
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలయ్య తన కుమారుడి వెండితెర ఆరంగ్రేటంపై తొలిసారి స్పందించారు. ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తారా అన్న వార్తలపై అంతా దైవ నిర్ణయం అని నవ్వుతూ అన్నారు.
అఖండ సీక్వెల్‌పై బాలయ్య ఏమన్నారంటే.. బాలయ్య బ్లాక్‌బస్టర్ చిత్రం అఖండ. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని.. అధికారిక ప్రకటించడమే ఆలస్యమని అన్నారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌కు హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment