పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోజ్యోతిలక్ష్మిగా... | Charmme turns Jyothi Lakshmi | Sakshi
Sakshi News home page

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోజ్యోతిలక్ష్మిగా...

Published Sat, Oct 11 2014 1:09 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోజ్యోతిలక్ష్మిగా... - Sakshi

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోజ్యోతిలక్ష్మిగా...

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కథానాయికా ప్రాధాన్య చిత్రం చేయాలన్న చార్మి కల త్వరలో నెరవేరనుంది. ‘జ్యోతిలక్ష్మి’ పేరుతో చార్మి ప్రధాన పాత్రలో పూరి త్వరలో ఓ సినిమా డెరైక్ట్ చేయబోతున్నారు. 2015లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఒక తరాన్ని తన శృంగార నృత్యాలతో ఉర్రూతలూగించిన నటి జ్యోతిలక్ష్మి జీవిత కథతో ఈ సినిమా రూపొందనుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పూరి దగ్గర ప్రస్తావిస్తే -‘‘అస్సలు కాదు.

జ్యోతిలక్ష్మిగారికీ దీనికీ ఏమాత్రం సంబంధం లేదు. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా నేనీ సినిమా చేయబోతున్నా. అసలు నా తొలి చిత్రంగా దీన్ని చేయాలనుకున్నా. ఇన్నేల్లకు కుదిరింది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘రోమియో’ చిత్రానికి సంగీతం సమకూర్చిన సునీల్ కశ్యప్ ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement