చక్కనమ్మ చిక్కింది | Charmi stunning looks after Losing 9 kgs weight | Sakshi
Sakshi News home page

చక్కనమ్మ చిక్కింది

Published Fri, Nov 1 2013 12:42 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Charmi stunning looks after Losing 9 kgs weight

కొందర్ని దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తయారు చేస్తాడేమో. వాళ్లు బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉంటారు... సన్నగా ఉన్నా అందంగానే ఉంటారు. చార్మి ఈ కోవకే చెందుతారు. టీనేజ్‌లోనే హీరోయిన్ అయిన చార్మీని దాదాపు పన్నెండేళ్లుగా బొద్దుగా చూస్తున్నాం. కానీ, ఇకనుంచీ చిక్కిన చార్మీని చూడబోతున్నాం. నాలుగు నెలల క్రితం తను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించేశారు. తొమ్మిది కిలోల బరువు తగ్గారు చార్మి. బరువు తగ్గాక ఎలా ఉన్నానో చూడండంటూ ఓ ఫొటోని ట్విట్టర్‌లో పెట్టారామె.
 
  ఇక్కడ మనం చూస్తున్నది ఆ ఫొటోయే. ఇంకా చార్మీ దగ్గర బోల్డన్ని ఫొటోలున్నాయి. సన్నబడిన సందర్భంగా ఓ ఫొటోషూట్ చేయించుకున్నారామె. ఆ షూట్‌లో ఇది శాంపిల్ మాత్రమే. మిగతా ఫొటోలను రోజుకొకటి చొప్పున బయటపెడతానని చార్మి పేర్కొన్నారు. ఇంతకీ.. ఇన్నేళ్లుగా బొద్దుగా ఉన్న చార్మీ ఇప్పుడు హఠాత్తుగా బరువు తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? అనే చర్చ జరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే... ట్రెండ్‌కి తగ్గట్టు మౌల్డ్ అవ్వాలని అనుకుని ఉంటారు. అలాగే కొత్త తారలకు తానేమీ తీసిపోనని చెప్పడానికే ఈ మార్పు  అని కూడా ఊహించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement