Short Film Actress Kushitha Kallapu On Hyderabad Pub Drugs Case Viral - Sakshi
Sakshi News home page

Kushitha On Drugs Case: 'మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేద్దామని పబ్‌కి వెళ్లా.. ఇలా అవుతుందనుకోలేదు'

Published Tue, Apr 5 2022 4:58 PM | Last Updated on Wed, Apr 6 2022 11:40 AM

Short Film Actress Kushitha Kallapu On Drugs Case - Sakshi

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసు తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రాహుల్‌ సిప్లిగంజ్‌, నిహారిక వంటి సెలబ్రిటీలు సహా పలువురు ప్రముఖల పిల్లలు పేర్లు  బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరిం‍ది. పోలీసుల దాడుల్లో పబ్‌ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు. 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

తాజాగా ఈ ఘటనలో తనపై జరుగుతున్న ప్రచారంపై షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా స్పందించారు. అక్కడ అసలు డ్రగ్స్‌​ వాడుతున్నారనే విషయమే తనకు తెలియదని, ఒకవేళ తెలిస్తే అసలు వెళ్లేవాళ్లం కాదని చెప్పింది. నేను మందు తాగలేదు, డ్రగ్స్‌ తీసుకోలేదు. జస్ట్‌ పార్టీ చూద్దామని వెళ్లాను. కానీ ఇంత ఇష్యూ అవుతుందనుకోలేదు. వీకెండ్‌లో మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేయడానికి వెళ్లాను. నా ఫ్రెండ్‌ హర్ష సహా ఐదుగురుం ఆ పబ్‌కి వెళ్లాం. కానీ హర్ష గతంలో డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడన్న విషయం నాకు తెలియదు.

మా గ్రూప్‌లో అయితే ఎవరూ డ్రగ్స్‌ తీసుకోలేదు. ఎలాంటి శాంపిల్స్‌ తీసుకోవడానికైనా మేం రెడీ. నేను రెగ్యులర్‌గా పార్టీలకు వెళ్లను. నాకు షూటింగ్స్‌ ఉంటాయి. కానీ వీకెండ్‌ కావడంతో  కర్మాగాలి వెళ్లాను. అంతకు మించి ఏం లేదు. ఇక ఈ ఇష్యూ గురించి ఇంట్లో కూడా బాగా గొడవ జరిగింది. మా పేరెంట్స్‌ నన్ను బాగా తిట్టారు. ఇంకోసారి ఇలాంటి పార్టీలకు వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement