నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ. చాలా రోజులుగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్‌ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ పరిచయమవుతాడన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ ఆలోచనను వాయిదా వేశారు. తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో మోక్షజ్ఞ తళుక్కుమంటాడన్న టాక్ వినిపిస్తోంది.
ఈ విషయంపై కూడా నందమూరి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే గతంలో మోక్షజ్ఞ తొలి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందన్న వార్తల వినిపించాయి. తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన బోయపాటి.. మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తాను డైరెక్ట్ చేయబోవటం లేదన్నారు. తాను ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే అభిమానులు అంచనాలు తారా స్థాయికి చేరతాయని, తొలి సినిమాకు ఆ స్థాయి అంచనాలు కరెక్ట్ కాదన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండగా తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి.
Comments
Please login to add a commentAdd a comment