తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయాడు. ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ఆధారంగా 6 నెలల క్రితం ఈడీ అధికారులు కెల్విన్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారిపోయాడు. దీంతో కెల్విన్ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం.
(చదవండి: అమ్మతోడు నాకు ఆ కేసుతో సంబంధం లేదు : బండ్ల గణేశ్)
కెల్విన్ బ్యాంకు ఖాతాకు టాలీవుడ్ కు చెందిన సినీతారల నుంచి భారీగా డబ్బులు జమ చేసినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై నోటీసులు అందుకొన్న సినీతారలను 2015 నుండి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకురావాలని కోరారు. మంగళవారం విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ సమయంలో బ్యాంకు స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులకు సమర్పించారు.
(చదవండి: Tollywood Drugs Case: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా)
Comments
Please login to add a commentAdd a comment