'లైగర్‌' టీంకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బాలయ్య | Balakrishna Visit Vijay Deverakonda Liger Movie Sets, Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Bala krishna: 'లైగర్‌' సెట్‌లో బాలకృష్ణ.. ఫోటోలు వైరల్‌

Published Wed, Sep 22 2021 3:05 PM | Last Updated on Wed, Sep 22 2021 7:21 PM

Balakrishna Visit Vijay Deverakonda Liger Movie Sets, Pics Goes Viral	 - Sakshi

Balakrishna Surprises Team Liger in Goa: విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'లైగర్‌'.  బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లైగర్‌ సెట్‌లో సడెన్‌గా ప్రత్యేక్షం అయ్యారు. బాలయ్య సర్‌ప్రైజ్‌ విజిట్‌తో మూవీ టీం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. మరోవైపు బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. 

చదవండి : ‘ప్రభాస్‌-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..!
ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రానా దగ్గుబాటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement