ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు..? ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరూ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా డార్లింగ్‌కు కాబోయే సతీమణి వివరాలను రామ్ చరణ్ వెళ్లడించారు. బాలకృష్ణ (Balakrishna) నిర్వహించే అన్‌స్టాపబుల్ వేదికగా చరణ్(Ram Charan) ఈ విషయాలు చెప్పనట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ రివీల్ చేశారని టాక్ ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో పాటు చరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే ఒక భాగం టెలికాస్ట్ అయింది. రెండో భాగం జనవరి 14న విడుదల అవుతుంది. అయితే, ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మరో రెండురోజుల్లో ప్రసారం కానుంది. అందులో ప్రభాస్ పెళ్లి విశేషాలు ఏమైనా తెలుపుతారేమో చూడాలి. ఈ వార్త బయటకు రాగానే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌కు రామ్ చరణ్ ఫోన్ చేసి మాట్లాడుతారు. అదే సమయంలో బాలయ్య కూడా సరదాగా పలు విశేషాల గురించి డార్లింగ్‌తో ముచ్చటించారు. చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రభాస్ అక్కడ పంచుకున్నారు. ఇదే షోలో చరణ్ స్నేహితులు శర్వానంద్, విక్కీ కూడా పాల్గొన్నారు.
2025 దసరా లోపు పెళ్లి
కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి రీసెంట్‌గా ప్రభాస్ పెళ్లి గురించి ప్రకటించారు. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. అమ్మాయి ఎవరు..? డేట్ వంటి వివరాలు చెప్పను గానీ అంటూనే త్వరలో శుభకార్యం తప్పకుండా ఉంటుందని ఆమె అన్నారు. ఈ దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చరణ్ మాటలు చూస్తుంటే డార్లింగ్ పెళ్లి త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు)
సలార్,కల్కి సినిమాల హిట్‌తో ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ లైనులో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన డైరీలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment