మోక్షజ్ఞ ఎంట్రీ షురూ | Mokshagna Entry with Director Prashanth Varma | Sakshi
Sakshi News home page

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ

Published Sat, Sep 7 2024 12:57 AM | Last Updated on Sat, Sep 7 2024 3:45 PM

Mokshagna Entry with Director Prashanth Varma

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఎం తేజస్వినీ నందమూరి సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు (సెప్టెంబర్‌ 6) సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. 

ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘నాపై, నా కథపై బాలకృష్ణగారు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. మన ఇతిహాసాల నుండి పొందిన స్ఫూర్తితో ఈ కథ ఉంటుంది’’ అన్నారు. ‘‘మోక్షజ అరంగేట్రానికి సరి΄ోయే కథను ప్రశాంత్‌ వర్మ సిద్ధం చేశారు. ఇప్పటికే నటన, ఫైట్స్, డ్యాన్స్‌లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకున్నారు’’ అని సుధాకర్‌ చెరుకూరి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement