
నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రథన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లేడీ లక్..’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని సోమవారం రిలీజ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్ పాడారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ఇది. చెఫ్ అన్వితా రవళిగా అనుష్క, స్టాండప్ కమెడియన్ సిద్ధుగా నవీన్ పాత్రలు మనసులను హత్తుకునేలా ఉంటాయి. ‘లేడీ లక్..’ సాంగ్‌లో నవీన్ ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా.
Comments
Please login to add a commentAdd a comment