
నందమూరి బాలకృష్ణ కొత్త మూవీపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్యతో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
(చదవండి: అన్‌స్టాపబుల్ సీజన్–2 ఆ రేంజ్‌లో ఉంటుంది : బాలయ్య)
ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య అన్‌స్టాపబుల్- 2 టీజర్‌కు దర్శకత్వం వహించారు. అయితే బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో చూడాలి. మరోపక్క బాలయ్య, దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ఒక సినిమా చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ సీజన్–2 ఈవెంట్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారంలో అన్‌స్టాపబుల్ సీజన్–2 అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment