Mokshagna
-
ప్రశాంత్ వర్మ- మోక్షజ్ఞ సినిమా వాయిదా.. కారణమిదే!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అతడి మొదటి సినిమా రాబోతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం (డిసెంబర్ 5న) నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ నేడు జరగాల్సిన పూజా కార్యక్రమం వాయిదా పడింది.మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదంటూ బాలకృష్ణ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు కాల్ చేశాడు. సినిమా ఓపినింగ్కుగానూ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా సెట్ వేశారు. ఇందుకోసం నిర్మాత దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేశాడు.చదవండి: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్‌పై కేసు నమోదు -
మోక్షజ్ఞ ఎంట్రీ షురూ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎం తేజస్వినీ నందమూరి సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు (సెప్టెంబర్ 6) సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాపై, నా కథపై బాలకృష్ణగారు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మన ఇతిహాసాల నుండి పొందిన స్ఫూర్తితో ఈ కథ ఉంటుంది’’ అన్నారు. ‘‘మోక్షజ అరంగేట్రానికి సరి΄ోయే కథను ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారు. ఇప్పటికే నటన, ఫైట్స్, డ్యాన్స్‌లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకున్నారు’’ అని సుధాకర్ చెరుకూరి అన్నారు. -
మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఇతనేనా!
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయన డెబ్యూ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఇస్తాడని ఓ సినిమా వేడుకలో బాలయ్య చెప్పాడు. దీంతో ఈ నందమూరి హీరోని వెండితెరకు పరిచయం చేసే డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు యువ దర్శకులు మోక్షజ్ఞ కోసం కథలు సిద్ధం చేశారట. కొంతమంది అయితే బాలయ్యకు కథలు కూడా వినిపించి.. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. కానీ బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను ‘హను-మాన్’ ఫేం ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. మోక్షజ్ఞ బర్త్‌డే(సెప్టెంబర్ 6, 2024) నాడు సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. తన పాత్ర కోసం మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడట. గతంలో కొంచెం బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ..ఇటీవల బాగా సన్నబడ్డారు. స్టైలిక్ లుక్‌తో ఫోటో షూట్ నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు. మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించబోన్నారని సమాచారం. -
నా కొడుకు గురించి వేరే వాళ్ళ సలహా నాకు అక్కర్లేదు
-
'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!
నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. అయితే వేడుకలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తన మాటలతో అందరినీ నవ్వించారు. శ్రీలీలతో హీరోయిన్గా చేస్తా అన్నందుకు మోక్షజ్ఞ ఇలా అన్నాడంటూ నవ్వులు పూయించారు. (ఇది చదవండి: ‘భగవంత్ కేసరి’.. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది) వేదికపై బాలయ్య మాట్లాడుతూ..' శ్రీలీల నన్ను చిచా, చిచా అని పిలిచి టార్చర్ పెట్టినావ్. నాతో సినిమాలో నటించావ్ సరే. కానీ నెక్ట్స్ సినిమాలో మనిద్దరం హీరో, హీరోయిన్లుగా చేద్దామన్నా. అయితే ఇదే మాటను ఇంటికి వెళ్లి మా వాళ్లతో చెప్పా. మా వాడు మోక్షజ్ఞకు కోపం వచ్చింది. ఏం డాడీ నెక్ట్స్ నేను కుర్ర హీరోను కాబోతున్నా. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తావ్. ఏం డాడీ నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని అనిండు.' అని అన్నారు. ఈ మాటలకు వేదికపై ఉన్న వారందరు నవ్వారు. అయితే ఇదే డైలాగ్ భగవంత్ కేసరిలో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే అంటూ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు. కాగా.. ఈ చిత్రం విజయదశమి సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. "#Sreeleela పక్కన హీరో గా చేస్తా అంటే మా మోక్షు అన్నాడు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని" - #Balakrishna pic.twitter.com/Rqf655In7K — Daily Culture (@DailyCultureYT) October 8, 2023 -
అప్పుడే మోక్షజ్ఞ ఎంట్రీ, నేనే డైరెక్టర్: బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారందరికీ బాలయ్య తన పుట్టినరోజున ఓ శుభవార్త చెప్పాడు. తన కొడుకు త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించాడు. తన 61వ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేస్తున్న, చేయబోయే సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముందుగా 'నర్తనశాల' చిత్రం గురించి మాట్లాడుతూ.. సౌందర్య బతికుంటే ఈ సినిమా పూర్తి చేసేవాడినన్నాడు. ద్రౌపది స్థానంలో మరో స్త్రీని ఊహించుకోలేనని, కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సినిమా తెరకెక్కించే అవకాశమే లేదని కుండబద్ధలు కొట్టేశాడు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి స్పందిస్తూ.. "ఆదిత్య 369 సీక్వెల్లో అబ్బాయి, నేను కలిసి నటిస్తాం. తాతమ్మ కల వంటి పలు సినిమాల ద్వారా నాన్నగారు నాకు నటనలో మెళకువలు నేర్పించాడు. అలా నేను మోక్షజ్ఞను నా సినిమాతో పరిచయం చేస్తూ మెళకువలు నేర్పిస్తాను. ఈ సినిమాకు నేను లేదా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ చేస్తారు" అని బాలయ్య చెప్పుకొచ్చాడు. చదవండి: మీ వల్లే ఇంతటివాడినయ్యాను, ప్లీజ్..: బాలయ్య -
చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): అంబాజీపేట మండలం, పుల్లేటికుర్రు గ్రామంలో ఉన్న శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కుమారుడు మోక్షజ్ఞలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో స్వామి వారికి చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకాలను బాలకృష్ణ, మోక్షజ్ఞలు నిర్వహించారు. బాలకృష్ణ నూతనంగా నిర్మించే చిత్రానికి సంబంధించి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు నాగమల్లేశ్వర సిద్ధాంతి తెలిపారు. అయితే బాలకృష్ణ పర్యటన గోప్యంగా ఉంచారు. ప్రత్యేక పూజలు అనంతరం బాలకృష్ణ, ఆయన కుమారుడు ప్రత్యేక వాహనాల్లో విడివిడిగా వెళ్లిపోయారు. -
బాలయ్య వారసుడు సినిమాల్లోకి రాడా..?
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తిరుగులేని మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే బాలయ్య జనరేషన్ హీరోలందరూ తమ వారసులను వెండితెరకు పరిచయం చేసినా.. బాలకృష్ణ మాత్రం ఇంకా మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నాడు. చాలా కాలం కిందటే త్వరలో మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని చెప్పిన బాలకృష్ణ, తరువాత సైలెంట్ అయిపోయాడు. అయితే మోక్షజ్ఞకు హీరో అయ్యే ఆలోచన లేదన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. బిజినెస్‌లో ఎదగాలనకుంటున్న మోక్షజ్ఞ ఇప్పటి వరకు నటన మీద దృష్టి పెట్టలేదన్న ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఒకటి, రెండు సార్లు కెమెరా కంటపడ్డ మోక్షజ్ఞను చూస్తే ఈ వార్తలు నిజమే అనిపిస్తాయి. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ ఏ మాత్రం సిద్ధంగా లేడన్న విషయం అర్థమవుతోంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోలోనూ నందమూరి వారసుడు చబ్బీ చబ్బీగా కనిపిస్తున్నాడు. దీంతో నందమూరి వారసుడి ఎంట్రీ డౌటే అన్న వార్తలు మరింత ఊపందుకున్నాయి. మరి ఇప్పటికైన బాలయ్య మోక్షజ్ఞ తెరంగేట్రంపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. -
బాలయ్య వారసుడి లుక్.. నిరాశలో ఫ్యాన్స్
బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తెరగేట్రం కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 2018లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలోనే ప్రకటించినా తరువాత వాయిదా వేశారు. మోక్షజ్ఞ తొలి చిత్రం కోసం క్రిష్, బోయపాటి లాంటి దర్శకులు కథలు రెడీ చేస్తున్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరగుతోంది. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ ఫోటో అభిమానుల ఆశలను ఆవిరి చేస్తోంది. బాలయ్య, వసుంధర, మోక్షజ్ఞలు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలో మోక్షజ్ఞ లుక్‌పై నందమూరి అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. మెక్షజ్ఞ లుక్స్ పరంగా సాదాసీదా ఉండటం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. చాలా రోజులుగా తెరంగేట్ర కోసం మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతున్నా ఆ ఫొటోలు చూస్తే నిజమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. -
మోక్షజ్ఞ ఎంట్రీపై బోయపాటి క్లారిటీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ. చాలా రోజులుగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్‌ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ పరిచయమవుతాడన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ ఆలోచనను వాయిదా వేశారు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో మోక్షజ్ఞ తళుక్కుమంటాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై కూడా నందమూరి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే గతంలో మోక్షజ్ఞ తొలి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందన్న వార్తల వినిపించాయి. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన బోయపాటి.. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తాను డైరెక్ట్ చేయబోవటం లేదన్నారు. తాను ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే అభిమానులు అంచనాలు తారా స్థాయికి చేరతాయని, తొలి సినిమాకు ఆ స్థాయి అంచనాలు కరెక్ట్ కాదన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండగా తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. -
‘యన్.టి.ఆర్’లో బాలయ్య ఎవరంటే..?
నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా తొలి భాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఏ పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే బాలకృష్ణ పాత్రలో ఎవరు కనిపించనున్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బాలకృష్ణ చిన్నప్పటి పాత్రను ఆయన మనవడు చేస్తున్నట్టుగా ప్రకటించిన హీరో అయ్యాక కనిపించే సన్నివేశాల్లో ఆ పాత్ర ఎవరు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా బాలయ్య పాత్రలో ఆయన తనయుడు మోక్షజ్ఞ నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారట. తండ్రి పాత్రతో పాటు తన పాత్రలోనూ తానే కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మరి అసలు విషయం తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
మోక్షజ్ఞ డెబ్యూకు డైరెక్టర్ ఫిక్స్..!
నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు వినిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్ లాంటి దర్శకులతో సినిమాలు కన్ఫామ్ అయినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడి పేరు వచ్చి చేరింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు సాండల్‌వుడ్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, యంగ్ హీరో ఇషాన్‌లను వెండితెరకు పరిచయం చేశాడు పూరి. మాస్, యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చిత్రాలు తెరకెక్కించటంలో పూరి స్పెషలిస్ట్. ఇటీవల పూరి దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేసిన బాలయ్య, పూరి డైరెక్షన్లో మోక్షజ్ఞను పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే ప్రస్తుతం పూరి ట్రాక్ రికార్డ్ అంత బాగోలేదు. అయినా బాలయ్య తన తనయుడిని పూరి చేతుల్లో పెడతాడేమో చూడాలి. -
మోక్షజ్ఞకు జోడిగా రకుల్..?
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. ఇప్పటికే లెజండరి యాక్ట్రెస్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే కోవలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పలు ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక పూర్తై శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రకుల్ ప్రీత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారంట. వివరాల ప్రకారం.. ఈ చిత్రంలో రకుల్ ఎన్టీఆర్‌కు పాలు అమ్మే మహిళ పాత్రలో, బాలాయ్య తనయుడు మోక్షజ్ఞతో జత కట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్న సంగతి తెలిసిందే. యువ ఎన్టీఆర్‌కు జోడిగా రకుల్ జతకట్టనున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు చిత్రంలో కీలకం కానున్నయని టాక్. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ‘ఎన్టీఆర్’ చిత్రంలో రకుల్‌ని అలనాటి అందాల తార శ్రీదేవి పాత్ర కోసం తీసుకోనున్నట్లు సమాచారం. మరి ఇంతకు రకుల్ ఎవరి పాత్రలో కనిపిస్తుందనే సస్పెన్స్ వీడాలంటే.. రకుల్ లేదా చిత్ర యూనిట్ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ అభిమానులు ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్లో పాల్గొనడం కోసం విద్యా రామోజీ ఫిలీం సిటిలో ఎంటర్ అయ్యారు. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం అండ్ విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. -
వచ్చే ఏడాది వారసుడొస్తాడు!
నందమూరి అభిమానులకు శుభవార్త. వాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాది తెరంగేట్రం చేయనున్నాడు. తనయుడి ఎంట్రీకి బాలకృష్ణ ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే... ఆ సినిమాకు దర్శకుడెవరు? నిర్మాత ఎవరు? అనే వివరాలను చెప్పలేదు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది వారసుడి తొలి సినిమా ప్రారంభమవుతుందని బాలకృష్ణ స్పష్టం చేశారు. -
చారిత్రక కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ..?
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఘనవిజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, తన వారసుడి ఎంట్రీకి కూడా అదే తరహా కథ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. అందుకే చారిత్రక కథాంశంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అద్భుత విజయాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చారిత్రక చిత్రంతో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అయ్యే అవకాశం ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత వెంకటేష్ హీరోగా థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నాడు క్రిష్. ఆ సినిమా తరువాత మరోసారి బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేసేందుకు అంగకీరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వల్గా శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సహాయ దర్శకునిగా మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సహాయ దర్శకునిగా చేస్తున్నారా? అవును. అది నిజం. బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి మోక్షజ్ఞ సహాయ దర్శకునిగా చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. హీరోగా వచ్చే లోపు సినీ రంగంలోని అన్ని శాఖలపై అవగాహన ఉంటే ఉపయోగమని మోక్షజ్ఞను ఈ చిత్రానికి సహాయదర్శకునిగా చేయమని బాలకృష్ణ సలహా ఇచ్చి ఉంటారు. ఒకవైపు ఈ పనిచేస్తూనే, హీరోగా ఎంట్రీకి కసరత్తులు చేస్తున్నారట మోక్షజ్ఞ. -
బాలయ్య వారసుడి ఎంట్రీ నిజమేనా?
నటరత్న బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంబంధించి తాజా వార్త ఒకటి సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో నందమూరి మూడోతరం వారసుడు, బాలయ్య తనయుడు 21 ఏళ్ల మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతారన్న కథనం టాలీవుడ్లో షికారు చేసింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో మోక్షజ్ఞ బాలకృష్ణ కొడుకు పాత్రలో కనిపిస్తారని కథనాలు వచ్చాయి. ఈ కథనాలు హల్చల్ చేస్తుండటంతో తాజాగా సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ కథనాలు వట్టి వదంతులేనని తేల్చింది. ఈ సినిమాలో అసలు మోక్షజ్ఞను తీసుకోవాలని భావించలేదని, ఇందులో అతన్ని వారసుడిగా పరిచయం చేసేందుకు తగిన పాత్ర లేకపోవడమే ఇందుకు కారణమని చిత్రవర్గాలు తెలిపాయి. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందిన శాతకర్ణి చక్రవర్తి పాత్ర చుట్టే కథ నడుస్తుందని, శాతకర్ణిగా నటిస్తున్న బాలయ్యపైనే కథ కేంద్రీకృతమై ఉంటుందని, కాబట్టి ఈ సినిమాలో మోక్షజ్ఞకు సరిపోయే కీలక పాత్రకు అవకాశం లేదని చిత్రవర్గాలు స్పష్టం చేశాయి. దాదాపు రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 9 నుంచి మొరాకోలో ప్రారంభం కానుంది. ఇక్కడ భారీ యుద్ధ ఘట్టాన్ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో హేమామాలిని, కబీర్ బేడి వంటి సీనియర్ నటులు నటిస్తుండగా, బాలయ్య సరసన కనిపించనున్న హీరోయిన్ను ఇంకా ఎంపిక చేయలేదు. -
సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ
హైదరాబాద్: ఇటీవల విడుదలైన తన సినిమా 'డిక్టేటర్' చాలా బాగుందని, ఈ చిత్రాన్ని చూడటానికి రావాలని సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. ఇది తన 99 వ చిత్రమని, త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ 100 వ సినిమాపై కేసీఆర్ ఆరా తీయగా.. ఆదిత్య 369 కు సీక్వెల్ గా సినిమా చేస్తున్నట్టు చెప్పారు. తాను అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు అందుతున్న సేవలను వివరించారు. రోగుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో పలు నిర్మాణాలు చేపట్టామని , వాటిని బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించాలిన బాలకృష్ణ కోరారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని సీఎం తెలిపారు. రోగులతో పాటు, వారికి సహాయకులుగా వచ్చే వారికోసం కూడా కనీస సౌకర్యాలు అందించే విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. సహాయకులు ఉండటానికి షెల్టర్లు, కనీస వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని అన్ని ఆసుపత్రుల వద్ద ఇలాంటి సదుపాయాలు ఉండేలా చూస్తామని చెప్పారు. ఈ విషయంపై ఆసుపత్రుల యాజమాన్యాలతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. -
నా 100వ సినిమాలో మోక్షజ్ఞ: బాలకృష్ణ
తిరుపతి: కొత్త శకానికి సంక్రాంతి పండుగ నాంది పలకాలని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ సారి ఆయన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని,దేవుడు చల్లని చూపు చూడాలని, పంటలు బాగా పండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. అయితే అవకాశం వస్తే సమర్థవంతంగా పని చేస్తానని బాలయ్య తన మనసులోని మాటను బయటపెట్టారు. హిందుపురం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాలకృష్ణ అన్నారు. ఇక తన వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై బాలకృష్ణ పలు విషయాలు వెల్లడించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ 'చివరికి సినిమాల్లోకే రావాలి కదా...నా వందో సినిమాలో మా అబ్బాయి నటించవచ్చు' అని తెలిపారు. డిక్టేటర్ సినిమాపై బాలకృష్ణ మాట్లాడుతూ...అభిమానులకు ఆ సినిమా ఫుల్ ప్లేట్ మీల్స్‌గా ఉందని, అన్ని అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు బాలయ్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. -
బాలయ్య వారసుడి ఎంట్రీ..?
టాలీవుడ్లో స్టార్ వారసుల ఎంట్రీకి యమా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుంటుంబాల నుంచి వచ్చే స్టార్ వారసుల రాక కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలా ఇండస్ట్రీ వర్గాల చాలారోజులుగా ఎదురుచూస్తున్న స్టార్ వారసుడు నందమూరి మోక్షజ్ఞ. బాలకృష్ణ నట వారసుడిగా ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ తెరగేంట్రంపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తన 99వ సినిమా డిక్టేటర్‌ను పూర్తిచేసిన నందమూరి బాలకృష్ణ, తన 100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీనును ఎనౌన్స్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ మాత్రం కన్ఫామ్ కాలేదు. అయితే అదే సమయంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వల్గా ఆదిత్య 999ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సింగీతం కథ కూడా రెడీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలక సన్నివేశంలో ఓ యువరాజు పాత్ర కనిపిస్తుందట. ఆ పాత్రను బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు సింగీతం శ్రీనివాస్. అయితే ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై దృష్టిపెట్టిన నందమూరి ఫ్యామిలీ, ఈ విషయం పై కూడా ఆలోచిస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్. -
మోక్షజ్ఞను చంపిందెవరు..?!
-
'మోక్షజ్ఞ కేసు'లో కొత్త మలుపు
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తండ్రి, కుటుంబ సభ్యులే చిన్నారిని చంపి ఉంటారని మోక్షజ్ఞ తల్లి విమల ఆరోపించారు. తన భర్త భాస్కరరావుకు జాతకాల పిచ్చి ఉందని విమల చెప్పారు. మోక్షజ్ఞ తండ్రికీడుతో పుట్టాడని జాతకం చెప్పారని వివరించారు. మోక్షజ్ఞ హత్య వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుందని విమల సందేహం వ్యక్తం చేశారు. జాతకాల పిచ్చితో తన భర్తే తండ్రి చంపి ఉండొచ్చని విమల అన్నారు. విజయవాడ సమీపంలో కనకదుర్గమ్మ వారిధి పై నుంచి మోక్షజ్ఞను కృష్ణానదిలోకి విసిరి చంపేసిన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ కృష్ణానదిలోకి విసిరేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. మోక్షజ్ఞ తల్లిదండ్రులు విమల ప్రియ, భాస్కరరావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. -
పసి ప్రాణంపై కసి
*కనకదుర్గమ్మ వారధి వద్ద ఘోరం *నదిలోకి విసిరేసి అన్న కుమారుడిని అంతం చేసిన బాబాయి *తాతయ్య, నానమ్మల వద్దకు వచ్చి బాబాయి చేతికి చిక్కిన చిన్నారి *ఇంటికి రాలేదని వెతుకుతూ వస్తుండగా కనిపించిన మృతదేహం * గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముద్దుముద్దు మాటలు మూగబోయాయి.. బుడిబుడి అడుగులు ఆగిపోయాయి.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి. హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజను సొంత బాబారుు హరిహరన్ బుధవారం అర్ధరాత్రి దాటాక కనకదుర్గమ్మ వారిధి పై నుంచి కృష్ణానదిలోకి విసిరి కసిగా ఉసురు తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. తాడేపల్లి రూరల్(గుంటూరు) : అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతుకానికి కారకుడైన నిందితుడూ కనిపించకుండా పోయాడు. అసూయతో ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరి హత్య చేయడం సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానాల మధ్య నదిలో తేలియాడుతున్న మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ(18 నెలలు)ను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, కుటుంబీకులు బంధువుల కథనం మేరకు మోక్షజ్ఞతేజ హత్యోదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. ఏఎస్ఐ రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్ కూడా ఉద్యోగంలో స్థిరపడగా, మూడవ కుమారుడు, ఈ సంఘటనలో నిందితుడైన హరిహరణ్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు.ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిన్నారి మోక్షజ్ఞతేజ తండ్రి భాస్కరరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడైన హరిహరణ్‌కు హితబోధ చేసి వెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరణ్.. బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు చేరుకున్న రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ ‘బాబాయి చేతిలో బలైపోయావా నాన్నా’ అంటూ బోరున విలపించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, తాడేపల్లి ఎస్ఐ దుర్గాసి వినోద్‌కుమార్‌లకు జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ వివరించారు. చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరణ్ వారధిపై నుంచి విసిరి నదిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. వారధిపై ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఏడాది బాలుడు అపహరణ.. ఆపై హత్య