టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు ఇవ్వమంటూ ఎక్సైజ్ శాఖకు లేఖ పంపిన విషయం తెలిసిందే! కానీ ఎక్సైజ్ శాఖ స్టార్ల కాల్ రికార్డింగ్ డేటాను మాత్రం పంపకపోవడంతో ఈడీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ సెలబ్రిటీలతో పాటు మొత్తం 41 మంది కాల్‌డేటా రికార్డింగ్స్ నమోదు చేసింది. అదే ఏడాది వీరిపై 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. డ్రగ్స్ నిందితులతో పాటు సాక్షుల నుంచి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఎక్సైజ్ సుపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్‌ను సైతం సీజ్ చేశారు.
కెల్విన్‌తో స్టార్స్‌కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికీ దీన్ని ఈడీకి పంపలేదు. దీంతో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులతో పాటు ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్‌ను ఇవ్వాలని ఈడీ కోరింది. వాటి వివరాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలపగా కోర్టుకు వాంగ్మూలాల కాపీలు మాత్రమే అందాయని ఈడీ పేర్కొంది. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవని తెలిపింది. దర్యాప్తుకు అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అందని నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మరోసారి హైకోర్టును సంప్రదించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment