Radisson Blu Plaza Hotel
-
నన్ను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు : రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన
బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకోగా వీరిలో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండటం మరింత సెన్సేషన్‌గా మారింది. ఇక ఈ లిస్ట్‌లో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని రాహుల్ స్పష్టం చేసినా అతనిపై ఆరోపణలు ఆగడం లేదు. రెగ్యులర్‌గా పబ్‌కు వెళ్లే అలవాటు ఉండటంతో రాహుల్‌ని నిందిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా రాహుల్ ఓ వీడియోను విడుదల చేశాడు. ‘నన్ను నమ్మడానికి, నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అయినప్పటికీ నా మీద నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటో నాకు తెలుసు’ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ‘నిన్ను నమ్ముతున్నాం రాహుల్.. వి ఆర్ విత్ యూ’ అంటూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
కిరణ్‌రాజు, అర్జున్‌పై ‘లుక్ఔట్’?
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న పబ్ భాగస్వాములు పెనుమత్స కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేనిపై లుక్ఔట్ సర్క్యులర్స్(ఎల్వోసీ) జారీ చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు యోచిస్తున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరు దేశం విడిచిపోకుండా అడ్డుకునేందుకే పోలీసులు ఈ ఎల్వోసీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కిరణ్ రాజు పాస్‌పోర్ట్ వివరాలను సేకరించారు. అర్జున్ పాస్‌పోర్టు వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాష్ట్ర నోడల్ అధికారుల ద్వారా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు ఎల్వోసీలు పంపడానికి చర్యలు ముమ్మరం చేశారు. ఈ చర్యలు పూర్తయితే బంజారాహిల్స్ ఠాణాలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసులో వీరిద్దరు కూడా నిందితులనే విషయం ఇమిగ్రేషన్ డేటాబేస్‌లోకి చేరుతుంది. ఈ క్రమంలో వీరు దేశం దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తే, ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తిం చి అదుపులోకి తీసుకుంటారు. వీరిద్దరూ రాష్ట్రం వెలుపల ఉన్నారని భావిస్తున్న పోలీసులు పట్టుకో వడం కోసం సాంకేతికంగానూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అధికారులు పబ్ ఉద్యోగులను ప్రశ్నించారు. రేవ్ పార్టీ జరిగిన రోజే పబ్‌లో ఓ ప్రముఖుడి కుమారుడి పుట్టినరోజు వేడుక జరిగిందని విచారణలో బయటపడింది. ఆ ‘మూడు టేబుళ్ల’వద్దే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి వద్ద కూర్చున్నవారిని గుర్తించడానికి మరోసారి సీసీ కెమెరాల ఫుటేజ్‌ని విశ్లేషిస్తున్నారు. నేడు ఎంఎస్‌జే కోర్టులో కస్టడీ పిటిషన్‌పై విచారణ ఇప్పటికే అరెస్టు అయి, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న పబ్ భాగస్వామి అభిషేక్ ఉప్పాలతోపాటు మేనేజర్ అనిల్‌కుమార్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగే అవకాశముంది. ఈ కోర్టులోనే బుధవారం ఈ నిందితులిద్దరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను కొట్టేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కౌంటర్లు సైతం సమర్పిస్తున్నారు. కిరణ్ రాజు డైరెక్టర్‌గా ఉన్న టి-డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అనుబంధంగా పుడింగ్ అండ్ మింక్ పబ్ కొనసాగుతోంది. దీనితోపాటు మరో 24 సంస్థల్లోనూ కిరణ్ డైరెక్టర్‌గా ఉన్నట్లు పోలీసు లు గుర్తించారు. ఆదివారం ఆ పబ్‌పై దాడి చేసిన సందర్భంలో నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా సిద్ధార్ధ్తోపాటు మాజీ కేంద్రమంత్రి మనవడు సహా 128 మంది కస్టమర్లు, 18 మంది సిబ్బంది, అభిషేక్, అనిల్కుమార్లను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వీరిలో అభిషేక్, అనిల్కుమార్లను అరెస్టు చేయగా, మిగిలిన వారిని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టిన విషయం తెలిసిందే. -
నిహారికకు తమన్నా మద్దతు.. తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
Tamanna Simhadri Reacts On Niharika Konidela In Pub Case: బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. ఇటీవల సమయానికి మించి రన్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి స్పందిచారు. చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన.. ఎవరో ఒకరు తప్పు చేస్తే పబ్‌కి వెళ్లిన వారందరిని దొంగల్లాగా చూస్తున్నారని తమన్నా సింహాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌కు వెళ్లడమే తప్పు అన్నట్లుగా నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిహారిక కేవలం తన ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే పబ్‌కు వెళ్లిందని చెప్పుకొచ్చారు. పబ్‌కు వెళ్లిన మిగతా వారిని వదిలేసి నిహారికను మాత్రమే టార్గెట్ చేస్తూ స్టోరీస్ వేస్తున్నారని మండిపడ్డారు. నిహారిక డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. పోలీసుల దాడి సమయంలో చాలా మంది పారిపోయారు కూడా అని చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. అలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారిని అడ్డుకుంటామని తమన్నా సింహాద్రి పేర్కొన్నారు. చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ -
హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
RGV Sensational Comments On Drugs Case: రాష్ట్రంలో సంచలనం రేపిన బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే హైదరాబాద్ డ్రగ్స్ కేసు చాలా చిన్నదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తాజా చిత్రం డేంజరస్ మూవీ ప్రమోషన్ల భాగంగా ఆర్జీవీ ఈ డ్రగ్స్ కేసుపై స్పందించారు. చదవండి: రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం, స్పందించిన ఆర్జీవీ ఈ మేరకు వర్మ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వాడకం కామన్‌గా మారింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే ఇది చాలా చిన్నది. మిగతా వాటితో పోలిస్తే ఇది ఒక షాట్ ఫలిం అంతే అనుకుంటున్నా. ముంబైలో నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీ తాగినంత ఈజీగా డ్రగ్స్ తీసుకునేవారు. ఇది చాలా సర్వసాధారణ విషయం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే తాను డ్రగ్స్ వాడనని చెప్పిన ఆర్జీవీ ఓసారి ట్రై చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ముట్టుకోలేదని స్పష్టం చేశారు. చదవండి: రామ్ చరణ్‌కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే.. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదు కానీ అంతకంటే ప్రమాదకరమైనవి చేస్తానంటూ తనదైన శైలిలో చెప్పారు. ఇక ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం డ్రగ్స్ కన్నా ప్రమాదకరమని ఆర్జీవీ పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 2 రాత్రి పోలీసులు బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై దాడి జరపగా ఈ డ్రగ్స్ వ్యవహరం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. -
బంజారాహిల్స్ రేవ్ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Talks With Media Over Drugs Case: బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ రేవ్ పార్టీ టాలీవుడ్లో సంచలనం రేపుతుంది. ఈ పార్టీలో ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన.. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సాక్షి టీవీతో మాట్లాడాడు. డ్రగ్స్ వ్యవహరంతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగిన ఈ పార్టీకి తl కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యానని, తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ జరిగినట్లు తెలిపాడు. చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు, ఆర్ఆర్ఆర్ టీం ఒక్కొక్కరికి తులం బంగారం.. ఈ పార్టీలో తను అసలు డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే లేట్‌నైట్ వరకు పబ్ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని రాహులు పేర్కొన్నాడు. -
నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన..
బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో నిహారిక ఉండటం, పోలీసుస్టేషన్‌కు తరలించిన వ్యవహారంపై నాగబాబు స్పందించారు. 'నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు. ' అని నాగబాబు తెలిపారు. కాగా ఈ పబ్‌కు హాజరైన వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. పబ్‌లో పాల్గొన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది యువకులు, 33 మంది యువతులు పబ్‌లో పాల్గొన్నారు. 142 మంది అడ్రస్‌లు, ఇంటి నెంబర్లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు