టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మరింత దూకుడు పెంచింది. ఈడీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో తెలంగాణ ప్రభుత్వ అధికారులు కదలిక మొదలైంది. ఇప్పటికే ఈడీ అడిగిన అన్ని వివరాలను ఇచ్చేసిన ఎక్సైజ్‌శాఖ.. తాజాగా తెలంగాణ హైకోర్టుకు 800 పేజీల నివేదికను సమర్పించింది. వీటితో పాటు 12 కేసుల ఎఫ్‌ఐఆర్‌ల ఛార్జ్‌షీట్లు, స్టేట్‌మెంట్లు, నిందితులు, సాక్ష్యుల వివరాల సేకరణ, సినీ తారలకు చెందిన 600 జీబీ వీడియో రికార్డులను అందజేసింది. 10 ఆడియో క్లిప్స్, కాల్‌డేటాను హైకోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యాలన్నింటిని హైకోర్డు ఈడీకి అందజేసింది. దీంతో ఇక ఈ కేసులో ఈడీ విచారణ మరింత వేగవంతం కానుంది.
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన నిందితుల, సాక్షుల డిజిటల్ వివరాలను ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. దీనిపై స్పందన రాకపోవడంతో.. ఈడీ అధికారులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment