గిరిజన గర్భవతుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని, దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారిణి దేవకీ వెంకట లక్ష్మి తెలిపారు.
గిరిజన గర్భవతుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని, దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారిణి దేవకీ వెంకట లక్ష్మి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. గిరిజన మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కోరారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో రికార్డులు పరీశీలించారు. సింబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.