హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లో హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎప్పటిలాగే నవీన్ పొలిశెట్టి నవ్వులు పంచాడు.. బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. సర్, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవ్వులు పూయించాడు.
క్లాసికల్ స్టైల్‌లో కుర్చీ మడతపెట్టి
శ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా.. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్ స్టైల్‌లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్. అతడి గానం విన్న శ్రీలీల.. తన వీణ భరించలేకపోతోందంటూ నవ్వేసింది. ఆడిషన్స్ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా.. నవీన్ ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.
సిక్స్ ప్యాక్ లేదని..
ఓ చిప్స్ కంపెనీ ఆడిషన్‌లో.. నాకు సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. అసలు చిప్స్ తిన్నవాడికి సిక్స్‌ప్యాక్ ఎలా వస్తుదని లాజిక్ పాయింట్ అడిగాడు. చివర్లో ముగ్గురూ కిస్సిక్ పాటకు స్టెప్పులేశారు. ఈ ఫన్‌ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment