
ఎవరో ఒకరు తప్పు చేస్తే పబ్‌కి వెళ్లిన వారందరిని దొంగల్లాగా చూస్తున్నారని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌కు వెళ్లడమే తప్పు అన్నట్లుగా నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిహారిక కేవలం తన ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే పబ్‌కు వెళ్లిందని చెప్పుకొచ్చారు.
Tamanna Simhadri Reacts On Niharika Konidela In Pub Case: బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. ఇటీవల సమయానికి మించి రన్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి స్పందిచారు.
చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన..
ఎవరో ఒకరు తప్పు చేస్తే పబ్‌కి వెళ్లిన వారందరిని దొంగల్లాగా చూస్తున్నారని తమన్నా సింహాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌కు వెళ్లడమే తప్పు అన్నట్లుగా నిహారికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిహారిక కేవలం తన ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే పబ్‌కు వెళ్లిందని చెప్పుకొచ్చారు. పబ్‌కు వెళ్లిన మిగతా వారిని వదిలేసి నిహారికను మాత్రమే టార్గెట్ చేస్తూ స్టోరీస్ వేస్తున్నారని మండిపడ్డారు. నిహారిక డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. పోలీసుల దాడి సమయంలో చాలా మంది పారిపోయారు కూడా అని చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. అలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారిని అడ్డుకుంటామని తమన్నా సింహాద్రి పేర్కొన్నారు.
చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ