
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే’. సెలబ్రిటీలతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ఆహా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ షోకు సంబంధించి మరో సాలిడ్ అప్‌డేట్ వదిలారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ టీజర్‌ను రేపు(మంగళవారం)విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి బాలయ్య లుక్‌ను ఆహా విడుదల చేసింది.దులో బాలకృష్ణ క్యాప్ పెట్టుకుని, డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన టీజర్ రేపు సా. 6గంటలకు విజయవాడలో లాంచ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment