charmi
-
పూరితో ఛార్మి కటీఫ్..!
-
ఐదు భాషల్లో డబుల్ ఇస్మార్ట్
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా షురూ అయింది. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారంప్రారంభమైంది. ‘ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ డైలాగ్ చెప్పిన తొలి సీన్‌కి చార్మి క్లాప్ ఇవ్వగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూ΄పొందుతోంది. పూరి జగన్నాథ్ చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ రాశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ఈ సినిమాలో రామ్‌ని మాసియర్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు పూరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న ‘డబుల్ ఇస్మార్ట్’ని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి. -
డైరెక్టర్ పూరీ, ఛార్మీ లను విచారిస్తున్న ఈడీ అధికారులు
-
ఆ మాట నేనే అంట.. ఇంకెవరైనా అంటే కొడతా: బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ టాక్ షోలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. తాజాగా లైగర్ టీమ్‌తో ముచ్చటించారు. పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండలతో బాలయ్య చేసిన సందడికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘మాటల గన్.. మన జగన్’అంటూ పూరీని ఆహ్వానించాడు బాలయ్య. ఈ సందర్భంగా వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’మూవీ గురించి చర్చించుకున్నారు. ఇప్పటి వరకు తను మరచిపోలేని పాత్ర తేడా సింగ్(పైసా వసూల్ మూవీ) అని బాలయ్య చెప్పుకొచ్చాడు. అలాగే.. నేనెంత యెదవనో నాకే తెలియదు అని ఆ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను గుర్తుకు చేసుకున్నారు బాలకృష్ణ. ‘ఆ మాట నేనే అంట.. ఇంకెవరైనా అంటే కొడతా’అని బాలయ్య అనగా.. పూరీ గట్టిగా నవ్వాడు. అలాగే ఆ సినిమాలో మామా ఏక్ పెగ్ లా.. సాంగ్‌ను కూడా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఇక చార్మి గురించి మాట్లాడుతూ.. అల్లరి పిడుగు మూవీ టైమ్‌లో మనం ఫస్ట్‌టైం కలిశామని గుర్తుచేశాడు. ఇప్పుడు పిడుగులా అయ్యావంటూ చార్మిపై సెటైర్లు వేశాడు. అలాగే ‘సమరసింహారెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి’ అంటూ హీరో విజయ్‌దేవరకొండను ఆహ్వానించాడు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్.. అసలు నువ్వు ఎలా రౌడీ అని ఫిక్స్ అయిపోయావ్’అని విజయ్‌ని ప్రశ్నించగా.. . ‘ఫస్ట్ నుంచి అది చేయద్దు, ఇది చేయద్దు లాంటి మాటలు విని విసిగిపోయా... లేదు ఇది కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యా’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత టైగర్ టీమ్‌కి సరదాగా కొబ్బరికాయలు కొట్టి ఇస్తూ.. ‘ఈ బిజినెస్ బాగుందే.. సైడ్ బిజినెస్’ అంటూ నవ్వులు పూయించారు. ‘బ్యాంకాక్‌లో కొబ్బరిబోండాల్లో వోడ్కా కలిపి ఇస్తారు’ అని చార్మి అనగా... ‘అవన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం’ అని బాలయ్య సమాధానం ఇచ్చాడు. లైగర్ టీమ్‌తో బాలయ్య చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ .. సంక్రాంతికి ఆహాలో ప్రసారం కానుంది. -
'లైగర్' మూవీ ఫొటోలు షేర్.. పూరీపై ఆర్జీవి కామెంట్స్
Rgv Reaction On Liger Team With Mike Tyson Photos: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబొలో వస్తున్న క్రేజీ మూవీ 'లైగర్'. ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సరికొత్త షెడ్యూల్ మంగళవారం లాస్ వెగాస్‌లో ప్రారంభమైంది. విజయ్-మైక్టైసన్లపై కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం కొన్ని ఫొటోలతో షేర్ చేసుకుంది. మైక్ టైసన్‌తో షూట్ ఎంతో సరదాగా ఉందని టీమ్ తెలిపింది. The LIGER family with the ONE and ONLY @MikeTyson pic.twitter.com/dXZEOOzFyw — Ram Gopal Varma (@RGVzoomin) November 17, 2021 లైగర్ చిత్రం బృందం షేర్ చేసిన ఫొటోలపై కాంట్రవర్సీల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అచ్చం మైక్టైసన్ల కఠినంగా ఉన్నాడని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. 'వన్ అండ్ ఓన్లీ మైక్ టైసన్‌తో లైగర్ ఫ్యామిలీ' అని క్యాప్షన్ ఇచ్చారు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా లైగర్ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా విభిన్నమైన లుక్‌లో పొడవాటి జుత్తుతో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ నటి అనన్యా పాండే అలరించనున్నారు. పాన్ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి చార్మితోపాటు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Sir @purijagan u almost look as tough as @MikeTyson 🙏🙏🙏 pic.twitter.com/UgzA7rgfeZ — Ram Gopal Varma (@RGVzoomin) November 17, 2021 -
టైసన్‌ను 'ఢీ' కొట్టేందుకు రెడీ అంటున్న విజయ్.. లైగర్ టీమ్
-
పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్
‘‘మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే ‘రొమాంటిక్’. ఇందులో మంచి భావోద్వేగాలు ఉంటాయి. ఇది కేవలం యూత్ సినిమానే కాదు.. కుటుంబ ప్రేక్షకులూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ అనిల్ పాదూరి అన్నారు. ఆకాశ్ పూరి, కేతిక శర్మ జంటగా రమ్యకృష్ట ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ పాదూరి విలేకరులతో మాట్లాడుతూ–‘‘దర్శకుడు అవ్వాలనే ఆలోచన నాలో రేకెత్తించింది పూరి జగన్నాథ్‌గారే. ‘రొమాంటిక్’ కథని డైరెక్ట్ చేయమని చెప్పారు పూరిగారు. ‘రొమాంటిక్’ కథ, మాటలు ఆయన రాసినా సినిమాలో నా మార్క్ కనిపిస్తుంది. ప్రేమను నమ్మని ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. ఈ పాత్రకు ఆకాశ్ వంద శాతం న్యాయం చేశాడు. ‘రొమాంటిక్’ ఫస్ట్ కాపీ చూసిన పూరిగారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ‘నా సినిమాలో ఇంత ఎమోషన్ ఉందా?. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో ఎమోషన్ ఉంది.. ‘రొమాంటిక్’ లో అంత కంటే ఎక్కువగా ఉంది.. సినిమా బాగా తీశావ్.. నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని మెచ్చుకున్నారు. నా తర్వాతి చిత్రం యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లోనే చేస్తాను’’ అన్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత -
పూరీ జగన్నాథ్ కాలర్ ఎగరేయాలి: విజయ్ దేవరకొండ
‘‘పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ చేసే సినిమాలన్నీ వరంగల్‌లోనే స్టార్ట్ చేయాలి.. ఎందుకంటే వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. ‘రొమాంటిక్’ ఘనవిజయం సాధిస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఆకాశ్ మాటలు విన్నాక తనలో మంచి ఫైర్ ఉందనిపించింది. మీ నాన్న (పూరి జగన్నాద్) కాలర్ ఎగరేయాలి. ఆకాశ్ సినిమా పిచ్చి గురించి పూరి, చార్మీగార్లు నాకు చెప్పేవారు. ప్రతి సినిమా చూస్తాడట.. సినిమాపై పిచ్చి ఉన్న నీలాంటోళ్లు తప్పకుండా సక్సెస్ అవ్వాలి.. సక్సెస్ అవుతావు. ‘రొమాంటిక్’ సినిమా బాగా వచ్చిందని చూసినవాళ్లు చెప్పారు. ఈ సినిమా 100శాతం హిట్ అవుతుంది. విధి అనేది నన్ను, పూరి జగన్నాథ్, చార్మీలను కలిపింది. ‘లైగర్’ సినిమా కోసం వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాతో ఇండియాని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాం’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నాకు పదేళ్లప్పుడు స్కూల్ తరపున వరంగల్‌కి వచ్చాను. అప్పటి నుంచి నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. ‘రొమాంటిక్’ చిత్రంలో ఆకాశ్, రమ్యకృష్ణ, కేతిక ఇరగ్గొట్టేశారు. మంచి లవ్‌స్టోరీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమా చూడండి. ఆకాశ్ చాలా మాట్లాడేశాడు.. వాడు చిన్నప్పుడు ప్రతిరోజూ లేవగానే ఓ డైలాగ్ చెప్పి వేషం ఇవ్వమని అడిగేవాడు నన్ను. తను మంచి నటుడు’’ అన్నారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ వరంగల్‌లో చేశాం.. పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్‌తోనే ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఇక్కడే చేశాం. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని మీరందరూ ఆశీర్వదించాలి’’ అన్నారు చార్మి. అనిల్ పాదూరి మాట్లాడుతూ– ‘‘టెంపర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌గారు పూరి జగన్నాథ్‌గారికి నన్ను పరిచయం చేశారు. నన్ను నమ్మి ‘రొమాంటిక్’ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్, చార్మీగార్లకు థ్యాంక్స్. మంచి ప్రేమకథా చిత్రాల్లో ‘రొమాంటిక్’ కూడా ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పూరి ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో నర్సీపట్నంలో పుట్టిన మా నాన్న సినిమా నేపథ్యం లేకున్నా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి పైకి వచ్చారు. ‘పూరి టైమ్ అయిపోయిందిలే.. ఇక సినిమాలు ఏం చేస్తాడు?’ వంటి రకరకాల కామెంట్స్ చూసినప్పుడు బాధ వేసేది. అలాంటి వారందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో సమాధానం చెప్పారు. అలాగే ‘వీడేం హీరోలే’ అని నన్ను కొందరన్నారు. నన్ను చూసి మీరు గర్వపడేలా ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి కష్టపడతా నాన్నా.. ఏదో ఒకరోజు గర్వంగా మీరు కాలర్ ఎగరవేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
'లైగర్' టీంకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య
Balakrishna Surprises Team Liger in Goa: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'లైగర్'. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లైగర్ సెట్లో సడెన్‌గా ప్రత్యేక్షం అయ్యారు. బాలయ్య సర్ప్రైజ్ విజిట్‌తో మూవీ టీం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. మరోవైపు బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. A Legendary Visit to #Liger Sets @ Goa🤩#NandamuriBalakrishna garu made a surprise Visit to the sets of #Liger today & Blessed the team with high spirits🙏 @karanjohar #Purijagannadh @TheDeverakonda @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/TT1Ga7vxfY — Puri Connects (@PuriConnects) September 22, 2021 చదవండి : ‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..! ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రానా దగ్గుబాటి -
ఓటీటీలోకి ఆర్జీవీ.. మే15న తొలి సినిమా స్ట్రీమింగ్
కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్‌ఫాంలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మహమ్మారి వల్ల ప్రజలు థియేటర్లకు వెళ్లేందుకు జంకుతు ఇంట్లోనే చిన్న స్క్రీన్‌పై సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో కొత్తకొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓటీటీ బాట పట్టాడు. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని ఓ థియేటర్లో ఆర్జీవీ సినిమాలు విడుదల అవుతాయి. తొలి సినిమాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘డీ-కంపెనీ’ మే 15న ఇందులో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆర్జీవీకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు, పూరి జగన్నాథ్, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్ హీరో రిషితేష్ దేశ్ముఖ్తో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటికే తెలుగులో ఆహా పేరుతో నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫాంను స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ సైతం కొత్తగా ఓటీటీ సంస్థలను స్థాపించాలని సన్నాహాలు చేస్తునట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. -
పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు
‘‘ఎవరు సినిమా తీస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్ వస్తుందో అతనే ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైలాగ్స్, డైరెక్షన్, టైటిల్స్ అన్నీ ఒక బ్రాండ్. హీరో క్యారెక్టర్స్ సృష్టించడంలో మేధావి’’ అన్నారు దర్శకులు కాశీవిశ్వనాథ్. సెప్టెంబర్ 28 దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకత్వ విభాగంలో 30 మంది సభ్యులకు 50 వేల చొప్పున 15 లక్షలు సహాయం చేశారు పూరి జగన్నాథ్, చార్మి. శనివారం ‘హెల్పింగ్ హ్యాండ్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకత్వ శాఖలోని 30 మందికి చెక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా చార్మీ మాట్లాడుతూ – ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ముందు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేదు. ఆ సమయంలో రామ్ మమ్మల్ని నమ్మారు. ‘పూరీగారి సినిమాలో నటించాలి’ అనే ఒక్క కారణంతో వచ్చి సినిమా చేశారు. అతనికి చాలా థ్యాంక్స్. మేం బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు కూడా ‘డబ్బులు వస్తాయి.. పోతాయి. మళ్లీ వస్తాయి.. పోతాయి. వాటి గురించి ఆలోచించకూడదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ కష్టపడదాం’ అని మా అందరిలో ధైర్యం నింపేవారు పూరీగారు. మాకు కుదిరితే ప్రతి ఏడాది పూరీగారి పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఇతరులను చూసి పోటీ ఫీల్ అవ్వడు, ఈర్ష్య పడడు పూరి. ఆయనకు విమర్శకులు ఉండరు. అభిమానులే ఉంటారు. దర్శకులకు సహాయం చేయాలనే ఆలోచన రావడం అభినందనీయం. ఎన్నో కుటుంబాల ఆశీస్సులు వీళ్ళతో ఉంటాయి’’ అన్నారు కాశీ విశ్వనాథ్. ‘‘పూరీగారు ఇండస్ట్రీలో ఒక కెరటం. పడటం తెలుసు. పడి లేవటం తెలుసు. ఎవరైనా సక్సెస్ వస్తే స్వీట్స్ పంచుతారు. ఆయన సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సంప్రదాయం కొనసాగాలి’’ అన్నారు దర్శకుల సంఘం సభ్యులు సుబ్బారెడ్డి. ‘‘పూరి అంటేనే పాజిటివిటీ. ఆయనకు వరుసగా 24 హిట్స్ రావాలి. 24 శాఖల వారికి సహాయపడాలని కోరుకుంటున్నాను. దాసరిగారిని ఓ సందర్భంలో మీ వారసుడు ఎవరని అడిగితే పూరి జగన్నాథ్ అని చెప్పారు’’ అన్నారు జర్నలిస్ట్ ప్రభు. ‘‘గతంలో దాసరిగారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారు. పూరీగారు ఈ సహాయాలను ఇలానే కొనసాగించాలి. చార్మీగారికి ధన్యవాదాలు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘జగ్గు (పూరి), నేను కలసి పెరిగాం. తనకి మనుషులను, మొక్కలను, జంతువులను ప్రేమించడం తెలుసు. తనో అడవి. అప్పుడప్పుడు కారుచిచ్చులు అంటుకోవచ్చు. కానీ అడవి ఎప్పుడూ అడవే. పూరీగారికి సినిమాను ప్రేమించడం మాత్రమే తెలుసు. ఇలాంటి సహాయ కార్యక్రమం చేయాలని ఐడియా ఇచ్చి నందుకు చార్మీగారికి ధన్యవాదాలు’’ అన్నారు నటుడు ఉత్తేజ్. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక సంఘం సభ్యులు గంగాధర్, సుబ్బారెడ్డి, విషు రెడ్డి, అనిల్ పాల్గొన్నారు. -
పూరీ జగన్నాథ్ బర్త్‌డే ఈవెంట్
-
మా సెట్లో ఆడా మగా తేడా లేదు
‘నీ తోడు కావాలి’ అంటూ ఏ తోడూ లేకుండా హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరి అండా లేకుండానే సక్సెస్ అయ్యారు. చార్మింగ్ బ్యూటీనే కాదు.. చాలా మంచి ఆర్టిస్ట్ అని కూడా అనిపించుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా పలు భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన చార్మి ఇప్పుడు తనలోని నటిని సెకండ్ సీట్లో కూర్చోబెట్టారు. నిర్మాతను ఫ్రంట్ సీట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రొమాంటిక్’ చిత్రాల నిర్మాణంతో బిజీగా ఉన్నారు. నేడు చార్మి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ► బర్త్‌డేకు స్పెషల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ ఏం లేవు. గోవాలో ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్ షూట్ జరుగుతోంది. మొన్న రామ్ బర్త్‌డేకు రిలీజ్ చేసిన టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నట్టు. ► బర్త్‌డేకు కొత్త నిర్ణయాలేమైనా తీసుకుంటారా? అలాంటివి ఎప్పుడూ పెట్టుకోను. ప్రస్తుతం ఫోకస్ అంతా ‘ఇస్మార్ట్ శంకర్’ మీదే ఉంది. బోలెడు పనులున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి, బిజినెస్ చూసుకోవాలి. మైండ్ మొత్తం సినిమా చుట్టూనే తిరుగుతోంది. ► ప్రొడ్యూసర్‌గా ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. ఫీమేల్ ప్రొడ్యూసర్స్‌కు షూటింగ్ స్పాట్లో ఉండే చాలెంజెస్ ఏంటి? మా సెట్లో స్త్రీలు, పురుషులు అనే తేడాని ఎప్పుడూ ఫీల్ అవలేదు. మా పీసీ (పూరీ కన్సెక్ట్స్) ఆఫీస్‌లో కూడా ఆ వ్యత్యాసాలేమీ ఉండవు. నేను మ్యాన్‌లా ఆలోచిస్తానని, మ్యాన్‌లా ఉంటానని అలానే వర్క్ చేస్తానని పూరీగారు చెబుతుంటారు– ఇక్కడ మొత్తం ఫ్రెండ్లీ వాతావరణమే ఉంటుంది. నేను బాస్, నువ్వు ఎంప్లాయ్.. అలా ఉండదు. ఇక్కడ అందరూ పనికోసమే వస్తారు, పని మాత్రమే చేస్తారు. ఫోకస్ పనిమీద మాత్రమే ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉండవు. ► హీరోయిన్గా ఉన్నప్పుడు మీకు అన్నీ టైమ్‌కు ఏర్పాటు చేస్తుంటారు. మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీ హీరోహీరోయిన్లను ఎలా చూసుకుంటున్నారు? నేను మా హీరోహీరోయిన్లను చాలా గారం చేస్తుంటాను. నాకు గారం చేయడం అంటే భలే ఇష్టం. హీరోగారు వస్తున్నారు.. అంతా రెడీ పెట్టండి. హీరోయిన్‌కి వ్యాన్ రెడీ ఉందా? ఇలా అన్నీ చూసుకుంటాను. యూనిట్ వాళ్లకు ఫుడ్ సెర్వ్ చేస్తుంటాను. అందరూ సరదాగా రావాలి, కలసి నవ్వుకుంటూ పని చేయాలి. ఇదే మా పాలసీ. ► గారం చేస్తే షూటింగ్ లేట్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది కదా? అస్సలు ఉండదు. వాళ్లు మార్నింగ్ నిద్ర లేవగానే వర్క్‌కి రావాలంటే ఒక ఉత్సాహంతో ఉండాలి. మనం ఇక్కడ బాగా చూసుకుంటే వాళ్లూ అలానే పని చేస్తారు. అబ్బా.. ఇవాళ షూటింగ్‌కి రావాలా? అని బాధపడుకుంటూ రారు. ఆ ఎనర్జీతో వస్తే చాలు.. జరగాల్సిన పనులు టైమ్‌కు జరిగిపోతుంటాయి. మేం డిఫరెంట్ కండీషన్స్‌లో షూట్ చేయాల్సి ఉంటుంది. వారణాసిలో షూట్ చేసినప్పుడు 47 డిగ్రీల ఎండ. డైరెక్ట్ సన్‌లైట్ కింద పనిచేశాం. అందరికీ సన్ ఎలర్జీతో బ్లాక్ ప్యాచ్‌లు వచ్చేశాయి. కానీ ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. ఇదో చాలెంజ్ అన్నట్లు తీసుకొని పని చేశాం. ► హీరోయిన్గా ఉన్నప్పుడు సెట్లో ఏదైనా మార్పు వస్తే బావుండు అనుకున్నది నిర్మాతగా మారిన తర్వాత తీసుకొచ్చింది ఏదైనా ఉందా? ఏదో మార్పు తీసుకు రావడానికో, మార్చడానికో మనం ఇక్కడం లేం. మా లక్ష్యం సినిమాలు చేయడమే. మంచి సినిమాలు చేయాలి, హిట్స్ కొట్టాలి. ఈ జర్నీ జరిగేటప్పుడు అందరూ హ్యాపీగా, ఇబ్బంది లేకుండా ఉండాలి. అంతే. ► నిర్మాతగా మారిన తర్వాత ఎలా ఉంది? అమ్మలా మారినట్టు ఉంది. సినిమా చేయడం బేబీ క్యారీ చేయడంలానే. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటినుంచి డెలివరీ వరకూ జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్మాత అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం అందులో భాగం అయ్యుంటాం. హీరోయిన్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ మొత్తం సెట్ అయిన తర్వాత మధ్యలో ఎంటర్ అవుతాం. అప్పటికే టీమ్ అంతా ఫిక్స్ అయ్యుంటుంది. అలాగే రేపు రిలీజ్ ఉందంటే ఇవాళో నాలుగు, రేపో నాలుగు ఇంటర్వ్యూలు ఇస్తే చాలు. సినిమా ప్రమోషన్‌కు వారం రోజులు కేటాయిస్తే చాలు అని ఉంటుంది. హీరోయిన్గా ఉన్నప్పుడు 6–7 రిలీజ్లు ఉండేవి. ప్రతి సినిమా హిట్ అవ్వాలనుకుంటాం. ప్రతీ ప్రాజెక్ట్ మీద ప్రేమ ఉన్నా అది ఒక్కోదానికి షేర్ అవుతుంది. నిర్మాతగా ఉన్నప్పుడు మన ఎనర్జీ, రక్తం, చెమట అన్నీ ఇందులోనే పెడతాం. కొన్నిసార్లు టెన్షన్‌తో నిద్ర పట్టదు. రేపు ఏం చేయాలి? అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయా? వంటి ఆలోచనలతో సతమతమవుతుంటాం. టెన్షన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఉంటుంది. దానికి తోడు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మీద అయితే చాలా నమ్మకంగా ఉన్నాం. ► పూరీగారు ఓ సాలిడ్ హిట్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ అంతా చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలా ఉండబోతోంది? 100 పర్సంట్... రాసిపెట్టుకోండి. పూరీగారి దగ్గర నుంచి ఇన్నాళ్లూ ఏదైతే మిస్ అయ్యారో, ఏదైతే కోరుకుంటున్నారో ‘ఇస్మార్ట్ శంకర్’ దానికి మించి ఉండబోతోంది. కావాలంటే రాసిస్తాను. ► మళ్లీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూడొచ్చు? నెవ్వర్ సే నెవర్ అంటారు. నటిగా మళ్లీ స్క్రీన్ మీద కనిపించడానికి చాలా టైమ్ ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలు మొత్తం పూరీ కనెక్ట్స్లోఎలాంటి సినిమాలు చేయాలి? అనే దానిమీదే దృష్టంతా. కొత్త కొత్త స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. అందుకే యాక్టింగ్ కొన్ని రోజులు సెకండ్ సీట్లోనే ఉండబోతోంది. ► హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారా? నిర్మాతగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? నిర్మాతగా ఉండటం చాలా స్ట్రెస్ఫుల్. చాలా టఫ్. ఇందాక అన్నట్టు టెన్షన్, నిద్రలేని రాత్రులు. కానీ నిర్మాతగా ఉండటాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. మనం ఏం చేసినా జీవితంలో సమస్యలు కామన్. వాటి పరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. సమస్యలను ఎవరైనా పరిష్కరించుకోవాల్సిందే కదా. నేను అది బాగా చేసుకోగలను. -
ఇస్మార్ట్ శంకర్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటి, నిర్మాత చార్మీ కౌర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం అవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ తోట ఛాయగ్రాహకుడు. -
ఇస్టార్ట్ శంకర్
డబుల్ ధిమాక్ శంకర్ ఈ నెల 24 నుంచి షూటింగ్ షురూ చేయనుండట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. శంకర్ అనే పక్కా మాస్ కుర్రాడి పాత్రలో రామ్ కనిపించనున్నారు. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మీ, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. సరికొత్త కథతో, రామ్‌ను ఓ కొత్త యాంగిల్లో ఈ సినిమాలో పూరి చూపించనున్నారట. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ. -
ఛార్మి నృత్య గీతానికి ధీటుగా నర్తనం..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: భరత వేదముగా.. నిరత నాట్యముగా.. అంటూ పౌర్ణమి సినిమాలో కథానాయకి ఛార్మి చేసిన నృత్య గీతం సంగీతాభిమానులనే కాదు.. నాట్యాభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ నృత్య గీతికలో ఛార్మి ప్రదర్శించిన నాట్య హోయలు.. నాట్య భంగిమలు.. అభినయాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాల్లో ఆ నృత్యాన్ని తిలకిస్తున్నామన్న అనుభూతిని అమలాపురానికి చెందిన ఓ నాట్య మయూరి తన ప్రదర్శనలతో కలిగిస్తోంది. తలపైన... రెండు అరచేతుల్లో అగ్ని కీలలతో మండతున్న ముంతలను ఉంచుకుని నాట్యమాడే ఆ ఎనిమిది నిమిషాల గీతానికి ఈ నర్తకి నయన మనోహరంగా నాట్యం చేస్తుంది. అమలాపురంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అడపా శ్రీలక్ష్మి గత ఎనిమిదేళ్లలో అనేక నృత్య ప్రదర్శనలతో ఎంతో పేరు తెచ్చుకుంది. తన పదో ఏట నుంచే నృత్యం వైపు నడక మొదలు పెట్టింది. ఫ్రెంచి యానానికి చెందిన నాట్య గురువు నల్లా హైమావతి వద్ద నాట్యం నేర్చుకుంది. జిల్లాలో ఎక్కడ నృత్య పోటీలు ఏర్పాటు చేసినా. ఏదైనా సభలు, వేడుకలు జరిగినా ఆరంభంలో శ్రీలక్ష్మి నృత్య ప్రదర్శన విధిగా ఉంటుంది. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు అడపా శ్రీమన్నారాయణ, మల్లేశ్వరి కూడా ఆమె అభీష్టానికి బాసటగా నిలిచి ప్రోత్సహించారు. ఓ సారి తన నృత్య ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు శ్రీలక్ష్మిని అభినందించి ఆశీర్వదించారు. పౌర్ణమి సినిమాలో ‘భరత వేదముగా...నిరత నాట్యముగా’ నృత్య గీతికను ప్రదర్శిస్తే ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు.. బహుమతుల పంటలు పరిపాటి. శ్రీలక్ష్మికి నృత్యంతో పాటు ఇటీవల కాలంలో సినిమాల్లో నటించాలన్ని కోరిక కూడా తోడైంది. సినీ ఆర్టిస్ట్ కావాలన్న లక్ష్యంతో కోనసీమలోని ఔత్సాహిక సినీ కళాకారులకు వేదికగా ఇటీవల ఏర్పాటైన కోనసీమ ఫిలిం క్లబ్లో శ్రీలక్ష్మి సభ్యత్వాన్ని పొంది ఏదైనా సినిమాలో అవకాశం వస్తే అల్లుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. నర్తకిగా కీర్తిని సాధించాలని.. నటిగా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యాలు నెరవేరాలని ఆశిద్దాం. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమాలో మహేశ్‌బాబు కబడ్డీ ఆటగాడిగా కనిపించారు. ఏ చిత్రంలోనో గుర్తుందా? ఎ) అతడు బి) ఒక్కడు సి) ఖలేజా డి) నిజం 2. ‘నాయకి’ ద్విభాషా చిత్రంలో నటిగా, దెయ్యంగా రెండు పాత్రల్లో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) సిమ్రాన్ సి) చార్మీ డి) జ్యోతిక 3. ‘‘చిరు చిరు చిరు చినుకై కురిశావే, మరుక్షణమున మరుగైపోయావే’’... అనే పాట ‘ఆవారా’ చిత్రంలోనిది. హీరోగా కార్తీ నటించారు. హీరోయిన్? ఎ) తమన్నా బి) శ్రియ సరన్ సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి 4. ఇలియానా 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో హీరో రవితేజ సరసన నటించారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ 2018లో ఆమె ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎవరి సరసన హీరోయిన్గా నటిస్తున్నారో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) అల్లు అర్జున్ సి) ప్రభాస్ డి) రవితేజ 5. ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో హీరోగా నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 20 6. మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్ సి) విజయ్‌కాంత్ డి) శరత్‌కుమార్ 7. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిన ప్రఖ్యాత రచయితెవరో తెలుసా? ఎ) అనంత శ్రీరామ్ బి) శ్రీమణి సి) చంద్రబోస్ డి) రామజోగయ్య శాస్త్రి 8. నిర్మాత కె.యస్ రామారావు తన సొంత నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్‌లో చిరంజీవితో ఎన్ని సినిమాలు నిర్మించారో తెలుసా? ఎ) 8 బి) 9 సి) 10 డి) 5 9. ‘ఇంద్ర’ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ. కానీ ఆ చిత్రంలోని ఓ సూపర్‌హిట్ సాంగ్ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో.. చెలికాడు చంపేస్తున్నాడే’ అనే పాటకు సంగీత దర్శకుడు మాత్రం మణిశర్మ కాదు. మరి ఆ పాటకు సంగీత దర్శకుడెవ్వరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఆర్పీ పట్నాయక్ సి) ఇళయరాజా డి) యం.యం. కీరవాణి 10. ఓ పక్క యన్టీఆర్‌తో, మరో పక్క మహేశ్ బాబు సరసన సినిమా చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) పూజా హెగ్డే సి) శ్రుతీహాసన్ డి) కాజల్ అగర్వాల్ 11. ‘మల్లెల తీరంలో’ అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా? ఎ) శ్రీదివ్య బి) అంజలి సి) మాధవీలత డి) మధుశాలిని 12. పవన్‌కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం రీమేక్‌ను కన్నడలో శివరాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కించిన తెలుగు దర్శకుడెవరో తెలుసా? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) దశరథ్ డి) పూరి జగన్నాథ్ 13. దర్శకుడు యస్.యస్. రాజమౌళి ట్వీటర్ ఐడీ ఏంటో? ఎ) మీ రాజమౌళి బి) యస్‌యస్ రాజమౌళి సి) యువర్స్ రాజమౌళి డి) రాజమౌళి సేస్ 14. చిరంజీవి అల్లుడు హీరోగా పరిచయమవుతన్న చిత్రానికి కెమెరామెన్ ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) ఛోటా కె.నాయుడు బి) కేకే సెంథిల్ కుమార్ సి) రత్నవేలు డి) మది 15. జూలై 3న పుట్టిన ప్రముఖ నటుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) కాంతారావు బి) యస్వీ రంగారావు సి) రామారావు డి) నాగేశ్వరరావు 16. ‘మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు’ అనే డైలాగ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం లోనిది. ఈ డైలాగ్‌ను ఏ ఆర్టిస్ట్ చెబుతారో తెలుసా? ఎ) ప్రకాశ్‌రాజ్ బి) సుహాసిని సి) వెంకటేశ్ డి) ఆర్తీ అగర్వాల్ 17. ‘నేనే నానీనే నీ నానీని నేనే..’ అనే పాట రచయితెవరో తెలుసా? ఎ) యం.యం. కీరవాణి బి) శివశక్తి దత్తా సి) రాజమౌళి డి) కల్యాణ్ రమణ కోడూరి 18. ‘అలా మొదలైంది’తో తన సినిమా దర్శక ప్రస్థానాన్ని ప్రారంభించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె ప్రస్తుతం ఏ హీరోతో సినిమా చేయనున్నారో తెలుసా? ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగశౌర్య డి) అల్లు శిరీష్ 19 ఈ క్రింది ఫొటోలోని బాలనటుడు ఓ పెద్ద హీరో. గుర్తుపట్టారా? ఎ) కమల్‌హాసన్ బి) మహేశ్‌బాబు సి) నాగార్జున డి) ఎన్టీఆర్ 20. ఎన్టీఆర్ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో చెప్పుకోండి? ఎ) శ్రీ కృష్ణావతారం బి) శ్రీ కృష్ణ లీలలు సి) మాయాబజార్ డి) శ్రీ కృష్ణ సత్య మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) ఎ 4) డి 5) ఎ 6) ఎ 7) డి 8) డి 9) బి 10) బి 11) ఎ 12) డి 13) బి 14) బి 15) బి 16) బి 17) ఎ 18) బి 19) ఎ 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
చార్మి@ఆర్మీ
-
చూసిన వెంటనే షాకయ్యా : నాని
ఒకప్పుడు డైనమిక్ డైరెక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ మాత్రమే అని అనేవారు. స్టార్ డైరెక్టర్ హోదాలో చాలా కాలమే కొనసాగారు. కానీ ప్రస్తుతం పూరి సినిమాలు వస్తున్నాయంటే ఒకప్పటి హంగామా ఇప్పుడు ఉండటం లేదు. దానికి కారణం వరుసబెట్టి ఒకే మూసధోరణిలో సినిమాలు చేస్తుండటమే. అయితే ‘మెహబూబా’ మాత్రం పూర్తిగా తన పంథా మార్చి కొత్తగా ట్రై చేసిన సినిమా అంటూ చెప్తున్నాడు పూరి. ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ హైలెవల్లో చేస్తోంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమోషన్లో భాగంగా నాని ఈ సినిమా గురించి వివరిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ‘ట్రైలర్ చూసిన వెంటనే షాకయ్యా. టెక్నికల్లి బ్రిలియంట్‌గా ఉంది. ఇదంతా ఎప్పుడు తీశారా అని డౌట్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న క్యూరియాసిటీ పెరిగింది. చిత్రబృంధానికి,పూరి గారికి, ఆకాష్, ఛార్మి గారికి విష్ యూ ఆల్ ది బెస్ట్’ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇండో పాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుభూతికి లోనయ్యా : కోన ఇప్పుడే మెహబూబా సినిమా చూశాను. కాదు...కాదు...అనుభూతికి లోనయ్యాను. ప్రేమతో పూరి తీసిన గొప్ప ప్రేమకథ మెహబూబా. చిత్రబృంధానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడే "మెహబూబా" చూసాను .. కాదు .. కాదు .. ఒక అనుభూతికి లోనయ్యాను.. పూరి ప్రేమతో తీసిన ఒక గొప్ప ప్రేమకథ ఇది !! ఆకాష్ చాలా చాలా బాగా చేసాడు.. It’s a mind blowing love story 👍Congratulations @purijagan , @PuriConnects & the whole team 👏👏👏 — kona venkat (@konavenkat99) May 9, 2018 -
పెళ్లి చేసుకోను.. ప్రేమించనూ లేను..
లైఫ్ చాలా సింపుల్ రిలేషన్షిప్స్ ఇంకా సింపుల్ లైఫ్‌లో కిందపడితే ‘భౌభౌ’ అంటారు. అదే పైకి లేస్తే ‘వావ్ వావ్’ అంటారు. మొరిగేవాళ్లే కాంప్లికేటెడ్ ఎప్పుడు ‘భౌభౌ’ అంటారో ఎప్పుడు ‘వావ్ వావ్’ అంటారో తెలియదు. ‘పీసీ’ అంటే పూరీ కనెక్ట్స్ కాదు.. పూరి, చార్మి అంటున్నారని టాక్ అంటే.. మొరిగేవాళ్లను మొరగనివ్వండి అంటున్నారు చార్మి. పీసీ అంటే ‘ప్రొఫెషనల్ కనెక్షన్’ అని కన్ఫార్మ్ చేస్తున్నారు చార్మి. బేసిక్‌గా మీరు మంచి యాక్ట్రెస్. ఆన్ స్క్రీన్‌కి దూరమై, ఆఫ్ స్క్రీన్ ప్రొడక్షన్ వ్యవహారాలకు స్టిక్ అయిపోయారేంటి? చార్మి: నేను ఆల్ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ చేసేశాను. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం.. ఇలా ఎక్కువ భాషల్లో, అందరి సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేశాను. రొమాన్స్, మాస్ మసాలా, దెయ్యాలు, థ్రిల్లర్స్, ఐటమ్ సాంగ్స్... ఏదీ వదిలిపెట్టలేదు. ఇప్పుడూ అలాంటి సినిమాలే అంటే నా మైండ్ ఒప్పుకోవడంలేదు. ఇంకా ఎన్నాళ్లని అదే చేస్తాం? చేసినన్నాళ్లు చాలా జెన్యూన్‌గా, హానెస్ట్‌గా చేశాను. ఏదో డబ్బు ఇస్తున్నారు కదా అని నా ప్రొఫెషన్ని చీట్ చేయలేదు. పదిహేనేళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశా. అప్పుడు అది బాగుందనిపించింది. ఇప్పుడు ఇది చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా మైండ్, నా సోల్ అన్నీ ఈ కంపెనీ (పూరీ కనెక్ట్స్) మీదే. ప్రొడక్షన్‌ని డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ స్ట్రెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నా. జనరల్‌గా ఏ కంపెనీ అయినా ఉన్నని రోజులు అంతా బాగానే ఉంటుంది. తర్వాత కలహాలొస్తే అప్పుడు మీ లైఫ్ ఏంటి ? పూరీగారు ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’ అంటారు. అప్స్ అండ్ డౌన్స్ కామన్. అవి పేరెంట్స్‌తో కూడా రావొచ్చు కదా? వాళ్లు నాతో జీవితాంతం ఉంటారని గ్యారంటీ ఏంటి? రిలేషన్షిప్లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావని గ్యారంటీ ఏంటి? మేం లైమ్‌లైట్‌లో ఉన్నాం అని మా కంపెనీ మీద చాలామందికి ప్రత్యేక దృష్టి ఉంటుందేమో. ఇక్కడ ఎప్పుడూ వర్క్ గురించే. వర్క్ తప్ప ఇక్కడేమీ ఉండదు. 24 గంటలు సినిమా పనులతో బిజీగా ఉంటాం. నాకు మెన్, ఉమెన్ అని వేరు చేయడం ఇష్టం ఉండదు. ఎవరి మైండ్ కరెక్ట్‌గా ఉంటే వాళ్లతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. పీసీ అంటే ‘పూరీ కనెక్ట్స్’. కానీ చాలామంది పి అంటే పూరి, సి అంటే చార్మి అనుకుంటున్నారు. దాని గురించి? పూరీగారు ఫేమస్ కాబట్టి, చార్మి ఫేమస్ కాబట్టి అలా అనుకుంటున్నారు. అదే నేను అబ్బాయిని అయితే అలా అనుకోరు కదా. లేదా నేను ఒక హీరోయిన్ని కాకుంటే అలా అనుకోరు కదా. ఇప్పుడు నేనేం చెప్పినా పట్టించుకోరు. మాట్లాడుకునేది మాట్లాడుకుంటూనే∙ఉంటారు. అందుకే ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం మానేశాను. నా బిల్స్ సొసైటీ కట్టడంలేదు. పబ్లిక్ కట్టడం లేదు. మీరూ కట్టడంలేదు. నేనే కట్టుకోవాలి. నా జీవితం నేనే బ్రతకాలి. వాళ్లు ఇలా అనుకుంటున్నారు... వీళ్లు ఇలా అనుకుంటున్నారని నా పనులన్నీ ఆపేసి కూర్చోలేను. మీ ఇష్టం అని వదిలేయడమే. మీ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్పై చాలామందికి క్వొశ్చన్స్ ఉన్నాయి.. వాటికి ఆన్సర్స్ ఆశిస్తారు? ఇతరుల లైఫ్ గురించి కొన్ని క్వొశ్చన్స్ అనుకుని ఆన్సర్స్ కోసం చూడటం మానుకోవాలి. ఆ ఆరాటాన్ని వదిలించుకుంటే పైకి వస్తారు. వర్క్‌లో ఫోకస్ ఉంచితే ఎక్కడికో వెళ్లిపోతారు. సాయంత్రం అవ్వగానే వాళ్ల గురించి, వీళ్ల గురించి సొల్లు కబుర్లు చెప్పుకునేవాళ్లు లైఫ్‌లో పైకి రారు. పూరీగారి లవ్‌స్టోరీలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన తీసిన మిగతా లవ్‌స్టోరీలకు ‘మెహబూబా’ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోంది? ‘మెహబూబా’ ఫుల్ ఇన్టెన్స్ లవ్‌స్టోరీ. 1970 టైమ్‌లో జరిగే కథ. బేసిక్‌గా ఇది పునర్జన్మల కథ. 1970లో ఒక కథ, 2018లో మరో కథ జరుగుతుంది. 1970లో జరిగేది ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ కొత్త కాన్సెప్ట్. న్యూ అటెమ్ట్ కూడా. పూరీగారికి వార్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. ఈ వార్ బేస్డ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. యాక్ట్రె స్‌గా ఉండటం వల్ల ఎక్కువ సంపాదించారా? లేక ప్రొడక్షన్లో ఉండటం వల్లనా? నేనెప్పుడూ మనీ వైపు అట్రాక్ట్ అవ్వలేదు. ‘ఐ యామ్ అట్రాక్టెడ్ టు వర్క్’. మనకి కావల్సింది ఏంటి? మంచి ఇల్లు, లగ్జరీ కారు, కోరుకున్న ఫుడ్, మంచి డ్రెస్సులు. నాకు విశాలమైన ఇల్లు ఉంది. లగ్జరీ కారు ఉంది. ఫైవ్‌స్టార్ హోటల్స్‌కి వెళ్లే స్తోమత ఉంది. హ్యాంగ్ అవుట్ అవ్వడానికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఎందుకు డబ్బు కోసం పరిగెత్తడం? అందుకే ఇక డబ్బు గురించి అంత ధ్యాస లేకుండా పోయింది. ఇప్పుడు నాకు మంచి వర్క్ కావాలి. అది ఈ కంపెనీలో దొరుకుతోంది. ఐ యామ్ హ్యాపీ. సొసైటీలో ఏం జరుగుతోందో తెలుసుకుంటారా? సొసైటీ మీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటారా? ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటేనే తెలుసుకుంటా. పట్టించుకోకూడదనుకుంటే పట్టించుకోను. నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ‘లివ్, లెట్ లివ్’. నేను ఒకరి జీవితంలోకి తొంగి చూడాలని ఆరాటపడను. సొసైటీ గురించి మాట్లాడుకుంటే... ‘నేను ఆడ, తను మగ’ అనే వ్యత్యాసాన్ని వేరు చేయాలి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ని మైండ్‌లో నుంచి తీసేయాలి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి వర్క్ చేస్తే అదేదో కాని పని అన్నట్లు చూడటం మానేయాలి. మా కంపెనీలో ఒక్కటే రూల్. రండి.. వర్క్ చేయండి. మీకేమైనా వేరే ఉద్దేశం ఉంటే వెళ్లిపోండి. అంతే. ఎందుకంటే మా మైండ్‌లో వర్క్ తప్పితే ఇంకేం ఉండదు. మా ఇంట్లో నన్ను మా నాన్నగారు అబ్బాయిలానే చూస్తారు. అందుకే ‘బేటా’ అని పిలుస్తారు. మా ఫ్యామిలీలో నేను ‘బాయ్ టైప్’. అంటే ‘బేటా’ అనిపించుకోవడంలోను, ‘బాయ్ టైప్’ అనుకోవడంలోనూ ప్రౌడ్‌నెస్ ఉంది అంటారా? ఉమెన్‌గా ఉండటంలో అది లేదా? స్ట్రాంగ్ ఉమన్ అని అనుకోవచ్చు కదా? ఎగ్జాంపుల్ కోసం ‘బాయ్’ అన్నా. ‘ఐయామ్ ఎ స్ట్రాంగ్ ఉమన్’. అసలు మ్యాన్, ఉమన్ అని ఎందుకీ డిఫరెన్స్? నేనేంటి? ఈరోజు లేవగానే ఏం పని చేయాలి? అని మాత్రమే ఆలోచిద్దాం. ఎవర్నీ హర్ట్ చేయకుండా ఉందాం. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్లు ఉంటే అందరూ హ్యాపీగా ఉంటాం. చేసిన క్యారెక్టర్లే వస్తున్నాయని నటించడంలేదు. కానీ పబ్లిక్ అప్పియరెన్స్‌లు కూడా తగ్గించేశారు.. కారణం? ఆఫీసులో ఉండి, ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ లొకేషన్‌కి వెళుతున్నాను. కానీ నేను బయట కనిపించాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు నాకు పబ్లిక్ అప్పియరెన్స్ ఇష్టం లేదు. బయటకు నా ఫేస్ చూపించడం ఇష్టం లేదు. కెమెరా వెనక ఉండి వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నా. ఒక ఉమన్ ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. ‘మెహబూబా’ని సింగిల్ హ్యాండెడ్‌గా చేయడం ఎలా అనిపించింది? సింగిల్ హ్యాండ్ అని చెప్పలేను. మా కంపెనీ (పూరీ కనెక్ట్స్) నుంచి వస్తున్న సినిమా ఇది. పూరీగారు మోస్ట్ ఈజియస్ట్ బిజినెస్ పార్టనర్, ఈజియస్ట్ డైరెక్టర్. ఆయన కింద పని చేసేవాళ్లను అడగండి. పూరీగారంటే మాకు పిచ్చ ఇష్టం అంటారు. వాళ్లందరికీ ఆయన మీద అంత ఇష్టం ఉండటం వల్ల ప్రేమతో వర్క్ చేస్తారు. నాకు వాళ్లందర్నీ హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాలేదు. ఒకవేళ పూరీగారి సినిమా కాకుండా వేరే సినిమా అయితే కష్టంగా ఉంటుందా? అవును. ఇంపాజిబుల్. ఆయన కాబట్టి వర్క్ చాలా ఈజీ అయిపోయింది. పూరీగారు లేకుండా అంటే చాలా కష్టం. ఎలాగూ ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం వచ్చింది. సోలోగా సినిమాలు ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు. ‘ఫిమేల్ ప్రొడ్యూసర్స్’ తక్కువ ఉన్నారు కదా? నాకలాంటి ఆలోచనలు లేవు. ఇన్నేళ్లూ సోలో హీరోయిన్ గానే చేశాను కదా. ఇప్పుడు టీమ్ వర్క్‌గా అందరం కలిసి ప్రొడక్షన్ చేద్దామనుకుంటున్నాను. టీమ్ వర్క్ వల్ల చాలాకాలం నిలబడతామని నా నమ్మకం. సాఫ్ట్వేర్ కంపెనీలనే తీసుకుందాం. ఇద్దరు ముగ్గురు ఫౌండర్స్ ఉంటారు. వాళ్లెప్పుడూ సోలోగా పేరు ఇవ్వరు. వాళ్ల కంపెనీ పేరునే బయటకు ఇస్తారు. ఎందుకంటే వాళ్లు టీమ్ వర్క్‌ని నమ్ముతారు. కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ కాంబినేషన్ సెట్ కావడం రేర్.. అలా చూస్తే మీకు రేర్‌గానే అనిపిస్తుంది. కాంబినేషన్స్ ఎందు కు కలవవు. బాపు–రమణగారు జీవితం మొత్తం కలిసే ట్రావెల్ చేశారు. యస్వీ కృష్ణారెడ్డిగారు–అచ్చిరెడ్డిగారు ఉన్నారు. వాళ్లు కలిసే ట్రావెల్ చేస్తారు. ఎవరూ ఏమీ అనరు. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ‘జెండర్’ వేరయ్యేసరికి టాపిక్ అవుతోంది. ఇలా టాపిక్ అవుతుందని ఇంట్లో కూర్చోలేం కదా. మీరు తీసుకునే నిర్ణయాలపట్ల చాలా క్లారిటీగా ఉన్నారనిపిస్తోంది. మరి.. ఇంతే క్లారిటీతో పెళ్లి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకోను. ‘ఐ యామ్ నాట్ మేడ్ ఫర్ మ్యారేజ్’. నేను రిలేషన్షిప్లో కూడా ఉండలేను. ఎవర్నీ ప్రేమించలేను. ఒక రిలేషన్‌షిప్‌కి కావాల్సినట్టు ఉండలేను. అందుకే పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. నా అంతట నేను బతకగలను. కావాలంటే పాస్‌పోర్ట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోతా. ఎవ్వరికీ ఫోన్ కూడా చేయను. ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే చాలా క్వొశ్చన్స్కు ఆన్సర్ చేయాలి. ‘నేను ఓ ఇరవై రోజుల తర్వాత ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్దాం అనుకుంటున్నా’ అని ముందే ప్రిపేర్ చేయాలి. అవన్నీ నా వల్ల కాదు. నాకు నచ్చినట్టు ఉంటాను. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను. కానీ ‘ఒక బంధం’లో సెక్యూరిటీ ఉంటుంది కదా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అదే సెక్యూరిటీ. భర్త ఉంటాడు. అతను డబ్బు ఇవ్వకపోతే ఆ భార్య పరిస్థితి ఏంటి? ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. సమయానికి భర్త ఇంట్లో ఉండడు. హాస్పటల్‌కి వెళితే ఎవరు చూస్తారు? నర్సే కదా. ఆ నర్స్‌కి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులుంటే చాలు. సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నట్లే. గతంలో ఓ వ్యక్తితో ఏర్పడిన ‘రిలేషన్షిప్’ తాలూకు చేదు అను భవం వల్లే మీ మైండ్ సెట్ ఇలా మారిందా? ఆ రిలేషన్షిప్ గురించి ఎవరికి వాళ్లు ఊహించుకున్నారు. నేనెప్పుడైనా రిలేషన్షిప్లో ఉన్నానని ఒప్పుకున్నానా? క్లియర్‌గా చెబుతున్నాను.. నేనిలా ఆలోచించడానికి ఎవరూ కారణం కాదు. ఎవర్నీ నిందించదలచుకోలేదు. మీరు హ్యాపీగా ఉన్నారని అర్థం అవుతోంది. మీ డెసిషన్‌తో మీ అమ్మానాన్న కూడా హ్యాపీనా? ఇక వాళ్లకు ఆప్షన్ లేదు. నన్ను ఫోర్స్ చేయరు. వాళ్లకేం కావాలి? వాళ్ళ అమ్మాయి నవ్వుతూ, ఆనందంగా ఉండాలి. పని చేసుకుని, నవ్వుకుంటూ ఇంటికి వస్తుందా? లేదా అన్నది వాళ్లకు ముఖ్యం. నేను హ్యాపీగా ఉన్నాను. మా నాన్నగారు మా అమ్మతో ‘ఇదిగాని పెళ్లి చేసుకుంటే 6 నెలల్లో డైవర్స్ అయిపోతుంది’ అంటూంటారు. మీ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతం ప్రొడక్షన్ చూస్తున్నారు.. డైరెక్షన్ వైపు కూడా వెళతారా? ఆ ప్లాన్స్ లేవు. నా ఊపిరి ఉన్నంతవరకూ సినిమాల్లోనే ఉండాలి. ఈ పూరీ కనెక్ట్స్ కంపెనీని చాలా పెద్దది చేయాలి. పూరీగారితో మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది. ఆకాశ్ పూరి గురించి? తన యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆకాశ్ ఈజ్ సూపర్. ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ‘మెహబూబా’ చేశాడని చెప్పడం లేదు. తను బయట సినిమాలు చేసినా కూడా నేను ఇదే చెబుతాను. చిన్నప్పటి నుంచి తనలో తపన ఉంది. పెద్ద హీరో అవ్వాలనే కసి ఉంది. ఆకాశ్ది మంచి పెంపకం. తన బిహేవియర్ చాలా బాగుంటుంది. ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం, తను యాక్ట్ చేసే వి«ధానం సూపర్. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. ఒక ప్రొడ్యూసర్‌గా పూరీగారి డైరెక్షన్ గురించి? నేనెవర్ని ఆయన గురించి చెప్పడానికి. హీ ఈజ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ‘మెహబూబా’ ఆన్ లొకేషన్లో ఏదైనా సీన్ చూసినా, డబ్బింగ్లో ఏదైనా సీన్ చూసినా నేను ఆడియన్‌లాగా చూస్తాను. నేను నిర్మాత.. ఆయన డైరెక్టర్.. అలా ఏమీ ఉండదు. ఆయన బాస్. పూరీగారితో పని చేయడమే నేను గొప్ప అనుకుంటున్నాను. నాకు పనిలో ఇంత రెస్పెక్ట్ ఇవ్వడమే గొప్ప. ‘హీ ఈజ్ పూరి జగన్నాథ్’. బయట చాలామంది పూరీగారితో పని చేయాలని కోరుకుంటారు. నాకా అవకాశం దక్కింది. మీ కెరీర్‌ని ఎనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంటుంది? నా కెరీర్లో బెస్ట్ ఫేజ్ అంటే ఇదే. ఎందుకలా? కారణం? హీరోయిన్గా ఉన్నప్పుడు కష్టమైనా ఉదయాన్నే నిద్ర లేవాలి. వర్కవుట్స్ చేయాలి. ఫుడ్ విషయంలో కంట్రోల్‌గా ఉండాలి. ఇప్పుడీ కష్టాలు లేవు. లేటుగా నిద్ర లేవాలనిపిస్తే అలానే చేస్తాను. వర్క్ చేయాలనే మూడ్ లేకపొతే చేయను. యాక్ట్ చేసినప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీదే దృష్టి పెట్టాను. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. ఫిల్మ్ ప్రొడక్షన్ ఈజీ కాదు. సినిమా తీయడం, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, దాన్ని పబ్లిసిటీ చేసి, సినిమా రిలీజ్ చేయడం.. ఇవన్నీ పెద్ద టాస్క్. ‘మెహబూబా’ సినిమా ద్వారా ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. ఇదివరకు సంవత్సరానికి ఆరు సినిమాలు చేశాను కానీ ఆ ఫుల్ఫిల్మెంట్ అప్పుడు లేదు. ఇప్పుడు ‘మెహబూబా’ ట్రైలర్ బావుంది, సినిమా రిలీజ్ ఎప్పుడు అని అందరూ అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఐ యామ్ ఇన్ హ్యాపీ స్పేస్. ఫిల్మ్ ప్రొడక్షన్ చూసుకుంటూ హ్యాపీ స్పేస్‌లో ఉన్న మీరు హీరోయిన్గా చేసినప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ లాంటి వాటితో ఇబ్బందులు పడ్డారా? నిజం చెప్పాలంటే నేను బ్లెస్డ్. నా పేరెంట్స్ ఎప్పుడూ నాతోనే ఉన్నారు. 13 ఏళ్లకే యాక్టింగ్ స్టార్ట్ చేశాను. 15కి స్టార్ అయిపోయాను. స్టార్ అయ్యాక నా డెసిషన్స్ అన్నీ మా నాన్నగారే తీసుకునేవారు. నా ప్రతి బర్త్‌డేని యూనిట్ సభ్యుల మధ్య లొకేషన్లో జరుపుకున్నాను. కేక్ కట్ చేసి మళ్లీ షాట్‌కి వెళ్లిపోయేదాన్ని. హ్యాపీగా గడిచింది. అంతా దేవుడి దయ. -
ఫస్ట్ టైమ్ జెన్యూన్‌గా తీసిన సినిమా మెహబూబా
‘‘నేను రోజూ పొద్దున నిద్ర లేవగానే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ చెప్పి, ‘ఒక వేషం ఇవ్వండి’ అని అడిగేవాడు ఆకాశ్. వాడి టార్చర్ తట్టుకోలేక ‘చిరుత’లో ఒక వేషం ఇచ్చాను. ఓసారి ‘నువ్వు హీరో అవ్వడానికి ఇంకో పదేళ్లు పడుతుంది. ఆ టైమ్‌కు నాకు కెపాసిటీ ఉంటుందో, డబ్బులు ఉంటాయో లేదో తెలీదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో’ అని చెప్పా. అప్పటినుంచి ఇంటికి ఏ డైరెక్టర్ వచ్చినా చాన్స్ కోసం కాళ్లు పట్టేసుకునేవాడు. టైమ్ బావుండి నేనే సినిమా తీశా’’ అని అన్నారు పూరి జగన్నాథ్. ఆకాశ్ పూరి, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘మెహబూబా’ మే 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘నేను 35 సినిమాలు చేసినా ఫస్ట్ టైమ్ జెన్యూన్‌గా ఒక సినిమా చేశాను అనే ఫీల్ వచ్చింది. హీరో ఆకాశ్ గురించి చెప్పాలి. వీడు నాకు చాలా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు (నవ్వుతూ). ‘దిల్’ రాజుగారు సినిమా చూసి రెండు విషయాలు చెప్పారు. ఒకటి.. నువ్వు మనసు పెట్టి చేస్తే ఇలా ఉంటుంది. రెండు.. నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాతో నాకిది మూడో సినిమా. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. తమ్ముడు భాస్కరభట్ల ‘మెహబూబా’ మీద పగబట్టి పాటలు రాశాడు. అందరూ మనసుపెట్టి సినిమా చేశారు. చార్మి ప్రొడక్షన్ బాగా చేసింది. మగాళ్ల కంటే ఎక్కువగా పనిచేస్తుంది చార్మి. అందుకే నాకు ఇష్టం. నేహా చాలా బాగా చేసింది. నాకు యాభై ఏళ్లు దాటాయి. నెక్ట్స్ టెన్ ఇయర్స్‌లో ఆకాశ్ కంటే ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు నేను చేస్తాను. ఇది నా ఛాలెంజ్’’ అన్నారు. ‘‘పూరీగారితో నాకిది 25వ సినిమా. ఇంతవరకూ రాసిన సినిమాలు ఒక ఎల్తైతే. ఈ సినిమా మరో ఎత్తు. చాలా ఇష్టంతో రాశాను. ఈ సినిమా కోసం చాలా పాటలు వదిలేశాను. అయినా రిగ్రెట్ లేదు. గొప్ప సినిమా కోసం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు వెచ్చించినా నష్టం లేదని నా ఉద్దేశం’’ అన్నారు భాస్కరభట్ల. ‘‘సందీప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాకు మ్యూజిక్ బ్యాక్‌బోన్. షూటింగ్ స్టార్ట్ చేయడమే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్ చేశాం. మా నాన్న ఇంత మంచి కథను ఏ స్టార్ హీరోతో అయినా తీయొచ్చు కానీ నాతో చేశారు. ఇది డెఫినెట్‌గా మా నాన్నకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఈ కమ్‌బ్యాక్ ఏ స్టార్‌తో ఇవ్వట్లేదు. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని, ఏమాత్రం ఫ్యాన్ బేస్ లేని ఒక 22 ఏళ్ల కుర్రాడితో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ‘ఆకాశ్ చాలా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేస్తున్నాడు’ అని అంటున్నారు. అవును కాన్ఫిడెన్సే. మా నాన్న మీద ఉన్న కాన్ఫిడెన్స్’’ అన్నారు ఆకాశ్. ‘‘ట్రైలర్‌కు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మేం చాలా కష్టమైన క్లైమెటిక్ కండీషన్లో షూట్ చేశాం. ఫాదర్, సన్ కాంబినేషన్ గురించి అందరూ అడుగుతున్నారు. సెట్లో పూరీగారు ఎంత కూల్‌గా ఉంటారో అందరికీ తెలుసు. అంతకన్నా ఎక్కువ కూల్ ఆకాశ్’’ అన్నారు చార్మి. -
పూరి హగ్...
చిన్న చిత్రాల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకుని ఫీచర్ ఫిల్మ్స్ డైరెక్టర్ అయిన వారు టాలీవుడ్లో ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ తొలిసారి ‘హగ్’ అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించడం విశేషం. ఇప్పటివరకూ డైరెక్టర్‌గా తనలోని ఒక కోణం మాత్రమే చూపించిన ఆయన ఈ నెల 31న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. బాలకృష్ణతో ‘పైసా వసూల్’ సినిమా తర్వాత తనయుడు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు పూరి. ‘ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు పూరి ఓ వార్త చెప్పబోతున్నారు’ అంటూ చార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనయుడితో తీస్తున్న ‘మెహబూబా’ సినిమా గురించి చెబుతారా? లేక మరో విషయం ఏదైనా ఉంటుందా? అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’. ఈ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి’ అంటూ ‘హగ్’ పోస్టర్ కూడా పోస్ట్ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పూరి. -
శ్రీ‘దేవి’ భక్తుడు రామ్‌గోపాల్ వర్మ.. ఆసక్తికర వీడియో
సాక్షి, సినిమా: రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. నటి ఛార్మి తాజాగా వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన కింద కూర్చొని కన్నార్పకుండా అతిలోకసుందరి పాటను వీక్షిస్తూ కనిపించారు. వర్మ తనదైన ప్రపంచంలో ఎవ్వరినీ పట్టించుకోకుండా ఆ పాటలో లీనమైపోయి చేస్తున్నారు. సన్నీడియోల్, శ్రీదేవి కలిసి నటించిన ఛాల్‌బాజ్ అనే హిందీ మూవీలో 'నా జానే కహాసే..' అనే పాటను వర్మ చూపు తిప్పకుండా చూస్తున్నారు. ఈ వీడియోకు ఛార్మి క్యాప్షన్‌గా.. ‘భక్తుడు రామ్‌గోపాల్ వర్మ.. శ్రీదేవి కోసం ఇక్కడ నేలపై కూర్చొని ఉన్నారు. రాముఇజం, ఆయన ఫ్యానిజం’ అని పోస్ట్ చేశారు. N the worshiper is here @rgvzoomin on the floor for @sridevi.kapoor .. Ramuism n his fanism 😍 A post shared by Charmmekaur (@charmmekaur) on Nov 26, 2017 at 9:03am PST -
స్క్రీన్ టెస్ట్
► ఈ పంజాబి భామ అసలు పేరు ‘సుర్దీప్ కౌర్’, ఆమె స్క్రీన్ పేరేంటి? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) తాప్సీ సి) కాజల్ అగర్వాల్ డి) చార్మీ ► యస్వీ రంగారావు నటుడు కాక ముందు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. ఏ డిపార్టుమెంట్లో (శాఖ) ఆయన పనిచేశారు? ఎ) ఆర్మీ బి) తపాల సి) ఫైర్ డి) ఎక్సైజ్ ► పరుచూరి బ్రదర్స్ రచయితగా పనిచేసిన తొలి చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? చిన్న క్లూ... ఆయన నటుడు కూడా? ఎ) నాగభూషణం బి) దేవదాసు.కనకాల సి) కె.బి.తిలక్ డి) నగేశ్ ► నటి స్నేహ నటించిన మొదటి తెలుగు సినిమా హీరో ఎవరు గుర్తు తెచ్చుకోండి? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రవితేజ డి) గోపిచంద్ ► ‘ప్రతిఘటన’ సినిమాకు దర్శకుడు టి.కృష్ణ మొదటగా అనుకొన్న హీరోయిన్ విజయశాంతి కాదు. అయితే మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎ) రాధిక బి) సుహాసిని సి) రాధ డి) శారద ► నటుడు ఆర్. నారాయణమూర్తి హీరోగా చేయకముందు, క్రాంతికుమార్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఆ సినిమా పేరేంటి? ఎ) రుద్రవీణ బి) శివుడు శివుడు శివుడు సి) విజేత డి) ఖైదీ ► మహేశ్ బాబు బాలనటుడిగా తన తండ్రి కృష్ణతో కలిసి ఎన్ని సినిమాలలో నటించాడో తెలుసా? ఎ) 3 బి) 4 సి) 2 డి) 5 ► కరుణాకరన్ దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరో కనుక్కోండి? ఎ) మణిశర్మ బి) ఏ.ఆర్.రహమా సి) దేవాడి) దేవి శ్రీ ప్రసాద్ ► ఎన్టీఆర్ నటించిన ‘పాండవ వనవాసం’ చిత్ర దర్శకుడు ఎవరు? ఎ) బి.యన్.రెడ్డి బి) ప్రత్యగాత్మ సి) కమలాకర కామేశ్వరరావు డి) కె.వి.రెడ్డి ► ఏ పాటనైనా తీయటానికి ముందు ఆ పాటను కనీసం వందసార్లు వింటానని చెప్పే దర్శకుడెవరు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్ ► ‘శంకరాభరణం’ చిత్ర మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) జంధ్యాల బి) సిరివెన్నెల సి) యం.వి.యస్. హరనా«థ రావు డి) కృష్ణశాస్త్రి ► ‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్’ పాట రచయిత? ఎ) భాస్కరభట్ల బి) రామజోగయ్య శాస్త్రి సి) సాహితి డి) అనంత శ్రీరామ్ ► నటి త్రిష ట్విట్టర్ ఐడీ ఏంటో తెలుసా? ఎ) త్రిష బి) త్రిషట్రాషెర్స్ సి) మీ త్రిష డి) నేమ్ ఈస్ త్రిష ► నటుడు నాగచైతన్య నటించిన ఒక సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ చిన్న పాత్రలో నటించారు. అది ఏ సినిమా కోసమో తెలుసా? ఎ) సాహసం శ్వాసగా సాగిపో బి) దడ సి) బెజవాడ డి) ఏ మాయ చేసావె ► ఎన్టీఆర్ హిట్ సాంగ్ ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటకు మళ్లీ డాన్స్ చేసిన తమిళ టాప్ హీరో? ఎ) రజనీకాంత్ బి) కమలహాసన్ సి) శరత్ కుమార్ డి) విజయ్ ► ‘కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం’ – ఈ డైలాగ్ ఏ సినిమా లోనిది? ఎ) తీన్మార్ బి) అత్తారింటికి దారేది సి) గబ్బర్‌సింగ్ డి) జల్సా ► ‘ఆల్ ఐ వాంట్ ఈస్ ఎవ్విరి థింగ్ ’ అనే ఇంగ్లీష్ షార్టు ఫిలిమ్‌ను నిర్మించింది తెలుగు యాంకర్? ఆమె ఎవరు? ఎ) సుమ బి) అనసూయసి) ఝాన్సీ డి) శిల్పా ► చక్రవర్తి ఈ ఫొటోలో ముద్దుగా ఉన్న పాప ఇప్పుడు హీరో యిన్. ఎవరో గుర్తుపట్టగలరా? ఎ) అవికా గోర్ బి) ఉదయభాను సి) భావనడి) అంజలా ఝవేరి ► అభయ్‌రామ్ అనే పేరు ఓ స్టార్ నటుడు కుమారునిది. ఎవరా స్టార్? ఎ) కళ్యాణ్‌రామ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) యన్టీఆర్ ► సావిత్రి నటించిన ఈ స్టిల్ ఏ సినిమా లోనిదో గుర్తు పట్టండి? ఎ) ఆత్మీయులు బి) మనసు మమత సి) అంతరంగాలుడి) చివరకు మిగిలేది మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) బి 4) డి 5) బి 6) బి 7) డి 8) సి 9) సి 10) బి 11) ఎ 12) బి 13) బి 14) డి 15) ఎ 16) ఎ 17) సి 18) ఎ 19) డి 20) డి -
కామెడీ హీరోతో పూరి
వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, స్పీడు మాత్రం తగ్గించలేదు. ఇప్పటికే తన తనయుడ్ని రీ లాంచ్ చేస్తూ మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన పూరి, తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. పైసా వసూల్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం మెహబూబా సినిమా మీద దృష్టి పెట్టాడు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఈ సినిమాను పూరి జగన్నాథ్ స్వయంగా చార్మీతో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి కామెడీ ఎంటర్ టైనర్ గా ఓ సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారు పూరి. ఈ సినిమాలో హీరోగా సునీల్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ కెరీర్ కూడా కష్టాల్లో ఉంది. హీరోగా మారిన తరువాత ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సునీల్ ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి పూరి, సునీల్ ల కాంబినేషన్ లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. -
చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?
-
చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?
ఆమెను అలా పోల్చడం సరికాదు వర్మకు జొన్నవిత్తుల కౌంటర్ హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన సినీ నటి చార్మిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో వరుస కామెంట్లు పెట్టారు. సిట్ విచారణ ముగిసిన అనంతరం ధైర్యంగా బయటకు వచ్చిన చార్మిని చూస్తే.. ఆమెను సిట్ విచారించినట్టుగా కాకుండా ఆమెనే సిట్‌ను ప్రశ్నించినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు తర్వాత చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ధైర్యంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. సిట్ విచారణ సందర్భంగా చార్మి గోర్ల నమూనాలను తీసుకోవడం కాదు.. ఆమె మేకప్ చేసుకున్నట్టు కనిపిస్తున్నదని వర్మ పేర్కొన్నారు. అయితే, దర్శకుడు వర్మ వ్యాఖ్యలపై రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'చార్మి వీరనారి కాదు.. సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు. చార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం సరికాదు' అని జొన్నవిత్తుల అన్నారు. -
చార్మి దాదా
⇒ కెల్విన్ ఫోన్లో ఆ పేరుతో ఉన్న నంబర్ మీదేనా? ⇒ అతడితో మీరు ఫొటోలు ఎందుకు దిగారు? ⇒ వాట్సాప్, మెసెంజర్లో ఎందుకు టచ్‌లో ఉన్నారు? ⇒ మీరు డ్రగ్స్ తీసుకున్నట్టు కెల్విన్ చెప్పాడు.. నిజమేనా? ⇒ చార్మిపై సిట్ ప్రశ్నల వర్షం.. ఆరు గంటలపాటు విచారణ ⇒ కెల్విన్ ఈవెంట్ మేనేజర్‌గానే తెలుసునన్న నటి ⇒ పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్ తీసుకున్నట్టా అని ప్రశ్న ⇒ నమూనాలిచ్చేందుకు నిరాకరణ.. నేడు సిట్ ముందుకు ముమైత్ సాక్షి, హైదరాబాద్ కెల్విన్ ఫోన్లో చార్మి దాదా పేరుతో ఉన్న నంబర్ మీదేనా? పూరీతో కలసి మీరు డ్రగ్స్ తీసుకున్నట్టు కెల్విన్ చెప్పాడు.. దీనిపై ఏమంటారు.? కెల్విన్‌తో ఫొటోలు ఎందుకు దిగారు..? అంటూ సిట్ అధికారులు హీరోయిన్ చార్మికౌర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. డ్రగ్స్ కేసులో భాగంగా బుధవారం చార్మి సిట్ ముందుకు వచ్చారు. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ఆమెను సూపరింటెండెంట్ పవన్‌కుమార్ నేతృత్వంలోని ఇన్స్పెక్టర్లు బీఎల్ రేణుక, విజయలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణిలతో కూడిన మహిళా అధికారుల బృందం విచారించింది. 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఆరు గంటలపాటు ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ‘‘కెల్విన్ కాల్‌డేటాతో పాటు వాట్సాప్ మెసేంజర్‌లో అనేకసార్లు చార్మి దాదా అనే పేరుతో కాల్స్, మెసేజ్‌లున్నాయి. చార్మి దాదా పేరుతో ఉన్న ఫోన్ నంబర్ మీదేనా’’అని ప్రశ్నించగా... ఆ నంబర్ తనదేనని చార్మి అంగీకరించారు. అయితే తాను నిర్మిస్తున్న పలు సినిమాలకు కెల్విన్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేశాడని, అందువల్లే అతడితో వాట్సాప్ మెసేజ్‌లు, కాల్స్ ఉన్నట్టు చార్మి చెప్పినట్టు తెలిసింది. ‘మీరు పూరి జగన్నాథ్‌తో కలసి డ్రగ్స్ తీసుకున్నట్టు కెల్విన్ మా విచారణలో చెప్పాడు. దీనిపై ఏమంటారు’అని అధికారులు ప్రశ్నించగా.. తనకు డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని, కెల్విన్‌తో పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానించడం సరికాదని చార్మి స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్ రోజున జరిగిన పార్టీలో కెల్విన్, పూరి, చార్మి దిగిన ఫొటోలను చూపి ఈవెంట్ మేనేజర్‌తో ఇలా ఫొటోలు దిగడం వెనుకున్న ఆంతర్యం ఏంటని అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. సినిమా ఫంక్షన్ అన్న తర్వాత పార్టీలు సర్వసాధారణమని, ఫొటోలో ఉన్నది తానేనని, ఇలా అనేకసార్లు సినిమా ఫంక్షన్లలో అభిమానులతో ఫొటోలు దిగానని చార్మి చెప్పినట్టు సమాచారం. ‘జీశాన్‌తో డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు మా వద్ద ఆధారాలున్నాయి. అసలు డ్రగ్స్ ఎందుకు కొనాల్సి వచ్చింది? ఎంత మందికి విక్రయించారు?’అని ప్రశ్నించగా.. తనకు డ్రగ్స్ విక్రయించాల్సిన అవసరం లేదని, మరెవరికీ అలవాటు చేసే పని లేదని చార్మి స్పష్టంచేసినట్టు తెలిసింది. రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు స్వచ్ఛందంగా ఇస్తారా అని ప్రశ్నించగా... అందుకు చార్మి నిరాకరించారని సమాచారం. తాము కూడా నమూనాలు సేకరించలేదని సిట్ అధికారులు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ చేసినట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఓవర్‌యాక్షన్.. అధికారులకు చార్మి ఫిర్యాదు సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన చార్మికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె విచారణకు వస్తున్నారని తెలిసి సిట్ అధికారులు మహిళ ఇన్స్పెక్టర్తో పాటు కొందరు మహిళ కానిస్టేబుళ్లను బందోబస్తులో పెట్టారు. అయితే చార్మి కారు దిగి లోపలికి వెళ్తున్న సందర్భంగా నల్లగొండ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ అతిగా ప్రవర్తించాడు. మహిళ సిబ్బంది ఉన్నా వారిని పక్కను తప్పించి చార్మిని తాకుతూ ముందుకు తీసుకెళ్లాడు. దీంతో చార్మి షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎక్సైజ్ శాఖ విచారణకు ఆదేశించింది. సంబంధిత కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎవరు ఆ ఇద్దరు? ఓవైపు చార్మిని ప్రశ్నిస్తున్న సమయంలోనే సిట్‌లోని మరో బృందం డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సచిన్ దవన్, ఓ చిన్న పరిశ్రమకు ఎండీగా ఉన్న సుయాజుద్దీన్ అలియాస్ సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులను 8 గంటలకు పైగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరు కెల్విన్ ముఠాకు చెందినవారా? లేదా సినీ పరిశ్రమలో ఎవరికైనా డ్రగ్స్ విక్రయించారా? అన్న దానిపై సిట్ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరు ఈవెంట్ మేనేజర్లని, పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సిట్ అధారాలు సేకరించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో వరుసగా ఈవెంట్ మేనేజర్లను సిట్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ కూడా ఈవెంట్ మేనేజర్ కావడం గమనార్హం. నేడు సిట్ ముందుకు ముమైత్ డ్రగ్స్ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న సినీనటి ముమైత్‌ఖాన్ గురువారం సిట్ ఎదుట హాజరవుతారని అధికారులు తెలిపారు. మొదట్లో ఆమెకు నోటీసులిచ్చేందుకు ఎక్సైజ్ అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. సరైన అడ్రస్ దొరకని కారణంగా ఆలస్యంగా నోటీసులిచ్చారు. అయితే ముమైత్ బిగ్‌బాస్ షోలో ఉండటంతో అసలు సిట్ ముందు విచారణకు వస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. అయితే తాను సిట్ ఎదుట విచారణకు హాజరవుతానని, షో నుంచి అనుమతి కూడా తీసుకున్నట్టు ముమైత్ తెలిపారు. -
చట్ట ప్రకారమే విచారించండి
► చార్మీ పిటిషన్‌పై ఎక్సైజ్ సిట్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించే హీరో యిన్ చార్మీ కౌర్‌ను విచా రించాలని డ్రగ్స్ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎక్సైజ్ సిట్) అధికారు లను హైకోర్టు ఆదేశిం చింది. చార్మీ ఇష్టానికి విరుద్ధంగా ఆమె రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూ నాలను సేకరించవద్దని.. ఈ విషయంగా ఆమెపై ఒత్తిడి చేయవద్దని సూచిం చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, మహిళా అధికారుల సమక్షంలో మాత్రమే ప్రశ్నించాలని పేర్కొంది. విచారణ పూర్తికాకుంటే మరుసటి రోజు కొనసా గించవచ్చని సూచించిం ది. ఈ కేసులో ప్రస్తుతం చార్మీ సాక్షి మాత్రమేనని, నిందితురాలు కాదు కాబట్టి విచారణ సమ యంలో న్యాయవాది అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ.. తనను న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలో విచారించేలా.. బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను తీసుకోకుండా అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈవ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. బలవంతంగా చేస్తున్నారు.. తొలుత చార్మీ తరఫున న్యాయవాది పి.విష్ణువ ర్ధన్‌రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్ వ్యవహా రానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు జూలై 12న చార్మీకి నోటీసులు ఇచ్చి, 26న హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. సిట్ అధికారులు ఇలా విచారణకు పిలిచిన వారి నుంచి బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చార్మీ విషయంలోనూ అలాగే జరిగే అవకాశముందని.. ఇది హక్కు లను ఉల్లంఘించడమేనన్నారు. ఈ కేసులో చార్మీ నిందితురాలుగానీ, అనుమానితురాలు గానీ కాదని.. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విచారణ సమయంలో న్యాయవాదిని వెంటబెట్టుకు నేందుకు అనుమతించాలని కోరారు. బలవంతమేమీ లేదు అనంతరం ఎక్సైజ్ సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపించారు. విచా రణ జరిపే చోటును నిర్ణయించుకునే వెసు లుబాటును చార్మికే ఇచ్చామని.. అయినా ఆమె స్వచ్ఛందంగా సిట్ కార్యాలయానికి వచ్చేందుకు అంగీకరించారని కోర్టుకు వివ రించారు. సిట్ అధికారులు ఎవరి నుంచీ బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకోవడం లేదన్నారు. సోమవారం హీరో నవదీప్ నమూనాలు ఇచ్చేందుకు తిరస్కరించారని, దాంతో అధికారులు నమూనాలేవీ సేకరించలేదని తెలిపారు. మహిళా అధికారుల సమక్షం లోనే చార్మిని విచారిస్తామని.. ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నం దున న్యాయవాది కూడా అవసరం లేదని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాద నలు విన్న న్యాయమూర్తి మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఛార్మీ తీవ్రంగా కలత చెందింది: దీప్‌సింగ్
-
ఛార్మీ తీవ్రంగా కలత చెందింది: దీప్‌సింగ్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మిపై వస్తున్న ఆరోపణలను ఆమె తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ ఖండించారు. ‘13 ఏళ్ల నుంచే ఛార్మి సినీ రంగంలో ప్రతిభ చాటుతోంది. చిన్ననాటి నుంచే కుటుంబానికి అండగా ఉంటోంది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలతో నా కుమార్తె తీవ్రంగా కలత చెందింది. ఒకవేళ చార్మీకి డ్రగ్స్ అలవాటు ఉంటే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతుందా?. తనకు ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొనే సమయం లేదు. ఛార్మీ తన తదుపరి చిత్రం పైసా వసూల్‌తో బిజీగా ఉంది. అయితే ఒకరిపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాసేటప్పుడు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక నాకు పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా తెలుసు. పూరీ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు.త్వరలోనే క్లీన్చిట్ వస్తుందని అప్పుడే అందరికి సమాధానం దొరుకుంది.’ అని ఛార్మి తండ్రి వ్యాఖ్యానించారు. కాగా డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 20న ఛార్మీ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. -
నీరుగారిపోతున్న డ్రగ్స్ కేసు!
-
‘మత్తు’ దిగిపోతోంది?
నీరుగారిపోతున్న డ్రగ్స్ కేసు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు నీరుగారిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, వివిధ రంగాల వారేగాకుండా పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని వెల్లడైనా.. చివరికి తూతూమంత్రంగానే ముగించేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఒక ప్రముఖ దర్శకుడిని, మరో హీరోను మాత్రమే టార్గెట్‌గా చేసి విచారణ జరగబోతోందన్న ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో 19 మంది సినీ ప్రముఖుల పేర్లను గుర్తించిన సిట్.. అందులో పెద్ద చేపలను వదిలేసి, 12 మందికే నోటీసులు జారీ చేసిందని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులోనూ ఇద్దరిపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకుని.. కేసును పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో ముమైత్‌ఖాన్‌కు సిట్ నోటీసులు జారీ చేసినా.. కొందరు సినీ పెద్దల ఒత్తిడి మేరకు ఆమెకు మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా పూర్తిస్థాయి ఆధారాలు ఉంటేనే సినీ ప్రముఖులెవరినైనా అరెస్టు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మంగళవారం వెల్లడించారు. వరుసగా విచారణ డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ ఫోన్‌కాల్ డేటా, విచారణలో అతను చెప్పిన అంశాల ఆధారంగా పలువురు సినీ ప్రముఖులకు ఎక్సైజ్ సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారిని ఈ నెల 19వ తేదీ నుంచి సిట్ విచారించనుంది. 19న పూరీ జగన్నాథ్, 20న ఛార్మి, 21న ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యాం కె.నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందు సిట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఛార్మి విదేశాల్లోనే.. రెండో రోజున విచారణకు హాజరుకావాల్సిన ఛార్మి విదేశాల్లోనే ఉన్నట్లు సమాచారం. ఐపీసీ నిబంధనల ప్రకారం ఎవరైనా మహిళను విచారించాలంటే... ఆమె కోరిన లేదా ఆమెకు అనుకూలంగా ఉన్న చోటనే విచారించాలి. ఈ లెక్కన సిట్ బృందం ఎలా విచారిస్తుందనే దానిపై స్పష్టత లేదు. ఇక నోటీసులు అందుకున్న మిగతా సినీ ప్రముఖులు కూడా సిట్ విచారణకు హాజరుకావాలా, వద్దా.. హాజరైతే ఎలా వ్యవహరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. ఐపీసీ నిబంధనల ప్రకారం.. తమ న్యాయవాదితో కలసి విచారణకు హాజరుకావచ్చు. దీంతో వారంతా మంచి న్యాయవాదులను వెతికిపట్టుకుని సలహా తీసుకుంటున్నారని, వారితో కలసి విచారణకు హాజరవుతారని సమాచారం. ముమైత్‌కు మినహాయింపు! బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో సిట్ ఎదుట హాజరు నుంచి ముమైత్‌ఖాన్‌కు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ నెల 21 ఆమె సిట్ ముందు విచారణకు రావాలి. కానీ ఆమె పుణేలో జరుగుతున్న బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం నిబంధనల ప్రకారం.. 70 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ ఆమె విచారణకు హాజరుకాకుంటే సిట్ అధికారులు బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లి అరెస్టు చేయవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఆమెకు విచారణ నుంచి మినహాయింపు లభించినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఆమె స్థిర నివాసాన్ని గుర్తించి నోటీసులివ్వటంలో ఎౖMð్సజ్ అధికారులు విఫలమయ్యారని కూడా అంటున్నారు. -
చార్మీని పెళ్లాడడానికి రెడీ...
నటి చార్మీని పెళ్లాడడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏంటీ నమ్మబుద్ధికా వడం లేదా? అయితే ఇది చదవండి. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న త్రిష గురువారం 33వ ఏటలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో నటి చార్మీ కూడా ఉంది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిష. త్వరగా తిరిగి రా.. పార్టీ చేసుకుందాం. అలాగే నేను చేసిన పెళ్లి ప్రతిపాదనను ఈ ఏడాదైనా పరిగణనలోకి తీసుకో..’ అంటూ ట్విటర్లో చార్మీ ట్వీట్ చేసింది. త్రిష స్పందిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇష్టాన్ని వ్యక్తపరిచిన రోజే సమ్మతం తెలిపాను. లవ్ యూ’ అంటూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు వారి మధ్య సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని గుర్తు చేస్తున్నా.. నెటిజన్లు తమదైన ప్రచారాలతో దుమ్ముదులుపుతున్నారు. కాగా పౌర్ణమి చిత్రంలో త్రిష, చార్మి కలిసిన నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా మారారు. త్రిష తన తల్లి ఉమాకృష్ణన్ తో కలిసి సమ్మర్ వెకేషన్‌కు వెళ్లింది. అక్కడే తన పుట్టినరోజును స్నేహితుల సమక్షంలో జరుపుకుంది. -
ఏం రాశారా అని టెన్షన్!
- చార్మి ‘‘నేను చాలా సినిమాల్లో నటించా. కానీ, ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నా జీవితంలో మరచిపోలేనిది. హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రకథ, పాత్రలు, ఆదర్శంగా నిలిచే అంశాలను ఒక పుస్తకంగా తీసుకు రావడం నా అదృష్టం’’ అని హీరోయిన్ చార్మి అన్నారు. చార్మీ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చూసి ఇన్స్పైర్ అయిన కె.సర్వమంగళ గౌరి ‘జ్యోతిలక్ష్మి’ అంటూ పుస్తకం రాశారు. ఆ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి పుస్తకం ఆవిష్కరించి, చార్మికి అందించారు. చార్మి మాట్లాడుతూ, ‘‘ప్రీమియర్ షో చూసి, బయటకు వస్తున్నప్పుడు ఒకావిడ సమాజానికి ఉపయోగపడే చిత్రం ఇదని చెబుతోంది. ఆమె ఎవరా అని ఆరా తీస్తే సర్వమంగళ గౌరిగారని తెలిసింది. ఆవిడ ఈ చిత్రంపై పుస్తకం రాశారంటే ఏం రాశారా? అనే టెన్షన్ నాలో ఉంది’’ అని పేర్కొన్నారు. తనికెళ్ల మాట్లాడుతూ- ‘‘ఒక సినిమా మీద పరిశోధక గ్రంథం రాయడమంటే చార్మి, పూరీ ధన్యులయ్యారు’’ అన్నారు. సర్వమంగళ గౌరి మాట్లాడుతూ- ‘‘ఎన్నో సామాజిక అంశాలను ‘జ్యోతిలక్ష్మి’ గుర్తుకు తెచ్చింది. ఈ అంశాలు నన్ను ఇన్స్పైర్ చేయడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ పుస్తకం రాశా’’ అని తెలిపారు. హీరో సత్య, పూరీ తనయుడు ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
త్రిషతోనే నా పెళ్లి....
చెన్నై : త్రిష ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ మధ్య నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రేమ, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ...బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటి చార్మీ, నికీషా పటేల్‌తో కలిసి ఆమె స్నేహమంటే ఇదేరా అన్నంత జోష్‌లో తుళ్లిపోతూ మరోసారి సంచలనం సృష్టించింది. స్వేచ్ఛా విహంగంగా జీవించే ఈ ముగ్గురు 'రమ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం పొంగి పొర్లుతోంది. ఇటీవల ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ట్విట్టర్లో జరిపిన ముచ్చట్లు అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. వారు ముగ్గురు అదిరే దుస్తులు ధరించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెల్పీ ఫోటోలను నటి త్రిష తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను చూసిన నికీషా పటేల్ ...త్రిషను పొగడ్తలతో ముంచేస్తూ తన ట్విట్టర్లో పేర్కొంది. ఇక నటి ఛార్మీ అయితే త్రిషతోనే నా పెళ్లి, ఆమెతోనే డేటింగ్ చేస్తా అంటూ రెచ్చిపోయింది. ఇవన్నీ అభిమానుల్ని పిచ్చపిచ్చగా ఎంటర్ టెయిన్ చేస్తున్నాయి. -
ఏంటీ నచ్చిందా?
ఐదు రోజులుగా చార్మి తన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. రోజుకో ఫొటో చొప్పున ట్విట్టర్లో పెట్టి, అందరికీ కనువిందు చేశారు. ఇంతకీ ఈ ఫొటోల కథాకమామిషు అంటూ చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. కొత్తగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారామె. అసలే తెల్లని మేని ఛాయ.. పైగా తెలుపు రంగు దుస్తులు... చెప్పేదేముంది చార్మి తళతళలాడిపోయారు. సాగర తీరంలో తనకు నచ్చిన భంగిమల్లో రకరకాల ఫొటోలు దిగారు. ఐదు రోజులుగా ఒక్కో ఫొటోను బయటపెడుతూ, ‘ఏంటీ ఫొటో నచ్చిందా?’ అని కొంటెగా క్వొశ్నించారామె. ‘మీరు సూపరండి. పిచ్చెక్కించేశారు...’ అంటూ అభిమానులు పరమానందపడిపోతూ స్పందించారు. ఆ కాంప్లిమెంట్స్‌కి చార్మి కూడా తగని సంతోషపడుతూ, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. -
భయపెడుతూ.. కవ్విస్తూ...
‘మంత్ర’ చిత్రంలో ‘మాహా..మాహా...’అంటూ ఒక పక్క తన అందంతో కవ్విస్తూనే మరోవైపు భయపెట్టారు చార్మి. మళ్లీ ‘మంత్ర-2’తో ఆమె ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. గ్రీన్ మూవీస్ పతాకంపై పి.శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.వి.సతీశ్ దర్శకుడు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. స్క్రిప్ట్‌ను నమ్మి చార్మి ఈ చిత్రంలో నటించారు. ఆద్యంతం సాగే సస్పెన్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది’’ అని నిర్మాత తెలిపారు. చార్మికి మంచి పేరు తీసుకువచ్చే చిత్రమిదని, ఆమె అభినయం ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, ఛాయాగ్రహణం: తనికెళ్ల రాఘవేంద్ర, సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె.సురేశ్, సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి. -
స్పానిష్ స్టూడెంట్... చార్మి!
ఎందుకు నేర్చుకుంటున్నారో చెప్పలేదు కానీ, ప్రస్తుతం చార్మి స్పానిష్ మాట్లాడటం నేర్చుకునే పనిలో ఉన్నారు. జనరల్‌గా సినీ తారలు ఏమైనా నేర్చుకుంటే, అది కచ్చితంగా ఏదైనా సినిమా కోసమేనని ఊహాగానాలొస్తాయి. ఇప్పుడు స్టూడెంట్‌గా మారి, స్పానిష్ భాష ఎందుకు నేర్చుకుంటున్నారో చార్మి చెబితే, ఆ ఊహాగానాలకు తెరపడుతుంది. ఆ సంగతేమిటో చెప్పలేదు కానీ, స్పానిష్కు సంబంధించి మొదటి కోర్సు పూర్తి చేశాననీ, 90 శాతం స్కోర్ సాధించానని చార్మి తెలిపారు. -
మంత్ర 2తో కోలీవుడ్లోకి చార్మీ
నటి చార్మి మంత్ర 2 చిత్రంతో మరోసారి కోలీ వుడ్ ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తోంది. ఆమె నటించిన మంత్ర చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్ర 2తో మళ్లీ రానున్నారు. మంత్ర థ్రిల్లర్ కథా చిత్రం కాగా మంత్ర 2 దెయ్యం ఇతివృత్తంతో కూడిన హారర్ కథా చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు ఎస్ సతీష్ తెలిపారు. దెయ్యం చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ మంత్ర 2కు కూడా ఇక్కడ ప్రజాదరణ లభిస్తుందని ఆశించవచ్చు. చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన సతీష్ చిత్రం గురించి తెలుపుతూ ఆస్తి కోసం అన్న కుటుంబాన్ని తమ్ముడే అంతం చేస్తాడన్నారు. ఈ కుటుంబం నుంచి తప్పించుకున్న చార్మీలో ఆమె తండ్రి ఆత్మ ప్రవేశించి చార్మీని కాపాడడంతో పాటు తన కుటుంబాన్ని అంతం చేసిన తమ్ముడిపైప్రతీకారం తీసుకుందన్నదే చిత్ర కథాంశం అన్నారు.ఈ చిత్రాన్ని తమిళంలో ఎస్ ఎస్ ఎస్ ఫిలింస్ పతాకంపై ఎస్ సుందరం అనువదించి విడుదల చేయనున్నారు. -
అయామ్ వెరీ సారీ : చార్మి
గడచిన పదిహేను రోజులుగా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి జంట ఫిలింనగర్లో హాట్ టాపిక్. పూరి దర్శకత్వంలో చార్మి నటించి, ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘జ్యోతిలక్ష్మి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత నితిన్ హీరోగా పూరి ఓ చిత్రం చేయాల్సి ఉంది. కానీ, ఆ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు నితిన్, ఆ కథను వేరే హీరోతో తెరకెక్కిస్తున్నట్లు పూరి ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్నట్లుండి హీరో ఎందుకు మారినట్లు? ఈ మార్పుకు ప్రధాన కారణం చార్మి అని ఫిలింనగర్లో మాట్లాడుకుంటున్నారు. చిత్రనిర్మాణం విషయంలో చార్మి జోక్యం నచ్చకనే నితిన్ తప్పుకున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఆ ఊహాగానాలు నిజం కాదని, ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే ఆ ప్రాజెక్ట్ నుంచి నితిన్ వాళ్లు తప్పుకున్నారని చార్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మార్పుకు తాను ఏమాత్రం కారణం కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. కాగా, నితిన్వాళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటూ చార్మి పేర్కొనడం సంచలనం రేపింది. ఇది నిజమేనా? అన్న చర్చ మొదలైంది. దాంతో, చివరకు సోమవారం మధ్యాహ్నం చార్మి వివరణ ఇచ్చుకొని, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిందో నాకు తెలీదు! ‘‘వాస్తవానికి పూరి, నితిన్‌ల సినిమా ఎందుకు ఆగిందనే విషయం నాకూ స్పష్టంగా తెలియదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎవరో చెబితే, అది నిజమనుకుని ఇంటర్వ్యూలో చెప్పాను. నిజమో, కాదో చెక్ చేసుకోకుండా అలా చెప్పినందుకు, సిన్సియర్‌గా క్షమాపణ చెబుతున్నా’’ అని తన ట్విట్టర్లో చార్మి ట్వీట్ చేశారు. ఈ సంగతలా ఉంచితే.. తనలో మంచి నిర్మాత ఉందని పూరి, సి. కల్యాణ్ గుర్తించడం కొంతమంది పురుషాహంకారులు జీర్ణించుకోలేకపోతున్నారని చార్మి అంటున్నారు. ఈ మధ్యకాలంలో పూరి, చార్మి చాలా చనువుగా ఉంటున్నారని వస్తున్న గుసగుసలపై వివరణ ఇస్తూ, ‘‘పూరి, నేను మంచి స్నేహితులం. అంతకు మించి ఏమీ లేదు’’ అని అన్నారామె. ‘‘కలిసి సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువసార్లు కలుస్తుంటాం. అది వృత్తిలో భాగం. దాన్ని వక్రీకరించవద్దు’’ అని చార్మి పేర్కొన్నారు. ఎవరేమనుకున్నా, సినీ నిర్మాణ రంగంలో కొనసా గాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. హిందీ రంగానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘జ్యోతిలక్ష్మీ’ పునర్నిర్మాణ హక్కుల కోసం సంప్రతిస్తోందని ఆమె చెప్పారు. -
దేవుడు కూడా... తెలుగు సినిమా తీయలేడు!
- దర్శకుడు పూరి జగన్నాథ్ పూరి స్పీడు... చార్మి అంతకన్నా యమస్పీడు... వాళ్ళి కాంబినేషన్లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘జ్యోతి లక్ష్మీ’ కూడా పేరు నుంచి పాటల విజువల్స్ దాకా ప్రతి అంశంతో స్పీడుగా జనాన్ని ఆకర్షిస్తోంది. శుక్ర వారం విడుదలైన ఆ సినిమా గురించి పూరి, చార్మి ‘సాక్షి’ మీడియా గ్రూప్‌తో మాట్లాడారు. పూరి చెప్పిన కబుర్లు... * ‘‘ ‘ఇడియట్’లో హీరో పాత్ర చంటి, హీరోయిన్ను ‘ఒసేయ్’ అన్నాడని ఒకరు తిడితే, మరొకరు సరిగ్గా అలాంటి అబ్బాయి కోసమే వెతికి పెళ్ళి చేసుకున్నారు. ప్రేక్షకుల్లో ఒకరికి నచ్చింది, మరొకరికి నచ్చదు. అందరికీ నచ్చేలా ఆ దేవుడు కూడా తెలుగు సినిమా తీయలేడు.’’ * ‘‘వేశ్య అంటే సాటి ఆడవాళ్లకే ఇష్టం ఉండదు. మగవాళ్లు ఇష్టపడతారు. ఆడవాళ్లు మాత్రం అసహ్యించుకుంటారు. 45 ఏళ్ల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు వేశ్య కథతో ‘మిసెస్ పరాంకుశం’ నవల రాసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలాగే ఉన్నాయి.’’ * ‘‘ఈ సినిమాలో ‘ఆడవాళ్లను అర్థం చేసుకోకపోయినా ఫర్లేదు....గౌరవించండి చాలు’ అని నేను రాసిన డైలాగ్ చాలామందికి నచ్చింది. మగాళ్లలో చాలామంది ఆడవాళ్లను చిన్నచూపు చూస్తారు. నేనీ సినిమా తీయడం వెనక ఉన్న ఉద్దేశం ఒకటే ...మహిళలు ఏ వృత్తిలో ఉన్నా, వారిని అందరూ గౌరవించాలి. అంతే... బేసిగ్గా నేను ఫెమినిస్టును. ఆడవాళ్లను సాటి ఆడవాళ్లే గౌరవించాలి. అందుకే ఈసారి నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలను తీయాలనుకుంటున్నా.’’ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి... పక్కనున్న పోలీస్ స్టేషన్లో అప్పగించా! - చార్మి చార్మి చెప్పిన కబుర్లు... * ‘‘పూరి గారు ఈ కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. కానీ హీరోయిన్గా కాకుండానే నా మీద నిర్మాత అనే బాధ్యతా పెట్టారు. ‘జ్యోతిలక్ష్మీ’లో నేను నటించలేదు.. ప్రవర్తించానంతే.’’ * ‘‘ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి చెబుతాను. కొత్తగా కారు కొనుక్కొని హైదరాబాద్‌లో చాలా రద్దీలో ఉన్న ట్రాఫిక్‌లో వెళుతున్నాను. ఇంతలో ఒకతను వచ్చి కారును గుద్దాడు. సారీ చె ప్పి వెళ్లిపోకుండా, అనవసరంగా మాతో గొడవ పెట్టుకున్నాడు. కార్లో ఉన్న నన్ను చూసి హీరోయిన్స్ గురించి తప్పుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పగించాను. హీరోయిన్స్ అంటే గౌర వం లే ని వాళ్లు... తమ ఇంట్లోని ఆడ వాళ్లను కూడా గౌరవించ రని నా ఫీలింగ్.’’ -
పూరీ, చార్మీలతో చిట్ ఛాట్ Part- 2
-
పూరీ, చార్మీలతో చిట్ ఛాట్ Part- 1
-
జ్యోతిలక్ష్మీ-2 కూడా చేస్తా: పూరి జగన్నాథ్
‘‘ఈ టీమ్‌తో పనిచేశాక అప్పుడే ముసలివాళ్లం అయిపోతున్నాం అన్న భయం పోయింది. మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు 45 సంవత్సరాల క్రితం రాసిన ‘మిసెస్ పరాంకుశం’ కథను సినిమాగా తీద్దామని నేను దర్శకుడు కాకముందే అనుకున్నా. అప్పట్లో నా దగ్గర డబ్బుల్లేవ్. దాంతో దర్శకుడయ్యాక కథ తీసుకుంటానని మల్లాది గారి దగ్గర అన్నాను. చివరికి ఇప్పటికి కుదిరింది’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. చార్మి, సత్య ప్రధాన పాత్రల్లో సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చార్మి కౌర్ సమర్పణలో శ్వేతలానా, వరుణ్, తేజ, సీవీ రావు నిర్మించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. పూరి జగన్నాథ్ దర్శకుడు. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సంద ర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా చెయ్యాలంటే ఒక పవర్‌హౌస్ కావాలి. అందుకే చార్మీని తీసుకున్నా. మంచి ఎనర్జీతో ఈ పాత్ర చేసింది. త్వరలో ‘జ్యోతిలక్ష్మి-2’ చేయబోతున్నా’’ అని తెలిపారు. ‘‘ఇప్పటి వరకూ హీరోయిన్గా కెమెరా ముందుండి వర్క్ చేశాను. మొదటి సారి కెమెరా వెనక ఉండి ఈ సినిమాకు వర్క్ చేశాను. తెర వెనుక టెక్నీషియన్స్ కష్టం ఎంత ఉంటుందో ఈ చిత్రం నిర్మించడం ద్వారా నాకు అర్థమైంది. నా కెరీర్‌కు ఇది స్పెషల్ మూవీ’’ అని చార్మి అన్నారు. ఏడేళ్ల క్రితం పూరితో సినిమా చేద్దామనుకున్నాననీ, చివరికి ఈ చిత్రంతో నెరవేరిందని, ఈ నెల 12న చిత్రాన్ని విడుదల చేస్తామని సి. కల్యాణ్ చెప్పారు. ‘‘పూరీ అన్నయ్యతో నాకిది ఇరవైమూడవ సినిమా. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి. సునీల్ కశ్యప్ భవిష్యత్తులో చాలా మంచి మ్యూజిక్ డెరైక్టర్ అవుతాడు’’ అని గేయ రచయిత భాస్కరభట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత బీఏ రాజు, నటులు ఉత్తేజ్, సంపూర్ణేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఐ యామ్ హ్యాపీ
మొదట సందిగ్ధంలో పడ్డా, ఇప్పుడు నేను హ్యాపీ అంటోంది నటి ధన్సిక. ఇంతకు ఈమె ఏ విషయం గురించి మాట్లాడుతుందనేగా మీ ప్రశ్న. పేరాన్మై చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం తిరుందిడుసిసే సుధాస్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో నవ నటులు వీరవన్ స్టాలిన్, నారాయణ్, అంజెనా కీర్తి ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు శంకర్ శిష్యుడు నిమేష్ వర్షన్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి ధన్సిక తెలుపుతూ తిరుందిడు సిసే యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రం అని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పింది. అయితే మొదట చిత్రం చేద్దామా? వద్దా అన్న సందిగ్ధంలో పడ్డానని అంది. కారణం ఇందులోని పాత్రకు న్యాయం చేయగలనా? అన్న సందేహమేనని పేర్కొంది. అయితే ఇప్పుడు చాలా హ్యాపీ అని అంది. ఈ చిత్రంలో చార్మి అనే పాత్రలో నటించానని తెలిపింది. ఇది అత్యాచారానికి గురైన యువతి పాత్ర అని చెప్పింది. ఈ పాత్రలో తన నటనకు పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పింది. తనది చాలా బ్యాలెన్సింగా నటించాల్సిన పాత్ర అని ఏ మాత్రం అటూ ఇటూ అయినా దాన్ని స్వభావం మారిపోతుందని అంది. ఇది సమాజంపై చెడు ప్రభావం చూపే అంశాలపై కనువిప్పు కలిగించే కథాచిత్రం అని ముఖ్యంగా మద్యానికి బానిసలైన వ్యక్తులు అత్యాచారాలు లాంటి అంశాలను చర్చించే చిత్రం అని పేర్కొంది. సమాజానికి చక్కని సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్ర యూనిట్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని నటి ధన్సిక అంది. -
జ్యోతిలక్ష్మి వెండితెరపై వెలుగనుందా?
-
మే 17న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
పంకజ్ ఉధాస్ (గజల్ సింగర్) చార్మి (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. వీరికి ఈ సంవత్సరం కొంచెం ఒడుదొడుకులు ఉండవచ్చు. సైన్స్ చదువుకునేవారికి బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మందకొడిగా సాగినప్పటికీ, పనులు పూర్తవుతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశావహంగా ఉంటుంది. సినీరంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంది. లక్కీ నంబర్స్: 3,5,8, లక్కీ కలర్స్: ఎల్లో, బ్లూ, గ్రీన్, బ్లాక్, లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు; సూచన: గురువులను, పండితులను గౌరవించడం, వృద్ధాశ్రమాలలో అన్న దానం చేయటం, శనిజపం చేయించుకోవడం. - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
జ్యోతిలక్ష్మిగా వెలిగిపోతున్న ఛార్మి
-
ఆ షరతుతోనే ఈ సినిమా చేశా!
‘‘నేను నటించిన ‘మంత్ర’ సినిమా నా కెరీర్లోనే బెస్ట్ పిక్చర్‌గా నిలిచింది. నాకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ‘మంత్ర 2’ కథ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. కానీ కచ్చితంగా హిట్ సినిమా చేయాలనే షరతుతోనే అంగీకరించాను’’ అని చార్మి చెప్పారు. ఆమె ప్రధాన ప్రాతలో శ్రీనివాస నాయుడు చామకూరి సమర్పణలో గ్రీన్ మూవీస్ పతాకంపై పి. శౌరి రెడ్డి, వి. యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మంత్ర 2’. ఎస్. వి.సతీశ్ దర్శకుడు. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చార్మి తల్లి సుర్జీత్ కౌర్ పాటల సీడీలను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘మంత్ర’ సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక ఈ సినిమా చేయడానికి కొంచెం భయపడ్డా. కానీ చిత్రబృందం సహకారంతో చాలా బాగా తీయగలిగాను’’ అని చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని తానే విడుదల చేస్తున్నానని నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో చేతన్, రచయిత భాస్కర భట్ల, సహనిర్మాతలు భోనాల శ్రీకాంత్, రవితేజ, కె. సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మిసెస్ పరాంకుశమే ఈ జ్యోతిలక్ష్మి
‘‘ నాకు చాలా ఇష్టమైన స్క్రిప్టు ఇది. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు తన 19వ ఏట రాసిన ‘మిసెస్ పరాంకుశం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించా. కానీ ఈ ట్రెండ్‌కు తగ్గట్టు మార్పులూ చేర్పులూ చేశాను’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో చార్మి ప్రధాన పాత్రలో సి.కె ఎంటర్టైన్మెంట్స్, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ -‘‘కళ్లు మూసి తెరిచే లోపు ఈ సినిమా పూర్తయిపోయింది. నేను నిజజీవితంలో ఎలాగైతే ప్రవరిస్తానో, ఈ సినిమాలో అలాగే చేశాను. ఈ సినిమాలో నేను జీవించానంతే’’ అని తెలిపారు. ‘‘మహిళల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలకు అద్దం పట్టే సినిమా ఇది. పూరి గారు ఇప్పటిదాకా చేసిన సినిమాలకు చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని గేయ రచయిత భాస్కర భట్ల అన్నారు. ఈ నెల 17న చార్మి పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్‌ను లాంచ్ చేయనున్నామని, ఈ నెలాఖరులో పాటలను, జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు పీజీ విందా, బీఏరాజు తదితరులు పాల్గొన్నారు. -
రెండో సారి...
‘మహా.. మహా’ పాటతో ‘మంత్ర’ సినిమాలో ఎంతగా కవ్వించారో...ఆ సినిమాతో అంత భయపెట్టారు చార్మి. ఆమె కథానాయికగా ‘మంత్ర-2’ అనే చిత్రం రాబోతోంది. పి. శౌరిరెడ్డి, వి. యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వి. సతీశ్ దర్శకుడు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘‘మంత్ర’ చిత్రానికి ఇది సీక్వెల్ కాదు. హారర్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. మంత్ర సినిమాలో ‘మహా..మహా’ పాట కన్నా మంచి విజయం సాధిస్తుంది. స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకంతో చార్మి మాకీ అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మోహనకృష్ణ, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి, సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె. సురేశ్. -
ముంబైలో పుట్టినా.. హైదరాబాదీనే..!
పదమూడేళ్ల వయసులోనే ‘తెరకెక్కిన’ మిల్కీబ్యూటీ చార్మి. అప్పటి నుంచి అచ్చంగా తెలుగు నటిగా మారిపోయింది. సిల్వర్‌స్క్రీన్‌పై పుష్కరకాలం దాటిన ఈ నటి టాలీవుడ్ కెరీర్లో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించింది. తాను హైదరాబాద్ అమ్మాయినే అంటోన్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ తన అభిమాన సిటీ గురించి చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: ఎస్బీ నేను పంజాబీని అయినా, ముంబైలో పుట్టి పెరిగినా, హైదరాబాద్ అమ్మాయిగానే భావిస్తా. ఎందుకంటే నాకు నటిగా జన్మనిచ్చిన తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రం ఈ నగరమే. హైదరాబాద్ ఇప్పుడు ఇంత హైటెక్‌సిటీగా మారిపోయింది కాబట్టి ఈ మాట చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలోనే ఈ సిటీ తెగ నచ్చేసింది. ఇక్కడి జనాల జీవనశైలిలో కనిపించే వైవిధ్యం.. నాకు ఆశ్చర్యంతో పాటు ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. నేను వచ్చిన కొత్తలో సిటీలో ఇంత గ్రోత్ లేదు. జూబ్లీహిల్స్‌లో వెళ్తుంటే ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడైతేనా.. బాబోయ్ చెక్‌పోస్ట్ దాటాలంటే చాలు గగనమే. ఇక్కడే స్థిరనివాసం.. నార్త్ నుంచి వచ్చిన మిగిలిన హీరోయిన్లు వచ్చి వెళ్తుంటారేమో కాని, నేనైతే హైదరాబాద్‌పై మక్కువ పెంచుకుని.. ఇక్కడో ఇల్లు తప్పనిసరిగా కొని తీరాలని నిర్ణయించుకున్నా. బహుశా మాస్ సినిమా చేసే టైమ్‌లో అనుకుంటా.. నా సంపాదనతో మణికొండలో ఫ్లాట్ కొనుక్కున్నా. ఈ సిటీలో నా ఫేవరెట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని హెలియోస్ జిమ్‌లో వర్కవుట్స్, మాదాపూర్ ఇనార్బిట్‌మాల్‌లోని ఫ్యూజన్9 రెస్టారెంట్లో కూర్చుని ఫుడ్‌ని ఆస్వాదించడం ఇలా ఈ సిటీలో నాకున్న హాబీస్ లిస్ట్ పెద్దదే. ఇనార్బిట్ మాల్లో రెస్టారెంట్ నుంచి సిటీ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. ఆ ప్లేస్‌కు వీక్లీ ఒకసారైనా వెళ్లి ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. పండుగ కళ ఇష్టం... వినాయకచవితి, రంజాన్.. వంటి పండుగల టైమ్‌లో సిటీలో సందడి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. రోడ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఇంత ట్రెడిషనల్‌గా ఉంటూనే అల్ట్రా మోడ్రన్‌గా వెలిగిపోయే నైట్‌లైఫ్ జోష్ కూడా అంతే స్థాయిలో ఉండడం ఈ సిటీకి మాత్రమే సాధ్యం. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో చాలా మంది ఇక్కడే ఉన్నారు. అందుకే ముంబై వెళ్లినా ఎక్కువ రోజులు ఉండలేను. హోమ్‌సిక్ ఫీలై కొన్ని రోజులకే తిరిగొచ్చేస్తా. -
ఛార్మీ- జ్యోతిలక్ష్మీ టీజర్ విడుదల
-
చార్మి పాటకు రూ.3 కోట్లు
నటి చార్మి సింగిల్ సాంగ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపడంతో ఆమెకిప్పుడు అన్నీ అలాంటి అవకాశాలే తలుపు తడుతున్నాయి. ఆ మధ్య తెలుగులో ఎస్కో నా గుమ గుమా ఛాయ్ అంటూ కుర్రకారుకు కిరాక్ పుట్టించిన ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్ ఛాన్స్‌లు రావడం మొదలెట్టాయి. కథానాయకిగా అవకాశాలు కనుమరుగవ్వడంతో సింగిల్ సాంగ్ అవకాశాలు బాగున్నాయనుకుని వాటి సంగతి చూసేస్తే పోలా అన్న నిర్ణయానికి వచ్చిన చార్మి ఇటీవల విక్రమ్ హీరోగా నటిస్తున్న పత్తు ఎండ్రత్తుకుళే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేశారు. గోలీసోడావంటి చిన్న చిత్రంతో పెద్ద విజయం సాధించిన దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో చార్మి సింగిల్ సాంగ్‌కు మాత్రమే ఖర్చు చేసిన డబ్బు మూడు కోట్లు అని కోలీవుడ్ వర్గాల సమాచారం. కోటి రూపాయల కంటే తక్కువ ఖర్చు అయ్యే గోలీసోడా తీసి సక్సెస్ సాధించిన విజయ్ మిల్టన్ తదుపరి చిత్రంలో ఒక్క సాంగ్‌కే మూడు కోట్లు ఖర్చు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఐ వంటి బ్రహ్మాండమైన చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఆ మాత్రం భారీతనం అవసరమేనంటున్నారు పత్తు ఎండ్రత్తుకుళే చిత్ర వర్గాలు. ఏదేమైనా ఇలాంటి విషయాలతో నటి చార్మి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈ చర్చ ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందో, లేదో? చూద్దాం. ఈ చిత్రంలో కథానాయకిగా చెన్నై చిన్నది సమంత నటిస్తున్నారు. -
ఔను.. అది నిజమే!
చార్మి ఎంత మంచి నటో, అంత మంచి డాన్సర్ కూడా. ఆమె ఎంత బాగా డాన్స్ చేస్తుందో చెప్పడానికి ఓ ఉదాహరణ ‘డమరుకం'లోని ‘ఏస్కో నా గుమా గుమా ఛాయ్...’ పాట. ప్రస్తుతం చార్మి ఆ తరహా మాస్ మసాలా సాంగ్ చేస్తున్నారనీ, ఇది తమిళ స్టయిల్ డాన్స్ అని ఓ వార్త ప్రచారంలో ఉంది. ‘ఔను.. ఆ వార్త నిజమే’ అని చార్మి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తమిళ చిత్రం ‘పత్తు ఎణ్రదుకుళ్ల’ కోసం ఆ చిత్రకథానాయకుడు విక్రమ్‌తో కలిసి చార్మి ఈ పాటకు కాలు కదుపుతున్నారు. తొమ్మిది నిమిషాల నిడివితో సాగే ఈ పాట చిత్రీకరణ గురువారం చెన్నైలో మొదలైంది. దీనికోసం భారీ సెట్ వేశారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగులో ప్రస్తుతం ‘మంత్ర 2’ చిత్రంలో నటిస్తున్న చార్మి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మి' చిత్రం చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె బాగా సన్నబడ్డారు కూడా. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మార్చి ప్రథమార్ధంలో షూటింగ్ షురూ కానుంది. -
చార్మి సమర్పణలో...
గత కొన్ని నెలలుగా చార్మి కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తున్నారు. ఇదంతా బరువు తగ్గడానికే. ఏ హీరో ,హీరోయిన్ అయినా ఇలా బరువు తగ్గితే కచ్చితంగా ఏదైనా పాత్ర కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చార్మి బరువు తగ్గింది ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం కోసం. ఈ మధ్య ‘టెంపర్’ ఆడియో వేడుకలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మని చూసి, చక్కనమ్మ చిక్కినా అందమే అనుకున్నారు. ఈ నెల 20న జ్యోతిలక్ష్మి పాత్రలోకి చార్మి ఒదిగిపోనున్నారు. ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? పూరి జగన్నాథ్. 20న ఈ షూటింగ్ ప్రారంభించి, నిర్విరామంగా జరుపుతామనీ, ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అని పూరీ తెలిపారు. ఈ చిత్రంలో నటించడంతో పాటు సమర్పకురాలిగా కూడా చార్మి వ్యవహరించనుండటం విశేషం. శ్వేతలానా, వరుణ్-తేజ, సీవీ రావు నిర్మించనున్న ఈ చిత్రంలో సత్య, వంశీ కీలక పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: పీజీ విందా. -
ఆ సినిమాలకు నేను దూరం: త్రిష
ప్రేక్షకుల్నిఅస్సలు భయపెట్టనంటోంది హీరోయిన్ త్రిష. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ చెన్నై చిన్నది.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు దాటినా ఇంతవరకు హారర్ చిత్రాలు చేయకపోవటం గమనార్హం. త్రిష తన కెరీర్లో దాదాపు 50 సినిమాల్లో నటించినా.. ఏ చిత్రంలోనూ ఆమె ప్రేక్షకుల్ని భయపెట్టే పాత్రలు పోషించలేదు. అయితే అటువంటి కథలు తనకు చాలానే వచ్చాయని, అయితే ఇష్టం లేని పాత్రలు చేయనని త్రిష నిర్మొహమాటంగా చెప్పేసింది. కాగా తనతో పాటు కెరీర్ ప్రారంభించిన... మిగతా హీరోయిన్లు అనుష్క, చార్మి, ప్రియమణి, అంజలి, రాయ్‌లక్ష్మి ఇప్పటికే హారర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే విభిన్న పాత్రల్లో కనిపించిన త్రిష మాత్రం తాను ఎప్పటికీ హారర్ చిత్రాలు చేయనని స్పష్టం చేసింది. ప్రస్తుతం త్రిష 'లయన్' చిత్రంలో బాలకృష్ణ సరసన నటిస్తోంది. -
జ్యోతిలక్ష్మి కోసం కసరత్తులు
ఒకప్పుడు నవలాధార చిత్రాలు విరివిగా వచ్చేవి. అప్పట్లో అదొక ట్రెండ్. ఇప్పుడా పరిస్థితి లేదు. కానీ, పూరి జగన్నాథ్ మాత్రం త్వరలో ఓ నవలాధార చిత్రం చేయనున్నారు. ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఆధారంగా ‘జ్యోతిలక్ష్మి’ పేరుతో ఆ సినిమా తెరకెక్కనుంది. టైటిల్ రోల్‌ను చార్మి పోషిస్తున్నారు. జ్యోతిలక్ష్మిగా కనబడడం కోసం చార్మి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. ఆ విశేషాలను చార్మి వివరిస్తూ -‘‘పూరీ బాలీవుడ్లో రూపొందించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాలో నేనూ నటించాను. అమితాబ్‌తో నటించే అదృష్టం ఆ సినిమాతో నాకు కలిగించింది. ఆ సినిమా టైమ్‌లో ‘నువ్వు రెండు వారాల్లో పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా కనబడాలి’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టే రెండువారాల్లో పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా తయారయ్యాను. తాజాగా ‘జ్యోతిలక్ష్మి’ కథ గురించి చెప్పారు. ‘నువ్వే కథానాయిక’ అనగానే నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఈ సినిమా కోసం నా పాత స్టిల్స్ కొన్ని నాకు చూపించారు. ‘ఇలా మారాలి’ అని చెప్పి చిన్న ఎన్టీఆర్ చిత్ర షూటింగ్‌కి గోవా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన చెప్పినట్లు మారే ప్రయత్నంలో ఉన్నాను. క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తున్నాను. బెల్లీ డాన్స్, క్లబ్ డాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. అంతేకాదు, మూడు నెలలుగా జట్టు కూడా కత్తిరించుకోలేదు. పొడవాటి కురులతో భారతీయ స్త్రీలా కనిపించాలనేదే నా తాపత్రయం’’ అని చెప్పుకొచ్చారు. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా గురించి చెబుతూ -‘‘టైటిల్ విన్న ఎవరైనా ఇది ప్రముఖ నృత్యాతార జ్యోతిలక్ష్మిగారి జీవిత కథ అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. ఇది ఆమె కథ కాదు. ఎవర్నీ అనుకరించి, అనుసరించి చేస్తున్న సినిమా కాదు ఇది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్’’ అని తెలిపారు చార్మి. -
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోజ్యోతిలక్ష్మిగా...
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కథానాయికా ప్రాధాన్య చిత్రం చేయాలన్న చార్మి కల త్వరలో నెరవేరనుంది. ‘జ్యోతిలక్ష్మి’ పేరుతో చార్మి ప్రధాన పాత్రలో పూరి త్వరలో ఓ సినిమా డెరైక్ట్ చేయబోతున్నారు. 2015లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఒక తరాన్ని తన శృంగార నృత్యాలతో ఉర్రూతలూగించిన నటి జ్యోతిలక్ష్మి జీవిత కథతో ఈ సినిమా రూపొందనుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పూరి దగ్గర ప్రస్తావిస్తే -‘‘అస్సలు కాదు. జ్యోతిలక్ష్మిగారికీ దీనికీ ఏమాత్రం సంబంధం లేదు. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా నేనీ సినిమా చేయబోతున్నా. అసలు నా తొలి చిత్రంగా దీన్ని చేయాలనుకున్నా. ఇన్నేల్లకు కుదిరింది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘రోమియో’ చిత్రానికి సంగీతం సమకూర్చిన సునీల్ కశ్యప్ ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.. -
విక్రమ్‌తో ఐటమ్ సాంగ్
సియాన్ విక్రమ్‌తో ప్రత్యేక గీతానికి రెడీ అవుతోంది చార్మి. ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. ఆ మధ్య టాలీవుడ్లో రగడ చిత్రంలో ఏస్కో...నా ఘుమ ఘుమ ఛాయ్...ఛాయ్ అంటూ అదిరే అందాలతో దుమ్ము లేపారు. అయితే కోలీవుడ్‌లో ఐటమ్‌సాంగ్ చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో చార్మి అతిథి పాత్రలకు, ఐటమ్‌సాంగ్స్ ఎడాపెడా ఒప్పేసుకుంటోంది. ఐ చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం 10 ఎన్రదు కుళ్ల. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఒక అదిరిపోయే ప్రత్యేక గీతం ఉందట. ఇది సాధారణ సాంగ్ కాదట. తొమ్మిది నిమిషాల నిడివితో సాగే ఈ పాటలో చార్మిని నటించమన్నారన్నది తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక గీతం కోసం పూణేలో రెండున్నర కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారట. ఈ నెల 20 నుంచి ఈ సెట్లో విక్రమ్, చార్మిలతో ఈ పాటను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందని తెలిసింది. మొత్తం మీద చాలా కాలం తరువాత కోలీవుడ్ అభిమానులు చార్మీ అందాలను తిలకించనున్నారన్నమాట. -
కొత్తవాళ్లు రావాలి : పూరి జగన్నాథ్
‘‘ఈ చిత్ర నిర్మాతలు నాకు మంచి మిత్రులు. మంచి చిత్రాలు నిర్మించాలనే సదాశయంతో వచ్చారు. ప్రచార చిత్రాలు చూస్తుంటే దర్శకుడికి మంచి ప్రతిభ ఉన్నట్లనిపిస్తోంది. చిత్రపరిశ్రమకు కొత్తవాళ్లు రావాలి. యువతరంతో నా సంస్థలో సినిమాలు నిర్మించాలనుకుంటున్నా’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. శివ గణేశ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ ఎంటర్టైన్మెంట్స్, మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కాయ్ రాజా కాయ్’. రామ్ ఖన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య ముఖ్య తారలు. భాస్కర్, సతీశ్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని పూరి జగన్నాథ్ ఆవిష్కరించి ఎస్వీ కృష్ణారెడ్డికి అందజేశారు. ముగ్గురు కుర్రాళ్ల మధ్య సాగే కథ ఇదని మారుతి చెప్పారు. కాయ్ రాజా కాయ్ ఆట ఆడిన యువకుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్రకథ అని దర్శకుడు తెలిపారు. మంచి చిత్రం నిర్మించామని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో హీరోయిన్ చార్మి, నిర్మాతలు అచ్చిరెడ్డి, సి. కల్యాణ్, హీరోలు సందీప్ కిషన్, సంపూర్ణేశ్ బాబు, రచయిత, దర్శకుడు డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్నాళ్లకు కుదిరింది!
‘‘దాదాపు ఏడేళ్ల క్రితం చేసిన ‘మంత్ర’ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. మళ్లీ అలాంటి సినిమా చేయమని చాలామంది ఎప్పట్నుంచో అడుగుతున్నారు. ‘మంత్ర 2’తో ఇన్నాళ్లకు అది కుదిరింది’’ అని చార్మి చెప్పారు. కె.ఎ. రవికుమార్‌రెడ్డి సమర్పణలో ఎస్.వి. సతీష్ దర్శకత్వంలో వి. యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘మంత్ర 2’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘చార్మీ అందించిన సహకారం మరువలేనిది. 20రోజుల పాటు ఏకధాటిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు షూటింగ్ చేసేవారామె. సంగీతదర్శకుడు చక్రి ఈ తరహా సస్పెన్స్, థ్రిల్లర్ చేయడం ఇదే మొదటిసారి’’ అని చెప్పారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ తరహా చిత్రం రాలేదని దర్శకుడు పేర్కొన్నారు. -
బాపుగారికి ఓసారి లవ్‌లెటర్ రాశా!
బాపు గారిని నేను మొట్టమొదటిసారి కలిసింది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. మా అమ్మా నాన్నలతో నేను చెన్నై వెళుతున్నాను. బాపుగారు కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. ఆయనను చూడగానే, దగ్గరికెళ్లి పలకరించాను. కట్ చేస్తే.. పది రోజుల తర్వాత బాపుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘బాపుగారు ‘సుందరకాండ’ సినిమా తీయనున్నారు. మిమ్మల్నే హీరోయిన్గా అనుకుంటున్నారు’’ అన్నది ఆ ఫోన్ సారాంశం. ఒక రకమైన ఉద్వేగంతో బాపుగారిని కలిశాను. ఆ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. షూటింగ్ మొదలుపెట్టాక అతి తక్కువ సమయంలోనే బాపు గారికి దగ్గరయ్యాను. మేమిద్దరం మంచి స్నేహితుల్లా మెలిగేవాళ్లం. ఆ చిత్రం షూటింగ్ బొబ్బిలిలో జరిగినప్పుడు, మా అందరికీ ఓ హోటల్లో బస ఏర్పాటు చేశారు. బాపు గారు మాత్రం మరో హోటల్లో బస చేశారు. ఆ హోటల్ విషయంలో ఆయనకేదో సెంటిమెంట్ ఉందట. బాపుగారు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే అంటూ, నాకు కూడా ఆ హోటల్లో ఓ గది బుక్ చేయమన్నాను. కానీ, ఆ హోటల్ అంత బాగుండదని చెప్పారు. అయినా ఫరవాలేదంటూ.. నేనూ ఆ హోటల్‌కు మారిపోయాను. బాపుగారి ఎదురు గదిలో దిగాను. అప్పుడాయన నా దగ్గరకు వచ్చి ‘నా కోసం నువ్వీ హోటల్‌కు వచ్చావ్ కదా!’ అంటూ, ‘ఒక్క అరగంట వెయిట్ చెయ్’ అని నా గది మొత్తం శుభ్రం చేయించారు. కొత్త దుప్పట్లు, దిండు గలీబులు వేయించారు. బాత్రూమ్ శుభ్రం చేయించారు. కొత్త బక్కెట్, మగ్ తెప్పించారు. రూమ్ స్ప్రేతో ఆ గదంతా ఘుమఘుమలాడేలా చేశారు. అక్కడ దోమలు ఎక్కువగా ఉండటంతో నా మంచానికి దోమ తెర ఫిక్స్ చేయించారు. ఇదంతా బాపు గారి గొప్పతనానికి నిదర్శనం. బాపు గారు నన్ను ‘చామ్’ అని పిలిచేవారు. ఆ పిలుపు నాకు కొత్తగా ఉండేది. ‘మీరేమో చాలా ట్రెడిషనల్... కానీ, నన్ను వెస్ట్రన్ స్టయిల్లో పిలుస్తున్నారు. కారణం ఏంటి?’ అని అడిగితే... నవ్వేసి ఊరుకునేవారు. ఆయన అలా పిలవడం నాకు చాలా హాయిగా ఉండేది. సుందరకాండ’ షూటింగ్ సమయంలో వర్షాకాలం. ఆ వాతావరణం పడక నాకు విపరీతంంగా జ్వరం వచ్చింది. దాంతో పాటు దగ్గు కూడా! మరునాడు షూటింగ్‌కు రాలేనని అందరూ అనుకున్నారు. ఆ రోజు షూటింగ్ పూర్తి చేసి, నేను రూమ్‌కు వచ్చి దుప్పటి ముసుగుపెట్టి పడుకున్నాను. కొంతసేపటికి మా తలుపు ఎవరో తట్టారు. నా అసిస్టెంట్ తీస్తే, బాపు గారు ఉన్నారు. ‘లోపలికి రావచ్చా..’ అని అడిగారు. ‘రండి సార్’ అన్నాను. ఆయన అసిస్టెంట్ అనుకుంటా.. ఓ క్యారేజీ తీసుకొచ్చాడు. నా రూమ్‌లో కూర్చుని బాపు గారూ భోజనం చేస్తారేమో అనుకున్నాను. ఆయన క్యారేజ్ ఓపెన్ చేసి, ప్లేటులో అన్నం వడ్డించి, ఆవకాయ పచ్చడి వేసి కలపడం మొదలుపెట్టారు. నాకు ఆవకాయ అన్నం అంటే మహా ఇష్టం. మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లం అని చెప్పాను కదా! అందుకని నా ఆహారపుటలవాట్లు బాపుగారికి బాగా తెలుసు. ఆయన అన్నం కలుపుతుంటే ‘ఎవరి కోసం..’ అనడిగాను. ‘నీ కోసమే’ అన్నారు. ‘నా కోసమే అయితే సరిగ్గా కలపండి’ అన్నాను నవ్వుతూ. అన్నం కలిపి, నాకు తినిపించారు. ‘బాగా కలిపారు’ అని తిన్నాను. మరునాడు జ్వరం హుష్‌కాకి. షూటింగ్‌కు వెళ్లిపోయాను. ఆ చిత్రం షూటింగ్ నాకు మిగిల్చిన అనుభూతి అంతా ఇంతా కాదు. సినిమా విడుదలై, మేము ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా బాపు గారితో సినిమా చేశాననే సంతృప్తి మిగిలింది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ గొప్ప వ్యక్తికి దూరం అయ్యామనే ఫీలింగ్ కలిగింది. బాపు గారు మొబైల్ ఫోన్ వాడరు. ల్యాండ్ లైన్ మాత్రమే. ఇ-మెయిల్స్‌కు కూడా దూరం. అందుకే, నా ఫీలింగ్స్ అన్నీ ఎనిమిది పేజీ ఉత్తరంలా రాశా. అది ‘లవ్ లెటర్’ అనుకోండి.. వేరే ఏదైనా అనుకోండి. ‘సుందరకాండ’ సమయంలో మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు, గడిపిన క్షణాలు.. తద్వారా నేను పొందిన అనుభూతిని ఆ ఉత్తరంలో రాశాను. ఆ ఉత్తరంతో పాటు ‘కోనియాక్’ బాటిల్ పంపించాను. ఆయనకు ఆ మద్యం ఇష్టం. చెన్నయ్‌లో నా ఫ్రెండ్ ద్వారా ఆ లెటర్, బాటిల్ పంపించాను. ఆ ఉత్తరం చదివి, బాపు గారు నాకు ఫోన్ చేస్తారని ఎదురు చూసేదాన్ని. అటు నుంచి స్పందన రాకపోవడంతో నా అంతట నేనే ఫోన్ చేశాను. బాపు గారు తీశారు. ‘ఉత్తరం చదివారా’ అనడిగాను. దానికాయన... ‘నువ్వు ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పేస్తావ్. ‘సుందరకాండ’ పోయింది కదా! తిడుతూ రాశావేమోనని, ఆ ఉత్తరం చదవలేదు. దేవుడి దగ్గర పెట్టేశా’ అన్నారు. హాయిగా నవ్వేశాను. ‘ముందా ఉత్తరంలో ఏముందో చూడండి. మీ మీద ఉన్న అభిమానానికి అక్షరరూపమిచ్చా’ అన్నాను. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో బాపు గారిని కలిశాను. ‘నువ్వు రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గరే ఉంది’ అని చెప్పారు. ఐదారేళ్ల తర్వాత ఆ ఉత్తరం గురించి ఆయన ప్రస్తావించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రతి ఏడాదీ నా పుట్టినరోజు నాడు తప్పకుండా బాపు గారికి ఫోన్ చేస్తాను. ‘ఇవాళ నా బర్త్‌డే. మీకు గుర్తుండదని నాకు తెలుసు. అందుకే, నేనే ఫోన్ చేశాను. నన్ను ఆశీర్వదించండి’ అని అడిగి మరీ, ఆయన ఆశీస్సులు పొందేదాన్ని. ఇక ఆ అదృష్టం నాకు లేదు. అయితే, ఆయన ఎక్కడ ఉన్నా దీవిస్తారనే నమ్మకం ఉంది. బాపు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా... -
మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను!
బ్రతుకు మీద ప్రతి ఒక్కరికీ తీపి ఉంటుంది. అందుకే చావు గురించి అస్సలు ఆలోచించరు. ఆలోచించం కదా అని అమరజీవులం కాలేం కదా. అయితే, ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి, బ్రతుకు మీద మమకారం పెంచుకుంటాం. అయితే, ఒక్కోసారి స్వయంగా మరణం అంచుల వరకు వెళ్లే సంఘటనలు జరుగుతుంటాయి. చార్మీకి అలానే జరిగింది. వైజాగ్ వెళ్లడం కోసం ఫ్లయిట్ ఎక్కారామె. ఇంకాసేపటిలో క్షేమంగా ల్యాండ్ అవుతామని అనుకుంటుండగా... హఠాత్తుగా ఓ పేద్ద కుదుపు. చార్మీతో పాటు విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ కంగారుపడ్డారు. ఈ సంఘటన గురించి చార్మీ చెబుతూ -‘‘ఓ వంద అడుగులు అమాంతంగా ఫ్లయిట్ కిందకు వెళ్లినట్లనిపించింది. నా చేతిలో ఉన్న కప్‌లోంచి టీ పైకి ఎగరడం మాత్రమే కాదు.. మా ప్రమేయం లేకుండా మేమంతా ఓ ఎగురు ఎగిరి మా సీట్లలో కూలబడ్డాం. ఇక ఇదే చివరి రోజు అనుకున్నా. మరోసారి ఇంకా బలమైన కుదుపు. దాంతో ఇదే మనకు తుది శ్వాస అని ఫిక్స్ అయ్యాను. మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను. చివరకు నింగి నుంచి సురక్షితంగా నేలకు రాగలిగాను. ఇంకా నమ్మలేకపోతున్నా. ఏదేమైనా ఇది చాలా భయంకరమైన అనుభవం. ఈ సందర్భంగా నేను చెప్పేదేంటంటే... జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి.. పూర్తిగా ఆస్వాదిద్దాం’’ అన్నారు. -
ఈ ‘కేవ్’ ఓనర్ పూరీ జగన్నాథ్!
సీన్ నం.1 ఎనిమిది నెలల క్రితం... హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నం. 31లో ఓ పాత బిల్డింగ్‌ను కూలగొడుతున్నారు. మొత్తం కూల్చేసి పునాదులు తీయడానికే చాలా రోజులు పట్టింది. కట్ చేస్తే... సీన్ నం.2 2014 జూలై 31... ఇప్పుడా ప్లేస్‌లో "cave'వెలిసింది. ‘కేవ్’ అంటే గుహ. మామూలుగా గుహలుండేది కొండల్లో. మరి నగరం మధ్యలో ఈ ‘కేవ్’ ఏంటి? ఆ ‘కేవ్’కి "restricted'అంటూ గేట్ ఏంటి? ‘సాక్షి’కి మాత్రమే "unrestricted'ఎంట్రీ దొరకడమేంటి? ఎన్నెన్నో నిర్మాణ విశేషాలున్న ఈ ‘కేవ్’ గురించి ఓనర్ పూరీ జగన్నాథ్‌నే అడిగేస్తే పోలా..! మీ ఆఫీస్ అదిరింది... మీ టేస్ట్ కనబడుతోంది... పూరీజగన్నాథ్: థ్యాంక్యూ... ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్‌గోపాల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్, చార్మి, రానా వచ్చారు. వాళ్లకైతే పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ అయితే అప్పటికప్పుడు బోస్ కంపెనీ వాళ్ళ సింగిల్ టవర్ కాన్సెప్ట్ స్పీకర్ తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలాంటి ఆఫీస్‌లో ఇలాంటివే ఉండాలని చెప్పారు. రామూ గారు మా ఆఫీస్ స్టాఫ్‌ను పిలిచి ‘‘మీ ఆఫీస్ ఇంత టేస్ట్‌ఫుల్‌గా ఉంది కదా. మీరు రెగ్యులర్ జీన్స్, షర్ట్స్‌లో రావద్దు. బెర్ముడాలు, టీ షర్ట్స్ వేసుకు రండి’’ అని చెప్పారు. ఆఫీస్ చూడడం కోసం రోజూ చాలామంది వస్తున్నారు. ఇండియాలోనే ఇలాంటి సినిమా ఆఫీస్ లేదని అందరూ అంటున్నారు. సినిమాకి ఫస్ట్‌లుక్ ఇచ్చినట్లుగా, ఈ ఆఫీస్ ఫస్ట్‌లుక్ మీడియాలో ఫస్ట్ మీకే ఇస్తున్నా... అందుకే మిమ్మల్ని ఆహ్వానించా... అసలు ఇంత భారీ స్థాయిలో, అత్యాధునికంగా ఆఫీసు కట్టాలని ఎందుకనిపించింది? పూరీజగన్నాథ్: నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే మా కాలనీలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని పర్సనల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నా. రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం లాంటివి అక్కడే చేసేవాణ్ణి. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలీదు. ఒకసారి అనుమానమొచ్చి అడిగితే, ఏదో చెప్పి కవర్ చేశా. నాకంటూ పర్సనల్‌గా ఓ స్పేస్ ఉండాలనేది మొదట్నుంచీ నా కోరిక. మామూలుగా అందరికీ హాలీడే అంటే పనిచేయని రోజు. నాకు మాత్రం పనిచేస్తేనే హాలీడే. సో, మనం పనిచేసే ఏరియా హాలీడే మూడ్‌లో ఎగ్జైటింగ్‌గా ఉండాలి. అందుకే ఈ ఆఫీస్. అయినా నేను ఇంట్లో కన్నా ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటాను. అదొక రీజన్. సినిమా ఎంత స్పీడ్‌గా తీస్తారో ఆఫీస్ కూడా అంత స్పీడ్‌గా కట్టించేసినట్టున్నారు? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) అవును. కేవలం 8 నెలల్లో ఈ బిల్డింగ్ రెడీ అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంత ఫాస్ట్‌గా ఏ బిల్డింగూ రెడీ అయి ఉండదు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత గొప్పగా ఆఫీస్ కట్టుకోవడం ఎలా అనిపిస్తోంది? పూరీజగన్నాథ్: నా టైమ్ బావుందంతే! మధ్యలో మీ టైమ్ బాగోలేనట్టుంది? పూరీజగన్నాథ్: నేను నమ్మే కాన్సెప్ట్ ఎప్పుడూ ఒక్కటే... ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’. మంచి అయినా, చెడు అయినా ఏదీ శాశ్వతం కాదు. అంత పర్మినెంట్ కానప్పుడు ఇంత డబ్బు ఖర్చుపెట్టి, ఆఫీసు కట్టడం అవసరమా? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) మీరు ఇది బిల్డింగ్ అనుకుంటున్నారా..? కేవ్ అండీ బాబూ. ఇంతకు ముందు మీ పాత ఆఫీస్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉండేది కదా. దాన్నెందుకు తీసేశారు? పూరీజగన్నాథ్: అవును... అప్పట్లో ఆ ఆఫీస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అయితే దాన్ని టెంపరరీగానే కట్టా. ఒక దశలో అప్పుల పాలై ఆ ఆఫీసు అమ్మేశా. ‘బిజినెస్‌మేన్’ సినిమా తర్వాత పుంజుకుని ఈ ఆఫీసు కొని, ఇక్కడున్న పాత బిల్డింగ్ పడగొట్టి నా డ్రీమ్ ఆఫీస్ కట్టుకున్నా. ఇందులోనే నా రెసిడెన్స్ కూడా. మీ ఆఫీస్ ఎంత బాగుందో, మీ హోమ్ థియేటర్ అంతకన్నా బాగుంది... పూరీజగన్నాథ్: నేనెక్కువ గడిపేది హోమ్ థియేటర్లోనే. యాపిల్ ఐ ట్యూన్స్ ద్వారా ఏ సినిమా కావాల్సి వస్తే, ఆ సినిమా ఇక్కడ చూడొచ్చు. అంతా శాటిలైట్ టెక్నాలజీ. మన అరచేతిలో వరల్డ్ సినిమా మొత్తం ఉన్నట్టే. ఒక్క సినిమాలు అనేకాదు, పాటలు, డాక్యుమెంటరీలు, టీవీ షోలు... ఇలా అన్నీ చూడొచ్చు. జస్ట్ ఐ ప్యాడ్ ద్వారానే కూర్చున్న చోట నుంచి కదలకుండా ఇవన్నీ ఆపరేట్ చేయొచ్చు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ ఆపరేటింగ్ కూడా ఐ ప్యాడ్ ద్వారా చేసుకోవచ్చు. సినిమాలు చూడనప్పుడు దీన్ని డ్రాయింగ్ రూమ్‌లా కూడా వాడుకోవచ్చు. కర్టెన్స్ ఓపెన్ చేసుకుంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ముచ్చట్లాడుకోవచ్చు. ఒకసారి పైకి చూడండి. పైన సీలింగ్‌కి వాడిన వాల్‌పేపర్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. లండన్‌లో ఫేమస్ ప్లే అయిన ‘ఫ్యాంటమ్ ఆఫ్ ది ఓపెరా’ వాల్ పోస్టర్ అది. ఆ నాటకం గొప్పతనం ఏంటంటే - గత యాభై ఏళ్లుగా నిర్విరామంగా ప్రదర్శిస్తూనే ఉన్నా, ఇప్పటికీ అది హౌస్‌ఫుల్లే. ఇక్కడ వాడిన ఆడియో సిస్టమ్స్ కూడా చాలా అత్యాధునికం. హైదరాబాద్‌లో ఈ తరహా సిస్టమ్ ఇదే మొట్టమొదటిదట. ఈ ఆఫీస్ డిజైనింగ్ ఆలోచన అంతా మీదేనా? పూరీజగన్నాథ్: జయకిరణ్ అని హైదరాబాద్‌లో ఫేమస్ ఆర్కిటెక్ట్. నా స్నేహితుల ఇళ్లల్లో ఆయన వర్క్ చూసి, ఈ ప్రాజెక్ట్ అప్పగించా. ఆయనతో గంటలు గంటలు కూర్చొని నా పిచ్చి అంతా చెప్పా. దానికి తగ్గట్టే ఆయన డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ అంతా చాలా కొత్తగా ఉంది! పూరీజగన్నాథ్: నాకు రెగ్యులర్ ఫ్లోరింగ్ నచ్చదు. ఇలా పాలిపోయినట్టుగా, రస్టిక్‌గా ఉంటేనే ఇష్టం. క్యాలిఫోర్నియా స్లేట్ని కొన్ని గోడలకు వాడాం. స్పెయిన్ నుంచి ఆర్డర్ చేసిన ఉడెన్ ఫ్లోర్లా అనిపించే టైల్స్ మరికొన్ని చోట్ల వాడాం. అంతా రెడీ అయ్యాక ఫ్లోర్స్‌ను క్లీన్ చేయడానికి కొంతమంది వచ్చారు. ఆ టైమ్‌లో ఒకామె నాతో అన్న మాటలు విని నాకు నవ్వొచ్చింది. ‘‘ఏం సార్... ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఫ్లోరింగ్ మాత్రం సెకండ్ హ్యాండ్ కొన్నారేం’’ అందామె. ఆ డిజైనింగ్ అలా ఉంటుందని ఆమెకు తెలియదు కదా. ఇంతకూ మీ హోమ్ స్టూడియోకు ‘కేవ్’ అనే పేరు ఎందుకు పెట్టినట్టు? పూరీజగన్నాథ్: ప్రపంచం ఓ అడవి లాంటిది. అందులో నేనో జంతువును. నేను ఉండడానికి ఓ కేవ్ దొరికిందంతే. సరే... దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది? పూరీజగన్నాథ్: ఇప్పుడు అవసరమా! ముందు మంచి కాఫీ తాగండి. మా ఆఫీస్‌లో కాఫీ బార్ కూడా ఉంది. కేపర్చినో, ఎక్స్‌ప్రెసో... ఇలా ఏది కావాల్సి వస్తే అది తాగొచ్చు. - పులగం చిన్నారాయణ The Man Behind.... ఆర్కిటెక్ట్‌గా నా కెరీర్ 1998లో మొదలైంది. ఇప్పటివరకూ ఉన్న నా క్లయింట్స్ అందరిలోకెల్లా పూరీగారు డిఫరెంట్. ఫలానాది వాడుతున్నామంటే ‘ఓకే’ అనేసేవారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. పూరీ గారితో వర్క్ చేయడం వెరీ ఫన్. నా ఐడియాలను బాగా గౌరవించేవారు. ఆయన బిహేవియర్ ప్యాట్రన్‌ను దృష్టిలో పెట్టుకునే, ఈ ఆఫీస్ డిజైన్ చేశాం. ఆయనకు ప్రకృతి ఇష్టం కాబట్టి, చుట్టూ చెట్లు, మొక్కలు, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చాం. ఆయనకు బ్లాక్ అంటే ఇష్టం. ఆందుకే ఈ ఆఫీస్‌లో ఎక్కువ అంశాలు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఆయన చాలా ఇన్ఫార్మల్గా ఉంటారు. అందుకే ఆఫీస్‌ను కూడా ఇన్ఫార్మల్గా డిజైన్ చేశాం. 18,000 చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ కట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్‌కు ఉంచేశాం. ఫస్ట్ ఫ్లోర్ సినిమా ఆఫీస్. సెకండ్ ఫ్లోర్లో జగన్‌గారి పర్సనల్ రూమ్, లైబ్రరీ, ఫొటోసెషన్ రూమ్‌తో పాటు రెసిడెన్స్ ఉండేలా డిజైన్ చేశాం. ఫ్రంట్ ఎలివేషన్‌ను ఐరన్ గ్రిల్స్‌తో లైన్స్‌లా పెట్టడానికి కారణం కొత్తగా, స్టయిలిష్‌గా ఉంటుందనే. దానికి తోడు ఈయన తీసే సినిమాల వల్ల ఆఫీసు మీద అప్పుడప్పుడు రాళ్లు పడుతుంటాయి కదా... (నవ్వేస్తూ). ఇది యాక్చ్యువల్‌గా గ్లాస్ హౌస్. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. పగలు లైట్లు వాడనవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, లైటింగ్ ఎక్కువ అవుతోందని స్టిక్కరింగ్ చేయాల్సి వచ్చింది. టై మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఏసీని కూడా సోలార్ ఎనర్జీతో రన్ చేసుకోవచ్చు. - జయకిరణ్, ఆర్కిటెక్ట్ ఆఫీస్ ముందు 11 అడుగుల యూరోపియన్ స్టాచ్యూ... యూరోపియన్ స్టాచ్యూను రెప్లికా చేసి ఆఫీస్ ముందు పెడుతున్నాం. సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందా స్టాచ్యూ. అలాగే అమెరికా నుంచి 10 అడుగుల రెక్కలున్న పెద్ద ఫ్యాన్లు తెప్పిస్తున్నాం. ఆ కంపెనీ వాళ్లకు మన స్పెసిఫికేషన్స్ నచ్చితేనే ఆర్డర్ ఓకే చేస్తారు. ఆఫీస్‌లో సోఫాలన్నీ దాదాపుగా టచ్ ఆపరేటెడ్. ఆఫీస్‌లో ఇంటర్‌కామ్ ఉంది. అంతా ఇంటర్నెట్ ఆపరేటెడ్. ఫారిన్ నుంచి కూడా ఇంటర్‌కామ్‌లో మాట్లాడొచ్చు. ఆఫీస్‌లో ఎక్కడేం జరుగుతోందో... ఐ ప్యాడ్ ద్వారా ప్రపంచం ఏ మూలన ఉన్నా చూడొచ్చు. ఫారిన్ వెళ్లినప్పుడు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కొనాలి. ఫొటోలు: శివ మల్లాల -
ఫిట్నెస్
జూబ్లీహిల్స్‌లో ఉన్న హెలియోస్ ఫిట్నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ఫిట్‌నెఃస్‌పై పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని సినీ దర్శకుడు పి. సురేందర్‌రెడ్డి, నటి ఛార్మి, ఇషాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హెలియోస్ నిర్వాహకుడు, నగరంలోని తొలి సర్టిఫైడ్ ట్రైనర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతున్నా అవగాహనా లోపం కారణంగా జిమ్‌లలో మరణాలు, వ్యాయామ సమయంలో అనారోగ్యాలు సంభవిస్తున్నాయన్నారు. ఆహారపు అలవాట్లపై అవగాహన లేక యువత ప్రమాదంలో పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సాక్షి, సిటీప్లస్ -
‘క్వీన్’కి ఇంకా అడగనే లేదట!
హిందీలో ఘనవిజయం సాధించిన ఇటీవలి చిత్రాలు తెలుగులో వరుసగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వరుసలో ‘క్వీన్’ చిత్రం కూడా దక్షిణాది భాషల్లో రానుంది. అయితే, కంగనా రనౌత్‌కు ఒక్కసారిగా ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఆ ‘క్వీన్’ పాత్రను ఎవరు పోషిస్తారనే అంశం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. త్రిష, శ్రీయ, నయనతార... ఇలా పలువురి నటీమణుల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. లేటెస్ట్గా, ఈ పాత్ర పంజాబీ పిల్ల ఛార్మిని వరించిందంటూ కొన్ని పత్రికలు, మీడియా ప్రచారం చేశాయి. ‘‘నాయికా ప్రధానమైన సినిమాల్లో నటించడం, అలాంటి పాత్రలు పోషించడం ఛార్మికి కొట్టిన పిండి. ‘క్వీన్’లోని రాణి పాత్రలో అటు అందంగానూ, ఇటు అభినయ ప్రధానంగానూ కనిపించాలంటే ఆమే కరెక్ట్’’ అని ఈ రీమేక్ తీస్తున్న నిర్మాతలు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, అసలు సంగతి ఏమిటని ‘సాక్షి’ ఆరా తీస్తే, ఈ వార్తల్లో పస లేదని తేలింది. ‘‘ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో తెలీదు. ‘క్వీన్’ రీమేక్ కోసమైతే, ఇప్పటి దాకా ఛార్మిని ఎవరూ సంప్రతించలేదు’’ అని ఛార్మి సన్నిహిత వర్గాలు ‘సాక్షి’కి స్పష్టం చేశాయి. అయితే, ఒకటి మాత్రం నిజం. ఇంకా అడగలేదన్న మాటే కానీ, ‘క్వీన్’ లాంటి చక్కటి కథతో, పాత్రతో ఎవరైనా సంప్రతిస్తే నటించడానికి ఛార్మికి అభ్యంతరం ఉండదని వేరే చెప్పాలా? -
చార్మిని జనం గుర్తు పట్టలేదు!!
-
నాది ప్రేమ వివాహమే
ఏ తరహా పాత్రనైనా సమర్థవంతంగా పోషించగల సత్తా వున్న నటి ఛార్మి. టాలీవుడ్, బాలీవుడ్‌లలో నటిస్తూ విరామం అన్నది ఎరుగని ఈ భామ తమిళ ప్రేక్షకులకు పరిచయమున్న నటే. కోలీవుడ్‌లో కాదల్ అళువదిల్లై, ఆహా ఎత్తనై అళగు, లాడం తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన చార్మికి తాజాగా పెళ్లి ఆలోచనలు ముసురుకుంటున్నాయనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ప్రేమ, పెళ్లికి సంబంధించిన అంశాల గురించే అధికంగా ప్రస్తావిస్తున్నారు. అయితే తానెవరిని ప్రేమించడం లేదని అంటున్నారు. తాజాగా చార్మి ఏమంటున్నారంటే... నటిగా రీ ఎంట్రీ అనే పదానికే తన జీవితంలో తావు లేదు. చివరి శ్వాస ఉన్నంత వరకు సినిమాలోనే ఉంటాను. హీరోయిన్ల భావాలను సినిమా కతీతులైన వారికి అర్థం కావు. నేనిప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదు. అయినా నాది ప్రేమ వివాహమే అవుతుంది. అది సినిమాకు చెందిన వారితోనే జరుగుతుంది. నాకు ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందనేది చెప్పలేను. భవిష్యత్తులో అలాంటిదేదైనా జరిగినప్పుడు చెబుతాను. ప్రస్తుతం తెలుగులో మంత్ర-2 చిత్రం చేస్తున్నానని ఛార్మి అన్నారు. -
నాకు బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను!
ఈతరం కథానాయికల్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేసింది చార్మీనే! మిగతా తారలతో పోలిస్తే తను పూర్తి భిన్నంగా కనిపిస్తారు. ఓ పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క ఆత్మసంతృప్తినిచ్చే పాత్రల అన్వేషణలో ఉంటారామె. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘ప్రతిఘటన’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రం చేయడం మీకు కొత్త కానప్పటికీ, ‘ప్రతిఘటన’ మీకెలాంటి అనుభూతినిచ్చింది? ఇప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. శక్తిమంతమైన పాత్రికేయురాలి పాత్ర నాది. ఓ న్యూస్ చానల్ రిపోర్టర్ని అన్నమాట. ఇప్పటివరకు పాత్రికేయులు నన్ను తికమకపెట్టే ప్రశ్నలు అడిగేవారు. ఈ సినిమాలో నేనా పని చేశా. కొంచెం వెటకారంగా చికాకు పెట్టే ప్రశ్నలతో ఆడుకుంటానన్నమాట. భలే అనిపించింది. ఇది మీకు 50వ సినిమా కదా? అవును. ఇప్పటివరకూ 49 విడుదలలు చూశాను. అయినా ఏదో మొదటి సినిమా అప్పుడు ఉన్నంత టెన్షన్‌గా ఉంది. కడుపులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్లుగా ఉంది. ఈ ఒత్తిడి అంతా సినిమా ఏమవుతుందో ఏమోననే భయం వల్ల కాదు. ఎందుకంటే, ఇది తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో చేయడం ఎలా అనిపించింది? ఇలాంటి శక్తిమంతమైన చిత్రాలు తీయడానికి ఆయనే కరెక్ట్. తనకేం కావాలో మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు కాబట్టే, పాత్రను బాగా అర్థం చేసుకుని చేయడానికి కుదిరింది. సమాజంలో జరుగుతున్న పలు అన్యాయాల గురించి ఆయన ఈ సినిమాలో చర్చించిన తీరు అద్భుతం. ఈ సినిమా చేయడం ద్వారా మీరేం నేర్చుకున్నారు? ఇప్పటివరకు నేను ఓటు వేయలేదు. కానీ, ఈ ఎన్నికలకు తప్పకుండా ఓటేస్తా. ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది. ఈ సందర్భంగా అందర్నీ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. 12 ఏళ్లలో 50 సినిమాలు పూర్తి చేశారు. ఇక మీ తరువాతి లక్ష్యం 100 సినిమాలపైనేనా? ఆ లక్ష్యం లేదు. నేనేదీ ప్లాన్ చేసుకోను. జీవితం ఎలా తీసుకువెళితే అలా వెళ్లిపోతాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌కే పరిమితం అవుతున్నారెందుకని? ఆ తరహా సినిమాలే చేయాలనే లక్ష్యంతో చేయడంలేదు. నేనే సినిమా చేసినా కథని దష్టిలో పెట్టుకునే చేస్తున్నాను. నేను వింటున్న కథల్లో ఇవి బాగున్నాయనిపిస్తోంది. అందుకే చేస్తున్నాను. రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్గా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నా వయసు 25. ఇంకా బోల్డంత కెరీర్ ఉంది. కాబట్టి, నింపాదిగా సినిమాలు చేసుకోవచ్చు. కెరీర్ పరంగా వేగం తగ్గిందేమో అనిపిస్తోంది... నేను హీరోయిన్ అయ్యి పన్నెండళ్లవుతోంది. ఇన్నేళ్లూ ఎంతో బిజీగా సినిమాలు చేశాను. ఇప్పుడు రిలాక్స్ కావాలనిపిస్తోంది. ఒకప్పుడు డబ్బు కోసం సినిమాలు చేశాను. ఇప్పుడా అవసరంలేదు. ఆత్మసంతృప్త్తిని మిగిల్చే సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను తిరస్కరించిన సినిమాల జాబితా చాలానే ఉంది. పాతికేళ్లు వచ్చేశాయ్ కాబట్టి, పెళ్లి చేసుకోమని మీ ఇంట్లో తొందరపెట్టడంలేదా? ఎందుకు పెట్టరు? కొన్ని సంబంధాలు కూడా వస్తున్నాయి. పెళ్లి గురించి నేనింకా ఓ నిర్ణయానికి రాలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లేనా? ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లి కష్టమే. ఎందుకంటే, మనిషి ఎలాంటివాడో, మనస్తత్వం ఏంటో తెలియకుండా జీవితాన్ని పంచుకోలేను. అందుకే నాకు బాగా తెలిసిన వ్యక్తినే చేసుకుంటాను. ఎవరా వ్యక్తి? ఇంకా తారసపడలేదు. మీరిప్పుడు చేయనున్న చిత్రాలు? ‘మంత్ర 2’ ఓకే చేశాను. -
వారి కోసం
చేసేది చెప్పడం, చెప్పింది చేయడం చాలామంది విషయాల్లో జరగదు. ఏమిటి రాజకీయ పదాల గురించి అనుకుంటున్నారా? వాళ్ల గురించి మనకెందుకులెండి. మనం చక్కగా సినిమా కబుర్లు చెప్పుకుందాం. అలా నటి చార్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేమిటో చూసే ముందు పై వ్యాఖ్యలకు విరుద్ధ వ్యక్తిత్వం చార్మిది. తన మనసులోని మాటలను నిర్భయంగా వెల్లడిస్తారు. తమిళంలో కాదల్ అళవేదిల్లై ఆహా ఎత్తనై అళగు తదితర చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో పలు చిత్రాలు చేశారు. సింగిల్ సాంగ్ నుంచి సంచలనం కలిగించే ఎలాంటి పాత్రకైనా సిద్ధం అంటున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగులో ప్రతిఘటన అనే చిత్రంలో నటిస్తున్నానని, ఇది తన 50వ చిత్రం అని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో సామూహిక అత్యాచారానికి గుైరె , నాలుగున్నరేళ్లుగా కోమాలో పడి ఉన్న యువతి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇదన్నారు. తన చిత్రాలు వ్యాపార రీతిగా విజయం సాధించకపోతే తాను ఇన్ని చిత్రాల్లో నటించేదాన్ని కాదని చెప్పారు. అందాన్ని మాత్రమే నమ్ముకుంటే రెండు మూడేళ్లకు మించి ఇండస్ట్రీలో నిలబడటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతిభ చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు కాలక్షేపాన్నే కోరుకుంటున్నారన్నారు. తన అభిమానులను ఆనందింప చేయడం కోసం తానెలా నటించడానికైనా రెడీ అని చార్మి అంటున్నారు. -
ఇక నాకు దిష్టి తగలదు
కొంతమంది పైకి మోడ్రన్‌గా కనిపించినా లోలోపల మాత్రం చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. చార్మి అలాంటి అమ్మాయే. సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా దాదాపు మోడ్రన్ దుస్తుల్లో కనిపించే చార్మి పండగలు, పూజలకు మాత్రం సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరిస్తారు. ఇక, పూజలు, పునస్కారాల గురించి చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడు గుడికెళ్తారు.. లేనప్పుడు ఇంట్లోనే పూజలు చేసుకుంటారామె. దాదాపు మూడు నెలల క్రితం వికారాబాద్‌లోని శివుడి గుడికెళ్లారు చార్మి. ‘మంగళ’ సినిమాకి నంది అవార్డు వస్తే, గుడికొస్తానని మొక్కుకున్నారట. ఆ మొక్కుని తీర్చేసుకున్నారు. మరి.. ప్రస్తుతం ఏం మొక్కుకున్నారో ఏమో కానీ ఇంట్లో, అఖండ పూజ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా 48 గంటల పాటు నిరాటంకంగా ‘గురుగ్రంథ్‌సాహిబ్’ చదువుతామని చార్మి ట్విట్టర్లో పేర్కొన్నారు. గురుగ్రంథ్‌సాహిబ్ అంటే.. సిక్కుల పవిత్ర గ్రంథం. ఈ అఖండ పూజ మాత్రమే కాదు.. దిష్టి తగలకుండా చేతికి రెండు పూసల గాజులు ధరించారు చార్మి. తననెంతో అభిమానించే వ్యక్తి వీటిని బహుమతిగా ఇచ్చారని, ఇక దిష్టి తగిలే ప్రసక్తే లేదని చార్మి తెలిపారు. అంతగా అభిమానం కనబర్చిన ఆ వ్యక్తి ఆడా, మగా అనేది మాత్రం స్పష్టం చేయలేదు ఈ బ్యూటీ. -
అద్భుత సమాజం కోసం...
మనుషుల మధ్య తిరుగుతున్న మదమృగాలకు ఎలాంటి శిక్ష విధించాలి? స్త్రీ స్వేచ్ఛకు భంగం వాటిల్లని అద్భుత సమాజాన్ని ఎలా నిర్మించాలి? అనే సామాజిక స్పృహ కలిగిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కీరవాణి, యశ్వంత్‌నాగ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. విద్యార్థిని అనూషా ఆడియో సీడీని ఆవిష్కరించి, సుద్దాల అశోక్‌తేజకు అందించారు. స్ఫూర్తినిచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని, ఈ పాత్రకు చార్మీని ఎంచుకున్నందుకు తగిన న్యాయం చేసిందని భరద్వాజ్ చెప్పారు. అమ్మాయిలపై చేయివేస్తే అబ్బాయిల గుండె ఆగిపోవాల్సిందేనని చెప్పే సినిమా ఇదని చార్మీ అన్నారు. ప్రేక్షకులకు ఇది అగ్ని ప్రాసన లాంటి సినిమా అని సుద్దాల అశోక్‌తేజ అన్నారు. రేష్మ, రఘుబాబు, లక్ష్మీభూపాల్ కూడా మాట్లాడారు. -
ప్రతిఘటన మూవీ ఆడియో లాంచ్
-
రేడియో మిర్చి శ్రోతలతో చార్మీ
-
ఛార్మీకి కాలం కలసిరావట్లేదా?
-
మనుషులు మారితేనే...
చాలా విరామం తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి జర్నలిస్ట్‌గా లీడ్‌రోల్ చేస్తున్నారు. రేష్మ, తనికెళ్ల భరణి, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘ఒరిస్సాలో జరిగిన రేప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెబుతూ, మనుషులు మారితేనే సమాజం, నాయకులు కూడా మారతారని ఇందులో చూపిస్తున్నాం. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని తెలిపారు. బాధ్యతాయుతమైన చిత్రంలో నటించినందుకు రేష్మ సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి-యశ్వంత్ నాగ్. -
ప్రతిఘటన మూవీ స్టిల్స్
-
మహిళా జర్నలిస్ట్ ‘ప్రతిఘటన’
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతమే ప్రధానాంశంగా, చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ -‘‘స్త్రీకి రక్షణలేని నేటి సమాజం స్థితి గతులకూ, నేటి రాజకీయ పరిస్థితులకు అద్ధం పట్టే సినిమా ఇది. ఇందులో మహిళా జర్నలిస్ట్‌గా చార్మి నటిస్తుండగా, అత్యాచార బాధితురాలి పాత్రను రేష్మ పోషిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి. -
తారల చిందుకు కాసుల వర్షం
గతంలో పండుగలు, ఇతర శుభకార్యాల్లో విందులు, వినోదాలు జరుపుకునేవారు. ఇప్పుడు సరదాలు, జల్సాలు, సంతోషాలకు ప్రత్యేక రోజేదైనా ఉందంటే అది డిసెంబర్ 31. కాస్మోపాలిటిక్ నగరాల్లో ధనవంతులకు, ధనం సంపాదించుకునే వారికి ఆ రోజు జాయ్‌ఫుల్ డేగా మారింది. ఆ రోజు రాత్రి నక్షత్ర హోటళ్లు, ఫామ్ హౌస్‌లు తారల బృందాలతో సం దడి నెలకొంటుంది. ఒక్క సినిమాకు లభించే పారితోషికం ఒక్కరోజే, అదీ కొన్ని గంటలు, కొన్ని నిమిషాలకే లభిస్తుండడంతో స్టార్ హీరోయిన్లు కూడా కాలుకదపడానికి సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా వంటి వాళ్లు కూడా చెన్నైలో స్టెప్స్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఇతర హీరోయిన్లు ఈ తరహా పార్టీలకు ఒక స్టార్ హోటల్ లో ఏడు నిమిషాల డ్యాన్స్‌కు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటుండగా టాలీవుడ్లో ఐటమ్ సాంగ్‌లకు కూడా వెనుకాడని నటి ఛార్మి నగరంలోని ఒక నక్షత్ర హోటల్ లో డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈమెకు రూ.18 లక్షలు పారితోషికం చెల్లించడానికి ఆ హోటల్ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. నటి శ్వేతా బసు రూ.7 లక్షల పారితోషికంతో మరో స్టార్ హోటల్లో చిందెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. గిండి సమీపంలోని ఒక హోటల్లో నటి స్నేహ, లక్ష్మీరాయ్, అనూయ తదితర తారలతోపాటు నటుడు శింబు, ఆర్య, ప్రసన్న, సంతానం కూడా సందడి చేయనున్నారు. ప్రముఖ నటీమణులు తమన్న, కాజల్ అగర్వాల్, అనుష్క, హన్సిక సమంతను కూడా ఆడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరు అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి ఏడాది డిసెంబర్ 31 హీరోయిన్లకు విందుతోపాటు గల్లా పెట్టెలు కూడా నిండనున్నాయన్నమాట. -
ఆచితూచి అడుగులు
చార్మి అందగత్తె. నో డౌట్. మంచి నటి. నో డౌట్. ప్రతిభగల అనువాద కళాకారిణి నో డౌట్. ఈ తరం కథానాయికల్లో లేని చాలా క్వాలిటీలు చార్మి సొంతం. హీరోయిన్గా కెరీర్ ఆరంభించి పదకొండేళ్లు నిండినా, చార్మి ఇంకా బిజీగానే ఉన్నారంటే కారణం ఆమెలోని క్వాలిటీలే. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడం తేలికైన విషయం కాదు. సినిమా భారాన్నంతా భుజాలపై మోయాల్సిన పరిస్థితి. కానీ చార్మి తన యాక్టింగ్‌తో విరివిగా స్త్రీ ప్రాధాన్యతా చిత్రాల్లో నటిస్తూ శభాష్ అనిపించుకున్నారు. మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, ఇందు, సై ఆట, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ, ప్రేమ ఒక మైకం... ఇన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన కథానాయికలు ఈ కాలంలో చాలా అరుదు. ఆ దిశగా చూస్తే చార్మి నిజంగా గ్రేట్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో స్త్రీ ప్రాధాన్యతా చిత్రం ‘ప్రతిఘటన’. చరిత్ర చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మంత్ర-2’ నిర్మాణ దశలో ఉంది. తన కెరీర్ గురించి ఇటీవల చార్మి మాట్లాడుతూ-‘‘కెరీర్ ప్రారంభమైన నాటినుంచి బిజీగా ఉండటం నిజంగా నా అదృష్టమే. గ్లామర్ పాత్రలు చాలా సినిమాల్లో చేశాను. ప్రేక్షకులు ఆదరించారు కూడా. ఇప్పుడు నటిగా కూడా ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నా దగ్గరకు ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే వస్తున్నాయి. వచ్చిన ప్రతి సినిమాకూ ‘ఓకే’ చెప్ప కుండా ఆచితూచి సినిమాలను అంగీకరిస్తున్నాను. హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ప్రేక్షకాభిమానం, పరిశ్రమ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
ఇది నాకు చాలా స్పెషల్
‘‘సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన ఓ జర్నలిస్ట్ కథ ఇది. చాలా రోజుల తర్వాత కష్టపడి కమిట్మెంట్తో చేశాను. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ’’ అని చార్మి చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ప్రతిఘటన’. చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో హీరో గోపీచంద్ టీజర్‌ను, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ -‘‘భరద్వాజ్‌గారి ‘అలజడి’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ‘ప్రతిఘటన’ చాలా పవర్ఫుల్ టైటిల్. సినిమా కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘చాలా కాలం తర్వాత నేను డెరైక్ట్ చేస్తున్న చిత్రమిది. ఒరిస్సాలో జరిగిన రేప్ కేస్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఇందులో చర్చిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా కెమెరామేన్ ఎస్.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంత అసూయ ఎందుకో
తన అందం చూసి కొందరు అసూయ పడుతున్నారు.. ఎందుకని విరుచుకుపడుతున్నారు నటి చార్మి. ఈ భామ తమిళంలో కాదల్ అళవదిల్లై, లాడెం తదితర చిత్రాల్లో నటించారు. అనంతరం టాలీవుడ్లో కొంతకాలం ప్రముఖ హీరోయిన్గా రాణించారు. ప్రస్తుతం అక్కడ అనుష్క, కాజల్, సమంత హవా కొనసాగుతండడంతో చార్మీకి క్రేజ్ తగ్గింది. దీంతో సింగిల్ సాంగ్‌లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కాస్త బరువు కూడా పెరగడంతో చార్మీ ఇక హీరోయిన్గా పనికి రాదనే ప్రచారం జోరందుకుంది. దీంతో కసిగా ఎక్సర్సైజులు చేసి కొన్ని నెలల్లోనే సుమారు 9 కిలోల బరు వు తగ్గి మళ్లీ నాజుగ్గా తయారయ్యారు. కవ్వించే అందాల ప్రదర్శనలో ఫొటో సెషన్ చేయించుకుని ఇంటర్నెట్లో పోస్టు చేశారు. తన నూతన అందాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. వారి కోసం ప్రతిరోజూ రెండు ఫొటోలు విడుదల చేస్తానని అంటున్నారు. తన కొత్త ఫొటోలు చూసిన కొందరు నటీమణులు ఉడుక్కుంటున్నారని, అంత అసూయ వారికెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఉడుకుబోతు తనం గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. వారి అసూయ తననేమీ చేయలేదంటున్నారు. -
చక్కనమ్మ చిక్కింది
కొందర్ని దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తయారు చేస్తాడేమో. వాళ్లు బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉంటారు... సన్నగా ఉన్నా అందంగానే ఉంటారు. చార్మి ఈ కోవకే చెందుతారు. టీనేజ్లోనే హీరోయిన్ అయిన చార్మీని దాదాపు పన్నెండేళ్లుగా బొద్దుగా చూస్తున్నాం. కానీ, ఇకనుంచీ చిక్కిన చార్మీని చూడబోతున్నాం. నాలుగు నెలల క్రితం తను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించేశారు. తొమ్మిది కిలోల బరువు తగ్గారు చార్మి. బరువు తగ్గాక ఎలా ఉన్నానో చూడండంటూ ఓ ఫొటోని ట్విట్టర్లో పెట్టారామె. ఇక్కడ మనం చూస్తున్నది ఆ ఫొటోయే. ఇంకా చార్మీ దగ్గర బోల్డన్ని ఫొటోలున్నాయి. సన్నబడిన సందర్భంగా ఓ ఫొటోషూట్ చేయించుకున్నారామె. ఆ షూట్లో ఇది శాంపిల్ మాత్రమే. మిగతా ఫొటోలను రోజుకొకటి చొప్పున బయటపెడతానని చార్మి పేర్కొన్నారు. ఇంతకీ.. ఇన్నేళ్లుగా బొద్దుగా ఉన్న చార్మీ ఇప్పుడు హఠాత్తుగా బరువు తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? అనే చర్చ జరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే... ట్రెండ్‌కి తగ్గట్టు మౌల్డ్ అవ్వాలని అనుకుని ఉంటారు. అలాగే కొత్త తారలకు తానేమీ తీసిపోనని చెప్పడానికే ఈ మార్పు అని కూడా ఊహించుకోవచ్చు. -
అప్పుడే పెళ్లా?
ఇప్పటికింకా నా వయసు నిండా 25. చీటికి మాటికి పెళ్లెప్పుడంటూ చిరాకు పుట్టించకండి అంటోంది నటి చార్మి. కోలీవుడ్, టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్ల సరసన చేరిన ఈ బ్యూటీకి ప్రస్తుతం హీరోయిన్గా డిమాండ్ లేదు. ఐటమ్ సాంగ్స్, గెస్ట్ పాత్రలంటూ వరుస పెట్టి ఎడాపెడా నటించేస్తున్న చార్మితో పాటు తమన్న, సమంత, హన్సిక, ప్రియమణి లాంటి హీరోయిన్లు మూడుముళ్లకు ముందడుగులో ఉన్నట్లు సినీ వర్గాల టాక్. ఈ ప్రచారాన్ని సహ నటీమణులు ఖండించినట్లుగానే చార్మీ కూడా ఖండించింది. ఈ విషయ మై ఆమె మాట్లాడుతూ తన వయసు 25నే. అప్పుడే వివాహం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసిం ది. కొందరు తారల మాదిరిగా తాను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం తాను పోషిస్తున్న యవ్వనం ఉట్టిపడే గ్లామర స్ పాత్రలు తనకు 30 ఏళ్లు దాటిన తర్వాత ఎవరూ ఇవ్వరని అంది. అందువల్ల ప్రస్తుతానికి నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పింది. వివాహమంటూ జరిగితే అది తనకు బాగా తెలిసిన వారితోనే అవుతుందని తెలిపింది. తాను నటించే చిత్రాల కథలను ఒక్కసారి వినగానే ఒకే చెప్పడం లేదని, అదే విధంగా తొలి చూపులోనే ప్రేమించేయడం కుదరదని అంటోంది. ఈ జాణ కోలీవుడ్‌లో శింబు సరసన కాదల్ ఒళివరిల్లై చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ చిత్రం 2002లో విడుదలైంది. అప్పుడు చార్మీ వయసు 18 ఉంటుందని, ఆ విధంగా చూసుకుంటే ఈమె వయసు 29 ఉంటుందని, అలాంటిది తన వయసింకా 25 అని చెప్పుకుంటోందని కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. -
పెళ్ళంటే సిగ్గుపడుతున్న చార్మి
-
ఇండియన్ స్క్రీన్‌పై చూడని హారర్
చార్మి కెరీర్లో గుర్తుంచుకోదగిన సినిమా ‘మంత్ర’. థ్రిల్లర్ చిత్రాల్లో ఆ సినిమా ఓ సంచలనం. ‘మంత్ర’ను అనుసరించి తర్వాత చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఆ రకంగా ఆ సినిమాను ఓ ట్రెండ్ సెట్టర్ అని కూడా అనొచ్చు. ప్రస్తుతం చార్మి ‘మంత్ర-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘మంత్ర’కి ఈ సినిమా కొనసాగింపు కాదని ఆ చిత్రం ప్రారంభంలోనే దర్శకుడు ఎస్.వి.సతీష్, నిర్మాతలు బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ తెలియజేశారు. అయితే... అదే పేరుతో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఉండటం సహజం. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ... కథ రీత్యా ఇది సీక్వెల్ కాకపోయినా... ఓ విధంగా సీక్వెలే అనాలని కొత్త రాగం అందుకున్నారు నిర్మాతలు. ఆ వివరాలను తెలుపుతూ-‘‘‘మంత్ర’ మాదిరిగానే ఇది కూడా హారర్ నేపథ్యంలో సాగే కథ. అలాగే... కథనం కూడా ఎక్కువశాతం రాత్రి వేళల్లోనే నడుస్తుంది. చిత్రీకరణ పరంగా చూస్తే ‘మంత్ర’ కంటే ఈ సినిమా బాగా వస్తోంది. అందుకే ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. చార్మీ అందిస్తున్న సహకారం మరిచిపోలేం. ఈ నెల మూడోవారం నుంచి ఆర్ఎఫ్సీలో ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని తెలిపారు. ‘‘మాతృకలోనూ సీక్వెల్లోనూ ఒకే కథానాయిక నటించడం ఇండియన్ స్క్రీన్‌పై ఇదే ప్రథమం. ఆ రకంగా చార్మీ చరిత్రలో నిలిచిపోతారు. అనుక్షణం ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇది. మనదేశంలో ఇప్పటివరకూ ఇలాంటి హారర్ సినిమా రాలేదని నమ్మకంగా చెప్పగలను’’ అని దర్శకుడు చెప్పారు. తనికెళ్లభరణి, రాహుల్‌దేవ్, రావురమేష్, నల్లవేణు, సుధ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివశంకర్, ఛాయాగ్రహణం: ఆర్.పి.తనికెళ్ల, కూర్పు: బాబు సిద్దంశెట్టి, సహ నిర్మాతలు: పవన్, సురేష్ కొండవీటి. -
మల్లిక ఆగమనం షురూ!
వేశ్య పాత్ర పోషించడం అంటే ఆషామాషీ విషయం కాదు. అదొక సవాల్ లాంటిది. ఆ సవాల్‌ని ఈ తరంలో రాణి ముఖర్జీ, టబు, అనుష్క వంటి తారలు జయించారు. ఇప్పుడు చార్మి వంతు. వాస్తవానికి వేశ్య పాత్రలంటే ఈ ముద్దుగుమ్మకు అంత ఆసక్తి లేదు. మూడు, నాలుగు ఆఫర్లు వచ్చినా తిరస్కరించేశారు. కానీ ఈసారి మాత్రం పచ్చజెండా ఊపారు. కారణం దర్శకుడు చందు చెప్పిన కథ నచ్చడం, ఆయన దర్శకత్వం వహించిన ‘టెన్త్ క్లాస్, నోట్‌బుక్’ సినిమాలు ఆమెను ఇంప్రెస్ చేయడం. ఏ ముహూర్తాన ఈ చిత్రానికి ‘ప్రేమ ఒక మైకం’ అని టైటిల్ పెట్టారో కానీ చార్మి ప్రతి ఫొటో నిజంగానే కుర్రకారుని మత్తెక్కించే విధంగానే ఉంది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. హైక్లాస్ వేశ్య మల్లికగా చార్మి ఒదిగిపోయిన వైనాన్ని దర్శకుడు చందు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు, ఉద్వేగానికి గురయ్యానని, పులగం చిన్నారాయణ రాసిన మాటలు అద్భుతంగా ఉన్నాయని చార్మి చెప్పారు. టూరింగ్ టాకీస్ పతాకంపై డి. వెంకటసురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఒక వేశ్య, ఓ రచయిత, ఓ గాయని.. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని, మల్లిక పాత్రకు చార్మి ప్రాణం పోశారని నిర్మాతలు తెలిపారు. రచయితగా ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, గాయనిగా ‘ప్రేమిస్తే’ శరణ్య నటించారు. చంద్రమోహన్, రవిబాబు, రావు రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్సార్ పాశోమ్-ప్రవీణ్, కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి.