Tollywood Drugs Case
-
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు తారలపై నమోదు కేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టిపారేసింది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు తెలిపింది. కాగా 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్, చార్మీ, తరుణ్, నవదీప్, రవితేజ, శ్యామ్ కె నాయుడు, ముమైత్ ఖాన్, తనీష్ సహా పలువురిపై డ్రగ్స్ కేసు నమోదు చేసింది. డ్రగ్స్ ఆనవాళ్లు లేవు! ఈ డ్రగ్స్ కేసుపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నవారిని నెలల తరబడి వారిని విచారించినా ఫలితం లేకపోయింది. వారి నుంచి వెంట్రుకలు, గోళ్లను శాంపిల్ తీసుకున్నారు. కానీ కేవలం పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది. ఆరు కేసులు కొట్టివేత పైగా డ్రగ్స్ కేసులో పాటించాల్సిన విధివిధానాలు అధికారులు సరిగా ఫాలో అవకపోవడంతో కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆరు కేసుల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కాలేదంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది. చదవండి: 30 ఏళ్లుగా వెండితెరకు దూరం.. మర్చిపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకునేలా చేస్తానంటూ.. -
సినీ భాషలోనే డ్రగ్స్ దందా!
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాల్లో నమోదైన ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారు మాదకద్రవ్యాల దందాను వారి పారిభాషిక పదాలనే కోడ్ వర్డ్స్‌గా వినియోగించే చేస్తున్నట్లు వెల్లడైంది. మరోపక్క టీఎస్ నాబ్ అధికారులు నటుడు నవదీప్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందిన నిందితులు మంగళవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌తో లింకులు ఉన్న డ్రగ్స్ కేసులు రెండు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న కేపీ రెడ్డికి సంబంధించిన కేసు మాదాపూర్ ఠాణాలో నమోదైంది. టీఎస్ నాబ్ అధికారులు గుట్టురట్టు చేసిన వెంకట రమణరెడ్డి లింకులకు సంబంధించిన కేసు హైదరాబాద్ కమిషనరేట్‌లోని గుడిమల్కాపూర్ ఠాణాలో రిజిస్టరైంది. ఈ కేసులోనే హీరో నవదీప్ పేరు బయటపడింది. ఈ రెండు కేసుల్లోనూ అనేక మంది టాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు మోడళ్ళు సైతం డ్రగ్స్ వినియోగదారులుగా ఉన్నట్లు బయటపడింది. వీళ్ళు రహస్య ప్రాంతాల్లో, పొరుగు రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహించుకుంటూ, మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా డ్రగ్స్ క్రయవిక్రయాల్లో వాటి పేర్లను డైరెక్టుగా వాడరు. ఎవరికి వాళ్ళు కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకుని పని పూర్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సినీ రంగానికి చెందిన వారు ఆ పారిభాషిక పదాలతోనే డ్రగ్స్‌కు కోడ్ వర్డ్స్ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు మోడల్స్ సైతం ఎక్కువగా కొకై న్ను వినియోగిస్తుంటారని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ డ్రగ్‌కు స్క్రిప్ట్ అనే కోడ్ వర్డ్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మాదకద్రవ్యాలు సరఫరా చేసే డ్రగ్ పెడ్లర్‌కు రైటర్ అని, డ్రగ్స్ రావాలని అడగటానికి ‘షెల్ వీ మీట్’ అని కోడ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి వారి ఫోన్లు విశ్లేషించినప్పుడు ఈ పదాలే కనిపించాయని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. మరోపక్క నవదీప్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ విశ్లేషణ ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను పోలీసులకు అప్పగించే ముందే నవదీప్ ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తులో గుర్తించిన అంశాలను బట్టి ఈ డ్రగ్స్ క్రయవిక్రయాలన్నీ స్నాప్‌చాట్ ఆధారంగా జరిగాయి. ఈ సోషల్‌మీడియా యాప్‌లో ఉన్న డిజ్అప్పీర్ ఆప్షన్‌ను పెడ్లర్లు, వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుడిమల్కాపూర్ కేసులో నిందితులుగా ఉండి, న్యాయస్థానం నుంచి మందస్తు బెయిల్ తీసుకున్న వ్యాపారి కలహర్‌రెడ్డి, పబ్ నిర్వాహకుడు సూర్య కాంత్ సహా మరో వ్యక్తి మంగళవారం దర్యాప్తు అఽధికారి ఎదుట హాజరయ్యారు. గుడిమల్కాపూర్ ఠాణాలో ష్యూరిటీలు సమర్పించడంతో పాటు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాయని హామీ ఇచ్చారు. కలహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘హైకోర్టు ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్ లో లొంగిపోయా. నాకు, డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. విచారణకు పూర్తిగా సహకరించాను.. తర్వాత కూడా సహకరిస్తాను. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు’ అని అన్నారు. -
మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నా..
హిమాయత్‌నగర్: మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని... ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) అధికారులకు తెలిపాడు. ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లోని విఠల్‌నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంలో మరోమారు నవదీప్ పేరు తెరపైకి రావడం, అతడు సైతం డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ఎన్ఏబీ నుంచి నోటీసులు అందుకున్న హీరో నవదీప్ శనివారం ఉదయం 11 గంటలకు టీఎస్ఎన్ఏబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యాడు. ఏసీపీ కె.నర్సింగరావుతో కలసి టీఎస్ఎన్ఏబీ (వెస్ట్) ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నార్కోటిక్ బ్యూరో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వచ్చేందుకు సిద్ధమని తెలియజేశాడు. ఈమధ్య కాలంలో డ్రగ్స్ తీసుకోలేదు... డ్రగ్స్ వ్యవహారంలో రామ్‌చంద్ అనే వ్యక్తిని టీఎస్ఎన్ఏబీ పోలీసులు విచారించగా తన పేరు చెప్పాడని... అతనిచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారని హీరో నవదీప్ వివరించాడు. తాను మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానే తప్ప ఇటీవల కాలంలో తీసుకోలేదన్నాడు. 15 ఏళ్లుగా పరిచయమున్న రామ్‌చంద్ ఏ కారణంతో తన పేరు చెప్పాడో తెలియదని పేర్కొన్నాడు. డ్రగ్ పెడ్లర్లు వెంకటరమణారెడ్డి, బాలాజీలతో ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలంటూ నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించగా 2017 నాటి డ్రగ్స్ కేసు విషయం, ఆనాటి పెడ్లర్ల ద్వారా వారు పరిచయమయ్యారని అతను చెప్పినట్లు తెలిసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని నవదీప్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ 81 మందిపై ఆరా... హీరో నవదీప్ మొబైల్‌ను స్వా«దీనం చేసుకున్న నార్కోటిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా 81 ఫోన్ నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారుల పేర్లు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. నవదీప్‌కు చెందిన ఎస్బీఐ ఖాతాను పరిశీలిస్తున్న పోలీసులు... ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా అతని మొబైల్లోని స్నాప్‌చాట్, వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు, అతను ఎవరెవరితో కలసి డ్రగ్స్ తీసుకున్నాడనే విషయాలన్నీ స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌ల చాటింగ్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో నవదీప్‌ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భయం వేసి పారిపోయా.. డ్రగ్స్ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముందని ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను ప్రశ్నించగా మీడియాలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పదేపదే వార్తలు రావడం వల్ల భయానికి గురయ్యానని హీరో నవదీప్ పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఒత్తిడి వల్ల తనను నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి పారిపోయినట్లు విచారణలో అతను చెప్పాడని సమాచారం. 45 మందికి తరచూ ఫోన్లు.. డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్‌ను విచారించాం. మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్లోని డేటా అంతా తొలగించి.. తల్లికి చెందిన మొబైల్ ఫోన్‌తో వచ్చాడు. అతని మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించగా.. మరమ్మతుల్లో ఉందన్నాడు. దీనిపై క్రాస్ చెక్ చేయగా మొబైల్ షాప్ వ్యక్తి కూడా అదే సమాధానం ఇచ్చాడు. పాత, కొత్త మొబైల్‌తోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇప్పటివరకు 81 లింకులను గుర్తించాం. వాటిలో ప్రధానంగా 45 మందికి నవదీప్ తరచూ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేసేవాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – ఎస్పీ సునీతారెడ్డి -
‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు
హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో సినీనటుడు నవదీప్ కూడా నిందితుడని, అతడు పరారీలో ఉన్నాడని నగర కొత్వాల్, తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) డైరెక్టర్ సీవీ ఆనంద్ గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది సమయానికే తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నవదీప్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ కేసులో ఉన్న నవదీప్ తాను కాదని, తన ఇంట్లోనే అందుబాటులో ఉన్నానని అందులో ప్రకటించాడు. ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన శుక్రవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. రామ్‌చంద్ వాంగ్మూలంతో వెలుగులోకి.. మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఫ్లాట్‌లో గత నెల 31న జరిగిన డ్రగ్ పార్టీ తీగ లాగిన టీఎస్ నాబ్ అధికారులు గురువారం మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ విచారణలోనే నటుడు నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. . నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్ తన వాంగ్మూలంలో నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లు వెల్లడించాడు. ఆఖరుసారిగా గత శనివారం ఇరువురం వీటిని తీసుకున్నట్లు బయటపెట్టాడు. దీంతో టీఎస్ నాబ్ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. మరికొందరితో కలిసి ఎస్కేప్... హైదరాబాద్ సీపీ చెప్తున్న నవదీప్‌ను తాను కాదంటూ ట్వీట్ చేసిన నవదీప్ ఆపై కొన్ని మీడియా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇవి ముగిసిన తర్వాత మరికొందరితో కలిసి కారులో బయటకు వెళ్లిపోయాడు. ఈ హడావుడి చూసిన టీఎస్ నాబ్ అధికారులు నవదీప్‌కు నోటీసులు జారీ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అతడు అందుబాటులో లేకపోవడంతో మరికొన్ని ప్రాంతాల్లోనూ గాలించారు. అర్ధరాత్రి వరకు పోలీసులతో టచ్‌లో ఉన్న నవదీప్ అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అంటూ మఽభ్యపెట్టాడు. ఆపై పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం తన న్యాయవాది ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్ నాబ్ సైతం కౌంటర్ దాఖలు చేసింది. గతంలోనూ గలాభాలు.. . నవదీప్ వార్తల్లోకి ఎక్కడం ఇది తొలిసారేమీ కాదు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడపడంతో పాటు పోలీసుల విధులను అడ్డుకోవడానికి ప్రయత్నించి 2010లో అరెస్టయ్యాడు. అదే ఏడాది అక్టోబర్‌లో నాగార్జునసాగర్‌లో బోటుతో వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకుని హడావుడి చేశాడు. 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరయ్యాడు. నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు డ్రగ్స్ కేసులో నవదీప్‌ను మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధి డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడని.. అతడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.సురేందర్ వాదనలు చేపట్టారు. పిటిషనర్ తరఫున వెంకట సిద్ధార్థ వాదనలు వినిపించారు. ‘ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుగా నవదీప్‌ను కావాలని ఇరికించారని, ఆయనకు ఇతర నిందితులెవరితోనూ ప్రమేయం, అనుబంధం లేదని.. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలి’ అని వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మంగళవారం వరకు నవదీప్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించారు. -
నటుడు చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలు..
చలపతిరావు జీవితంలో విషాదాలు : సీనియర్ నటుడు చలపతి రావు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో గతకొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామును కన్నూమూశారు. కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయ్‌గా పేరుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఈయన సతీమణి పేరు ఇందుమతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. అప్పటికే కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమేనట. ఆ తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లిచేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట. ఇదిలా ఉంటే సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలా జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరిని పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
అదే నాకు మిగిలిన సంతృప్తి.. కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గతేడాది కైకాల పుట్టినరోజు నాడు స్వయంగా చిరు దంపతులు ఆయన ఇంటికి వెళ్లి బెడ్‌పైనే కేక్ కట్ చేయించి ఆప్యాయంగా పలకరించారు. కైకాలను అలా చూడటం అదే చివరిసారి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కైకాల మరణం పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. తెలుగు సినీ రంగానికే కాదు.. భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడాయన. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో మరో నటుడు పోషించి ఉండరు. ఆయనతో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి, ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు.నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నటన, రుచికరమైన భోజనం రెండూ ఆయనకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. ‘‘అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు’’ అని అన్నప్పుడు..‘‘మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం’’ అని చెప్పాం.ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు.సత్యనారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. Rest in peace Navarasa Natana Sarvabhouma Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y — Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022 -
రకుల్ ప్రీత్ సింగ్‌కు షాక్.. మరోసారి ఈడీ నోటీసులు
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ మరోసారి షాకిచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చింది. ఇప్పటికే ఆమెను గతేడాది విచారించిన ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో రకుల్ విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పూర్తిస్థాయిలో విచారించక పోవడంతో మరోసారి హాజరు కావాలని సూచించారు. కాగా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు సిట్ ఏర్పాటు చేసి పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల్ని ప్రశ్నించారు. వీరిలో పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుపాటి రానా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవనీత్, పబ్ మేనేజర్ మేనేజర్, రవితేజ డ్రైవర్ శ్రీనివాసులు కూడా ఉన్నారు. -
డ్రగ్స్ కేసు: తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ ఆరోపణ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదని కోర్డుకు ఈడీ తెలిపింది. దీంతో వారికి కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని సూచించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 25కు వాయిదా కోర్టు వేసింది. -
బంజారాహిల్స్ రేవ్ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Talks With Media Over Drugs Case: బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ రేవ్ పార్టీ టాలీవుడ్లో సంచలనం రేపుతుంది. ఈ పార్టీలో ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన.. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సాక్షి టీవీతో మాట్లాడాడు. డ్రగ్స్ వ్యవహరంతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగిన ఈ పార్టీకి తl కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యానని, తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ జరిగినట్లు తెలిపాడు. చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు, ఆర్ఆర్ఆర్ టీం ఒక్కొక్కరికి తులం బంగారం.. ఈ పార్టీలో తను అసలు డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే లేట్‌నైట్ వరకు పబ్ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని రాహులు పేర్కొన్నాడు. -
Tollywood Drugs Case: 800 పేజీలతో హైకోర్టుకు ఎక్సైజ్‌శాఖ నివేదిక
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మరింత దూకుడు పెంచింది. ఈడీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో తెలంగాణ ప్రభుత్వ అధికారులు కదలిక మొదలైంది. ఇప్పటికే ఈడీ అడిగిన అన్ని వివరాలను ఇచ్చేసిన ఎక్సైజ్‌శాఖ.. తాజాగా తెలంగాణ హైకోర్టుకు 800 పేజీల నివేదికను సమర్పించింది. వీటితో పాటు 12 కేసుల ఎఫ్ఐఆర్ల ఛార్జ్షీట్లు, స్టేట్మెంట్లు, నిందితులు, సాక్ష్యుల వివరాల సేకరణ, సినీ తారలకు చెందిన 600 జీబీ వీడియో రికార్డులను అందజేసింది. 10 ఆడియో క్లిప్స్, కాల్‌డేటాను హైకోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యాలన్నింటిని హైకోర్డు ఈడీకి అందజేసింది. దీంతో ఇక ఈ కేసులో ఈడీ విచారణ మరింత వేగవంతం కానుంది. కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన నిందితుల, సాక్షుల డిజిటల్ వివరాలను ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. దీనిపై స్పందన రాకపోవడంతో.. ఈడీ అధికారులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు..
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చారు. ఈడీ అడిగిన అన్ని వివరాలను ఎక్సైజ్ శాఖ ఇచ్చేసింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందజేశారు ప్రభుత్వ అధికారులు. ఈడీకి వివరాలు అందజేసినట్లు ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఇక మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచనుంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా పరిశీలించనుంది. మరోసారి సినీ తారలను ఈడీ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్‌పై కూపీ లాగనున్నారు. కాగా మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్..
ED Files Contempt Of Court Petition Against Telangana CS Excise Director: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వట్లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరిన వివరాలను ఈడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తర్వాత మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
Tollywood Drugs Case: కాల్ డేటా రికార్డింగ్స్ ఎక్కడ? ప్రశ్నించిన ఈడీ
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కాల్ డేటా రికార్డింగ్స్ మిస్సింగ్!
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు ఇవ్వమంటూ ఎక్సైజ్ శాఖకు లేఖ పంపిన విషయం తెలిసిందే! కానీ ఎక్సైజ్ శాఖ స్టార్ల కాల్ రికార్డింగ్ డేటాను మాత్రం పంపకపోవడంతో ఈడీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ సెలబ్రిటీలతో పాటు మొత్తం 41 మంది కాల్‌డేటా రికార్డింగ్స్ నమోదు చేసింది. అదే ఏడాది వీరిపై 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. డ్రగ్స్ నిందితులతో పాటు సాక్షుల నుంచి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఎక్సైజ్ సుపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్‌ను సైతం సీజ్ చేశారు. కెల్విన్‌తో స్టార్స్‌కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికీ దీన్ని ఈడీకి పంపలేదు. దీంతో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతో పాటు ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్‌ను ఇవ్వాలని ఈడీ కోరింది. వాటి వివరాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలపగా కోర్టుకు వాంగ్మూలాల కాపీలు మాత్రమే అందాయని ఈడీ పేర్కొంది. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవని తెలిపింది. దర్యాప్తుకు అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అందని నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మరోసారి హైకోర్టును సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. -
మరోసారి తెరపైకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని తాజాగా ఈడీ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే పలువురు సినీతారలను విచారించిన ఈడీ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను సైతం పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి ఈడీ విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేయనుంది. -
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్‌కు ఊరట, ఈడీ క్లీన్చిట్
టాలీవుడ్ సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట లభించింది. ఈ డ్రగ్ కేసులో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు క్లిన్ చిట్ లభించింది. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు సినీ ప్రముఖులకు క్లిన్ చిట్ ఇవ్వగా తాజాగా ఈడీ కూడా ఈ కేసులో వీరికి క్లిన్ చిట్ ఇచ్చింది. ఇటీవల టాలీవుడు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ దిగుమతులతో పాట ఆర్ధిక లావాదేవీలు, నిధుల మల్లింపులపై టాలీవుడ్‌కు చెందిన మొత్తం12 మందిని స్టార్స్‌ను, సెలబ్రెటీలను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య విచారణ ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. తమ కేసును కూడా క్లోజ్ చేసింది. ఫెమా, హవాలా సంబంధించిన ఆధారాలు లభ్యం కానందున ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. దీంతో కొంతకాలంగా డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులకు ఊరట లభించింది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎక్సైజ్ శాఖకు చుక్కలు చూపిస్తున్న నిందితులు
ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్ కేసు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రానా దగ్గుబాటి, రవితేజ, తరుణ్, నటి చార్మి కౌర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. ఈ విచారణ ముగియడంతో పాత నిందితులు పేర్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. గతంలో ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులు ఎక్సైజ్ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ గతంలో 12 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో కోర్టు విచారణకు ఆదేశించింది. కానీ నిందితులు కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం కాగా.. 2020 నుంచి ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ కోర్టుకు హజరుకావడం లేదు. మూడు సార్లు కెల్విన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అతడు హజరుకాకుండా తప్పించుకు తిరిగాడు. ఇక 2018లో నుంచి అబూబకర్ అనే మరో నిందితుడు కోర్టు రావడంలేదు. మరో నిందితుడు సోహెల్ పరారీ ఉన్నాడు. మైక్ కమింగ్ విదేశాలకు పారిపోయాడు. ఇలా నిందితులు కోర్టుకు హజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. నిందితులపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసి వారిని పట్టుకోవడంలో జాప్యం జరుగుతోంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన సినీ ప్రముఖుల విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ తారలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ బుధవారం (సెప్టెంబర్ 22న) ముగిసింది. ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు, చివరగా నటుడు తరుణ్‌ని ఈడీ కార్యాలయంలో విచారించారు. దీంతో అభియోగాలు ఉన్న 12 మంది విచారణ పూర్తయ్యింది. తరుణ్‌ని దాదాపు 8 గంటల పాటు అధికారులు విచారణ చేశారు. తండ్రి, చార్టర్డ్ అకౌంటెంట్‌తోపాటు హాజరైన తరుణ్ బ్యాంకు స్టేట్ మెంట్ ఇతర పత్రాలు వెంట తీసుకొచ్చారు. అయితే ఈ విచారణకు సినీ సెలబ్రిటీలందరూ తమ బ్యాంక్ ఖాతాల వివరాలతో హాజరయ్యారు. ఆగస్ట్ 31వ తేదీన సినీ ప్రముఖుల విచారణను ఈడీ మొదలుపెట్టింది. మొదటగా పూరీ జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. అనంతరం వరుసగా ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానాను సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వరుసగా ఈడీ విచారించింది. ఈ సమయంలోనే డ్రగ్ డీలర్ కెల్విన్, అతడి స్నేహితుడు జీషాన్ ఇళ్లలో సోదాలు చేశారు. వారిని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. సెప్టెంబర్ 9న రవితేజతో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ను 6 గంటల పాటు, సెప్టెంబర్ 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌ను 9 గంటల పాటు ఈడీ విచారించింది. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్‌ను దాదాపు 7 గంటల పాటు ఈడీ విచారించింది. చివరిగా సెప్టెంబర్ 22న తరుణ్ విచారణకు హాజరయ్యాడు. కేసులో బలమైన ఆధారాలు లేవని, సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్‌చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని ఈడీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. -
మనీలాండరింగ్‌పై తరుణ్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ
-
Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు తరుణ్