మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఇతనేనా! | Nandamuri Balakrishna's Son Mokshagna Debut Movie Directed By Prasanth Varma | Sakshi

పాన్‌ ఇండియా డైరెక్టర్‌తో నందమూరి వారసుడి ఎంట్రీ!

Published Wed, Jul 3 2024 1:46 PM | Last Updated on Wed, Jul 3 2024 2:47 PM

Nandamuri Balakrishna's Son Mokshagna Debut Movie Directed By Prasanth Varma

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయన  డెబ్యూ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం రకరకాల గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఇస్తాడని ఓ సినిమా వేడుకలో బాలయ్య చెప్పాడు. దీంతో ఈ నందమూరి హీరోని వెండితెరకు పరిచయం చేసే డైరెక్టర్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

ఇప్పటికే పలువురు యువ దర్శకులు మోక్షజ్ఞ కోసం కథలు సిద్ధం చేశారట. కొంతమంది అయితే బాలయ్యకు కథలు కూడా వినిపించి.. గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నారట. కానీ బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను ‘హను-మాన్‌’ ఫేం ప్రశాంత్‌ వర్మకు అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్‌ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. మోక్షజ్ఞ బర్త్‌డే(సెప్టెంబర్‌ 6, 2024) నాడు సినిమా అనౌన్స్‌ మెంట్‌ ఉంటుందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. 

తన పాత్ర కోసం మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడట. గతంలో కొంచెం బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ..ఇటీవల బాగా సన్నబడ్డారు. స్టైలిక్‌ లుక్‌తో ఫోటో షూట్‌ నిర్వహించి వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు.  మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించబోన్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement