Naveen Polishetty
-
థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తే.. మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.గతంలో విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/zUpUbt2SdV— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 The truth is on trial, and one lawyer is determined to prove it. ⚖️ Court: State vs A Nobody, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/HzHtBdITgc— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 No plan, no limits, only guts 💥 Jack, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/90hJsZEYKd— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
‘లక్కీ’ హీరోయిన్.. వరుస ఫ్లాపులు.. తగ్గని ఆఫర్స్
మాములుగా హీరోహీరోయిన్లకు ఫ్లాప్ వస్తే ఆఫర్స్ తగ్గిపోతాయి. స్టార్ హీరోలకు ఇందులో మినహాయింపు ఉంటుంది. వాళ్లకు ఫ్లాప్ వచ్చినా కొత్త సినిమాలకు కొదవ ఉండదు. కానీ హీరోయిన్ల పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. ఫ్లాప్ వస్తే పక్కన పెట్టేస్తుంటారు. కానీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )కి వరుస ఫ్లాపులు వచ్చినా..ఆఫర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. హిట్ 2తో హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో నటించింది. అయితే వాటిల్లో లక్కీ భాస్కర్ మినహా మిగతా చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవల వచ్చిన మట్కా, మెకానిక్ రాకీ చిత్రాలు భారీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో మీనాక్షి పని అయిపోయిందని అనుకున్నారు అంతా. ఇక ఆమె తెలుగు తెరకు దూరమైపోతుందని ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటికీ మీనాక్షిని ‘లక్కీ’గానే చూస్తోంది. ఫ్లాపులను పట్టించుకోకుండా ఆమెకు అవకాశాలు అందిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో మీనాక్షి హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏంటో తెలియదు కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక ఇప్పటికే ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనగనగా ఒక రాజుతో పాటు మరో రెండు సినిమాల్లో మీనాక్షి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా మీనాక్షి మూడు, నాలుగు చిత్రాలతో అలరించబోతుంది. -
'అంబానీ మామ.. నీకు వంద రీచార్జులు'.. నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా టీజర్
హీరోలు కూడా అలవోకగా కామెడీ పండించగలరు అని నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నిరూపించాడు. తను నోరు విప్పితే చాలు ఏదో ఒక పంచ్ రావాల్సిందే.. ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే! నేడు (డిసెంబర్ 26న) నవీన్ పొలిశెట్టి బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా (Anaganaga Oka Raju Movie) నుంచి రాజుగారి ప్రీవెడ్డింగ్ వీడియో రిలీజ్ చేశారు.ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే..టీజర్ ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పళ్లెంలో భోజనం వడ్డిస్తున్నారు. మరోవైపు రాజుగారు నవీన్ పొలిశెట్టి.. ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముకేశ్ అంబానీ ఫోన్ చేశాడట! ముకేశ్ మామయ్య... నీకు వంద రీచార్జులు.. ఇప్పుడే మన అనంత్ పెళ్లి క్యాసెట్ చూస్తున్నా.. అంటూ సంభాషణ మొదలుపెట్టాడు. తన ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే! జస్టిన్ బీబర్, కిమ్ కర్దాషియన్, జాన్ సేన.. అందరితో తన సంగీత్‌లో స్టెప్పులేయిస్తాడంటున్నాడు. చివర్లో పెళ్లికూతురు మీనాక్షి చౌదరితో ఫోటోషూట్ కూడా చేయించారు.ప్రీవెడ్డింగ్ వీడియో అదిరింది!ఈ ప్రీవెడ్డింగ్ వీడియో బ్లాక్‌బస్టర్ అవడం గ్యారెంటీ! మూడు నిమిషాల వీడియోలోనే ఇంత ఫన్ ఉంటే ఫుల్ సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందోనని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇకపోతే... అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
నవీన్ తో జోడి కడుతున్న మీనాక్షి..
-
సిక్స్‌ప్యాక్ లేదని నన్ను రిజెక్ట్ చేశారు: నవీన్ పొలిశెట్టి
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లో హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎప్పటిలాగే నవీన్ పొలిశెట్టి నవ్వులు పంచాడు.. బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. సర్, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవ్వులు పూయించాడు.క్లాసికల్ స్టైల్లో కుర్చీ మడతపెట్టిశ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా.. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్ స్టైల్లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్. అతడి గానం విన్న శ్రీలీల.. తన వీణ భరించలేకపోతోందంటూ నవ్వేసింది. ఆడిషన్స్ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా.. నవీన్ ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. సిక్స్ ప్యాక్ లేదని..ఓ చిప్స్ కంపెనీ ఆడిషన్లో.. నాకు సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. అసలు చిప్స్ తిన్నవాడికి సిక్స్‌ప్యాక్ ఎలా వస్తుదని లాజిక్ పాయింట్ అడిగాడు. చివర్లో ముగ్గురూ కిస్సిక్ పాటకు స్టెప్పులేశారు. ఈ ఫన్‌ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది. -
నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3లో సందడి
గాయం నుంచి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పూర్తిగా కోలుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తర్వాత అమెరికా వెళ్లారు నవీన్ పోలిశెట్టి.. అనుకోకుండా ఓ రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. చాలా రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నవీన్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. తాజాగా ప్రముఖ ఓటీటీలో ప్రాసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3లో నవీన్ పాల్గొని సందడి చేశాడు. నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ ఉన్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది. -
'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?
'జాతిరత్నాలు' అనగానే నవీన్ పొలిశెట్టి గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు. దీని తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అని మరో మూవీ చేశాడు. దీంతో కూడా హిట్ కొట్టాడు. ఇదొచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం చేతికి గాయం కావడంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇతడికి పెళ్లయిపోయిందనే రూమర్ తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దేవర' పాటపై కాపీ ట్రోల్స్.. నిర్మాత ట్వీట్ వైరల్)'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' రిలీజ్ టైంలో అమెరికా వెళ్లిన నవీన్.. చాలారోజుల నుంచి అక్కడే ఉన్నాడు. మొన్నీమధ్య ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ జరగడంతో చేతికి కట్టుతో కనిపించాడు. తన గాయం గురించి కొన్ని రోజుల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసి, తనకేం పర్లేదని త్వరలో కోలుకుంటానని కూడా చెప్పాడు.అయితే అమెరికాలో నవీన్ ఓ అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడని, అందుకే చాలారోజుల నుంచి అక్కడే ఉండిపోయాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నవీన్.. అలాంటిదే లేదని, తనకు పెళ్లి జరిగితే కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పాడు. సో అదన్నమాట విషయం.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఎడమ చేత్తో భోజనం.. ఫ్రాక్చర్‌తో జీవితం ఇలా అయిపోయిందంటున్న హీరో
జాతిరత్నాలు మూవీతో సినీప్రియులకు చెక్కిలిగింతలు పెట్టాడు హీరో నవీన్ పొలిశెట్టి. తన యాస, నటనతో అదరగొట్టేశాడు. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ హీరోకు కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో కుడి కాలు, చేయి ఫ్రాక్చర్ అయింది. అప్పటినుంచి సరిగా ఏ పనీ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా షూటింగ్స్‌కు విరామం చెప్పక తప్పలేదు. అయితే నెలలు గడుస్తున్నా ఆ బాధ నుంచి హీరోకు ఇంకా ఉపశమనం దొరకలేదు. ఫ్రాక్చర్ తర్వాత జీవితం ఇలా..కానీ ఇంత బాధలోనూ మరోసారి జనాల్ని నవ్వించాడు నవీన్ పొలిశెట్టి. ఫ్రాక్చర్ తర్వాత జీవితం ఇలా ఉందంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశాడు. హీరో వెంకటేశ్.. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ అని చెప్తున్న డైలాగ్ వినగానే నవీన్ తన చేయి చూసుకుని ఛానల్ మార్చేశాడు. అక్కడ కూడా చేయి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో అన్న చిరంజీవి డైలాగ్ వచ్చింది. దీంతో చేయి మీద డైలాగ్స్ వచ్చే ఛానల్స్ వద్దురా బాబోయ్ అని స్పోర్ట్స్ ఛానల్ పెట్టగా అక్కడ అంపైర్ రెండు చేతులు పైకెత్తుతూ సిక్స్ అని చూపించాడు.ఎడమ చేత్తో భోజనంఇదేం గోలరా బాబూ అనుకుంటే గానకోకిలకు చప్పట్లు అన్న డైలాగ్ వినిపించింది. కట్టుతో ఉన్న చేయితో చప్పట్లు కొట్టలేక ఎడమ చేతితో తన చెంపలు వాయించుకున్నాడు. చివర్లో ఫుడ్ కూడా తినడానికి అవస్థలు పడ్డాడు. ఎడమ చేత్తో భోజనం లాగించాడు. ఎవరైనా ఎడమ చేత్తో భోజనం తింటారా? ఇదేనా సంస్కారం? అన్న డైలాగ్ రాగానే వెంటనే పక్కనే ఉన్న శునకంలా కేవలం నోరు, నాలుకను ప్లేటుకు ఆనిస్తూ తినేశాడు.నవ్వు ఆయుధంనవ్వుతూ ఉంటే జీవితంలో ఏ ఇబ్బందులనైనా అధిగమించవచ్చు. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మిమ్మల్ని ఆనందపర్చడమే నాకిష్టం. పూర్తిగా కోలుకున్నాక నా కొత్త సినిమాలతో మిమ్మల్ని సంతోషపెట్టాలని ఎదురుచూస్తున్నాను. ఇట్లు మీ జానెజిగర్ నవీన్ పొలిశెట్టి అని చిన్న సందేశం ఇచ్చాడు. View this post on Instagram A post shared by Naveen Polishetty (@naveen.polishetty) చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు -
కుడి కాలు, చేయి ఫ్రాక్చర్.. కోలువకోడం కష్టంగా ఉంది: నవీన్ పొలిశెట్టి
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్లు మార్చి నెలలో ప్రచారం జరిగింది. బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కిందపడిపోయాడని, చేతికి బలమైన గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి తప్పనిసరని వైద్యులు సూచించినట్లు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం నిజమేనని ధ్రువీకరించాడు నవీన్ పొలిశెట్టి.కష్టకాలం..ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'ఇటీవలే జరిగిన ఓ ప్రమాదంలో కుడి చేయి, కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. దీనినవల్ల ఎంతో ఇబ్బందిపడుతున్నాను. ముఖ్యంగా సినిమా షూటింగ్స్ కూడా చేయలేకపోతున్నాను. ఈ గాయం వల్ల సినిమాలు ఆలస్యమయ్యేట్లున్నాయి. ఇది నాకు కష్టమైన, బాధాకరమైన సమయం. పూర్తి రికవరీ కోసం వైద్యుల సలహాతో మెడిసిన్ తీసుకుంటున్నాను. పూర్తిగా కోలుకునేందుకు..కోలుకోవడానికి మరికొన్ని నెలలు పట్టేటట్లు ఉంది. ఈసారి మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. గుడ్‌న్యూస్ ఏంటంటే.. నా అప్‌కమింగ్ ప్రాజెక్టుల స్క్రిప్ట్స్ అద్భుతంగా, మీకు నచ్చేవిధంగా రూపు దిద్దుకుంటున్నాయి. వాటి కోసం చాలా ఎగ్జయిట్ అవుతున్నా. కోలుకున్న వెంటనే షూటింగ్ మొదలుపెడతాను. ఏదైనా అప్డేట్స్ ఉంటే నేనే చెప్తాను. మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అందిస్తున్న సపోర్ట్‌కు థాంక్యూ.. మీ జానెజిగర్' అంటూ ఎక్స్‌లో ఓ నోట్ రిలీజ్ చేశాడు. Life update. Have unfortunately suffered severe multiple fractures in my hand 💔 and injured my leg too :( It’s been very tough but working towards full recovery so I can perform at my energetic best for you. Your support, patience and love is the only medicine I need ❤️… pic.twitter.com/IY0cYiAuDU— Naveen Polishetty (@NaveenPolishety) July 17, 2024 చదవండి: సినిమాకు అవార్డులు.. కానీ ఏం లాభం? రూ.22 కోట్ల నష్టం! -
జాతిరత్నాలు హీరోకు యాక్సిడెంట్?
జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా వీధుల్లో బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన చేతికి ఫ్రాక్చర్ అయిందట! చేతికి బలమైన గాయం అవడం వల్ల రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ హీరో కొంతకాలంపాటు సెట్‌కు దూరంగా ఉండాల్సిందేనన్నమాట! ఈ యాక్సిడెంట్ వార్తలపై నవీన్ స్పందించాల్సి ఉంది. కాగా నవీన్ పొలిశెట్టి చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేశాడు. ఇందులో అనుష్కతో జోడీ కట్టాడు. పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ మూవీని వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం నవీన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ఒక్క పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ! -
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్‌పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్‌బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
మిస్టర్ పొలిశెట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
డిప్రెషన్‌కు వాడే టాబ్లెట్ పేరేంటి?.. నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్!
ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అభిమానులను అలరించిన హీరో నవీన్ పొలిశెట్టి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ','జాతి రత్నాలు' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం 'జాతి రత్నాలు' డైరెక్టర్‌తోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలో నవీన్ మాట్లాడుతూ..' అరే వంశీ.. అదేదో డిప్రెషన్ కోసం ఏదో టాబ్లెట్ ఉందన్నావ్ కదరా.. ఆ టాబ్లెట్ పేరేంట్రా?.. ఒక ఫ్రెండ్ కోసం అడుగుతున్నారా? నాకోసం నేనేందుకు అడుగుతారా?.. ఇప్పుడు నా లైఫ్‌లో జాయ్‌ఫుల్ ఫేజ్‌లో ఉన్నా.. డోలో 650 నా.. అరే నువ్వు ఎంబీబీఎస్ చదివావా? లేక పేమేంట్ సీటా? అని అన్నారు. అయితే ఈ వీడియోకు వరల్డ్ కప్ ఫైనల్-2023 అంటూ ట్యాగ్ చేశారు. అయితే మ్యాచ్‌లో ఇండియా ఓటమిని ఇంకా మర్చిపోలేక ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Inkenni rojulo 💔 Asking for a friend . Dolo 650 daily #CWC2023Final pic.twitter.com/ssd0Je5DO5 — Naveen Polishetty (@NaveenPolishety) November 21, 2023 -
అతన్ని చూస్తే భయమేస్తోంది.. రిటైర్ అవుతానంటున్న బ్రహ్మజీ!
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో దాదాపు వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' చిత్రంలో ఖైదీలను ఉరి తీసే వైవిధ్యమైన తలారి పాత్రను పోషించారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు మోసాలు చేస్తున్నారంటూ అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రహ్మజీ చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు') ఇటీవల నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో పిల్లల చదువుల గురించి నవీన్ మాట్లాడే సీన్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. అంతే ఈ సీన్ ట్విట్టర్లో చూసిన బ్రహ్మజీ సైతం ఫిదా అయ్యారు. పోలిశెట్టి నటన చూస్తే నాకు భయమేస్తోంది.. ఇక నేను రిటైర్ అయిపోతా అంటూ ఫన్నీ పోస్ట్ చేశారు. దీనికి నవీన్ సైతం 'మీకు పవర్ ఉంది.. నాకు బ్రెయిన్ ఉంది.. మనిద్దరం కలిస్తే' అంటూ ఫన్నీగానే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. Ee abbayi talent chusthe naaku bhayamesthundi..ika Nenu retire ayipothe better..🙏🏼🙏🏼🙏🏼 https://t.co/3xQY0hgw1f — Brahmaji (@actorbrahmaji) October 8, 2023 -
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఓటీటీ అఫిషియల్ ప్రకటన వచ్చేసింది
అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో వెండితెరపై మెరిసింది. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో ఇప్పటి వరకు సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్.. సూసైడ్ లేఖతో చరణ్ అభిమాని వార్నింగ్..) తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నుంచి ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అఫిషీయల్‌గా నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు తొలి ప్రేక్షకుడిని నేనే అంటూ గతంలో చిరంజీవి తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో సినిమాకు ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. మెగాస్టార్‌తో పాటు మహేశ్ బాబు, సమంత కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ కంటే రెట్టింపు వినోదం ఇందులో ఉన్నట్లు వారందరూ తెలిపారు. థియేటర్లో ఈ సినిమా చూడలేకపోయిన వారు అక్టోబర్ 5న నెట్‌ఫ్లిక్స్ చూసి ఎంజాయ్ చేయండి. -
ఫ్రెండ్స్ ని ప్రీ రిలీజ్ కి పిలిపించి లాఠీతో కొట్టించాడు
-
నమ్మకం నిజమైంది
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో వాళ్లే మా సినిమాను ప్రమోట్ చేశారు. ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్‌కి వెళ్లాను. అమెరికాలో ప్రమోషన్‌కి వెళ్లినప్పుడు హోటల్లో నిద్రపోయే టైమ్ ఉండేది కాదు. ఈస్ట్ నుంచి వెస్ట్‌కు ప్రయాణం చేసే విమానంలోనే నిద్రపోయేవాణ్ణి. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్లా కాబట్టి నాకు కష్టం అనిపించలేదు’’ అని హీరో నవీన్ పోలిశెట్టి అన్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి విలేకరులతో చెప్పిన విశేషాలు. ► మంచి సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉండేది. అది నిజమైంది. తెలుగులో వసూళ్లు నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకున్నాయి.. మూడో వారంలోనూ మంచి వసూళ్లు ఉన్నాయి. అమెరికాలోనూ మూడో వారంలో మంచి వసూళ్లు ఉండటంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లోనూ షోలు పెంచుతున్నారు. మా మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ► నా తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నేను బాగా నటించగలనని నిరూపించింది. నా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రొడ్యూసర్స్, బయ్యర్స్‌లో వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు.. భావోద్వేగాలు కూడా పండించగలను అని నిరూపించుకున్నా. ► తెలుగులో చిరంజీవి, ప్రభాస్గార్లు, హిందీలో ఆమిర్ ఖాన్‌గారు ఇష్టం. అలాగే అన్ని జానర్స్ సినిమాలను ఇష్టపడతాను. హిందీలో రాజ్‌కుమార్ హిరాణీగారి చిత్రాలంటే ఇష్టం. తెలుగులో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, భైరవ ద్వీపం, ఆదిత్య 369’ వంటి సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ఆ గుర్తింపు వచ్చింది: నవీన్ పోలిశెట్టి
ఇప్పటి వరకు నేను చేసిన మూడు సినిమాలు(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి) చేశాను. ఈ మూడు సక్సెస్ఫుల్ మూవీస్ ఒక్కోటి నా కెరీర్‌కు ఒక్కో రకంగా హెల్ప్ చేశాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస..మూవీతో నేను బాగా నటించగలనే నమ్మకం వచ్చింది. జాతి రత్నాలు టైమ్ లో పాండమిక్ వచ్చింది. అప్పుడు సినిమాలు థియేటర్ లో చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి...నవీన్ సినిమా థియేటర్ లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ లో వచ్చింది. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నాను’అని యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అన్నాడు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్ మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు.. ►మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే మరోవైపు జవాన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పుడు ఎంతో టెన్షన్ పడ్డా. పెద్ద సినిమాతో వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే కంగారు ఉండేది. కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ తెలుగులో కలెక్షన్స్ నెమ్మదిగా మొదలయ్యాయి. కానీ యూఎస్ లో డల్లాస్ లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్ గా రన్ స్టార్ట్ అయ్యింది. మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్ లో కూడా యూఎస్ లో రన్ అవుతోంది. స్క్రీన్స్ పెంచుతున్నారు. ► మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. నా పర్ ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మహేశ్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్ గారు, సమంత..ఇంకా చాలా మంది చూసి వాలెంటరీగా రియాక్ట్ అయ్యారు. ఆడియెన్స్ కూడా వాళ్లకు వాళ్లే ముందుకొచ్చి మా సినిమాను ప్రమోట్ చేశారు. ► ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 15 సిటీస్ వెళ్లాను. అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు జర్నీ చేసే ఫ్లైట్ లోనే నిద్రపోయేవాడిని. హోటల్ లో నిద్ర పోయేందుకు కూడా టైమ్ ఉండేది కాదు. రిలీజ్ అయ్యాక కూడా మూవీ ప్రమోషన్ చేశాం. ప్రేక్షకులకు నా థ్యాంక్స్ చెప్పుకోవాడనికి వెళ్తున్నా. కాబట్టి అది కష్టం అనిపించలేదు. ► బాలీవుడ్ లో స్టాండప్ కామెడీ హిట్, తమిళంలో బాగా చూస్తారు. మన దగ్గర ఎందుకు సక్సెస్ కాలేదని అనిపించింది. అయితే మనం పర్పెక్ట్ గా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఛాలెంజ్ గా తీసుకుని చేశాను. ఇక్కడ కూడా స్టాండప్ కమెడియన్స్ కు ఆదరణ పెరిగితే హ్యాపీ. ► నటుడిగా ప్రతి సీన్ ను సెట్ లో ఇంప్రొవైజ్ చేసుకుంటా. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స్ అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. రేపు చేసే సీన్ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి పూర్తి క్లారిటీ తీసుకుంటా. ► ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. వచ్చే ఏడాది మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను కానీ నా ప్రయారిటీ ప్రస్తుతానికి తెలుగులో నటించడమే. -
ప్రేక్షకుల వల్లే అది సాధ్యమైంది
‘‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదల రోజే ఓ పెద్ద హిందీ సినిమా(జవాన్) రిలీజ్ అవుతోందని తెలినప్పుడు ఆందోళన చెందాం. కానీ ఈ నెల 7 నుంచి మొదలైన ప్రీమియర్స్ నుంచి ఇప్పటి వరకూ మా సినిమాకు మంచి స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల మౌత్‌టాక్‌తోనే ఇది సాధ్య మైంది.. మాకు పెద్ద హిట్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవంలో నవీన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను అందరికంటే ముందు చూసిన చిరంజీవిగారు హిట్ అవుతుందన్నారు.. ఆయన మాటే నిజం అయింది’’ అన్నారు. ‘‘నాకు వచ్చిన ఓ ఐడియాను నవీన్ , అనుష్కలతో పాటు నిర్మాతలు నమ్మకుంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు’’ అన్నారు పి.మహేశ్‌బాబు. దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్‌ఎకేఎన్ మాట్లాడారు. -
ఆడియన్స్ కోసం ఈ సినిమా.. సినిమా చూస్తే..!
-
మంచి సినిమాలను ప్రోత్సహించాలి
‘‘తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మరోసారి నిరూపించారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూప్రోత్సహించాలి. ‘జవాన్’ విడుదలైన రోజే వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నిలబడి, బలమైన వసూళ్లతో ముందుకెళ్తోంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పి. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని చిరంజీవి, మహేశ్‌బాబు, రవితేజ, రాజమౌళి, వంశీ పైడిపల్లి సమంత అభినందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో సక్సెస్ సెలబ్రేషన్స్, సక్సెస్ టూర్ ΄్లాన్ చేస్తున్నాం’’ అన్నారు ప్రమోద్. -
అనుష్క కోసం సమంత.. ఏం చేశారంటే
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలైంది. ఈ సినిమాకు ఆడియెన్స్‌తో పాటు సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను చూసి అభినందించారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!) తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అనుష్కతో ఆమెకు ఉన్న స్నేహం కోసం సినిమా చూశారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా తనను ఇంతగా నవ్వించలేదని చెప్పారు. సినిమాలో అనుష్క ఛార్మింగ్‌గా కనిపించారని చెప్పుకొచ్చారు. ఇందులో నవీన్ పోలిశెట్టి సూపర్బ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ఆమె పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి; ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్.. మరో కొత్త ట్విస్ట్!) ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. యూఎస్‌లో ఆఫ్ మిలియన్ డాలర్స్ మార్క్‌ను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చేరుకుంది. వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రాజమౌళి చెప్పినట్టే అయ్యిదిగా..!
-
'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి'. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన చిత్రం చూశానంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ డైరెక్టర్‌పై అట్లీని కొనియాడారు. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) కాగా.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా మహేశ్ బాబు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా కనిపించగా, అనుష్క చెఫ్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రాజమౌళి ట్వీట్లో రాస్తూ..'చాలా కాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూశాను. స్వీటీ ఎప్పటిలాగే తన అందంతో మెరిసిపోయింది. నవీన్ పొలిశెట్టి కామెడీ మంచి వినోదాన్ని అందించింది. సక్సెస్ సాధించిన చిత్ర బృందానికి అభినందనలు. ఇంత సున్నితమైన విషయాన్ని చాలా సరదాగా హ్యాండిల్ చేసినందుకు మహేశ్ బాబుకు వందనాలు!' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. (ఇది చదవండి: 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ) Watched 2 movies back to back after a long time…🙂 Sweety looked as beautiful and radiant as ever. @NaveenPolishety provided lots of laughter and loads of fun… Congratulations to the #MissShettyMrPolishetty’s team on their success. @filmymahesh, kudos to you for handling such… — rajamouli ss (@ssrajamouli) September 8, 2023 This is the reason why @IamSRK is the Baadshah of the box office… What an earth-shattering opening… 🤯🤯 Congratulations @Atlee_dir for continuing the success streak in the north too, and congrats to the team of #Jawan for the stupendous success…:) — rajamouli ss (@ssrajamouli) September 8, 2023 -
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. తొలిరోజు పేలవమైన కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి తొలిసారి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. కామెడీ, ఎమోషన్స్ కలగలిపి తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్ మాత్రం పేలవంగా వచ్చాయి. ఇండియాలో కేవలం రూ.4 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్స్‌కు అనుష్క దూరం కావడం వల్లే వసూళ్లు ఇంత పేలవంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మౌత్ టాక్ బాగుండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. మరోపక్క అదేరోజు రిలీజైన బాలీవుడ్ మూవీ జవాన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల మేర వసూళ్లు రాబట్టి రికార్డుల వేటకు సిద్ధమని సమరశంఖం పూరించింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఒకేరోజు రిలీజవడం నవీన్-అనుష్కల సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. జవాన్‌కు హిట్ టాక్ రావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మరి జవాన్ పోటీని తట్టుకుని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది చూడాలి! చదవండి: బేబి పెళ్లికొడుకు.. రియల్ లైఫ్‌లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్‌లు.. సూసైడ్ ఆలోచనలు.. -
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’మూవీ రివ్యూ
టైటిల్: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నటీనటుటు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదిరతులు నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: వంశీ-ప్రమోద్ దర్శకత్వం: పి.మహేశ్ బాబు సంగీతం:రధన్ నేపథ్య సంగీతం: గోపీ సుందర్ విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 కథేంటంటే.. అన్విత(అనుష్క శెట్టి) లండన్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ చెఫ్. ఆమె వంటకు లండన్ వాసులు ఫిదా అయిపోతారు. కెరీర్ పరంగా ఎంతో ఎదిగినా.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తుంది. ఆమె తల్లి(జయసుధ)ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా రిజెక్ట్ చేస్తుంది. పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తల్లితో తెగేసి చెబుతుంది. తల్లి మరణించిన తర్వాత.. తనకు ఓ తోడు కావాలనుకుంటుంది అన్విత. అందుకోసం ఓ బిడ్డను కనాలనుకుంటుంది. అది కూడా పెళ్లి చేసుకోకుండా. ఐయూఐ పద్దతిలో తల్లి కావాలని ఓ డాక్టర్ని సంప్రదిస్తుంది. స్పెర్మ్ డోనర్ని తనే వెతుకుతానని చెప్పి..తనకు నచ్చిన లక్షణాలు ఉన్న యువకుడి కోసం సెర్చ్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. తనతో క్లోజ్‌గా మూవ్ అయిన తర్వాత అసలు విషయం చెబుతుంది. అయితే అప్పటికే అన్వితతో ప్రేమలో పడిన సిద్దు ఆమెకు సహాయం చేశాడా? లేదా? అసలు అన్విత పెళ్లి చేసుకోకూడదని ఎందుకు నిర్ణయం తీసుకుంది? ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె దేశం విడిచి లండన్ ఎందుకు వెళ్లింది? చివరకు సిద్ధూ-అన్విత కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పెళ్లి కాకుండా తల్లి కావాలనుకునే ఓ యువతి కథే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ పాయింట్ వినగానే ఏదో వల్గారిటీ సినిమా అనే ఫిలింగ్ కలుగుతుంది. అదే సమయంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సినిమాలు ఒప్పుకోదులే అనే నమ్మకం కూడా ఉంటుంది. ఆ నమ్మకాన్ని కాపాడుతూ.. ఎలాంటి వల్గారిటీ లేకుండా, ప్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మహేశ్‌బాబు పి. ఓ సున్నితమైన అంశాన్ని కామెడీ, ఎమోషన్స్‌తో అతి సున్నితంగా తెరపై చూపించాడు. ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు కచ్చితంగా ఉండాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. అలా అని కథంతా సీరియస్‌గా సాగదు. కామెడీ వేలో చెబుతూనే.. అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఫేమస్ చెఫ్‌గా అనుష్కను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లితో ఆమె బాడింగ్ చూపించారు. అవి కాస్త ఎమోషనల్‌గా ఉన్నప్పటికీ.. రొటీన్‌గా అనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి ఎంట్రీ వరకు కథ చాలా సింపుల్‌గా సాగుతుంది. ఇక హీరో ఎంట్రీ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నప్పటి కామెడీతో కప్పేశారు. స్టాండప్ కమెడియన్‌గా హీరో చెప్పే జోకులు కొన్ని చోట్ల నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్ తెప్పిస్తాయి. హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడడం..ఆమె ఏమో అతన్ని స్పెర్మ్ డోనర్‌గా చూడడం.. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా అర్థమైపోతుంది. హీరోయిన్‌కి ప్రపోజ్ చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. స్పెర్మ్ డొనేషన్ కోసమే తనతో క్లోజ్‌గా మూవ్ అయిందనే విషయం తెలిశాక హీరో ఏం చేశాడనేది సెకండాఫ్. ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఆమె అడిగిన సహాయం చేస్తాడనేది అందరికి అర్థమైపోతుంది. కానీ ఈ క్రమంలో జరిగే సన్నివేశాలను హిలేరియస్‌గా రాసుకున్నాడు దర్శకుడు. ఆస్పత్రిలో డాక్టర్‌కి హీరో మధ్య జరిగే సంభాషనలు కానీ.. హీరోయిన్ ఇంటికి పిలిస్తే.. వేరేలా అనుకొని వెళ్లడం..ఈ సీన్లలన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. చివరల్లో మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. అసలు హీరోయిన్ ప్రేమ, పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందనే కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్గానూ కనెక్ట్ అవుతారు. అయితే కథంతా ఒక పాయింట్ చుట్టే తిరగడంతో సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే సినిమా ఫలితంగా మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం అనుష్క, నవీన్ పోలిశెట్టి పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, అనుష్క కాకుండా వేరేవాళ్లు నటించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. చెఫ్ అన్విత పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. తన స్టార్‌డమ్‌ని పక్కకిపెట్టి.. ఆ పాత్రలో ఎంతమేరకు నటించాలో అంతమేరకు చక్కగా నటించింది. తెరపై చాలా హుందాగా కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించింది. ఇక నవీన్ పోలిశెట్టి మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. స్టాండప్ కమెడియన్ సిద్దూ పాత్రలో జీవించేశాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. హీరోయిన్ తల్లిగా జయసుధ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకే ఆమె పాత్ర ముగుస్తుంది. ఇందులో ఆమె బాలయ్య వీరాభిమానిగా కనిపించడం గమనార్హం. హీరో తల్లిదండ్రులుగా తులసి, మురళీ శర్మలు రొటీన్ పాత్రలు పోషించారు. హీరో స్నేహితుడిగా అభినవ్ గోమఠం, హీరోయిన్ స్నేహితురాలిగా సోనియా దీప్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీ సుందర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. రధన్ పాటలు బాగున్నాయి. కథలో భాగంగానే పాటలు వస్తాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌తో పాటు సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టే, సాక్షి వెబ్‌డెస్క్ -
అనుష్క కోసం రంగంలోకి దిగిన ప్రభాస్
టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో ఆమె మళ్లీ ప్రేక్షకులను మెప్పించనున్నారు. యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నవీన్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలకు తిరిగి భారీగా సినిమాను ప్రమోట్ చేయగా.. హీరోయిన్ అనుష్క కూడా వినూత్నంగా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సారి అనుష్క కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు. అనుష్క సినిమా కోసం ఆయన చేసిన ఓ పని నెట్టింట ట్రెండ్ అవుతోంది. (ఇదీ చదవండి: ‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ) 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో తాజాగా అనుష్క ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన వంటకం అయిన మంగుళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తయారీ విధానాన్ని అభిమానులతో ఇలా పంచుకున్నారు. (ఇదీ చదవండి: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విటర్ రివ్యూ) 'చెఫ్ పాత్రలో చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను. దీంతో సోషల్ మీడియా ద్వారా ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలు పెడుతున్నాను. ఇందులో ప్రభాస్ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన... ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి.' అని ప్రభాస్‌ను అనుష్క ట్యాగ్ చేశారు. ప్రభాస్ రియాక్షన్ అనుష్క విసిరిన ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్ వెంటనే ఇన్‌స్టాలో తన ఫేవరట్ రెసిపీని పోస్ట్ చేశారు. రొయ్యల పులావ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన తయారీ విధానాన్ని కూడా ఆయన షేర్ చేశారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు విసురుతున్నట్లు ప్రభాస్ చెప్పారు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ పోస్ట్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడంటే అనుష్క సినిమాకు భారీగా ప్రమోషన్ దక్కినట్లేనని వారు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విటర్ రివ్యూ
నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ‘జాతిరత్నాలు’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్.. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా వెరైటీగా చేయడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. ట్విటర్లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్ వస్తోంది. సినిమా బాగుందని, నవీన్ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. అనుష్కకు కమ్‌బ్యాక్ మూవీ ఇది అని కామెంట్ చేస్తున్నారు. Watched premiers in London#MissShettyMrPolishetty In simple words the movie is really very nice and good to watch @NaveenPolishety comedy timing and acting 💥 @MsAnushkaShetty sweetie's comeback movie.#วอลเลย์บอลหญิง — Vinaykumar sura (@Vinaykumarsura) September 7, 2023 ఇప్పుడే లండన్‌లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశాను. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెరీ నైస్ సినిమా ఇది. చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అనుష్కకు ఇది మంచి కమ్‌బ్యాక్ సినిమా’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #MissShettyMrPolishetty Clean comedy with heartfelt emotions… #Anushka is queen as always and @NaveenPolishety is star of the show….. Comedy matram ROFL👌👌 pic.twitter.com/9ZWx00kxNg — VishnuBose ᴼᴳ (@vishnubose1947) September 6, 2023 మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎమోషనల్‌తో కూడిన క్లీన్ కామెడీ చిత్రం. అనుష్క ఎప్పటికీ రాణిలాగే ఉంటుంది. నవీన్ కామెడీ చాలా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Watched the premier of Miss Shetty Mr Polishetty with @NaveenPolishety … met him after 17 years. My second movie with him - first being Krish in 2006. Very humble, nice and down to earth person. The movie is really good. Watch it!!! #MissShettyMrPolishetty #NaveenPolishetty pic.twitter.com/jUy7zzb2Es — Sandeep Tapse (@SandeepTapse) September 7, 2023 #MissShettyMrPolishetty #MissShettyMrPolishettyReview a feel good movie . @NaveenPolishety @MsAnushkaShetty both fit into their worlds perfectly. " bhayta nundi vache prema pina bhayamtho, thanlo thane preminchukovatam modalpetindhi" . This dialogue is deep. Rating: 2.75/5 pic.twitter.com/TBbweThRRO — Thaagubothu🥃 (@reventhmails5) September 7, 2023 #MissShettyMrPolishetty What a beautiful cinema this is ❤️❤️. @NaveenPolishety what an actor , what a talent long way to go man . @MsAnushkaShetty the princess of screen presence and acting does it again effortlessly. Fun and emotion is so organic and situational. Loved it 🙌 — Sravankumar 25 (@25Sravankumar) September 7, 2023 #MissShettyMrPolishetty Overall, movie is a sure shot blockbuster and a hattrick for @NaveenPolishety ! He is a natural rockstar and you won’t be disappointed with this one at all! His description about the movie in climax is apt (IYKYK)!#TrustMyReviews rating: 3.75/5 — Trust my reviews (@trustmyreviews) September 6, 2023 After #Kushi, Another Clean Hit for #Tollywood loading... With #MissShettyMrPolishetty 👏👏👏 Blockbuster Reports from the premiere shows 🤘🤘🤘#MSMP @NaveenPolishety @MsAnushkaShetty #MaheshBabu @UV_Creations @GskMedia_PR @SureshPRO_ — SR Promotions (@SR_Promotions) September 7, 2023 Review #MissShettyMrPolishetty 3/5. ⭐️⭐️⭐️/5 "Outstanding performances by Anushka Shetty and Naveen Polishetty in #MissShettyMrPolishetty. Good songs, engaging screenplay, some minor flaws, top-notch comedy, and emotions. Rating: ⭐️⭐️⭐️/5. Must-watch Telugu movie! #Jaibalayya… pic.twitter.com/oe6YpXZ15C — MovieBuffSmartScopeTV (@SunoritaTrading) September 6, 2023 #MissShettyMrPolishetty one word review It's #NaveenPolishetty show.. He carries the movie with one-liners which work at most parts Rest of the movie is dull — SaiCharan Ande (@SaicharanAnde) September 7, 2023 #MissShettyMrPolishetty Out and out proper rom com Good to see Anushka back. But the real dinosaur of the movie is @NaveenPolishety he literally outperformed everyone in the movie His comedy and emotional performance was terrific, He is the Rajendra Prasad of this generation. — sampathkumar (@Imsampathkumar) September 7, 2023 #MissShettyMrPolishetty Review: ⭐⭐⭐ Comedy is Good👍 Emotions reflected well on Screen 👍 Super First half and a Good 2nd Half Predictable at times But Overall Good movie ✅ Follow @Thyveiw for Genuine Reviews #Jawan pic.twitter.com/VmKKa7cxq8 — Thyview (@Thyveiw) September 7, 2023 -
మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి'. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న థియేటర్లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో నవీన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ బాబు ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమా చూసిన మెగాస్టార్ ప్రశంసలు కురిపించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!) మహేశ్ బాబు మాట్లాడుతూ.. ' చిరంజీవి మాకు ఫోన్ చేశారు. మెగాస్టార్ ఫోన్ రావడంతో సంతోషంతో ఊగిపోయా. ఆయనను అభిమానించే వాళ్లం. మెగాస్టార్ ఫోన్ చేసి అభినందిస్తే ఎలా ఉంటుంది. మా సినిమా గురించి చిరంజీవి మాట్లాడటం సర్ ప్రైజ్ ఇచ్చింది. చిరంజీవి నాతో పాటు నవీన్‌ను ఇంటికి పిలిచి అభినందించారు. మెగాస్టార్ ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూయర్. ఆయన అభినందనలతో మాకు బిగ్ సక్సెస్ కొట్టిన ఫీలింగ్ కలిగింది. ' అని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ..' కొత్త తరహా కథలు చేసేందుకు అనుష్క, నవీన్ లాంటి స్టార్స్ సిద్ధంగా ఉన్నందువల్లే మాలాంటి డైరెక్టర్స్ కథలు రాయగలుగుతున్నామని అన్నారు. ఈ సినిమా ఫన్ ఎమోషన్ కలిసి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని తెలిపారు. సందేశాలు నేరుగా చెప్పడం లేదు.. కానీ కథలో ఆ మోరల్ కనిపిస్తుందన్నారు. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్లో చదివా.. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశామని తెలిపారు. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023 -
ఇవాళ బిగ్ బాస్ లో జరగబోయే సీన్స్ గురించి ముందే చెప్పిన నవీన్
-
జనాలు వస్తారా లేదా అని టెన్షన్ పడ్డా..
-
మా నమ్మకం మరింత పెరిగింది
‘‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ యునిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మా సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే చిత్రం విజయంపై నమ్మకం మరింత పెరిగింది. కృష్ణాష్టమి రోజు సినిమా రిలీజ్ అవుతోంది. కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, మా సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘జాతి రత్నాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నచ్చింది. నా ΄ాత్రలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. నాగార్జునగారికి మా ట్రైలర్ బాగా నచ్చింది. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి 15వ కంటెస్టెంట్‌గా వెళ్లాను’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లో చూసింది 30 శాతం అనుకుంటే.. సినిమాలో 70 శాతం భావోద్వేగాలు, వినోదం ఉంటాయి’’ అన్నారు పి. మహేశ్‌బాబు. -
ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లో నవీన్ పోలిశెట్ అభిమానులను కలిసి సందడి చేశారు. త్వరలోనే అమెరికాలోనూ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నవీన్ పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నవీన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కువ టైం పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులే వల్ల మూవీ రిలీజ్ ఆలస్యమైంది. ఈ విషయంలో మన్నించాలని ప్రేక్షకులను కోరుతున్నా. మీరు చూపించే ప్రేమకు మంచి సినిమాను తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభవుతాయి.' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో స్టాండప్ కమెడియన్‌గా నవీన్, చెఫ్‌గా అనుష్క కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ప్రమోషన్స్ నవీన్ పోలిశెట్టి అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లనున్నారు. డల్లాస్‌లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. -
‘తగ్గేదేలే’ అంటున్న నవీన్ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..
సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లనున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. నవీన్, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు.తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. -
కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?
నవీన్ పొలిశెట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా పరిచయం ఎందుకంటే 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఆ తర్వాత ఇతడు హీరోగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హీరో నవీన్ పొలిశెట్టి.. ప్రముఖ నాయకుడు కేఏ పాల్ని కలవడం ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలి అనుకునే ఓ మధ్య వయసు లేడీ.. ఓ కుర్రాడితో ట్రావెల్ అయితే చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్న నవీన్.. తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నీ తిరిగేస్తున్నాడు. అలా ఆదివారం వైజాగ్‌లో సందడి చేశాడు. అయితే వైజాగ్ బీచ్ రోడ్లో వెళ్తుండగా అనుకోకుండా అక్కడే ఓ కారులో కేఏ పాల్ కూడా షికారుకి వచ్చారు. దీంతో మరో కారులో ఉన్న నవీన్ పొలిశెట్టి.. ఆయనకు హాయ్ చెప్పగా, తిరిగి కేఏ పాల్ కూడా పలకరించారు. అలా కాసేపు దూరం నుంచే మాట్లాడుకున్న ఈ ఇద్దరికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లిద్దరితో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి) #KAPaul & #MrPolishetty pic.twitter.com/Pw5urprkka — Matters Of Movies (@MattersOfMovies) August 28, 2023 -
ఈ నగరమంటే నాకు చాలా ఇష్టం: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నవీన్ పోలిశెట్టి. తాజాగా నెల్లూరులో సందడి చేశారు. ఆయనను చూసిన అభిమానులు సైతం సెల్ఫీల కోసం ఎగబడ్డారు. (ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !) పోలిశెట్టి మాట్లాడుతూ.. 'నా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ 80 శాతం నెల్లూరులోనే జరిగింది. ఇక్కడి ఫుడ్ సూపర్. నాకు ఎంతో ఇష్టం.' అని అన్నారు. నగరంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పలువురు ఫుడ్ బ్లాగర్స్‌తో ముచ్చటించారు.అనంతరం మినీబైపాస్ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నవీన్ మాట్లాడారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ సమయంలో నగర వీధుల్లో తిరిగానని.. ఈ ప్రాంతం బాగా తెలుసన్నారు. ఇందులో హీరోయిన్గా అనుష్క నటించడం సంతోషంగా ఉందన్నారు. కథపై ఎంతో నమ్మకంతో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంజీబీ మాల్లో జరిగిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. Amazing craze for @NaveenPolishety at Nellore . Stand up promotional tour of #MissShettyMrpolishetty is getting a massive response . Today they are moving to Vijayawada. 6pm PVP Mall meet and greet with #NaveenPolishetty #MSMPStandupTour #MSMPonSep7th pic.twitter.com/1hzhrzKvEC — GSK Media (@GskMedia_PR) August 26, 2023 -
అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. తాజాగ నవీన్ పొలిశెట్టి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. షూటింగ్ ప్రారంభంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించడం అంత సులభం కాదని నవీన్ తెలిపాడు. దీంతో షూటింగ్ ప్రారంభంలో మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పాడు. ఆ తర్వాత నుంచి అనుష్క అందించిన ఎంకరేజ్‌మెంట్‌తో ఎలాంటి బెరుకు లేకుండా ఆమెతో కలిసిపోయానని చెప్పాడు. అలా షూటింగ్ మొత్తం సరదాగా సాగిపోయిందని గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమా వల్ల తామిద్దరం మంచి ఫ్రెడ్స్ అయ్యాం. సినిమాలో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని నవీన్ పేర్కొన్నాడు. అనుష్క లాంటి స్టార్ నటితో కలిసి నటించారు కదా ఆమె నుంచి ఏం నేర్చుకున్నారని యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనిపై వెంటనే స్పందించాడు నవీన్. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని ఇలా చెప్పేశాడు. 'సెట్స్ లో అడుగుపెట్టగానే టెక్నీషియన్స్‌కు అనుష్క ఓ వెచ్చటి హగ్ ఇస్తుంది. కానీ అది ఎంతో అభిమానపూర్వకంగా మాత్రమే ఇచ్చే కౌగిలింత. ఆవిడ నుంచి నేను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అది మనలో ఎంతో పాజిటివ్‌ను ఇస్తుంది. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్లో ఇదొకటి.' అని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: అనిరుద్ గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్) తాజాగ విడుదలైన ట్రైలర్లో అనుష్కను చాలా తక్కువగా చూపించారని, సినిమాలో ఆమె చేసిన రచ్చ ఓ రేంజ్లో ఉంటుందని నవీన్ తెలిపాడు. అంతేకాకుండా ఆమె ఏ నటుడితోనైనా ఫర్ఫెక్ట్గా సింక్ అవుతుందని చెప్పాడు. -
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ స్టిల్స్
-
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
జాతి రత్నాలు తర్వాత ఒత్తిడికి గురయ్యాను
‘‘ఒక యాక్సిడెంట్లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా ‘జాతి రత్నాలు’ సినిమాని రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అందుకే ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన కథ చాలా ఎగ్జయిట్ చేసింది. మానవ సంబంధాల మీద మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్‌తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. అది నచ్చింది. అలాగే అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు పి. దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘పెళ్లి ఒక్కటే కాదు.. ప్రతి రిలేషన్లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. మహేశ్ బాబు. -
తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ.. పెళ్లెందుకు?: అనుష్క!
జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మోస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేశ్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా మరో అప్డేట్తో ముందుకొచ్చారు మేకర్స్. (ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్‌పై సంచలన కామెంట్స్! ) తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా కనిపించనుండగా, అనుష్క చెఫ్‌గా నటించనుంది. ట్రైలర్ చూస్తే ఈ మూవీ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ చేసి స్టాండప్ కమెడియన్ ఎంటి? అనే అనుష్క డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. అ తర్వాత తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ.. పెళ్లేందుకు? అన్న అనుష్క డైలాగ్ అభిమానుల్లో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. The trailer of #MissShettyMrPolishetty is all set to work up your appetite for comedy and entertainment! #MSMPTrailer - https://t.co/UQfI6Xo6kZ Grand release on September 7th! #MSMPonSep7th @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @adityamusic @UV_Creations pic.twitter.com/LxhgRPHkp9 — UV Creations (@UV_Creations) August 21, 2023 -
అలా చేశానని ఇంట్లోవాళ్లే తిట్టారు: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి పేరు చెప్పగానే మీకు తెలియకుండానే 'ఈవ్..' అనే సౌండ్ చేస్తారు. ఎందుకంటే 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' మూవీతో హిట్ కొట్టినప్పటికీ 'జాతిరత్నాలు' చిత్రంతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'గా రాబోతున్నాడు. సెప్టెంబరు 7న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) అప్పుడు కోప్పడ్డారు 'నేను ఓ ఇంజినీర్. చేతిలో ఉన్న ఉద్యోగం పక్కనబెట్టి ఇండస్ట్రీలోకి వచ్చాను. బాగా డబ్బులొచ్చే పని వదిలేసి వచ్చానని అమ్మనాన్న చాలా కోప్పడ్డారు. 'ఏజెంట్ ఆత్రేయ'కి ముందు పదేళ్లపాటు ఇంటిపేరు పాడుచేస్తున్నానని తిట్టారు. నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టైటిల్లోనే ఇంటిపేరు ఉండటం చూసి నాన్న హ్యాపీగా ఫీలయ్యారు' అందుకే ఈ మూవీ ''జాతిరత్నాలు' ఈ రేంజులో అలరిస్తుందని మేం అస్సలు ఊహించలేదు. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఒత్తిడికి లోనయ్యాను. అలాంటి టైంలో ఓ మహిళా అభిమానిని కలిశాను. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో నేను ఏడ్చేశాను. ఇలా నన్ను ఆదరిస్తున్న వాళ్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలని ఫిక్సయ్యా. అలా ఎన్నో కథలు విని.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఓకే చేశాను. అనుష్కతో కలిసి వర్క్ చేయడం సరదాగా అనిపించింది' అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) -
Miss Shetty Mr Polishetty : హే కృష్ణా... వస్తున్నాం
మా సినిమాని రిలీజ్ చేయడానికి మంచి తేదీ చెప్పు అంటూ జ్యోతిష్కుడు మహేశ్ దగ్గరికి వెళ్లాడు పొలిశెట్టి. ఓ 70, 80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకో అని మహేశ్ అంటే... ‘హే కృష్ణా’ అంటూ ఉట్టి కొట్టి కృష్ణాష్టమికి రిలీజ్ చేసుకుంటాం అంటాడు పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్ బాబు పి. దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్లీ కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించే వీడియోను సోమవారం విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి, మహేశ్‌ల కామెడీతో సాగే ఈ ఫన్నీ వీడియో ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. -
అనుష్క అభిమానులకు బ్యాడ్ న్యూస్
అనుష్క శెట్టి తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. నిశ్శబ్దం(2020) చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. త్వరలోనే ఆమె తెరపై కనిపించబోతున్నారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదల వాయిదా పడింది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. గతంలోనే చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ డేట్‌ని అనౌన్స్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. (చదవండి: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్) పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా ఆగస్ట్ 4న విడుదల చేయడం లేదని, కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేసింది. ఈ చిత్రానికి పి.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో చెఫ్‌గా అనుష్క, స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పోలిశెట్టి నటించారు. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించే చాన్స్ ఉంది. We apologize from the bottom of our hearts for this unforeseen delays. We will soon be serving #MissShettyMrPolishetty, a comedic feast, with a side of laughter... Stay tuned for the New release date and trailer... pic.twitter.com/LpMbdrVTsm — UV Creations (@UV_Creations) July 29, 2023 -
అనుష్క సినిమా వాయిదా...పోలిశెట్టి రిలీజ్ కష్టాలు
-
మల్లారెడ్డి వాయిస్ ని యాజ్ ఇట్ ఈజ్ దింపేసాడు
-
అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టిల ‘లేడీ లక్’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రథన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లేడీ లక్..’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని సోమవారం రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్ పాడారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. చెఫ్ అన్వితా రవళిగా అనుష్క, స్టాండప్ కమెడియన్ సిద్ధుగా నవీన్ పాత్రలు మనసులను హత్తుకునేలా ఉంటాయి. ‘లేడీ లక్..’ సాంగ్‌లో నవీన్ ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. దీంతో తాజాగా ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదఅనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ల చేశారు మేకర్స్. చెఫ్ అన్విత రవళి శెట్టిపాత్రలో అనుష్కా శెట్టి, స్టాండప్ కమెడియన్ సిద్ధుపాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపిస్తారు. ఈ సినిమాకు సంగీతం: రధఅనుష్కా శెట్టి, నవీ¯Œ ΄÷లిశెట్టి ్రç . -
ఫన్ పార్టీ
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు వి. జయశంకర్ సమర్పణలో రవిపొలిశెట్టి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టైటిల్ లోగో విడుదల పాత్రికేయుల చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ చిత్రం థియేటర్స్‌లో గట్టిగా సౌండ్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్ రైడ్ చిత్రం’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘పాతిక రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ఇది మా యూనిట్‌కు, వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు రవి పొలిశెట్టి. -
హతవిధి.. ధనుష్ వాయిస్‌లో ఉన్న మ్యాజిక్కే వేరు!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్‌కు మంచి స్పందన లభించింది. బుధవారం ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను హీరో ధనుష్ పాడడం విశేషం. ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ పాడి అలరించాడు. అందుకే సింగర్‌గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన పాడిన కొలవరి డి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తన గాత్రంతో హతవిధి సాంగ్‌కు మరింత వన్నె తెచ్చాడీ హీరో. నవీన్ పొలిశెట్టి నిస్పృహతో అరిచే వాయిస్‌తో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్‌లో ఏది గొప్పగా చేయాలనుకున్నా అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్‌తో సాంగ్ కొనసాగుతుంది. అంతేకాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతాడనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించాడు. లిరిక్స్ విషయానికి వస్తే 'బుల్లిచీమ బతుకుపై... బుల్డోజరైందాయ్' అనే పంచులతో మిస్టర్ శెట్టి జీవితాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఈ పాట. ఇంత మంచి లిరిక్స్‌ను రామజోగయ్య శాస్త్రి అందించడం విశేషం. ధనుష్ గొంతు, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌తో పాటు సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. చదవండి: చాతిపై పవర్ స్టార్ పచ్చబొట్టు -
వీడియో: హైదరాబాద్‌కు తిరుగులేదన్న శ్రేయా ఘోషల్, ఆమె తెలుగుకు ఆడియన్స్ ఫిదా!
-
'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ
జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను అనౌన్స్ చేసి చాలాకాలమే అయినా ఇడేట్ప్పటివరకు ఇలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా టీజర్‌ను వదిలారు మేకర్స్. ఇందులో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా కనిపించనుండగా, అనుష్క చెఫ్‌గా నటించనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసుందేకు మేకర్స్ రెడీ అవుతున్నారు. -
అనుష్క, నవీన్ పొలిశెట్టి మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ అవుట్
హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్ పతాకంపై ‘రారా కృష్ణయ్య ఫేం’ పి మహేశ్ బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ను ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’గా ఖరారు చేశారు. ఈ సందర్భంగా, అనుష్క, నవీన్ పొలిశెట్టిల లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్‌గా నవీన్, అన్విత రవళి శెట్టి అనే చెఫ్‌గా అనుష్క నటించనున్నారు. కాగా ఈ సమ్మర్‌కు తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క, జాతిరత్నాలు తర్వాత నవీన్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩 Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz — UV Creations (@UV_Creations) March 1, 2023 -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి ప్రేమాయణం..?
-
చాలా అందమైన సినిమా: రష్మిక ప్రశంసల వర్షం
విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. యూట్యూబ్ యాక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. కలర్ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన సుహాస్ మూవీని పలువురు సినీతారలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ట్వీట్ చేసింది పుష్ప భామ. రష్మిక తన ట్విటర్లో రాస్తూ.. ' మీరు చాలా అందమైన సినిమా తీశారు. మీ చిత్రబృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న మీకు ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి వెళ్లి ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మహిళల కోసం ప్రత్యేకంగా ఈనెల 8న ఉచిత షోలు ఏర్పాటు చేసినట్లు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ప్రకటించింది. మాస్ మహారాజా రవితేజ సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని కొనియాడారు. సుహాస్ నటన అద్భుతంగా ఉందని.. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రశంసించారు రవితేజ. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరో హీరో నవీన్ పోలిశెట్టి సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రబృందాన్ని అభిందిస్తూ ట్వీట్ చేశారు. You guys have made such a beautiful film..@SharathWhat @anuragmayreddy and @ActorSuhas Dear comrade to now- so so proud! ❤️Congratulations on this huge success you guys🤗🤗❤️ I hope all of you go give it a watch.. highly recommended for u my beautiful ladies❤️ and guess what.👇🏻 pic.twitter.com/t7NtOdO7ls — Rashmika Mandanna (@iamRashmika) February 7, 2023 What a performance by @ActorSuhas.Thoroughly enjoyed watching #WriterPadmabhushan. The climax is heart of the film❤️ Absolutely loved it. A must watch for all. Kudos to @anuragmayreddy @SharathWhat, director @prasanthshanmuk & young team for pulling off such a refreshing film — Ravi Teja (@RaviTeja_offl) February 7, 2023 So happy to see the response to #WriterPadmabhushan . The team deserves all the love. Go watch the film with your families if you haven’t yet. Congrats Agent Bobby @ActorSuhas . And super happy for my brothers @SharathWhat @anuragmayreddy ❤️ — Naveen Polishetty (@NaveenPolishety) February 7, 2023 -
నవీన్ అన్నా ఉన్నావా? చచ్చావా? ..నవ్వులు పూయిస్తోన్న ‘జాతిరత్నం’వీడియో
‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నవీన్పొలిశెట్టి. 2021 మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. . ఈ మూవీ విడుదలై ఏడాదిన్నరకు పైనే అవుతున్నా హీరో నవీన్ పొలిశెట్టి నుంచి ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో `అనగనగ ఒక రాజు` మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాలకు సంబంధించి ఇటీవల ఎలాంటి అప్డేట్స్ రాలేదు. తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ ఫన్నీ వీడియో ద్వారా తన సినిమాల అప్డేట్స్ని ఇచ్చాడు. నవీన్ పొలిశెట్టి స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతూ `అరేయ్ ఏం చెప్పమంటావురా `జాతిరత్నాలు` తరువాత ఫ్యాన్స్ లవ్వు అరే ఇంటి నుంచి బయట అడుగు పెట్టడానికి లేదు పరిస్థితి.. అనగానే ఫ్యాన్స్ అంటూ ఇద్దరు నవీన్ పొలిశెట్టి వద్దకు వచ్చారు. అందులో ఒకతను నవీన్ అన్నా ఉన్నావా? చచ్చావా? అనడంతో కంగుతిన్న నవీన్ `ఉన్నారా.. షూటింగ్ చేస్తున్నా.. అనడం.. అయితే నెక్స్ట్ మూవీ అప్ డేట్ ఏదీ అని మరో అభిమాని ప్రశ్నించడం..దానికి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్న కదా షూటింగ్ జరుగుతోంది. చాలా బాగా వస్తున్నయ్ అని నవీన్ అనడం...ఆ వెంటనే అది అందరికి తెలిసిందే కదా.. అప్ డేట్ లు లేవు పదా అని ఫ్యాన్స్ వెళుతుండటం.. మరో అభిమాని కొడుకుతో కలిసి తనెవరో తెలుసా.. జాతిరత్నాలు టైమ్ లో ఎత్తుకుని సెల్ఫీ ఇచ్చారు. అప్పుడు వీడు థర్డ్ స్టాండర్డ్.. త్వరగా అప్ డేట్ ఇవ్వండి లేదంటూ వీడి కొడుకు థర్డ్ స్టాండర్డ్ కి వచ్చేలా ఉన్నాడని పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. వీడియో చివరల్లో న్యూ ఇయర్ లో న్యూ మూవీస్ అప్ డేట్ లని నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో అందించబోతున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2022లో తనకున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ కొత్త ఏడాదిలో వరుస రిలీజ్ లతో తెరపై సందడి చేయబోతున్నారు. -
Recap 2022: స్టార్స్‌కు మాట.. పాట సాయం చేసిన మరో స్టార్ హీరోలు
ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ మాట సాయం చేస్తే.. పాట సాయం కూడా చేస్తే.. ఆ ఇద్దరు స్టార్ల అభిమానులకు పండగే పండగ. 2022 అలాంటి కొన్ని పండగలను ఇచ్చింది. అడగ్గానే కాదనకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి, మాట... పాట పాడిన కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి. అది కూడా నాలుగు చిత్రాలకు. 2017లో వచ్చిన రానా ‘ఘాజీ’, మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రాల తర్వాత ఈ ఏడాది లీజైన మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’, బాలీవుడ్ చిత్రం రణ్‌బీర్ కపూర్ ‘బ్రహాస్త్రం’కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫిబ్రవరి 18న విడుదలైంది. రణ్‌బీర్, ఆలియా జంటగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో రూపొందిన ‘బ్రహ్మాస్త్రం’ ట్రయాలజీలోని ‘బ్రహ్మాస్త్రం: పార్ట్ 1 శివ’ సెప్టెంబరు 9న రిలీజైంది. (చదవండి: ఆయన లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు: అల్లు అర్జున్) అదే నెల 30న విడుదలైన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 చిత్రానికీ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగ మార్తాండ’లోని షాయరీ చిరంజీవి వాయిస్‌తో ఆడియన్స్‌కు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ టైటిల్ రోల్ చేయగా, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలను చిరంజీవితో షాయరీగా చెప్పించారు కృష్ణవంశీ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేశ్‌బాబు. పవన్ కల్యాణ్ ‘జల్సా’ (2008), ఎన్టీఆర్ ‘బాద్షా ’(2013), దివంగత నటుడు కృష్ణ టైటిల్ రోల్ చేసిన ‘శ్రీశ్రీ’ (2016), సందీప్ కిషన్ హీరోగా చేసిన ‘మనసుకు నచ్చింది’ (2018) చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ ఈ ఏడాది ‘ఆచార్య’కు ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజైన సంగతి తెలిసిందే. (చదవండి: ఉదయనిధి స్టాలిన్ మంత్రి కావడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు) మరోవైపు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తనకు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లాంటి హిట్ అందించిన ఆర్ఎస్జే స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ‘మిషన్ ఇంపాజిబుల్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాప్సీ ఓ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న రిలీజైంది. ఇంకోవైపు ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. మార్చి 11న ఈ చిత్రం విడుదలైంది. ఇక వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఇప్పటికే ‘అ!’, ‘హిట్’, ‘హిట్ 2’ సినిమాలను నిర్మించిన నాని ఈ ఏడాది వెబ్ ఆంథాలజీ ‘మీట్ క్యూట్’ నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలు. ఈ సినిమా ట్రైలర్‌కు నాని వాయిస్ ఓవర్ అందించారు. సోనీ లివ్‌లో నవంబరు 25 నుంచి ఈ ఆంథాలజీ స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో తాను నిర్మించిన ‘అ!’కు నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ గ్లింప్స్‌కు హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో మరోచోట కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రానుంది. పాటల సందడి.. ఇప్పటికే ఎన్నో పాటలకు గాత్రం అందించిన శింబు ఈ ఏడాది బాగా సౌండ్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ది వారియర్’లోని ‘బుల్లెట్ సాంగ్’ పాడారు. తమిళంలోనూ ఈ పాటను పాడారు శింబు. రామ్, కృతీ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. అలాగే ఈ ఏడాది శ్రోతలను మెప్పించిన మరో పాట ‘టైమ్ ఇవ్వు పిల్ల..’ కూడా శింబు పాడిందే. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రంలోని పాట ఇది. వీటితో పాటు నిర్మాతగా హీరో రవితేజ తెలుగులో సమర్పించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’ థీమ్ సాంగ్ కూడా శింబు గొంతు నుంచి వినిపించిందే. ఫిబ్రవరి 11న ఈ చిత్రం రిలీజైంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు ’(తెలుగులో ‘వారసుడు) సినిమా కోసం కూడా శింబు పాట పాడారు. ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయ ఆదితి పాడిన తొలి పాట ‘రోమియోకి జూలియట్‌లా’. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’లోని పాట ఇది. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజైంది. ఇలా మాట.. పాట సాయం చేసిన స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
లండన్‌కు వెళ్లనున్న అనుష్క..10 రోజుల అక్కడే..కారణం ఇదే
టాలీవుడ్లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2005లో సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ అయింది. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. . యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు లండన్ వెళ్లేందుకు సిద్దమతుందని సమాచారం. అయితే ఇది హాలీడే ట్రిప్ కాదట.. నవీన్ పొలిశెటి సినిమా షూటింగ్ కోసం ఆమె లండన్ వెళ్తున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో అనుష్క, నవీన్ పొలిశెట్టిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. లండన్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన సీన్స్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ ఎండ్లోగా షూటింగ్‌ను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. (చదవండి: స్వీటీకి అనుష్క పేరు ఎలా వచ్చిందో తెలుసా?) -
రివర్స్ గేర్‌లో వచ్చి.. స్టార్స్ అయ్యారు
హీరో కావాలంటే ఏం కావాలి ? టాలెంట్. ఎవరినడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. మరి…ఒక్క టాలెంట్ ఉంటే సరిపోతుందా ? ఈ ప్రశ్నకు మాత్రం వెంటనే జవాబు రాదు.నిజమే కదా…నెపోటిజం నుంచి మొదలుపెడితే సవాలక్ష అడ్డంకులను అధిగమించాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్లు లేకుండా, కేవలం టాలెంట్ పెట్టుకుని వెండితెర మీద వెలిగిపోవడం అంత తేలికేం కాదు. ఆఫీస్‌ల చుట్టూ తిరగాలి. ఇండస్ట్రీలో వాళ్లనీ, వీళ్లనీ ఇంప్రెస్ చేయాలి. గంటల పాటు స్టూడియోల ముందు, షూటింగ్ స్పాట్ల ముందు వెయిట్ చేయాలి. అయినా ప్రతిఫలం ఉంటుందో, ఉండదో క్లారిటీ ఉండదు. మరేం చేయాలి ? ఇంకేముంది. రివర్స్ గేర్ వేయాలి. టైమ్ వేస్ట్ చేయకుండా…షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టడమే. ముందు ప్రేక్షకులకు దగ్గర కావడమే. వాళ్ల మెప్పు పొందితే…ఇండస్ట్రీ నుంచే పిలుపొస్తుంది. వీళ్లు రివర్స్ గేర్‌లో వచ్చారు. ముందు ప్రేక్షకుల మెప్పు పొందేశారు. ఆ తర్వాత సినిమా చాన్సులు సంపాదించారు. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ కలిగించిన సంచలనం టాలీవుడ్ దాటి బాలీవుడ్ దాక వెళ్లిపోయింది. మరి దానికి ముందు విజయ్ దేవరకొండ ఏంటి అనగానే పెళ్లి చూపులు సినిమా గుర్తొస్తుంది. దానికి ముందు అని మళ్లీ ప్రశ్నిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా అన్న ఆన్సర్ వినిపిస్తుంది. కానీ…షార్ట్ ఫిల్మ్స్‌తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు విజయ్. 2011లో కొంచెం టచ్‌లో ఉంటా అనే షార్ట్ షార్ట్ ఫిల్మ్ మొదలైన ప్రయాణం…అతన్ని టాలీవుడ్ స్టార్‌ని చేసింది. (చదవండి: తరుణ్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్) సుహాస్.. కలర్ ఫోటో మూవీ హీరో. కథానాయకుడు అంటే ఇలానే ఉండాలి అన్న అడ్డుగోడ లను బద్దలుకొట్టిన హీరో. షార్ట్ ఫిల్మ్స్‌తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. తన నటించిన చాలా షార్ట్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. షార్ట్ ఫిల్మ్స్‌తో క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు నుంచి హీరో ఫ్రెండ్‌గా సుహాస్ జర్నీ వేగంగానే సాగింది. ప్రతి రోజు పండుగ, మజిలీ చిత్రాల్లో ముఖ్య పాత్రలతో ప్రేక్షకులకు మరింతగా దగ్గరైయ్యాడు. హీరో ఫ్రెండ్‌గా ఇటు కామెడీని పండిస్తూ, అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉనికిని చాటు కుంటోన్న సుహాస్‌ని…కలర్ ఫోటో హీరో చేసేసింది. ఇండస్ట్రీకి కొత్త స్టార్ దొరికేశాడు. ఆరు పాట లు, ఐదు ఫైట్స్ తరహా మూస సినిమాలని బ్రేక్ చేయాలని ప్రయ త్నించే దర్శకులకు సుహాస్ ఇప్పుడు బిగ్ స్టార్. నవీన్ పొలిశెట్టి. ముంబై బేస్డ్ కామెడీ కంపెనీ ఏఐబీ(A.I.B)లో చాలా వీడియోలు చేశారు. అందులో ఇంజినీరింగ్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చేసిన వీడియో… సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నేషనల్ వైడ్ నవీన్ పొలిశెట్టికి పావులారిటీ తెచ్చింది. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుంచి అనేక సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ వచ్చా డు నవీన్. కానీ…A.I.B వీడియోస్ క్లిక్ అయ్యేదాకా పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. ఇంజినీరింగ్ వీడియో క్లిక్ అయిన తర్వాత…హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ ఇచ్చాడు నవీన్. ఆ తర్వాత జాతిరత్నాలు లాంటి మరో హిట్ మూవీతో స్టార్ అయిపోయాడు. -
రచయితలుగా హీరోలు.. అట్లుంటది వీళ్లతోని!
కెమెరా ముందు నటులుగా విజృంభిస్తున్నారు... కెమెరా వెనకాల రచయితలుగా కలం పడుతున్నారు. యువహీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్ రచయితలుగా కథలు.. డైలాగులు రాస్తున్నారు.. నాయకులుగా నటిస్తున్నారు. ఈ ‘కథా’నాయకుల కథ తెలుసుకుందాం. ‘మేజర్’ సినిమాతో తాజాగా మరో హిట్ అందుకున్నారు అడివి శేష్. తాను హీరోగా నటించిన ‘క్షణం, గూడఛారి’ వంటి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’ మంచి విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. ఈ చిత్రానికి శేష్ అద్భుతమైన కథ అందించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతంగా సాగుతోంది. ఇలా శేష్ కథలు అందించిన ‘క్షణం, గూఢచారి, మేజర్’ సినిమాలు హిట్స్‌గా నిలవడం విశేషం. ఇటు రైటింగ్.. అటు యాక్టింగ్‌లో శేష్ మేజర్ హిట్స్ చూశారు. అట్లుంటది మనతోని ‘అట్లుంటది మనతోని...’ అంటూ ‘డీజే టిల్లు’లో హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన సందడికి యూత్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి కథ, మాటలు అందించి రైటర్‌గానూ సూపర్ హిట్ అందుకున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’ ఇచ్చిన హిట్‌తో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రెడీ చేస్తున్నారు సిద్ధు. కాగా సిద్ధు హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం 2020 జూన్‌లో ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే అందించారు సిద్ధు. ఈ యువహీరో కథ ఇచ్చిన రెండు సినిమాలూ హిట్ కావడం విశేషం. ఆత్రేయ కథ అదిరింది ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు నవీన్ పొలిశెట్టి. ఈ రెండు చిత్రాల్లో హీరోగా నటించగా, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు కథ, స్క్రీన్ ప్లే అందించారు నవీన్. ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. మాస్ కా దాస్ ‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో హీరోగా నటించి, మూడో చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’తో దర్శకుడిగా మారారు విశ్వక్ సేన్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించారు. ‘ఫలక్‌నుమా దాస్’తో హీరోగా మాస్ కా దాస్ అంటూ మంచి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవడంతో పాటు రైటర్‌గానూ మార్కులు కొట్టేశారు విశ్వక్. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దాస్‌కి ధమ్కీ’ చేయడానికి విశ్వక్ కథ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తారు విశ్వక్. కిరణ్ అబ్బురం తొలి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో హీరోగా హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. తన ద్వితీయ చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’కి కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసుకున్నారు కిరణ్. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. హీరోగా.. రైటర్‌గా కిరణ్ ‘అబ్బురం’ అనిపించుకున్నారు. టాలెంట్‌ని ఎవరూ ఆపలేరు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఆ ప్రతిభే మంచి నిచ్చెన అవుతుంది. ఈ విషయంలో ఈ ‘కథా’నాయకులు మరికొందరికి ఆదర్శం అనొచ్చు. చదవండి: ముడతలు కనిపిస్తున్నాయ్.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు ‘డీజే టిల్లు’ పిల్లతో కిరణ్ అబ్బవరం రొమాన్స్! -
మిస్ చెఫ్?
విభిన్నమైన వంటకాలు, వాటి రెసిపీలు తెలుసుకునే పనిలో ఉన్నారట అనుష్కా శెట్టి. తన చేతి వంట రుచి చూపించేందుకు రెడీ అయ్యారట. వంటల గురించి యూట్యూబ్ చానెల్ ఆరంభించడానికే అనుష్క ఇలా కుకింగ్ మీద దృష్టి పెట్టారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ వంటల రీసెర్చ్ చేస్తున్నది తన తాజా సినిమా కోసం అని సమాచారం. అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన తారాగణంగా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే... ఈ చిత్రంలో ఓ అంతర్జాతీయ చెఫ్ పాత్రలో ఈ బ్యూటీ కనిపించనున్నారట. ఈ పాత్రలో ఒదిగిపోవడానికే పాకశాస్త్రంలోని అంశాలపై పట్టు సాధించే పనిలో ఉన్నారట. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ఇదే. -
అనుష్క కొత్త సినిమా అప్డేట్.. ఆ బ్యానర్లో హ్యాట్రిక్ చిత్రం
Anushka Shetty Movie With Naveen Polishetty In UV Creations Banner: దక్షిణాదిలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. దీంతో అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో నటిస్తోందంటూ వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లో నిజమో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆమె ఫ్యాన్స్. చదవండి: మరోసారి ప్రభాస్‌తో అనుష్క..! ఈ నేపథ్యంలోనే అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. కానీ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ను ఇచ్చింది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఏప్రిల్ 4 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ సినిమాను 'రారా.. కృష్ణయ్య' దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లోనే అనుష్క మిర్చీ, భాగమతి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు అనుష్క 48వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా యూవీ బ్యానర్లో హైట్రిక్ చిత్రం. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సక్సెస్ పార్టీలో అనుష్క సందడి, ఫొటోలు వైరల్ -
ఫొటోలు చూసి కత్రీనా, విక్కీ కుళ్లుకోవాలి.. ఇది నవీన్ పొలిశెట్టి పెళ్లి
Naveen Polishetty Anaganaga Oka Raju Movie Title Teaser Out: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా తానెంటో నిరూపించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. తర్వాత వచ్చిన 'జాతి రత్నాలు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా నవీన్ హీరోగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, పోర్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'అనగనగా ఒక రాజు' అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో రాజు గాడి పెళ్లి అంటూ నవీన్ చేసే సందడి మాములుగా లేదు. తన డైలాగ్‌లు, ఆహార్యంతో నవ్వులు పంచుతున్నాడు నవీన్. తన పెళ్లికి తీసే ఫొటోలు సోషల్ మీడియాలో అదిరిపోవాలని, కత్రీనా, విక్కీ కౌశల్ కుళ్లుకోవాలని చెప్పడం సరదాగా ఉంటుంది. 'నేను చెప్పకూడదు కానీ, ఈ డికెడ్లో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా' అంటూ వీడియో ముగించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టికి మరో బర్త్‌డే గిఫ్ట్.. కొత్త సినిమా అప్డేట్ -
రాధేశ్యామ్ ఈవెంట్ కోసం నవీన్ పొలిశెట్టి ఎంత తీసుకున్నాడు?
టాలీవుడ్లో ఫీమేల్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు కానీ మేల్ యాంకర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో యాంకర్ రవి, ప్రదీప్ లాంటివారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వాళ్లు ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంతగా చేయరు . అందులోనూ పాన్ ఇండియా స్థాయి సినిమాలకు యాంకరింగ్ చేసిన అనుభవం లేదు. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఓ కొత్త యాంకర్ వచ్చాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన జాతిరత్నం.. నవీన్ పొలిశెట్టి. ‘జాతిరత్నాలు’మూవీతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి.. ఉన్నట్టుండి యాంకర్‌గా మారిపోయాడు. దీంతో హోస్ట్‌గా చేయడానికి ఎంత తీసుకున్నాడు. అసలు రాధేశ్యామ్ ఈవెంట్‌కి నవీన్‌ను యాంకర్‌గా సూచించిందెవరు అనే విషయంలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్‌తో ఉన్న స్నేహం కారణంగానే నవీన్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హోస్ట్‌గా చేయడానికి ఒప్పకున్నాడట. అయితే అతన్ని సూచించింది మాత్రం ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్. నవీన్ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చిచోరేతో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అందుకే అతన్ని హోస్ట్‌గా పెడితే ప్రమోషన్స్‌కి కలిసొస్తుందని ప్రభాస్‌కి చెప్పాడట నాగ్ అశ్విన్. దీంతో ప్రభాస్.. నవీన్ పొలిశెట్టి హోస్టింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘జాతిరత్నాలు’సమయంలో ప్రభాస్ నవీన్ పొలిశెట్టికి సపోర్ట్ చేశాడు. ఆ మూవీ ట్రైలర్ విడుదల చేసి.. సినిమా స్థాయిని పెంచాడు. అందుకే నవీన్ పొలిశెట్టి తనవంతు సాయంగా ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ఈవెంట్కి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా హోస్టింగ్ చేశాడట. ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌లో నవీన్ ఓ సినిమా చేస్తున్నాడు.. అలాగే ప్రభాస్‌తోనూ మంచి బాండింగ్ ఉంది. అందుకే నవీన్ పొలిశెట్టి ఫ్రీగా యాంకరింగ్ చేశాడట. నిజంగానే అతని యాంకరింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఉపయోగపడింది. -
నవీన్ పొలిశెట్టికి మరో బర్త్‌డే గిఫ్ట్.. కొత్త సినిమా అప్డేట్
Naveen Polishetty New Movie Update On His Birthday: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా తానెంటో నిరూపించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన ప్రత్యేకమైన నటనతో అలరిస్తున్న ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా నవీన్‌కు బర్త్‌డే విష్ చెబుతున్నారు అభిమానులు. అంతేకాకుండా నవీన్‌తో యూవీ క్రియేషన్స్ చేస్తున్న సినిమాను ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు నవీన్. View this post on Instagram A post shared by Naveen Polishetty (@naveen.polishetty) తాజాగా తన మరో సినిమా గురించి ప్రకటించాడు ఈ యంగ్ హీరో. నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, పోర్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. 'ప్రొడక్షన్ నెం 15'గా రూపొందుతున్న సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ నవీన్ ప్రకటించాడు. ఈ పోస్టర్లో పంచెకట్టులో కనిపించాడు నవీన్. ఈ పోస్టర్‌ను నవీన్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. త్వరలో సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. The Entertainer is coming back to deliver the entertainment royale 👑😍 Wishing a very Happy Birthday to the young sensation @naveenpolishety ❤️ Title out soon! 🤩#HBDNaveenpolishetty #NaveenPolishetty4 @kalyanshankar23 @vamsi84 #SaiSoujanya @SitharaEnts pic.twitter.com/hYEbn0A3wP — Fortune Four Cinemas (@Fortune4Cinemas) December 26, 2021 ఇదీ చదవండి: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్‌కు హోస్ట్‌గా జాతి రత్నం.. -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి సినిమా ఆగిపోయిందా? ఇదిగో క్లారిటీ ..
Naveen Polishetty Confirms New Film With Anushka Shetty: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నవీన్- అనుష్క జంటగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా రానుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై యూవీ క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు. నవీన్ పొలిశెట్టి బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే అనుష్క ఈ చిత్రంలో నవీన్‌కి జోడీగా కనిపించనుంది. నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయితో ఎలా ప్రేమలో పడుతుంది? ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా కథ. పి. మహేశ్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by Naveen Polishetty (@naveen.polishetty) -
నిర్మాతగా బిజీ అవుతున్నత్రివిక్రమ్
-
రాధేశ్యామ్ ప్రీ రిలీజ్‌కు హోస్ట్‌గా జాతి రత్నం.. ఎంటర్టైన్మెంట్ డబుల్
Naveen Polishetty Hosting To Radhe Shyam Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్రబృందం చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కూడా భారీ హైప్‌కు ఒక కారణం. ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులు నమోదు చేశాయి. ఇటీవలే పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు వెల్లడించిన పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. ఇక ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో ప్రేరణగా కనిపించనున్న పూజా హెగ్డే అదనపు ఆకర్షణ. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ చిత్రం 'గ్లాడియేటర్'కు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ పనిచేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో జనవరి 14, 2022న సంక్రాంతి కానుకగా 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 23న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులే అతిథులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్స్‌ను ఫ్యాన్స్ చేతులమీదుగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వ్యవహరించనున్నాడు. ఇది తెలిసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ మరింత డబుల్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ కనకాల, ప్రదీప్, అనసూయ, శ్రీముఖి వంటి ప్రముఖ యాంకర్స్ హోస్ట్‌గా వ్యవహరించేవారు. కానీ రాధేశ్యామ్ సినిమా కోసం మాత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతి రత్నాలు' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి యాంకర్‌గా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నవీన్‌తో పాటు యాంకర్ రష్మీ గౌతమ్ కూడా హోస్ట్‌గా వ్యవహరించనుందని సమాచారం. అయితే జాతి రత్నాలు సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రాధేశ్యామ్ రెండో సాంగ్.. ఫ్లర్టేషన్‌షిప్ కోరుకుంటున్నాడట -
Anushka Shetty: పుకార్లకు చెక్ పెట్టిన అనుష్క.. ఆ సినిమా ఆగిపోలేదు
‘అనుష్క ఇక సినిమాల్లో నటించదు.. ఆమె పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవుతుంది. అందుకే ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై చేయాల్సిన సినిమా నుంచి తప్పుకుంది’ అంటూ వచ్చిన పుకార్లకు బర్త్‌డే సందర్భంగా చెక్‌పెట్టింది అనుష్క. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆగిపోయిందనుకున్న సినిమాను అధికారికంగా ప్రకటించింది. అనష్కకు 48వ చిత్రం ఇది. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క ‘మిర్చి’,‘భాగమతి’అనే రెండు సినిమాలు చేసింది. తాజాగా ఆ బ్యానర్లో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది లేడి ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. .ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారని అప్పట్లో ప్రచారం జరిగింది. Happy Birthday Sweety! 💕 We are delighted to announce our "Hattrick Combination" with the Sweet and Very Special @MsAnushkaShetty 🥳🎉. Directed by #MaheshBabuP Produced by @UV_Creations#HBDAnushkaShetty #Anushka48 #HappyBirthdayAnushkaShetty pic.twitter.com/nOv4LWvonh — UV Creations (@UV_Creations) November 7, 2021 -
‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ ఆగిపోయిందా?
నిశ్శబ్దం తర్వాత అనుష్క నటించబోయే కొత్త సినిమా పై, కొంత కాలంగా కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. యూవీ క్రియేషన్స్ లో బ్యానర్ లో, మిస్ శెట్టి , మిస్టర్ పొలిశెట్టి టైటిల్ తో తెరకెక్కాల్సి ఉంది. 25 ఏళ్ల పొలిశెట్టి , 40 ఏళ్ల శెట్టితో ప్రేమలో పడితే, ఆ లవ్ స్టోరీ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కాని ఈ ప్రాజెక్ట్ రూమర్స్ కే పరిమితం అవుతోంది. ఎందుకంటే మిస్ శెట్టి ఇప్పుడు ఇతర ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతోందని సమాచారం. తమిళంలో చంద్రముఖి సీక్వెల్ తో పాటు, నెట్రికన్ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాగా ప్రచారం సాగుతోంది. (చదవండి: జాతిరత్నాలు తర్వాత నవీన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..) ఇక మిస్టర్ పొలిశెట్టి అంటే నవీన్ పొలిశెట్టి కూడా,ఇటీవలే త్రివిక్రమ్ కొత్తగా ప్రారంభించిన బ్యానర్ లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. జాతిరత్నాలు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ చిత్రంలో దర్శకుడిగా మారుతున్నాడు. త్వరలనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇలా ఇద్దరు ఇతర ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. -
మరోసారి కామెడీ ఎంటర్టైన్మెంట్తో వస్తున్న జాతిరత్నం
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్న మూడో సినిమా ఖరారయింది. కల్యాణ్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. ‘‘ తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజున (1931, సెప్టెంబర్ 15) ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థ పురుడు పోసుకోవడం హ్యాపీగా ఉంది. మీరు (ప్రేక్షకులు) మరింత సరదాగా నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
అఫిషియల్: త్రివిక్రమ్‌తో నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం
‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నవీన్పొలిశెట్టి, తరువాతి ప్రాజెక్ట్‌పై అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కళ్యాణ్ శంకర్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి ఎంటర్టైనర్ గా బలమైన కథతో సాగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' అనే మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది. -
చిట్టి సాంగ్.. లక్ష్మీ పటాస్‌లా పేలిందిగా..
Chitti Song Hits 100 Million Views: చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 11లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులోని పాటలు కూడా బాగానే హిట్టయ్యాయి. ముఖ్యంగా 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే..' అనే పాట యువతకు బాగా కనెక్ట్ అయింది. మార్చి 29న రిలీజైన ఈ పాట తాజాగా 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది. దీంతో చిట్టి సాంగ్ సోషల్ మీడియాలో మరోసారి మార్మోగుతోంది. -
రూ. 4 కోట్ల పారితోషికం తిరిగిచ్చిన నవీన్ పొలిశెట్టి
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థకు షాక్ ఇచ్చాడు. నవీన్ ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. జాతి రత్నాలు మూవీతో స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీతో నవీన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అతడికి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో స్వీటీ అనుష్కతో ఓ సినిమాతో పాటు సితార ఎంటర్టైన్మెంట్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అయితే సితార ఎంటర్టైమెంట్ సంస్థ దగ్గర నవీన్ తీసుకున్న 4 కోట్ల రూపాయల పారీతోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: బిగ్‌బాస్: ఐదో సీజన్లో కీలక మార్పులు.. సక్సెస్‌పై అనుమానాలెన్నో! అయితే ఈ తాజా బజ్ ప్రకారం నవీన్ సితార ఎంటర్టైన్మెంట్లోని ఈ సినిమాను కాన్సిల్ చేసుకుని అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. రంగ్ దే మూవీ కో డైరెక్టర్ కథ వినిపించగా నవీన్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని డైరెక్టర్‌కు సూచించాడట. అయితే మార్పులు చేసినప్పటికి కథ పూర్తి కాకపోవడంతో నవీన్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టి, తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేశాడట. అయితే దీనిలో ఎంతవరకు నిజముందనేది హీరో కానీ, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ స్పందించేవరకు వేచి చూడాలి. మరోకపక్క అనుష్క అనుకున్న మరో మూవీపై కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరోపక్క యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. మరి ఈ సారి నవీన్ ఎలాంటి సినిమాలతో రాబోతున్నాడో తెలుసుకొవాలంటి ఇంకా కొంతకాలం వేచి చూడాలి. -
Naveen Polishetty: ‘జాతిరత్నం’ పెద్దమనసు.. ఆ యువకుడికి ఉద్యోగం
కరోనా కష్టకాలంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అభిమానులకు అండగా ఉంటున్నాడు. బాధల్లో ఉన్నవారితో ఫోన్లొ మాట్లాడడమే కాకుండా.. తనకు తోచిన సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాజాగా ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే వ్యక్తికి ఒక్క ట్వీట్‌తో జాబ్ ఇప్పించాడు ఈ ‘జాతిరత్నం’. లాక్డౌన్ సమయంలో జాబ్ కోల్పోయిన ఇబ్బంది పడుతున్న సమీర్ గురించి నవీన్ పొలిశెట్టికి తెలియగానే.. ఆ యువకుడి వివరాలను ట్వీటర్లో పోస్ట్ చేస్తూ ఉద్యోగం ఉంటే చెప్పండని కోరాడు. నవీన ట్వీట్‌కు స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్‌కు స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ.. సమీర్‌కు వచ్చిన ఆఫర్ లెటర్ని పోస్ట్ చేశాడు నవీన్. సమీర్ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్యలకు థ్యాంక్స్ చెప్పారు. త్వరలో ఈ స్టోర్‌కు తాను వెళ్తానని చెప్పాడు. అలాగే పాండమిక్ టైమ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ ట్వీట్ చేశారు. Offer letter :) the guy has got a job. Folks at ewoke cafe , am going to visit your cafe and meet all of you soon. So happy today. Big shout out to @charan_tweetz @iamsowmya18 We need to help people get jobs back in this pandemic. Do your bit if you can :) https://t.co/GX5TrGF1s7 pic.twitter.com/ebeYelcZB0 — Naveen Polishetty (@NaveenPolishety) August 3, 2021 -
అయ్యో.. అనుష్క సినిమా ఆగిపోయిందా?!
ఒక పెద్ద విజయం తరువాత హీరోహీరోయిన్ల మార్కెట్ పెరిగిపోతుంది. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి వరుస ప్రాజెక్ట్స్, మరిన్ని అవకాశాలను చేజిక్కుంచుకుంటారు స్టార్లు. అంతేగాక పారితోషికం కూడా భారీగా పెంచేస్తారు. కానీ విటన్నింటికి స్వీటి అనుష్క భిన్నమనే చెప్పుకోవాలని. బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాల తర్వాత అనుష్క క్రేజ్ మరింత పెరిగిపోయిందని అందరూ భావించారు. ‘బాహుబలి 2’ తరువాత ఆమె తన సినిమాల సంఖ్యను బాగా తగ్గించింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. తను బరువు పెరగడం వల్లే గ్లామర్ పాత్రలను పక్కన పెట్టి పూర్తిగా మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోంటోంది. ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చి ఎన్నో ప్రాజెక్ట్స్‌ను స్వీటి వదులుకుందని టాక్. ఈ నేపథ్యంలో ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి మహిళ నేపథ్యం ఉన్న పాత్రలను చేసింది. అయితే ‘భాగమతి’ మంచి విజయం సాధించగా.. ‘నిశ్శబ్దం’ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత అనుష్క ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఫలానా బ్యానర్లో.. ఫలానా హీరోతో అనుష్క చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ చివరకు అవన్నీ పుకార్లుగానే ఉండిపోతున్నాయి. ఇక తన సినిమాలను గురించిన ప్రకటనలు వచ్చినప్పటికి అధికారికంగా రావడం లేదు. ఇటీవల యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్కా ప్రధాన పాత్రధారులుగా మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని జోరుగా ప్రచారం జరిగింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ‘రారా కృష్ణయ్యా’ ఫేం దర్శకుడు పి. మహేశ్ ఈ సినిమా రూపొందించనున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ అప్డేట్ వచ్చి నెలలు గడుస్తున్నా.. దీనికి సంబంధించిన తదుపరి అప్డేట్ మాత్రం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ మూవీకి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్‌పై తదుపరి అప్డేట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
Sushant Singh Rajput: సుశాంత్ తండ్రికి దక్కని ఊరట
న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సుశాంత్ జీవితం ఆధారంగా ఎవరినీ సినిమాలు తియ్యనీయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. గురువారం అందులోని వివరణను పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితం, మరణం గురించి దాదాపుగా అన్ని మీడియా హౌజ్‌ల ద్వారా జనాలకు తెలిసిపోయింది. ఈ తరుణంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అనే ప్రస్తావన ఉండకపోవచ్చనే జస్టిస్ సంజీవ్ నరులా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు తన కొడుకు విషయంలో కిషోర్ సింగ్ ప్రస్తావించిన ‘ పబ్లిసిటీ రైట్’ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆ హక్కు సెలబ్రిటీ చనిపోయాక ఉంటుందా? ఉండదా? అనే విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, అంతమాత్రాన సినిమా తీస్తే ప్రైవసీకి భంగం కలిగించినట్లు కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. రిలీజ్ తర్వాత రండి ఇదిలా ఉండగా సుశాంత్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘న్యాయ్ ది జస్టిస్’ ఇవాళ(శుక్రవారం) రిలీజ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే కృష్ణ కిషోర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు సుశాంత్ లైఫ్ ఆధారంగానే ‘సూసైడ్ ఆర్ మర్డర్’, ‘ఎ స్టార్ వాజ్ లాస్ట్’, ‘శశాంక్’, క్రౌడ్‌ఫండ్‌తో తీస్తున్న మరో సినిమా.. ఇలా వరుసగా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న తన కొడుకు జీవితాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దర్శకనిర్మాతలు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారని కృష్ణ కిషోర్ సింగ్ వాదిస్తున్నాడు. అయితే ‘సినిమా స్వేచ్ఛ’ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నిర్మాతలకు నష్టం కలిగించే ఈ అంశంపై త్వరగతిన నిర్ణయం తీసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమను ఆశ్రయించవచ్చని కోర్టు సుశాంత్ తండ్రికి సూచించింది. చదవండి: సుశాంత్ గురించి నవీన్ పొలిశెట్టి.. -
కరోనా కష్టకాలంలో నెటిజన్‌కు నవీన్ పొలిశెట్టి సర్ప్రైజ్
Naveen Polishetty: కరోనా కష్టకాలంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అభిమానులకు అండగా ఉంటున్నాడు. ఈ మమహ్మారి కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులను తన మాటలతో ఓదార్పునిస్తున్నాడు. సర్ప్రైజ్ కాల్ చేసి విషాదంలో మునిగిపోయిన కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు. కరనా బారిన పడి తన తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తన తల్లి బాధతో కుంగిపోతుందని సాయి స్మరణ్ అనే నెటిజన్ ఇటీవల నవీన్ పొలిశెట్టికి ట్వీట్ పెట్టాడు. అంతే కాకుండా ‘జాతిరత్నాలు’చూశాక అమ్మ కొంత బాధను మర్చిపోయిందని ట్వీటర్లో పేర్కొన్నాడు. సాయి ట్వీట్‌ను చూసిన నవీన్.. ‘‘మనకెంతో ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అమ్మకు ‘జాతిరత్నాలు’ కొంతవరకూ ఊరట కలిగించినందుకు ఆనందిస్తున్నా. మీ వివరాలను నాకు పంపించండి త్వరలోనే సర్ప్రైజ్ చేస్తా’ అని రిప్లై ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా నవీన్.. సాయికి ఫోన్ చేశారు. సాయి వాళ్లమ్మతో కొంత సమయంపాటు వీడియో కాల్లో మాట్లాడారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘అమ్మ మరలా నవ్వింది. బాధ నుంచి బయటపడడం కోసం ప్రేమ ఎంతో అవసరం. అవసరమైన వారికి చేతనైనంత సాయం చేయండి’ అని నవీన్ విజ్ఞప్తి చేశాడు View this post on Instagram A post shared by Naveen Polishetty (@naveen.polishetty) -
‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్, హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లెన్త్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట. ఇందులో హీరోను కూడా నవీల్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా గతంలో నవీల్ పోలీశెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌ను కూడా నవీన్‌నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్ పూర్తి చేసినట్లు సమాచారం. చదవండి: ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్ -
ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘చిట్టి’
పెద్ద హీరోలు కాదు, అగ్ర దర్శకుడు లేడు అయినా ఆ సినిమాకు ప్రేక్షకులు జైకొట్టారు. థియేటర్లలో పడిపడి నవ్వి.. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించారు. ఇప్పటికే అది ‘జాతిరత్నాలు’సినిమా అని అర్థమైపోయిందనుకుంట. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జాతిరత్నాలు’నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అమాకత్వపు పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల మనసును దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది. ‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మాస్ మహారాజా రవితేజ సినిమాలో కూడా ఫరియాకు చాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇంతవరకు అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీకి రెండు భారీ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్లను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. అందుకు కారణం ఆమె ఎత్తు అనే తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరి ఫరియానే. ప్రభాస్, రానా, గోపిచంద్, వరుణ్‌తేజ్ మినహా మరే హీరోలు ఆమె హైట్‌కు సెట్ కాలేరు. తాజాగా ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్ ఆమెకంటే చాలా తక్కువట. అందుకే ఆ సినిమాలను ఫరియా సున్నితంగా తిరస్కరించిందట. తనకంటే తక్కువ హైట్ ఉన్నహీరోలతో నటించేందుకు ఫరియా మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. మరోవైపు ఫరియా బాలీవుడ్ చాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు కథలు కూడా విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మహేశ్‌తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ! మహేశ్ బాబు వీడియోని వాడేసిన తెలంగాణ పోలీసులు.. వైరల్