
నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. అయితే వేడుకలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తన మాటలతో అందరినీ నవ్వించారు. శ్రీలీలతో హీరోయిన్‌గా చేస్తా అన్నందుకు మోక్షజ్ఞ ఇలా అన్నాడంటూ నవ్వులు పూయించారు.
(ఇది చదవండి: ‘భగవంత్ కేసరి’.. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది)
వేదికపై బాలయ్య మాట్లాడుతూ..' శ్రీలీల నన్ను చిచా, చిచా అని పిలిచి టార్చర్ పెట్టినావ్. నాతో సినిమాలో నటించావ్ సరే. కానీ నెక్ట్స్ సినిమాలో మనిద్దరం హీరో, హీరోయిన్లుగా చేద్దామన్నా. అయితే ఇదే మాటను ఇంటికి వెళ్లి మా వాళ్లతో చెప్పా. మా వాడు మోక్షజ్ఞకు కోపం వచ్చింది. ఏం డాడీ నెక్ట్స్ నేను కుర్ర హీరోను కాబోతున్నా. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తావ్. ఏం డాడీ నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని అనిండు.' అని అన్నారు. ఈ మాటలకు వేదికపై ఉన్న వారందరు నవ్వారు. అయితే ఇదే డైలాగ్ భగవంత్ కేసరిలో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే అంటూ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు. కాగా.. ఈ చిత్రం విజయదశమి సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
"#Sreeleela పక్కన హీరో గా చేస్తా అంటే మా మోక్షు అన్నాడు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని" - #Balakrishna pic.twitter.com/Rqf655In7K
— Daily Culture (@DailyCultureYT) October 8, 2023
Comments
Please login to add a commentAdd a comment