మోక్షజ్ఞ- ప్రశాంత్‌ వర్మ సినిమాపై రూమర్స్‌.. చిత్ర యూనిట్‌ క్లారిటీ | Movie Makers Gives Clarity On Rumours About Balakrishna Son Mokshagna Teja And Prasanth Varma Project | Sakshi
Sakshi News home page

మోక్షజ్ఞ- ప్రశాంత్‌ వర్మ సినిమాపై రూమర్స్‌.. చిత్ర యూనిట్‌ క్లారిటీ

Published Thu, Dec 19 2024 7:16 AM | Last Updated on Thu, Dec 19 2024 10:05 AM

Balakrishna Son Mokshagna Teja Movie Makers Comments On His Project

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే, ఈ చిత్రం ప్రకటనతోనే ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ఒక వార్త ట్రెండ్‌ అయింది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మోక్షజ్ఞకు అనారోగ్యం కారణం పేరుతో మొదలు కాలేదు. ఇదే విషయాన్ని మీడియా వేదికగా బాలయ్య చెప్పారు. దీంతో మోక్షజ్ఞ సినిమాకు బ్రేకులు పడ్డాయిని భారీగా రూమర్స్‌ రావడం జరిగింది. అయితే, తాజాగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

మోక్షజ్ఞ- ప్రశాంత్‌ వర్మ ప్రాజెక్ట్‌పై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌’ తాజాగా ఇలా స్పందించింది.  'మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి పలు రూమర్స్‌ వచ్చాయి. అందులో ఏవీ నిజం కాదు. ఈ ప్రాజెక్ట్‌ గురించి భవిష్యత్‌లో ప్రకటనలు, అప్‌డేట్స్‌ను మా సోషల్‌మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తాము.  @SLVCinemasOffl, @LegendProdOffl మా ఎక్స్‌ ఖాతాలలో మాత్రమే ప్రకటిస్తాము. పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలను ఎంకరేజ్‌ జయకండి అని కోరుతున్నాము'. అని ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లెజెండ్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ సంయుక్తంగా సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రంగా కొత్త సంవత్సరంలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. బాలయ్య హిట్‌ సినిమా ఆదిత్య 369 సీక్వెల్‌లో కూడా మోక్షజ్ఞ నటిస్తున్నారు.  'ఆదిత్య 999 మ్యాక్స్‌' పేరుతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో తన తండ్రితో కలిసి ఆయన మెప్పించనున్నారు. ఈమేరకు బాలకృష్ణ ఒక ప్రకటన కూడా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement