mokshagna teja
-
మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ సినిమాపై రూమర్స్.. చిత్ర యూనిట్ క్లారిటీ
నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ చిత్రం ప్రకటనతోనే ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ఒక వార్త ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మోక్షజ్ఞకు అనారోగ్యం కారణం పేరుతో మొదలు కాలేదు. ఇదే విషయాన్ని మీడియా వేదికగా బాలయ్య చెప్పారు. దీంతో మోక్షజ్ఞ సినిమాకు బ్రేకులు పడ్డాయిని భారీగా రూమర్స్ రావడం జరిగింది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్ఎల్వీ సినిమాస్’ తాజాగా ఇలా స్పందించింది. 'మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి పలు రూమర్స్ వచ్చాయి. అందులో ఏవీ నిజం కాదు. ఈ ప్రాజెక్ట్ గురించి భవిష్యత్‌లో ప్రకటనలు, అప్డేట్స్ను మా సోషల్‌మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తాము. @SLVCinemasOffl, @LegendProdOffl మా ఎక్స్ ఖాతాలలో మాత్రమే ప్రకటిస్తాము. పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలను ఎంకరేజ్ జయకండి అని కోరుతున్నాము'. అని ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి.సినిమాస్ సంయుక్తంగా సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రంగా కొత్త సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలయ్య హిట్ సినిమా ఆదిత్య 369 సీక్వెల్లో కూడా మోక్షజ్ఞ నటిస్తున్నారు. 'ఆదిత్య 999 మ్యాక్స్' పేరుతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో తన తండ్రితో కలిసి ఆయన మెప్పించనున్నారు. ఈమేరకు బాలకృష్ణ ఒక ప్రకటన కూడా చేశారు.AN IMPORTANT ALERT about our Next @PrasanthVarma - @MokshNandamuri Project.Please stop spreading fake news. All official information will come through official channels only.#PVCU2#MTejeswiniNandamuri @sudhakarcheruk5 @LegendProdOffl @ThePVCU pic.twitter.com/V9fXc7E0sy— SLV Cinemas (@SLVCinemasOffl) December 18, 2024 -
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలయ్య తన కుమారుడి వెండితెర ఆరంగ్రేటంపై తొలిసారి స్పందించారు. ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తారా అన్న వార్తలపై అంతా దైవ నిర్ణయం అని నవ్వుతూ అన్నారు. అఖండ సీక్వెల్‌పై బాలయ్య ఏమన్నారంటే.. బాలయ్య బ్లాక్‌బస్టర్ చిత్రం అఖండ. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని.. అధికారిక ప్రకటించడమే ఆలస్యమని అన్నారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌కు హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. -
ఆరాధ్య.. ఉదయ్ కిరణ్.. లక్ష్మీప్రియ.. మోక్షజ్ఞ..
హైదరాబాద్: అభంశుభం తెలియని చిన్నారులను అయినవారే హతమారుస్తున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆస్తులు, అక్రమ సంబంధాలు, తగవులతో పసివాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. పెద్దోళ్ల ఆవేశకావేశాలకు చిన్నారులు సమిధలు మారుతున్నారు. తెలుగు గడ్డపై ఇటీవల చోటు చేసుకున్న మూడు ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా రెండేళ్ల వయసున్న మోక్షజ్ఞను సొంత చిన్నాన్నే కడతేర్చిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తెనాలికి చెందిన మోక్షజ్క్ష అనే బాలుడ్ని సొంత చిన్నాన్నే కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆస్తి కోసమే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. మోక్షజ్ఞ తండ్రి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. భార్యతో ఏకాంతానికి అడ్డుగా మారిందన్న అక్కసుతో ఆరాధ్య అనే 19 నెలల చిన్నారిని సొంత బాబాయ్ పొట్టన పెట్టుకున్న అమానవీయ ఘటన ఒంగోలులో నవంబర్ లో చోటుచేసుకుంది. పసిపాపపై పెట్రోల్ పోసి నిప్పటించి పాశవికంగా చంపేశాడు. డబ్బుకోసం ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్‌ను స్వయానా పెదనాన్న కొడుకే కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వనస్థలిపురంలో జరిగింది. కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందన్న భయంతో ఉదయ్ కిరణ్ గొంతు నులిమి హత్య చేశారు. స్నేహితులతో కలిసి నిందితుడు ఈ కిరాతానికి ఒడిగట్టాడు. చిత్తూరు జల్లా తిరుచానూరులో లక్ష్మీప్రియ అనే ఐదేళ్ల చిన్నారిని వరుసకు మేనమామ అయ్యే వ్యక్తే మూడు రోజుల క్రితం హత్య చేశాడు. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులను అయినవారే అంతమొందించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.