
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ, సడెన్‌గా ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడిపోయింది. కొన్ని గంటల్లో క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించాలని ఏర్పాట్లు కూడా చేశారు. అందుకోసం సుమారు రూ. 30 లక్షలు ఖర్చు కూడా పెట్టారు. అయితే, మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదంటూ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ కాల్ చేయడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. ఆ సమయం నుంచి మళ్లీ ఈ కాంబినేషన్ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అయితే, తాజాగా సమాచారం ప్రకారం మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా లేనట్లే అని తెలుస్తోంది. కొద్దిరోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ మూవీ రానుందని ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నుంచి ప్రశాంత్ దాదాపు తప్పుకున్నట్లే అని తెలుస్తోంది. రేపోమాపో ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. త్వరలో ప్రభాస్‌తో ఒక భారీ ప్రాజెక్ట్ చేసేపనిలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు పక్కా సమాచారం ఉంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి.
శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ టెస్ట్ లుక్ కూడా చేయనున్నారని సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ప్రభాస్‌తో మూడు పెద్ద ప్రాజెక్ట్‌లు నిర్మిస్తామని ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ క్రమంలో సలార్2 కూడా లైన్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా ప్రభాస్ చిత్రం రానుంది.
మోక్షజ్ఞ నిర్మాతకు మరో ఆఫర్ ఇచ్చిన బాలయ్య
మోక్షజ్ఞ తొలి సినిమా ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ మూవీ కోసం మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అయితే, పూజా కార్యక్రమం రోజే సినిమాకు ఫుల్‌స్టాప్ పడిపోయింది. లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నట్లు తెలిపారు. అయితే, సినిమా ఉంటుందని వారు చెబుతున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ, మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌కు బదులుగా నిర్మాత సుధాకర్ చెరుకూరికి బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారట. తన తర్వాతి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉంది. ఈ సినిమాను ఆయనకే అప్పజెప్పారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment