీ జరిగినట్లు తెలిపాడు.

చదవండి: రామ్‌ చరణ్‌ గొప్ప మనసు, ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఒక్కొక్కరికి తులం బంగారం..

ఈ పార్టీలో తను అసలు డ్రగ్స్‌ తీసుకోలేదని, తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే లేట్‌నైట్‌ వరకు పబ్‌ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని రాహులు పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement