డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మిపై వస్తున్న ఆరోపణలను ఆమె తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ ఖండించారు. ‘13 ఏళ్ల నుంచే ఛార్మి సినీ రంగంలో ప్రతిభ చాటుతోంది. చిన్ననాటి నుంచే కుటుంబానికి అండగా ఉంటోంది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలతో నా కుమార్తె తీవ్రంగా కలత చెందింది. ఒకవేళ చార్మీకి డ్రగ్స్ అలవాటు ఉంటే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందా?. తనకు ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొనే సమయం లేదు.