surprise visit
-
విమానంలో తల్లికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. వీడియో వైరల్
అమ్మను స్కూటర్లో కూచోబెట్టి తిప్పేవాళ్లున్నారు. కార్లలో తిప్పేవాళ్లున్నారు. కాని విమానంలో తిప్పేవాళ్లు... అదీ విమానం నడుపుతూ తిప్పేవాళ్లు కొంచెం అరుదు. ఈ తల్లికి తన కుమారుడే తను ప్రయాణిస్తున్న ఫ్లయిట్‌కి పైలెట్ అని తెలియదు. కాని తెలిసి గొప్పగా ఆనందించింది. మురిసిపోయింది. నెటిజన్లు కూడా భలే ముచ్చటపడ్డారు. అది ఇండిగో విమానం. కొచ్చి నుంచి బయలుదేరబోతోంది. ఒకామె అదే ఫ్లయిట్లో చాలా క్యాజువల్‌గా ఎక్కింది. ఇంతలో ‘అమ్మా’ అనే పిలుపు. తిరిగి చూస్తే కాక్‌పిట్ నుంచి బయటికొచ్చి నిలబడిన పైలెట్. ‘హార్ని.. నువ్వేనా’ అని ఆమె సంబరంగా నోరు తెరిచేసింది. ఎందుకంటే ఆ పైలెట్ ఆమె కొడుకే. అతని పేరు విమల్ శశిధరన్. తను ప్రయాణించే ఫ్లయిట్‌కి కొడుకే పైలెట్ అని తెలిసిన తల్లి సంతోషంగా కొడుకును హగ్ చేసుకుంది. ఆ స్వీట్ సర్ప్రయిజ్కి మురిసిపోయింది. కొచ్చికి చెందిన విమల్ శశిధరన్ ఇదంతా వీడియో తీయించి ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేశాడు. ‘ఇలాంటి క్షణాలే జీవితాన్ని అత్యధ్భుతం చేస్తాయి’ అని కామెంట్ చేశాడు. ఆ వీడియోలో కన్నకొడుకు ఉన్నతి చూసి గర్వపడే తల్లిని, తల్లిని ఆనందపరిచే కొడుకును చూసి నెట్లోకం పులకించింది. కామెంట్లు, లైక్‌లు మామూలే. ‘మీ అమ్మ వయసులో చిన్నదిగా కనిపిస్తోంది. పిల్లలు బాగా చూసుకుంటే తల్లిదండ్రుల వయసు తగ్గుతుంది’ అని ఒకరు రాస్తే ‘ఆ అమ్మ నవ్వు ఎంత బాగుంది’ అని మరొకరు రాశారు. ఏమైనా అమ్మను విమానంలో కూచోబెట్టి తానే నడిపి తిప్పే అదృష్టం ఎంతమందికొస్తుంది చెప్పండి. View this post on Instagram A post shared by Vimal Sasidharan (@iflya320) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) -
ఆక్రమిత మేరియుపోల్‌లో పుతిన్
కీవ్: ఉక్రెయిన్‌లోని ఆక్రమిత తీర ప్రాంత నగరం మేరియుపోల్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మికంగా పర్యటించారు. సెప్టెంబర్‌లో తమ సైన్యం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక పుతిన్ మొదటిసారిగా అక్కడికి వెళ్లారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న పుతిన్, సొంతంగా వాహనం నడుపుతూ నగరంలోని స్మారకప్రాంతాలను సందర్శించారు. పుతిన్ శనివారం మేరియుపోల్‌కు దగ్గర్లోనే ఉన్న క్రిమియాకూ వెళ్లారు. -
వైరల్ వీడియో: పులి కోసం అంతా పడిగాపులు! అంతలోనే సర్ప్రైజ్
-
పులి కోసం అంతా పడిగాపులు! అంతలోనే సర్ప్రైజ్
వైరల్: అడవుల్ని, అందులోని వన్యప్రాణులను కదిలించడం మనిషికి బాగా అలవాటైపోయింది. వాటి ఆవాసాల్లో వెళ్లి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఫలితం.. సో కాల్డ్ జనావాసాల మీద వన్యప్రాణుల దాడులు లేదంటే తిరిగి వాటినే చంపడం చూస్తున్నాం. అయితే.. వన్య ప్రాణులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనే స్పృహ లేకుండా పోతున్నారు చాలామంది. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సురేందర్ మెహ్రా ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ఓపెన్ సఫారీ వ్యూ కోసం వెళ్లిన కొందరికి పెద్దపులి తానేంటో చూపెట్టింది. ఆశగా దాని చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్లపై.. ఒక్కసారిగా దూసుకొచ్చి వణుకు పుట్టించింది. టూరిస్టులు ఓ ఓపెన్ జీప్‌లో ఉండగా.. పొదల మాటున పులి ఉండడం గమనించి జీప్ డ్రైవర్ ఆపేశాడు. ఆ సమయంలో అది ఎప్పుడు బయటకు వస్తుందా? క్లిక్ మనిపిద్దామా? అని కెమెరాలతో రెడీగా ఉన్నారు కొందరు. అయితే.. వాళ్ల గోలకు చిర్రెత్తుకొచ్చిందేమో. గాండ్రిస్తూ ఉగ్రంగా ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. ఆ దెబ్బకు భయంతో జీప్ డ్రైవర్ వాహనాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లాడు. గట్టిగా అరవడంతో అది కాస్త వెనక్కి తగ్గింది. కొన్నిసార్లు, పులిని చూడటం కోసం మనం కనబరిచే అతి ఆత్రుత.. వాటి(పులుల) జీవితంలోకి చొరబడడం తప్ప మరొకటి కాదు అంటూ సురేందర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ, ఆయన ట్వీట్ ద్వారా వీడియో మాత్రం వైరల్ అవుతోంది. Sometimes, our ‘too much’ eagerness for ‘Tiger sighting’ is nothing but intrusion in their Life…🐅#Wilderness #Wildlife #nature #RespectWildlife #KnowWildlife #ResponsibleTourism Video: WA@susantananda3 @ntca_india pic.twitter.com/B8Gjv8UmgF — Surender Mehra IFS (@surenmehra) November 27, 2022 -
సర్ప్రైజ్ విజిట్.. థియేటర్స్‌లో సాయిపల్లవి సందడి
న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ పవర్ స్టార్‌గా సాయిపల్లవికి క్రేజ్ ఉంది. రీసెంట్గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గార్గి' సినిమా ఈనెల 15న విడుదలైన సంగతి తెలిసిందే. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం థియేటర్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు సాయిపల్లవి థియేటర్స్‌లో సందడి చేసింది. చెన్నై, హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లిన ఆమె ఫ్యాన్స్‌తో కలిసి సినిమాను చూడటమే కాకుండా, వారితో కాసేపు సరదాగా ముచ్చటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Good to see @Sai_Pallavi92 owning and promoting #Gargi She is doing theatre visits, not only in Chennai but also in Hyderabad.. Presented by @2D_ENTPVTLTD Release by @SakthiFilmFctry Produced by @blacky_genie@Suriya_offl #Jyotika @prgautham83 pic.twitter.com/ZI2BJBKAdq — Ramesh Bala (@rameshlaus) July 17, 2022 -
'లైగర్' టీంకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య
Balakrishna Surprises Team Liger in Goa: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'లైగర్'. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లైగర్ సెట్లో సడెన్‌గా ప్రత్యేక్షం అయ్యారు. బాలయ్య సర్ప్రైజ్ విజిట్‌తో మూవీ టీం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. మరోవైపు బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. A Legendary Visit to #Liger Sets @ Goa🤩#NandamuriBalakrishna garu made a surprise Visit to the sets of #Liger today & Blessed the team with high spirits🙏 @karanjohar #Purijagannadh @TheDeverakonda @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/TT1Ga7vxfY — Puri Connects (@PuriConnects) September 22, 2021 చదవండి : ‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..! ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రానా దగ్గుబాటి -
గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. నేడు సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్‌బహదూర్’ వర్ధంతి కావడంతో ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఇది న్యూఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉంది. అయితే ప్రధాని గురుద్వారా సందర్శన షెడ్యూల్ ప్రకారం నిర్వహించినది కాదు. ఈ పర్యటనను ఉన్నట్టుండి ప్లాన్ చేశారు. సాధారణంగా ప్రధాని ఇలాంటి పర్యటనకు వెళ్తే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. కానీ గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ఏ విధమైనటువంటి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. చదవండి: భారత్ ఎందుకొద్దు? పర్యటనలో ప్రధాని మోదీ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అక్కడ పోలీసు బందోబస్తు లేదని, ఎక్కడా బారికేడ్లు పెట్టలేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయలేదని, సామాన్యులకు ఎలాంటి అడ్డంకులూ లేవని అధికారులు పేర్కొన్నారు. ఉదయాన్నే మంచుకురుస్తుండగా, ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా ప్రధాని మోదీ గురుద్వారా రకాబ్ గంజ్ చేరుకొని గురు తేగ్ బహదూర్‌కు సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా ఢిల్లీలో గురుద్వారా రకాబగంజ్ 1783వ సంవత్సరంలో నిర్మితమైంది. ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారాల్లో ఎక్కువ మంది సందర్శకులు వెళ్లే గురుద్వారాల్లో ఇదీ ఒకటి. ఓవైపు పంజాబ్ రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఈ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం ప్రధానమంత్రి మోదీ తన గురుద్వారా సందర్శనకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. దీనితోపాటు గురుముఖి భాషలో సందేశమిచ్చారు. ‘నేను ఈ రోజు ఉదయం చారిత్రాత్మక గురుద్వారా రకాబగంజ్ సాహిబ్‌కు ప్రార్థనలు చేశాను. అక్కడ గురు తేగ్‌బహదుర్ పవిత్ర శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాను. ఈ ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితులను చేసి, ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లించిన గురు తేగ్‌బహదూర్ దయతోనే ఎంతో ప్రేరణ పొందాను. గురు సాహిబ్స్ విశేష కృపతోనే మన ప్రభుత్వ పాలనా కాలంలో గురు తేగ్‌బహదూర్ 400వ ప్రకాశ్ పర్వాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తేగ్ బహదూర్ ఆదేశాలను గుర్తు చేసుకుంటున్నాం. కాగా గురు తేగ్ బహదూర్ సిక్కు మతంలోని పదిమంది గురువులలో తొమ్మిదవ గురువు. 17వ శతాబ్దంలో ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అతన్ని హత్య చేశారు. -
వివాదంలో ట్రంప్ విహారం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన చర్యతో వివాదంలో ఇరుక్కున్నారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకి, ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఆసుపత్రి వెలుపలకు వచ్చి మరీ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ విమర్శల పాలయ్యారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే, నిబంధనలు ఉల్లంఘించి బయటతిరగడాన్ని వైద్య నిపుణులు సైతం తప్పుబడుతున్నారు. అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం, ఆందోళనల నేపథ్యంలో ట్రంప్ వైద్య బృందంలోని కీలక సభ్యుడు, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పల్మనరీ నిపుణుడు బ్రియాన్ గారిబాల్డి ప్రకారం సోమవారం ఆయన ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ అంచనాల మధ్య ట్రంప్ సర్ప్రైజ్ ఔటింగ్ విమర్శలకు తావిచ్చింది. కోవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన ట్రంప్ బులెట్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కలియ దిరుగుతూ, అభివాదం చేస్తూ తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. అనంతరం కొద్దిసేపటికి ఆసుపత్రికి తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించి ఉన్నప్పటికీ ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించ బయటికి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కరోనా గురించి చాలా తెలుసుకున్నాను. నిజంగా స్కూలుకు వెళ్లినట్టుగా ఉందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన అభిమానులకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించడానికే బయటికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బందికి, నర్సులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. అటు ట్రంప్ కాన్వాయ్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ కు పంపనున్నామని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ చీఫ్ జేమ్స్ ఫిలిప్స్ వ్యాఖ్యానించారు. వారు వైరస్ బారిన పడే అవకాశం ఉంది. చనిపోవచ్చు కూడా అంటూ ట్రంప్ వైఖరిపై మండిపడ్డారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి జూడ్ డీర్ మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ట్రంప్ తో పాటు ఉన్న వారంతా ప్రొటెక్టివ్ గేర్ ను ధరించే ఉన్నారని, మెడికల్ టీమ్ ఈ పర్యటన సురక్షితమని చెప్పిన తరువాతనే ఆయన బయటకు వచ్చారని ప్రకటించడం విశేషం. pic.twitter.com/0Bm9W2u1x7 — Donald J. Trump (@realDonaldTrump) October 4, 2020 Every single person in the vehicle during that completely unnecessary Presidential “drive-by” just now has to be quarantined for 14 days. They might get sick. They may die. For political theater. Commanded by Trump to put their lives at risk for theater. This is insanity. — Dr. James P. Phillips, MD (@DrPhillipsMD) October 4, 2020 -
టెర్రస్‌పై టెన్నిస్... చిన్నారులతో పాస్తా
రోమ్: ఆటతో టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాలన్నా... అందమైన మనసుతో అభిమానుల్ని ఆకట్టుకోవాలన్నా స్విట్జర్లాండ్ యోధుడు రోజర్ ఫెడరర్ తర్వాతే ఇంకెవరైనా... ఇప్పటికే చాలా సందర్భాల్లో తన మాటలతో, చర్యలతో అందరి మది దోచుకున్నాడు. తాజాగా 38 ఏళ్ల ఈ దిగ్గజ ప్లేయర్ ఇటలీకి చెందిన ఇద్దరు చిన్నారుల్ని ఆనందాశ్చర్యాలకు గురి చేశాడు. వారితో టెన్నిస్ ఆడటంతోపాటు కమ్మగా పాస్తాను ఆరగించి వారికి మరపురాని సంతోషాన్ని పంచాడు. లాక్డౌన్ కాలంలోనూ ఇంటి టెర్రస్‌పై టెన్నిస్ ఆడుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన చిన్నారులు విటోరియా (13 ఏళ్లు), కరోలా (11 ఏళ్లు)లకు ఫెడరర్ స్వీట్ షాకిచ్చాడు. ఎదురెదురు ఇళ్ల టెర్రస్‌లపై నిలబడి అత్యంత కచ్చితత్వంతో ర్యాలీలు ఆడిన ఈ చిన్నారుల వీడియో ఏప్రిల్‌లో వైరల్‌గా మారింది. వీరి అంకితభావానికి ముగ్ధుడైన రోజర్ జూలై 10న వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. తమ ఆరాధ్య ప్లేయర్‌ను చూసిన ఈ చిన్నారులిద్దరూ ఆనందంతో గంతులేస్తూ తమకు కనిపించిన వారందరికీ ఈ విషయాన్ని చాటి చెప్పారు. వారిలాగే ఎదురెదురు ఇళ్లపై నిలబడి వారితో టెన్నిస్ ఆడిన ఫెడరర్... ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మక వేదికలపై ఆడినప్పటికీ, ఇలాంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదని పేర్కొన్నాడు. అనంతరం వారితో పాస్తాను ఆస్వాదించడంతో పాటు సెల్ఫీలకు ఫోజులివ్వడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతేకాకుండా వారిద్దరిని రాఫెల్ నాదల్ అకాడమీలో వేసవి శిబిరానికి పంపిస్తున్నట్లు ఫెడరర్ చెప్పాడు. -
అఖిలేశ్ ప్రాజెక్టుపై సీఎం యోగి టఫ్ రివ్యూ
లక్నో: అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడమే తన లక్ష్యం అని ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. గత 150గంటల్లోనే 50 నిర్ణయాలు అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న ఆయన తాజాగా అవినీతిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తొలి కొరడా దెబ్బను మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ పెట్ ప్రాజెక్టు అయిన గోమతి రివర్ ఫ్రంట్‌పై ప్రయోగించారు. అనూహ్యంగా ఆ ప్రాజెక్టు అనుమతులు, నిర్వహణా బాధ్యతలు చూస్తున్న అధికారులతో సమావేశం అయ్యారు. ఈ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరిట అక్కడ నిర్మించిన ల్యాండ్ స్కేప్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, ఇతర డిజైన్లు ఏవీ కూడా ఆదిత్యనాథ్‌ను పెద్దగా ఆకర్షించలేదు. పైగా ఆ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు అక్కడ పూర్తయిన పనులకు పొంతన లేకుండా పోయింది. దీంతో ప్రత్యేక సమావేశం అయిన ఆదిత్యానాథ్ అవినీతిని తాను ఏ మాత్రం సహించబోనని హెచ్చరించారు. రెండేళ్లుగా నిర్మిస్తున్న ఈప్రాజెక్టుకు మొత్తం రూ.1500కోట్లు కేటాయించగా అందులో రూ.1427 కోట్లను ఇప్పటికే ఖర్చు చేశారు. అయితే, పనులు మాత్రం కేవలం 60శాతం మాత్రమే పూర్తయ్యాయి. పనుల నాణ్యతతోపాటు, వ్యయంలో కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఆదిత్యానాథ్ ప్రాజెక్టు వివరాలు మొత్తం అడిగారు. డబ్బును ఎలా ఖర్చు చేశారనే విషయాలు తనకు తెలియజేయాలని ఆదేశించారు. తన పరిపాలనలో 18గంటలపాటు అధికారులు ఎప్పుడంటే అప్పుడు పనిచేయాల్సిందేనని ఆదేశించిన యోగి ఆ విధంగానే ముందుకు వెళుతున్నారు. గోమతి ప్రాజెక్టును నమామి గంగే ప్రాజెక్టుకు అనుసంధానించి గంగా శుద్ధి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
ఎయిర్ పోర్టులో మంత్రి ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పుణ్యమా అని ఆయా శాఖల కేంద్ర మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండటం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నిన్నటికినిన్న సమాచార శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉద్యోగుల ఆలస్యంపై మండపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో పౌరవిమాయనయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీ టెర్మినల్(టెర్మినల్1) కు వెళ్లిన మంత్రి అక్కడ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరాతీశారు. గతవారం ఇదే టెర్మినల్ లో ఎయిర్ కండీషనర్ పనిచేయక ప్రయాణికులు ఉక్కపోతను అనుభవించిన సంఘటన దృష్యా ఏసీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జులై 5 నాటి పునర్ వ్యవస్థీకరణలో ఆర్థిక శాఖ నుంచి పౌరవిమానయానానికి మారిన జశ్వంత్ సిన్హా.. గత వారం దేశీ విమాన సేవల బలోపేతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఎస్కేయూలో వీసీ తనిఖీలు
ఎస్కే యూనివర్సిటీ వీసీ కె. రాజగోపాల్ ఇవాళ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. విధులకు గైర్హాజరైతున్న తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు మెమొ జారీ చేశారు. కళాశాలలోని పలు విభాగాలను సందర్శించిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. -
గిరిజన గర్భిణుల్లో రక్తహీనత
గిరిజన గర్భవతుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని, దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారిణి దేవకీ వెంకట లక్ష్మి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కోరారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో రికార్డులు పరీశీలించారు. సింబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. -
రాజధాని మాఊళ్లోనే పెట్టేవాడిని