
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అతడి మొదటి సినిమా రాబోతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం (డిసెంబర్ 5న) నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ నేడు జరగాల్సిన పూజా కార్యక్రమం వాయిదా పడింది.
మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదంటూ బాలకృష్ణ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు కాల్ చేశాడు. సినిమా ఓపినింగ్‌కుగానూ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా సెట్ వేశారు. ఇందుకోసం నిర్మాత దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment