kelvin
-
టాలీవుడ్ డ్రగ్స్ డీలర్ కెల్విన్
-
కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా?
సాక్షి, హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సినీ నటుడు దగ్గుబాటి రానాను ప్రశ్నించారు. ఈడీ అధికారులకు డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే రానా విచారణ జరిగినట్లు తెలిసింది. ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంట ల పాటు విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లావాదేవీలన్నీ సినీరంగానివే... మంగళవారం నటుడు నందు విచారణ సందర్భంగా కెల్విన్‌ను తీసుకొచ్చిన అధికారులు.. బుధవారం కూడా ఆయనను ఈడీ కార్యాలయానికి రప్పించారు. అతడి ల్యాప్‌టాప్‌ను తెరిపించి అందులోంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రానా, కెల్విన్‌లను విడివిడిగా, ఆపై ఇద్దరినీ కలిపి ఈడీ బృందం ప్రశ్నిం చింది. ఇరువురూ చెప్పిన అంశాల్లో కొన్నింటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. రానా తన వెంట రెండు బ్యాంకు ఖాతాలకు సంబందించిన స్టేట్మెంట్లు తెచ్చారు. 2015–17 మధ్య లావాదేవీల వివరాలను ఈడీకి ఇచ్చారు. 2017లో ఎఫ్–క్లబ్లో జరిగిన పార్టీకి హాజరయ్యారా? దాని ముందు, ఆ తర్వాత కెల్విన్‌కు నగదు బదిలీ చేశారా? తదితర అంశాలపై రానాను ప్రశ్నించారు. ఇంతకు ముందే కెల్విన్ బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించిన అధికారులు అం దులో రానా ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారని సమాచారం. ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్‌తో తాను చేసిన లావాదేవీలన్నీ సినీ రంగానికి సంబంధించినవే అని ఈడీ అధికారులకు రానా స్పష్టం చేసినట్లు తెలి సింది. రానా సాయంత్రం 6 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోగా, ఆ తర్వాత 2 గంటల పాటు కెల్విన్ విచారణ సాగింది. నేడు నవ్‌దీప్ కూడా..? ఈడీ సమన్లు అందుకున్న వారిలో నటుడు రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. వీరిద్దరూ గురువారం ఈడీ కార్యాలయానికి రానున్నారు. సోమవారం నటుడు పి.నవ్‌దీప్ హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఆయన కూడా గురువారం హాజరుకావడానికి అనుమతి కోరినట్లు సమాచారం. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కెల్విన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్ కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌కు తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు జారి చేసింది. బోయినాపల్లి మాదక ద్రవ్యాల కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కెల్విన్‌ను అరెస్టు చేసి ఎల్ఎస్డి రకం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు. 2016లో మళ్లీ ఎక్సైజ్‌శాఖ కెల్విన్ కేసు మరోసారి అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్ వ్యవహరం బయట పడింది. ఈ నేపథ్యంలో సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో కోర్టు ఆ ఛార్జ్‌సీట్‌ను విచారణకు స్వీకరించింది. దీంతో ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్..ఈడీ ముందు లొంగిపోయిన కెల్విన్
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్..ఈడీ ముందు లొంగిపోయిన కెల్విన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయాడు. ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ఆధారంగా 6 నెలల క్రితం ఈడీ అధికారులు కెల్విన్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారిపోయాడు. దీంతో కెల్విన్ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం. (చదవండి: అమ్మతోడు నాకు ఆ కేసుతో సంబంధం లేదు : బండ్ల గణేశ్) కెల్విన్ బ్యాంకు ఖాతాకు టాలీవుడ్ కు చెందిన సినీతారల నుంచి భారీగా డబ్బులు జమ చేసినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై నోటీసులు అందుకొన్న సినీతారలను 2015 నుండి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకురావాలని కోరారు. మంగళవారం విచారణకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ సమయంలో బ్యాంకు స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులకు సమర్పించారు. (చదవండి: Tollywood Drugs Case: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా) -
కిలోగ్రామ్‌కు సరికొత్త నిర్వచనం
వర్సెయిల్స్: ప్రపంచవ్యాప్తంగా బరువును కొలిచేందుకు వాడుతున్న కిలోగ్రామ్(కేజీ) ప్రమాణం నిర్వచనాన్ని మార్చేందుకు ఫ్రాన్స్ లో సమావేశమైన 50 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. దీంతో పాటు విద్యుత్ ప్రవాహానికి వాడే ఆంపియర్, ఉష్ణోగ్రతకు వాడే కెల్విన్, పదార్థ రాశిని కొలిచేందుకు వాడే మోల్ ప్రమాణాల నిర్వచనాలను సవరించాలని నిర్ణయించాయి. ఫ్రాన్స్‌లోని వర్సయిల్స్లో జరిగిన ఓ సమావేశంలో ఈ నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. 1889 నుంచి ఇప్పటివరకూ ఫ్రాన్స్‌లోని ఓ హైసెక్యూరిటీ లాకర్లో భద్రపరిచిన ప్లాటినం–ఇరీడియం అల్లాయ్ గోళాన్ని ఇన్నాళ్లూ కేజీకి ప్రమాణంగా పరిగణిస్తూ వచ్చారు. ఈ లోహపు వస్తువు కిందపడ్డా, మరే కారణంచేత అయినా దెబ్బతిన్నా కేజీ బరువులో మార్పులు జరిగే అవకాశముండేది. ఈ నేపథ్యంలో తాజా నిర్వచనం ప్రకారం కేజీని ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండేలా డిజిటల్ మాధ్యమంలో సంఖ్యల రూపంలో తెలియజేయనున్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రజల జీవితాల్లో పెద్దగా వచ్చే మార్పేమీ ఉండబోదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వచ్చే మే 20 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు : కెల్విన్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆదివారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి తనపై వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని కెల్విన్ అన్నారు. ఇకపై సాధారణ జీవితాన్నే కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. ఆరు నెలల కిందట వెలుగు చూసిన డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును విచారించింది. ఈవెంట్ మేనేజర్‌గానూ పనిచేసిన కెల్విన్‌కు అంతర్జాతీయ, గోవా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని, టాలీవుడ్‌లోని పలువురు దర్శకులు, నటీనటులకు అతను మాదకద్రవ్యాలను సరఫరా చేశాడని నిర్ధారించాయి. ఈ క్రమంలో ఆయా దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లను సిట్ విచారించింది. కాగా, దర్యాప్తు దశలోనే ఈ కేసు నీరుగారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. (చదవండి : డ్రగ్స్ కేసు కథ కంచికేనా!) -
డ్రగ్స్ కేసు కథ కంచికే..!
-
డ్రగ్స్ కథ కంచికే!
సాక్షి, హైదరాబాద్ : రోజుకో లీకుతో, ఏదేదో జరిగిపోతోందన్న ప్రచారంతో సస్పెన్స్ సినిమాను తలపించిన సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం కేసు కథ కంచికి చేరినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎక్సైజ్ సిట్ పూర్తిస్థాయి ఆధారాలను సేకరించలేక పోయిందని... సిట్ చేసిన హడావుడి, గంటల తరబడి విచారణ అంతా ఉత్తదేనని తేలిపోయింది. అకున్ సబర్వాల్ సారథ్యంలోని ఎక్సైజ్ సిట్ 10 మంది సినీ ప్రముఖులను విచారించగా.. ముగ్గురి నుంచి మాత్రమే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారని శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని... ఈ మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎక్సైజ్ సిట్‌కు నివేదిక అందిందని విశ్వసనీయ సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక అందిన నేపథ్యంలో ఈ నెల చివరి వారంలోగా చార్జిషీటు వేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది. కోర్టులో నిలబడతాయా? ఇప్పటివరకు సేకరించిన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, ఆధారాలు ఎంతవరకు కోర్టులో నిలబడతాయన్న దానిపై ఎక్సైజ్ సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సినీ ప్రముఖులు దోషులేనని తేల్చదగిన కచ్చితమైన ఆధారాలేవీ అధికారులకు లభించలేదని తెలుస్తోంది. అరకొర ఆధారాలు కోర్టులో నిలవకపోతే... కేసుతో ఇబ్బందిపడ్డ సినీ ప్రముఖులు పరువు నష్టం దావా వేసే అవకాశముందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలి చార్జిషీటుతోనే కేసును తేల్చకుండా.. అనుబంధ చార్జిషీట్లు వేస్తూ కేసును పొడిగించాలని భావిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెల్విన్ ‘బెదిరింపు’లతో.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్. అతను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు దొరికే సమయానికే బాగా మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజున కెల్విన్‌ను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో రహస్యంగా విచారించారు. ఉన్నతాధికారి అకున్ సభర్వాల్ కూడా సాధారణ దుస్తుల్లో అక్కడికి వచ్చారు. అంతా సాధారణ సిబ్బందేనని భావించిన కెల్విన్... అధికారులను బెదిరించడానికి ప్రయత్నించాడు. ‘నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. నా సత్తా ఏమిటో చూపిస్తా. మీకు 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది. నా కోసం ఆ దర్శకుడు ఫోన్ చేస్తాడు. ఫలానా రాజకీయ నాయకుడి కుమారుడు వస్తాడు.. ఆ హీరోయిన్ నన్ను వెతుక్కుంటూ వస్తుంది..’అంటూ పలువురు ప్రముఖుల పేర్లను చెప్పినట్లు సమాచారం. ఈ మాటలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. కెల్విన్ ఫోన్‌కాల్ లిస్టు, మెసేజీలు, అతడి వద్ద దొరిన ఫొటోల ఆధారంగా విచారణ చేపట్టారు. అందులో భాగంగానే పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులను పిలిపించి విచారించారు. ఎక్సైజ్ సిట్‌కు ఏమేం దొరికాయి? విచారణ ఎదుర్కొన్న హీరోయిన్ ఫోన్ నుంచి కెల్విన్‌కు 40 ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయి. అందులో ఒక్క ఎస్సెమ్మెస్‌లో మాత్రమే ఎల్ఎస్డీ అనే పదం ఉంది. మిగతా వాటిలో బ్లాటింగ్, మెటీరియల్ అనే పదాలను వాడినట్లు సిట్ గుర్తించింది. ఇక ఆ హీరోయిన్ నుంచి కెల్విన్‌కు ఎస్సెమ్మెస్ వెళ్లిన ప్రతిసారి అరగంట గంట సమయంలోపు సదరు దర్శకుడి బ్యాంకు ఖాతా నుంచి కెల్విన్ ఖాతాలోకి డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఈ హీరోయిన్, దర్శకుడు, కెల్విన్ కలసి ఉన్న ఫొటోలు కూడా దొరికాయి. ఈ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగింది. ఆ దర్శకుడిని సుదీర్ఘంగా విచారించి, వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. అయితే ఈ ఆధారాలేవీ కోర్టులో గట్టిగా నిలవవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎల్ఎస్డీ అంటే సినీ పరిభాషలో ‘లైట్ స్కేల్ డిన్నర్ (తక్కువ స్థాయిలో భోజనం)’అనే వాడుక ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కాబట్టి సినీ ప్రముఖుల బ్యాంకు ఖాతాల నుంచి ఆయనకు డబ్బు వెళ్లేందుకు చాలా అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఒకరు డ్రగ్ తీసుకున్నట్లు తేలినా.. ఫోరెన్సిక్ పరిశీలనలో ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే తరచూ విదేశాలకు వెళ్లే ఆ ప్రముఖుడు ఎక్కడ డ్రగ్ తీసుకున్నాడో చెప్పటం కష్టమని, ఫలానా చోట, ఫలానా దేశంలో డ్రగ్ తీసుకున్నాడని నిరూపించటం సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో సందర్భం, అవసరాన్ని బట్టి డ్రగ్స్ వాడకానికి చట్టబద్ధత ఉందని.. ఆ దేశాల్లో డ్రగ్స్ తీసుకుని ఉంటే పరిస్థితి ఏమిటన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇక మిగతా ప్రముఖుల విషయంలో ఈ మాత్రం ఆధారాలు కూడా లభ్యం కాలేదు. కేసుకు సంబంధించి ఇంకొన్ని వివరాలు.. ⇒ విచారణ ఎదుర్కొన్న ఒక నటుడు కొన్నేళ్ల కింద ఒకటి రెండు సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లుగా అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. కానీ ఇప్పుడా విషయాన్ని నిరూపించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. విచారణ సమయంలో తన పరువు తీశారంటూ కన్నీరు పెట్టిన ఆ నటుడు.. ఎక్సైజ్ సిట్ చార్జిషీటు వేయగానే పరువునష్టం దావా వేయాలన్న యోచనతో ఉన్నట్టు సమాచారం. ⇒మరోవైపు డ్రగ్స్ విక్రయించినవారిని కాకుండా కేవలం డ్రగ్స్ వాడిన వారిని అరెస్టు చేసి, చర్యలు చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. వారిని అరెస్టు చేశాక కోర్టుల్లో నిరూపించలేకపోయినా, వారు పరువు నష్టం దావాలు వేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసును కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు అంశంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన గుజరాత్ ఎన్నికల విధుల్లో ఉండటంతో అందుబాటులోకి రాలేదు. ఇతర అధికారులను సంప్రదించినా.. కేసుపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
పంద్రాగస్టున రేవ్ పార్టీకి ప్లాన్
- భారీగా డ్రగ్స్ విక్రయించాలని కెల్విన్ సూచించాడని తెలిపిన నైజీరియన్ ముఠా - మాదక ద్రవ్యాల కేసులో తాజాగా నలుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు - రూ.పది లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం - వివరాలు వెల్లడించిన సీపీ మహేశ్ భగవత్ సాక్షి, హైదరాబాద్: ‘స్వాతంత్య్ర దినోత్సవం రోజు గోవాలో రేవ్ పార్టీకి కెల్విన్ ప్లాన్ చేశాడు. ఆ పార్టీలో భారీగా డ్రగ్స్ విక్రయించాలని సమాచారమిచ్చాడు. అంతలోనే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కెల్విన్‌ను అరెస్టు చేశారు’ అని రాచకొండ పోలీసులకు తాజాగా చిక్కిన నలుగురు సభ్యుల ముఠా తెలిపింది. గతంలో అరెస్టు అయిన ఆరుగురు నైజీరియన్ నిందితులిచ్చిన వివరాల ఆధారంగా అజా గాబ్రియల్ ఒగొబొన్నాను రెండు రోజుల క్రితం, నవ్యంత్, అంకిత్ పాండే, గణత్ కుమార్‌రెడ్డిలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.పది లక్షల విలువైన 450 ఆంఫెటమైన్ ట్యాబ్లెట్లు, 45 గ్రాముల ఎమ్డీఎమ్ఏ, 60 ఎల్ఎస్డీ ప్యాకెట్లు, 0.5 గ్రాముల కొకైన్, 0.35 గ్రాముల చంగా, 60 గ్రాముల గంజా, ఒక పాస్‌పోర్టు, ఆరు ల్యాప్‌టాప్‌లు, రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. నగర పబ్‌లకు డ్రగ్స్ సరఫరా డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు రాచకొండ పోలీసులు జూలై 23న ఆరుగురు నైజీరియన్లు, విజయవాడకు చెందిన ఓ యువతిని అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన అజా గాబ్రియల్ ఒగొబొన్నా గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి మిగతావారికి విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిపారు. దీంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. యాప్రాల్‌లో తన ప్రేయసి ఉంటున్న గ్రీన్వుడ్ రెసిడెన్సీకి రాగానే అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్ రెడ్డి పెడ్లర్ జూన్ 23న అరెస్టైన నైజీరియన్ ముఠా పోలీసు విచారణలో ఆరుగురికి డ్రగ్స్ విక్రయించినట్లు తెలిపింది. దీంతో ఆరుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారి రక్తనమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వారందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించారు. అయితే ఈ కేసులో డ్రగ్ స్వీకరించిన పవన్‌కుమార్‌రెడ్డి పెడ్లర్ అని దర్యాప్తులో తేలింది. అతడిని రెండు వారాల క్రితం పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. తాజా గా పవన్‌కుమార్ ప్రమేయం ఉన్నట్టు తేలడం తో అతని కోసం గాలిస్తున్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్వోటీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నవీన్కుమార్లతోపాటు ఇతర సిబ్బందిని రివార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ తరుణ్ జోషి, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు, అదనపు డీసీపీ క్రైమ్స్ జానకీ తదితరులు పాల్గొన్నారు. గోవాకు వెళ్లినా డ్రగ్స్ విక్రయం ఆపలేదు ఈ ముఠాలో కీలకవ్యక్తి కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి నూక నవ్యంత్. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసై చదువు మధ్యలోనే ఆపేశాడు. పబ్‌లకు వెళ్లేప్పుడు డీజే అంకిత్ పాండే పరిచయమయ్యాడు.ఇతని ద్వారా గాబ్రి యేల్తో స్నేహం చేశాడు. థాయిలాండ్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ కొనుగో లు చేశాడు. ఆగస్టు 15న గోవాలో పెద్ద రేవ్ పార్టీ నిర్వహిస్తున్నామని, రావాలని నవ్యంత్కు కెల్విన్ చెప్పాడు. కెల్విన్ అరెస్టు కావడంతో నవ్యంత్ గోవాకు పారి పోయాడు. అక్కడి నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. నవ్యంత్ ఫోన్లో 50 మంది మహిళల నంబర్లు ఉన్నాయి. అందులో సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. -
డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు ఏదీ?
కెల్విన్‌కు డ్రగ్ సరఫరా గుట్టు తేల్చడంపై దృష్టి సారించని ఎక్సైజ్ సిట్ - డ్రగ్స్ దొరకకున్నా కొందరికి నోటీసులు, విచారణ పేరుతో హడావుడి - డార్క్ నెట్, కొరియర్ రవాణా అంశాలపై నిర్లక్ష్యం - కెల్విన్ అరెస్ట్ రోజు ఓ ప్రముఖ నిర్మాత ఉన్నాడని చెప్పిన అకున్ - దర్యాప్తు జాబితాలో ఏ నిర్మాత పేరూ లేని వైనం - ఆ నిర్మాత సహా మరో 14 మంది ప్రముఖులు తప్పించుకున్నట్లేనా? - తీవ్ర ఒత్తిళ్ల కారణంగా వారి విచారణపై సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణ తీరు ఏమిటన్నది గందరగోళంగా మారింది. అసలు డ్రగ్స్ మూలాలను పెకలించాల్సింది పోయి.. వాటిని వినియోగించిన వారిని మాత్రమే టార్గెట్ చేయడమేమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెల్విన్‌కు డ్రగ్స్ ఎక్కడినుంచి సరఫరా అయ్యాయి, కెల్విన్ పైన మరింత మంది డ్రగ్ పెడ్లర్లు ఉన్నారా? ఉంటే వారెవరు? అసలు డ్రగ్స్ సరఫరా మూలాలు ఎక్కడున్నాయి? వాటిని నియంత్రించేదెలా.. వంటి అంశాలన్నీ పక్కదారి పట్టాయి. డ్రగ్స్‌కు బానిసైన వారిని, వినియో గించిన వారిని బాధితులుగా పరిగణిస్తారని... కానీ వారే ప్రధాన నిందితులు అనే స్థాయిలో ఎక్సైజ్ సిట్ హడావుడి చేయడమేమిటంటూ పోలీసు శాఖ అధికారులే విస్తుపోతున్నారు. ఒకవేళ వారు డ్రగ్ పెడ్లర్లుగా భావిస్తే.. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి, డ్రగ్స్ ఉంటే స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని.. కానీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం ఏమిటని పేర్కొంటున్నారు. డార్క్ నెట్లపై సిట్ మౌనం కెల్విన్ సహా ఇతర పెడ్లర్లు డార్క్‌నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించారని పేర్కొన్న ఎక్సైజ్ సిట్.. ఆ డార్క్ నెట్, వాటి నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరాలను నియంత్రించే అంశంపై దృష్టి పెట్టలేదన్న ఆరోపణ వినిపిస్తోంది. డార్క్ నెట్ వెబ్సైట్ల నియంత్రణకు ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్)కి లేఖ రాయా లి. కానీ ఇప్పటివరకు సిట్ అనుమానిత డార్క్‌నెట్ సైట్లపై ఎన్ఐసీకి లేఖ రాయలేదని సమాచారం. దీనిపై సిట్ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. స్పందన రాలేదు. అసలు గుట్టు తేలేనా? కెల్విన్‌కు గోవా, జర్మనీల నుంచి డ్రగ్ వచ్చిందని సిట్ చెబుతోంది. గోవా నుంచే డ్రగ్ వస్తోందని తెలిసినప్పుడు ప్రత్యేకంగా ఒక బృందాన్ని గోవాకు పంపించి దర్యాప్తు చేయాల్సి ఉంది. అక్కడి మూలాలను ఛేదిస్తే మొత్తం నెట్వర్క్ బయటపడేది. కానీ సిట్ ఆ దిశగా దృష్టి పెట్టలేదు. అంతేగాకుండా కెల్విన్ డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కడి నుంచి వివరాలు సేకరించాడు? డార్క్ నెట్ వెబ్సైట్ల అంశం అతడికి ఎలా తెలిసిందన్న కోణంలోనూ పరిశీలన జరగడం లేదన్న విమర్శలున్నాయి. బడా నిర్మాత సేఫ్..? డ్రగ్స్ వ్యవహారంలో పలు ఇంటర్నే షనల్ స్కూళ్ల విద్యార్థులతో పాటు ఓ బడా సినీ నిర్మాత కూడా ఉన్నట్లు కెల్విన్ విచారణలో తేలిందని కొద్దిరోజుల కింద అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఆ నిర్మాతకు కూడా నోటీసులిచ్చి విచారిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ బడా నిర్మాత అంశం మరుగున పడిపోవడం గమనార్హం. దీనిపై సిట్ అధికారులెవరూ నోరు మెదపడం లేదు. -
ఆధారాలు బయటపెట్టిన సిట్, ఒప్పుకున్న పూరీ
-
పూరీని విచారించనున్న నార్కోటిక్స్‌అధికారులు
హైదరాబాద్ : సిట్ అధికారుల విచారణకు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను తాజాగా నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేయనున్నారు. ఈ రోజు ఉదయం సిట్ విచారణ నిమిత్తం అబార్కీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్ హాజరు అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను సిట్ అధికారులు విడతలు వారీగా విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఎవరో మొదట తెలియదని చెప్పిన పూరీ జగన్నాథ్... పలు ఆధారాలను సిట్ బృందం బయటపెట్టడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు. కెల్విన్ పరిచయం విషయంలో ముందు బుకాయించిన పూరీ... ఆతర్వాత జ్యోతిలక్ష్మి ఆడియో విడుదల ఫంక్షన్‌కు కెల్విన్‌తో పాటు జీశాన్ కూడా హాజరయిన ఫోటోలను సిట్ బృందం బయటపెట్టడంతో... కెల్విన్‌తో పరిచయాన్ని అంగీకరించినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఛార్మీ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అలాగే పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని తేల్చేందుకు ఆయన రక్త నమూనాలు సేకరించే అవకాశం ఉంది. అలాగే పూరీ ఇచ్చిన సమాచారంతో ఓ వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ విచారణ కొనసాగుతోందని, అయితే విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించడం కుదరదని తెలిపారు. మరోవైపు పూరీ కుటుంబసభ్యులతో పాటు, ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పూరీ జగన్నాథ్‌ను విచారణ చేయనున్న నేపథ్యంలో గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. మరికొన్ని గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పూరీ జగన్నాథ్‌పై ప్రశ్నల వర్షం...
-
ఛార్మీ తీవ్రంగా కలత చెందింది: దీప్‌సింగ్
-
ఛార్మీ తీవ్రంగా కలత చెందింది: దీప్‌సింగ్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మిపై వస్తున్న ఆరోపణలను ఆమె తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ ఖండించారు. ‘13 ఏళ్ల నుంచే ఛార్మి సినీ రంగంలో ప్రతిభ చాటుతోంది. చిన్ననాటి నుంచే కుటుంబానికి అండగా ఉంటోంది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలతో నా కుమార్తె తీవ్రంగా కలత చెందింది. ఒకవేళ చార్మీకి డ్రగ్స్ అలవాటు ఉంటే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందా?. తనకు ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొనే సమయం లేదు. ఛార్మీ తన తదుపరి చిత్రం పైసా వసూల్‌తో బిజీగా ఉంది. అయితే ఒకరిపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాసేటప్పుడు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నాకు పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా తెలుసు. పూరీ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు.త్వరలోనే క్లీన్చిట్ వస్తుందని అప్పుడే అందరికి సమాధానం దొరుకుంది.’ అని ఛార్మి తండ్రి వ్యాఖ్యానించారు. కాగా డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 20న ఛార్మీ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. -
పూరీ జగన్నాథ్‌పై ప్రశ్నల వర్షం...
హైదరాబాద్ : సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్...సిట్ విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. విచారణలో భాగంగా పూరి జగన్నాథ్‌పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. తన గురించి సుమారు 40 నిమిషాల సేపు చెప్పిన పూరీ.. సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని, తన సినిమాల్లో ఎక్కువగా పబ్ సీన్లు ఉంటాయని, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా డ్రగ్స్ మాఫియా ప్రధాన సూత్రధారి కెల్విన్ పరిచయం అయినట్లు సిట్ అధికారులు తెలిపారు. అయితే పరిచయం తర్వాతే కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడని తనకు తెలిసినట్లు చెప్పారు. కాగా విచారణ గదిలో ఓ మానసిక వైద్యుడి పర్యవేక్షణలో పూరీ జగన్నాథ్‌ను అధికారులు ప్రశ్నించారు. మొదటి విడత 20 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, అలాగే ఆయన బ్యాంకాక్ పర్యటనపై కూడా సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్‌ల కోసమే బ్యాంకాక్ వెళుతోందని పూరీ జగన్నాథ్ వెల్లడించినట్లు సమాచారం. ఇక తనకు సినిమా వాళ్లు తప్ప, బయట స్నేహితులు లేరని పేర్కొన్నారు. సిట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. నాంపల్లిలో ఉన్న ఆబ్కారీ ఆఫీసులో సిట్ బృందం పూరీని విచారణ చేశారు. డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. కొకైన్, హెరైన్ లాంటి మాదకద్రవ్యాలను అమ్ముతున్న కెల్విన్‌తో పూరీకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ విచారణను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఎక్సైజ్ శాఖలోని సెక్షన్ 67 ప్రకారం పూరీని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కెల్విన్‌తో పూరీ వాట్సాప్ ద్వారా సంబంధాలు కొనసాగించాడని, ఆ అంశాన్నే సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కెల్విన్ వాట్సాప్‌లో పూరీ బ్యాంక్ ఆర్థిక లావాదేవీల గురించి కూడా మెసేజ్ చేశారని, కెల్విన్‌కు పూరీ ఎందుకు సందేశాలు పంపారు, వారిద్దరి మధ్య జరిగిన లావాదేవీలు ఏమిటన్న అంశాన్ని సిట్ అధికారులు తమ విచారణలో తేల్చనున్నారు. ఒకవేళ కెల్విన్ దగ్గర పూరీ డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరిస్తే, అది ఆయన కోసమా లేక అమ్మేందుకు తీసుకున్నాడా అన్న కోణంలోనూ విచారణ కొనసాగనున్నది. కాగా పూరీ జగన్నాథ్ ఈరోజు ఉదయం పదిన్నరకు కుమారుడు ఆకాశ్, సోదరుడు సాయిరాం శంకర్‌తో పాటు తన న్యాయవాదితో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చారు. సంబంధిత కథనాలు... పూరీ జగన్నాథ్ విచారణ ఇలా... డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్ -
డ్రగ్స్ కేసు: కొరియర్ సంస్థలకు నోటీసులు
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ కేసులో పలు కొరియర్ సంస్థలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జరీ చేశారు. గోవా నుంచి హైదరాబాద్‌కు కొరియర్ ద్వారా భారీగా డ్రగ్స్ సరఫరా అయినట్లు సిట్ విచారణలో ప్రధాన నిందితుడు కెల్విన్ విల్లడించిన నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి. డ్రగ్స్ పంపినవారు, డెలివరీ తీసుకున్నవారు ఎవరెవరన్న కోణంలో విచారణ చేపట్లనుట్లు అధికారులు వెల్లడించారు. ఇదివరకే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది. బ్రెండన్, నిఖిల్ శెట్టి, అమన్ నాయుడు డ్రగ్స్ ముఠాలతో తనకు సంబంధం ఉందని, తామంతా ఎల్ఎస్డీ డ్రగ్స్‌నే విక్రయిస్తామని సిట్ రెండ్రోజుల విచారణలో డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ తెలిపాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నేడు అమన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్ లను సిట్ తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది. మరో ముగ్గురు నిందితులు బ్రెండన్‌బెన్, అనీష్, పీయుష్ లను కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. వినాయక నిమజ్జనం చివరి ఐదు రోజుల్లో ఎల్ఎస్డీ స్ట్రిప్పులకు భారీగా డిమాండ్ ఉంటుందని విచారణలో కెల్విన్ వెల్లడించినట్లు సమాచారం. ఇక కొకైన్ బ్యాచ్‌పై దృష్టి ఇప్పటివరకూ కేవలం ఎల్ఎస్డీ బ్యాచ్‌ను పట్టుకున్నారని, ఇంకా కొకైన్ బ్యాచ్ ఉందని.. అందులో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నారని బయటకు రావడం మరింత కలకలం రేపుతోంది. దీంతో కేసు కొత్త మలుపులు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు కొకైన్‌ను తీసుకుంటారని, విచారణలో మరికొందరి పేర్లు బయటకు రానున్నాయి. మరోవైపు కస్టడీ గడువు ముగియటంతో సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం కెల్విన్, ఖుద్దూస్, వాహిద్‌లను జడ్జి ముందు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
డ్రగ్స్ వ్యవహారంలో కొత్త మలుపు
-
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్!
- డ్రగ్స్ కేసులో చర్యలకు రెడీ అవుతున్న ఎక్సైజ్ అధికారులు - పక్కా ఆధారాలు సేకరించిన సిట్.. కెల్విన్ విచారణలో విస్తుగొలిపే నిజాలు - వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ల ద్వారా కోడ్ భాషలో ఆర్డర్లు - తెరపైకి మరికొందరు ప్రముఖులు - గోవా నుంచి రోడ్డు మార్గంలో డ్రగ్స్ రవాణా - గత రెండేళ్లుగా జర్మనీ, నెదర్లాండ్స్ నుంచి కొరియర్ ద్వారా సరఫరా - వేరే ముఠాతో వ్యాపారం విస్తరించిన కెల్విన్ సాక్షి, హైదరాబాద్ మేనేజర్: టూ పేపర్స్ ప్లీజ్ కెల్విన్: కలెక్ట్ ఫ్రం బోయ్ మేనేజర్: వేర్? కెల్విన్: ఔటర్ ఇది సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడి వద్ద పనిచేసే మేనేజర్‌కు, కెల్విన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్! ఇందులో ‘పేపర్’ అంటే డ్రగ్. ‘బోయ్’ అంటే డ్రగ్స్ తెచ్చి ఇచ్చే కొరియర్. సినీ రంగంలో ఇన్నాళ్లూ ఇలా గుట్టుగా సాగిన వ్యవహారం అంతా క్రమంగా వెలుగుచూస్తోంది. కెల్విన్ విచారణలో అలాంటి ‘పేపర్లు’, మేనేజర్లు, వారి వెనకాల ఉన్న పెద్దలు ఒక్కరొక్కరుగా బయట కొస్తున్నారు!! ప్రముఖుడితో పాటు ఓ హీరో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. త్వరలో వారిద్దరినీ అరెస్టు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. అందుకు కావాల్సిన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వీళ్లు డ్రగ్స్ తీసుకోవటమే కాకుండా.. సరఫరా చేసినట్లు కూడా అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. వీలైతే విచారణ కంటే ముందే వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ మరోసారి ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నటి పేర్లను బయట పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. శనివారం బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ బృందం విచారణలో కెల్విన్ ఈ విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లు సమాచారం. కెల్విన్‌ను విచారణ కోసం తమకు అప్పగించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఎక్సైజ్ అధికారులు చర్లపల్లి జైలులో ఉన్న అతడిని శనివారం తమ అధీనంలోకి తీసుకున్నారు. కెల్విన్‌తోపాటు మరో డ్రగ్స్ గ్యాంగ్ నేతలు ఖుద్దూస్, వాహిద్‌లను విచారించారు. కెల్విన్ అరెస్టు సమయంలోనే అధికారులు అతడి ముఠా ఫోన్ వివరాలు, వాట్సాప్ మేసేజ్‌లను సేకరించారు. ఎప్పుడు, ఎక్కడ కలుసుకునేవారు.. డ్రగ్స్ ఎవరి ద్వారా చేరవేసేవారు.. తదితర వివరాలన్నీ పక్కాగా సేకరించారు. ఆ తర్వాతే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఆరు నెలల్లో 185 సార్లు ఫోన్.. అధికారులు అనుమానించినట్టుగానే.. మరో డ్రగ్ ముఠాకు చెందిన బ్రెండెన్, నిఖిల్శెట్టిలతో తనకు సంబంధం ఉన్నట్లు కెల్విన్ బయటపెట్టినట్టు తెలిసింది. నాలుగేళ్ల క్రితం బ్రెండెన్ తనను సినీ వర్గాలకు తొలిసారి పరిచయం చేశాడని, అప్పట్నుంచే దర్శకులు, నటులకు దగ్గరైనట్లు అతడు వివరించాడు. ప్రముఖ దర్శకుడి ద్వారానే సినీ ఇండస్ట్రీలో ఇతర దర్శకులు, నిర్మాతలు, హీరోలను కలుసుకున్నట్లు కెల్విన్ వెల్లడించాడు. దర్శకుడితోపాటు అతడితో సన్నిహితంగా ఉండే నటికి పలుమార్లు డ్రగ్స్ అందించినట్టు వివరించాడు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కూడా ఆ దర్శకుడి ద్వారానే ఎల్ఎస్డీ ఇచ్చినట్లు కెల్విన్ చెప్పినట్లు తెలిసింది. ఆ దర్శకుడు, ఆయన కారు డ్రైవర్, మేనేజర్లతో ఆరునెలల కాలంలో దాదాపు 185 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు చెప్పాడు. ఆయన వాట్సాప్ మెసేజ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసే వారని, ఎంత కావాలో కోడ్ రూపంలో చెప్పేవారని కెల్విన్ వివరించినట్టు తెలిసింది. కెల్విన్ ఫోన్లో సీక్రెట్ ఫోల్డర్‌ను కూడా అధికారులు డీకోడ్ చేశారు. మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నేరుగా కలిసేవాడిని కాదు.. ప్రతీసారి తాను సినీ ప్రముఖులతో కలిసే వాడిని కాదని, తప్పని పరిస్థితులు ఉంటేనే వారిని కలిసే వాడినని కెల్విన్ చెప్పినట్లు తెలిసింది. ‘‘డ్రగ్స్ కావాలని వాట్సాప్, ఒక్కొక్కసారి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సమాచారం ఇచ్చేవారు. నా మనుషుల ద్వారా వారు చెప్పిన కోడ్ ప్రకారం చేరవేసేవాడిని. గోవా నుంచి రోడ్ మార్గంలో డ్రగ్ వచ్చేది. గడచిన రెండేళ్ల నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి సరఫరా చేశా..’’ అని కెల్విన్ సిట్ విచారణలో చెప్పినట్లు సమాచారం. బ్రెండెన్, నిఖిల్‌శెట్టి ద్వారా తన వ్యాపారం విస్తరించినట్లు, తన దగ్గర డ్రగ్స్ లేకుంటే వారి దగ్గర్నుంచి ఇప్పించేవాడినని చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ తీసుకున్నవారు క్రెడిట్ కార్డు ద్వారా తన ఖాతాకు డబ్బు మళ్లించేవారని వెల్లడించాడు. ఓ నటుడికి తానే డ్రగ్స్ అలవాటు చేశానని ఈ సందర్భంగా కెల్విన్ చెప్పినట్లు తెలిసింది. కొన్ని ప్రముఖ విద్యాలయాల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేశామని, వారి ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికే తప్ప ఇందులో ఎలాంటి ఉగ్రవాద కుట్ర కోణం లేదని అతడు చెప్పినట్లు సమాచారం. ఖుద్దూస్, వాహిద్‌లను విచారించినా వారి నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం రాలేదని తెలిసింది. వారి విచారణ అంతా రంగారెడ్డి జిల్లా నాగోల్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల చుట్టే తిరిగినట్లు సమాచారం. వారూ నా కస్టమర్లే.. సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన నిర్మాత కొడుకుతోపాటు మరో ప్రముఖ నిర్మాత చిన్న కొడుక్కి ఎల్ఎస్డీ ఇచ్చామని, వారిద్దరూ తన వద్ద రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకునేవారని కెల్విన్ తెలిపాడు. ఓ నిర్మాత కొడుకు ఆరు మాసాల కిందటే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, అయితే దాన్నుంచి ఇటీవలే బయటకొచ్చాడని వెల్లడించాడు. మరో నిర్మాత తనయుడు ఇప్పటికీ తన ఖాతాదారుడేనని చెప్పాడు. అతడిని దాదాపు 25 రోజులపాటు డ్రగ్ ఎడిక్షన్ కేంద్రానికి పంపి మాన్పించే ప్రయత్నం చేశారని వివరించాడు. సదరు నిర్మాత కొడుకు కెల్విన్‌తో ఫోన్ సంభాషణ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. కానీ ఇది నేరం రుజువు చేసేందుకు సరిపోదు కాబట్టి ఆయనకు నోటీస్ ఇవ్వాలని భావిస్తోంది. ప్రముఖ దర్శకుడి దాదాపు 17 సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఓ టెక్నీషియన్‌కు కూడా డ్రగ్స్ తీసుకున్నాడని కెల్విన్ చెప్పినట్లు తెలిసింది. ఈవెంట్ మేనేజర్లే ఎక్కువగా డ్రగ్స్ అందుకునే వారని చెప్పినట్లు సమాచారం. పెద్దనోట్ల రద్దుతో ‘డిజిటల్’ వైపు.. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సినీ ప్రముఖులు అంతా డిజిటల్ మనీ లావాదేవీలతోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. దీంతో అధికారులు కెల్విన్, అనిల్శెట్టితోపాటు వారి ముఠా సభ్యుడు జీషన్ బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు. వారికి ఏయే బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నాయో విచారణ చేస్తున్నారు. ఏడాది కాలంపాటు ఆయా ఖాతాల ద్వారా నడిచిన లావాదేవీల స్టేట్మెంట్ల కోసం బ్యాంకు అధికారులు లేఖలు రాస్తున్నారు. తిరిగి విధుల్లోకి అకున్ డ్రగ్స్ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ సెలవులు రద్దు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తి అయ్యేవరకూ సెలవులు వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే అకున్ సబర్వాల్ ఈ నెల 16 నుంచి 27 వరకు సెలవులపై వెళ్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని అకున్ వివరించారు. కేసు తీవ్రత దృష్ట్యా సెలవులు రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్ అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు. ధూల్‌పేటకు చెందిన సునీల్ సింగ్ (24) అనే వ్యక్తి గోనె సంచిలో చింతపండు చాటున గంజాయి పెట్టి విక్రయిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 42 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తూ ఇలా మూడోసారి దొరకటంతో అతడిపై పీడీ చట్టం పెట్టినట్లు వివరించారు. -
కెల్విన్ ఫోన్లో సీక్రెట్ ఫోల్డర్ డీ కోడింగ్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణలో మరో ఎనిమిదిమంది పేర్లు వెల్లడించినట్లు సమాచారం. నిందితులు పేర్కొన్న ఈ జాబితాలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా డ్రగ్స్ మాఫియాలో ప్రధాన నిందితుడు కెల్విన్ ను విచారించేందుకు తమకు అప్పగించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఎక్సైజ్ అధికారులు చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న అతడిని తమ కస్టడీకి తీసుకున్నారు. బాలనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ బృందం అతడిని విచారించింది. కెల్విన్‌తో పాటు, ఖుద్దుస్, వాహిద్‌లను సిట్ అధికారులు విచారణ జరిపారు. మరోవైపు కెల్విన్ ఫోన్లో సీక్రెట్ ఫోల్డర్‌ను అధికారులు డీకోడ్ చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో అధికారులు రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం మరో ముగ్గురు నిందితులు అమన్ నాయుడు, నిఖిల్‌శెట్టి, కుందన్ సింగ్‌ను సిట్ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా ఇప్పటివరకూ అరెస్ట్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినవారి సంఖ్య 14కి చేరింది. ఇక కెల్విన్‌కు సినీ నటులు, డైరెక్టర్‌కు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని వెలుగులోకి రావడంతో పాటు, కొన్ని ప్రముఖ విద్యాలయాల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడనే ఆరోపణలున్నాయి. కెల్విన్, ఖుద్దుస్, వాహిద్‌లను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్ విచారణకు హాజరుకానున్నారు. -
డ్రగ్స్: తెరపైకి మరో స్టార్ హీరో డ్రైవర్!
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు సిట్ కస్టడీలోకి కెల్విన్ హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌ను మరికాసేపట్లో సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండురోజులపాటు కెల్విన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడైన కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటుడు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. కెల్విన్ కాల్‌లిస్ట్‌లో సినీ ప్రముఖులు ఉండటం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌కు 15మంది ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు విచారణలో తేలినప్పటికీ.. తమ పేర్లు బయటరాకుండా ఒత్తిడి చేసి వారు సైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరో నిందితుడిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. -
మనసు లేని మనిషి
క్రైమ్ ఫైల్ ‘‘ఇదే సర్ ఇల్లు’’... కారు దిగుతూనే అన్నాడు కెల్విన్. ‘‘ఊ... పదండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. అందరూ మెయిన్ డోర్ వైపు నడిచారు. కాలింగ్ బెల్ కొడితే క్షణాల్లో తలుపు తెరచుకుంది. ‘‘ఎస్... ఏం కావాలి?’’ అన్నాడు తలుపు తెరిచిన వ్యక్తి, అందరినీ తేరిపార చూస్తూ. మాట్లాడలేదు ఇన్స్పెక్టర్. జేబులోంచి ఐడీ కార్డు మాత్రం తీసి చూపించాడు. దాన్ని చూస్తూనే... ‘‘ఓహ్... రండి లోపలికి. ఏంటిలా వచ్చారు?’’ అన్నాడతను అందంగా నవ్వుతూ. ‘‘స్టాసీ కనిపించడం లేదని వాళ్ల అక్కయ్య కంప్లయింట్ ఇచ్చారు. ఎంక్వయిరీకి వచ్చాం మిస్టర్ పీటర్సన్.’’ అతను నవ్వాడు. ‘‘అనుకున్నాను ఇలాంటిదేదో జరుగు తుందని. కానీ మీరనుకున్నట్టు, మీకు అందిన కంప్లయింట్లో ఉన్నట్టు తను కనిపించకుండా పోలేదు. వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. అది తెలియక అందరూ స్టాసీ మిస్ అయ్యిందనుకుంటున్నారు.’’ ‘‘మీ భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందా? మరి మీరింత ఆనందంగా ఉన్నారేంటి?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూస్తూ. ‘‘నన్ను కాదనుకుని వెళ్లిపోయినవాళ్ల గురించి ఏడుస్తూ కూర్చోవడంలో అర్థం లేదు. ఎంతో ప్రేమించాను. వంచించి పోయింది. తన ఆనందం తాను వెతుక్కుంది. మరి నా ఆనందాన్ని నేనెందుకు చంపేసుకోవాలి?’’ ఇన్స్పెక్టర్ కనుబొమలు పైకి లేచాయి. ‘‘మీ యాటిట్యూడ్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందే! కానీ, స్టాసీ వేరే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ మీరు చెబుతున్నది నేనెలా నమ్మాలి?’’ వెంటనే టీపాయ్ మీద ఉన్న తన మొబైల్ అందుకున్నాడతను. టకటకా మెసేజులన్నీ చెక్ చేశాడు. ఒక మెసేజ్ ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్కి అందించాడు. ‘‘చూడండి... మీకే తెలుస్తుంది’’ అన్నాడు. ఇన్స్పెక్టర్ ఆ మెసేజ్ చదివాడు. ‘‘సారీ డియర్... నేను వెళ్లి పోతున్నాను. నా మనసు నాకు తెలియ కుండానే వేరే వ్యక్తి వైపు మళ్లింది. అతని తోనే నాకు ఆనందం ఉందనిపిస్తోంది. అందుకే నీతో బంధాన్ని తెంచేసుకుంటు న్నాను. సారీ అండ్ బై... స్టాసీ.’’ అర్థమైందన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ‘‘మీరివాళ ఓసారి స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. కేసు క్లోజ్ చేస్తాం’’ అనేసి తన టీమ్‌తో పాటు వెనుదిరిగాడు. కారు ఎక్కుతుంటే అసిస్టెంట్ కెల్విన్ అన్నాడు... ‘‘నాకెందుకో అనుమానంగా ఉంది సర్. మూడేళ్ల క్రితం ఈయన భార్య క్యాథలీన్ సావియో బాత్ టబ్‌లో మునిగి మరణించింది. ప్రమాద వశాత్తూ మరణించిందని కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు మరో భార్య కనిపించ కుండా పోయింది. ఇందులో అనుమానించాల్సిందేమీ లేదంటారా?’’ అప్పటికే ఇన్స్పెక్టర్ బుర్ర పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎక్కడో ఏదో ముడి ఉంది. అది విడితే కానీ అన్ని విషయాలూ బయటకు రావు. అందుకే ముందు దాన్ని విప్పే ప్రయత్నంలో పడ్డాడతను. ‘‘ఏంటి సర్ మళ్లీ వచ్చారు? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను కదా?’’... పొద్దున్నే వచ్చిన పోలీసులను చూసి అదే నవ్వు ముఖంతో అన్నాడు పీటర్సన్. ‘‘మీరివ్వాల్సిన స్టేట్మెంట్స్ ఇంకా ఉన్నాయి మిస్టర్ పీటర్సన్. పదండి స్టేషన్‌కి’’ అన్నాడు చేతులకు బేడీలు వేస్తూ. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పానుగా స్టాసీ ఎవరితోనో వెళ్లిపోయిందని. తను ఇచ్చిన మెసేజ్ కూడా చూపించాను. ఇంకేం సాక్ష్యాలు కావాలి మీకు?’’ అన్నాడు ఆవేశంగా. ‘‘నిజమైన సాక్ష్యానికీ సృష్టించిన సాక్ష్యానికీ తేడాలు ఆమాత్రం తెలియవా? మీరూ ఒకప్పుడు పోలీసేగా... ఇలాంటి వెన్ని చూసుంటారు మీరు? అయినా నేను వచ్చింది స్టాసీ కేసు గురించి కాదు. మీ భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు అరెస్ట్ చేయడానికి.’’ ఇన్స్పెక్టర్ మాట వింటూనే పీటర్సన్ ముఖం పాలిపోయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా వారి వెంట నడిచాడు. ఫిబ్రవరి 21, 2013... అమెరికాలోని ఇలినాయిస్... ‘‘తన మూడో భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు డ్రూ పీటర్సన్‌కి ముప్ఫై ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.’’ తీర్పు వింటూనే అవాక్కయి పోయాడు పీటర్సన్. అన్నాళ్లూ ఉన్న కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. బిత్తర చూపులు చూశాడు. ఇలా జరిగిం దేమిటి అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. అతని దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎప్పటికీ దొరకననుకున్నారు కదా మిస్టర్ పీటర్సన్. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొకడు ఉంటాడు. ఇక వెళ్దామా?’’ అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో విజయగర్వం ఉంది. దాన్ని చూసి తల దించుకున్నాడు పీటర్సన్. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో క్లోజ్ అయిపోయిన కేసు మళ్లీ ఎలా తెరచుకుంది? తనకిప్పుడు శిక్ష ఎలా పడింది? ఏమీ అర్థం కావడం లేదతనికి. ఎందుకంటే ఆ రోజు తన ఇంటి నుంచి వెళ్లాక ఇన్స్పెక్టర్ ఏం చేశాడో, ఎన్ని రహస్యాలను బయటికి లాగాడో అతడికి తెలియదు కాబట్టి! ఎప్పుడైతే పీటర్సన్ భార్య క్యాథలీన్ మరణం గురించి కెల్విన్ గుర్తు చేశాడో... అప్పుడే వెయ్యి సందేహాలు తలెత్తాయి ఇన్స్పెక్టర్ మనసులో. వెంటనే డ్రూ పీటర్సన్ జీవిత పుస్తకంలోని ప్రతి పుటనీ, ఆ పుటల్లోని ప్రతి అక్షరాన్నీ క్షుణ్నంగా చదవడం మొదలెట్టాడు. పీటర్సన్ చరిత్ర ఇన్స్పెక్టర్కి సరైన దారి చూపించింది. 1954, జనవరి 5న పుట్టాడు డ్రూ పీటర్సన్. చిన్నప్పట్నుంచీ పోలీసు యూనిఫామ్ అంటే పిచ్చి. అందుకే పట్టుబట్టి పోలీసయ్యాడు. అయితే నిజాయతీపరుడైన పోలీస్ కాలేదు. యూనిఫామ్ ముసుగులో అవినీతికి పాల్పడ్డాడు. చివరికి పై అధికారుల కంటికి చిక్కి డిస్మిస్ అయ్యాడు. ఇదంతా ఒకెత్తు. అతడి వ్యక్తిగత జీవితం మరొకెత్తు. పీటర్సన్ మొదట్నుంచీ ఆడపిల్లల విషయంలో చాలా వీక్. పోలీస్ ట్రెయినింగ్ సమయంలోనే హైస్కూల్లో తన సహ విద్యార్థిని అయిన క్యారెల్ను పెళ్లాడాడు. కానీ నాలుగేళ్లలోనే వారి బంధం సడలిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత విక్టోరియాని పెళ్లాడాడు పీటర్సన్. ఓ పక్క ఆమెతో కాపురం చేస్తూనే క్యాథలీన్ సావియోతో ప్రేమాయణం మొదలెట్టాడు. అది తెలిసి విక్టోరియా వేరుపడిపోయింది. దాంతో క్యాథలీన్ని తన అర్ధాంగినిగా చేసుకున్నాడు. కానీ ఆ బంధమూ బలంగా లేదు. పీటర్సన్ తనను తరచుగా వేధిస్తున్నాడంటూ క్యాథలీన్ పలుమార్లు పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చింది. కానీ తన పలుకుబడితో వాటిని బుట్టదాఖలు చేయించాడు పీటర్సన్. చివరికి 2004, ఏప్రిల్ నెలలో ఓ రోజు బాత్‌టబ్‌లో శవమై తేలింది క్యాథలీన్. కానీ ఆ సమయంలో పీటర్సన్ ఇంట్లో లేడని ఎలిబీ ఉండటంతో ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా తేల్చి కేసు క్లోజ్ చేశారు. ఆ తర్వాత తనకంటే ముప్ఫ య్యేళ్లకు పైగా చిన్నదైన స్టాసీ యాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2007లో ఓరోజు తన అక్క ఇంటికని బయలుదేరిన స్టాసీ మాయమైపోయింది. చెల్లెలు ఎంతకీ రాకపోవడంతో పీటర్సన్‌కి ఫోన్ చేసిందామె. అతడు చెప్పిన పొంతన లేని సమాధానాలకు సందేహాలు తలెత్తి, పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం పీటర్సన్ జీవితాన్ని తిరగ తోడారు. ‘‘నేనేదో సందేహంతో మామూలుగా అన్నాను. కానీ మీరు అంత కచ్చితంగా పీటర్సన్ని నేరస్తుడిగా ఎలా నిరూ పించారు సర్?’’... అడిగాడు కెల్విన్. సబార్డినేట్ ఉత్సుకతను చూసి నవ్వు కున్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక్కోసారి చిన్న తప్పు చేసి దొరికిపోతాడు కెల్విన్. పీటర్సన్ కూడా అదే చేశాడు. ఇంటి నుంచి వెళ్లిన రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్టాసీ తనకు మెసేజ్ ఇచ్చిందంటూ చూపించాడు కదా! ఆ మెసేజ్ చివర్లో స్టాసీ అని రాసివుంది. ఏ భార్య అయినా తన భర్తకు మెసేజ్ ఇస్తూ చివర్లో తన పేరు రాసుకుంటుందా? అంత అవసరం ఉంటుందా? తన భర్తకి తన నంబర్ తెలియదా?’’ ‘‘నిజమే సర్. నాకిది తట్టనే లేదు’’ అన్నాడు కెల్విన్ ఆశ్చర్యపోతూ. ‘‘అక్కడికీ ఆమె వేరే ఎవరి నంబర్ నుంచైనా మెసేజ్ పెట్టిందేమోనని ఆ నంబర్ స్టాసీదేనా అని కూడా అడిగాను పీటర్సన్ని. అతడు అవునని చెప్పాడు. దాంతో నా అనుమానం బలపడింది. కచ్చితంగా ఏదో నంబర్ నుంచి ఆ మెసేజ్ తన ఫోన్‌కి పీటర్సనే ఇచ్చుకున్నాడని అనిపించింది. మనం నమ్మమేమోనని భయమేసి కింద స్టాసీ పేరు పెట్టాడు. అడ్డంగా దొరికిపోయాడు. దానికి తోడు నువ్వు క్యాథలీన్ని గుర్తు చేశావ్. ఆ కేసు నేను రహస్యంగా రీ ఓపెన్ చేశాను. చని పోయినప్పుడు క్యాథలీన్ నగ్నంగా ఉంది. అంటే స్నాన ం చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయిందని మనం అనుకోవాలని అలా ప్లాన్ చేశాడు. కానీ ఆమె ఒంటిమీద దెబ్బలున్నాయని పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఉంది. ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశాడు. అలాగే భర్త హింసిస్తున్నా డంటూ క్యాథలీన్ ఇచ్చిన కంప్లయింట్లన్నీ నా విచారణలో దొరికాయి. అలా ఓ చిన్న తీగ మొత్తం డొంకని కదిలించింది.’’ ‘‘మీరు గ్రేట్ సర్. మూసేసిన కేసును తెరిచి మరీ ఛేదించారు.’’ తల అడ్డంగా ఊపాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు కెల్విన్. నేను ఇంకా గెలవలేదు. స్టాసీ జాడ తెలియట్లేదు. ఆమె ప్రాణాలతో ఉందా? లేక ఆమె కూడా క్యాథలీన్లాగే పీటర్సన్ పైశాచికత్వానికి బలైందా? అది తెలిసినప్పుడే నేను నిజంగా గెలిచినట్టు.’’ ఇన్స్పెక్టర్ ఈ మాట అని రెండేళ్లయ్యింది. కానీ ఇప్పటికీ అతను గెలవలేదు. ఎందుకంటే... నేటికీ స్టాసీ జాడ తెలియలేదు! - సమీర నేలపూడి