మోక్షజ్ఞ డెబ్యూకు డైరెక్టర్‌ ఫిక్స్‌..! | Nandamuri Mokshgna Debut In Puri Jagannadh Direction | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 13 2018 3:22 PM | Last Updated on Tue, Nov 13 2018 3:22 PM

Nandamuri Mokshgna Debut In Puri Jagannadh Direction - Sakshi

నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు వినిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్‌ లాంటి దర్శకులతో సినిమాలు కన్ఫామ్‌ అయినట్టుగా కూడా వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో దర్శకుడి పేరు వచ్చి చేరింది. డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో పాటు సాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌, యంగ్ హీరో ఇషాన్‌లను వెండితెరకు పరిచయం చేశాడు పూరి.

మాస్, యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే చిత్రాలు తెరకెక్కించటంలో పూరి స్పెషలిస్ట్‌. ఇటీవల పూరి దర్శకత్వంలో పైసా వసూల్‌ సినిమా చేసిన బాలయ్య, పూరి డైరెక్షన్‌లో మోక్షజ్ఞను పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే ప్రస్తుతం పూరి ట్రాక్‌ రికార్డ్ అంత బాగోలేదు. అయినా బాలయ్య తన తనయుడిని పూరి చేతుల్లో పెడతాడేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement