Prasanth Varma: 'హనుమాన్' మూవీతో హిట్‌ కొట్టాడు.. ఇంతలోనే దర్శకుడికి షాక్! | Twitter Removes Hanuman Movie Director Prasanth Varma Blue Tick, Know Reason Inside - Sakshi
Sakshi News home page

Prasanth Varma Twitter Blue Tick: డైరెక్టర్ ప్రశాంత్ వర్మని డిసప్పాయింట్ చేసిన ఆ ఒక్కటి!

Published Wed, Jan 17 2024 4:32 PM | Last Updated on Wed, Jan 17 2024 5:02 PM

Twitter Removes Hanuman Movie Director Prasanth Varma Blue Tick - Sakshi

సంక్రాంతి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అల్టిమేట్‌గా 'హను-మాన్' చిత్రం విజేతగా నిలిచింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మూవీ టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు చిన్న షాక్ తగిలింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

'హనుమాన్' సినిమా విషయంలో హీరో తేజకి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ.. ఓవరాల్‌గా మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ బాగా హైలైట్ అయ్యాడు. ఎందుకంటే రిలీజ్ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన బలంగా నిలబడి హిట్ కొట్టాడు. అక్కడే అందరి మనసులు గెలిచేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా గదతో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్‌గా మార్చాడు. దీంతో చిన్న సమస్య వచ్చింది.

(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)

ట్విట్టర్ ప్రస్తుతం 'ఎక్స్'గా మారిపోయింది. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ లేదంటే పేరు మార్చిన సరే బ్లూ టిక్ పోతోంది. అలా ఇప్పుడు ప్రశాంత్ వర్మ టిక్ కూడా పోయింది. ఈ క్రమంలోనే అతడి చేస్తున్న పోస్టులు ఒరిజినల్ అకౌంట్ నుంచి చేస్తున్నాడా? ఫేక్ అకౌంట్ నుంచే చేస్తున్నాడా అనేది అభిమానులకు అర్థం కావట్లేదు. అందుకే త్వరగా బ్లూ టిక్ మళ్లీ తెచ్చుకో అని కామెంట్స్ పెడుతున్నారు. 

ఎందుకంటే రీసెంట్‌గా కొందరు నెటిజన్స్.. కావాలనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా పేర్లతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి పిచ్చిపిచ్చి ట్వీట్స్ చేశారు. తద్వారా వీరిద్దరినీ బ్యాడ్ చేయాలనేది వాళ్ల ఉద్దేశం. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ పోవడంతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముందని నెటిజన్స్ అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement