ఇప్పటి వరకు నేను చేసిన మూడు సినిమాలు(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి) చేశాను. ఈ మూడు సక్సెస్‌ఫుల్ మూవీస్ ఒక్కోటి నా కెరీర్‌కు ఒక్కో రకంగా హెల్ప్ చేశాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస..మూవీతో నేను బాగా నటించగలనే నమ్మకం వచ్చింది. జాతి రత్నాలు టైమ్ లో పాండమిక్ వచ్చింది. అప్పుడు సినిమాలు థియేటర్ లో చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి...నవీన్ సినిమా థియేటర్ లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ లో వచ్చింది. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నాను’అని యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అన్నాడు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్ మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు..
►మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే మరోవైపు జవాన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పుడు ఎంతో టెన్షన్ పడ్డా. పెద్ద సినిమాతో వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే కంగారు ఉండేది. కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ తెలుగులో కలెక్షన్స్ నెమ్మదిగా మొదలయ్యాయి. కానీ యూఎస్ లో డల్లాస్ లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్ గా రన్ స్టార్ట్ అయ్యింది. మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్ లో కూడా యూఎస్ లో రన్ అవుతోంది. స్క్రీన్స్ పెంచుతున్నారు.
► మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. నా పర్ ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మహేశ్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్ గారు, సమంత..ఇంకా చాలా మంది చూసి వాలెంటరీగా రియాక్ట్ అయ్యారు. ఆడియెన్స్ కూడా వాళ్లకు వాళ్లే ముందుకొచ్చి మా సినిమాను ప్రమోట్ చేశారు.
► ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 15 సిటీస్ వెళ్లాను. అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు జర్నీ చేసే ఫ్లైట్ లోనే నిద్రపోయేవాడిని. హోటల్ లో నిద్ర పోయేందుకు కూడా టైమ్ ఉండేది కాదు. రిలీజ్ అయ్యాక కూడా మూవీ ప్రమోషన్ చేశాం. ప్రేక్షకులకు నా థ్యాంక్స్ చెప్పుకోవాడనికి వెళ్తున్నా. కాబట్టి అది కష్టం అనిపించలేదు.
► బాలీవుడ్ లో స్టాండప్ కామెడీ హిట్, తమిళంలో బాగా చూస్తారు. మన దగ్గర ఎందుకు సక్సెస్ కాలేదని అనిపించింది. అయితే మనం పర్పెక్ట్ గా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఛాలెంజ్ గా తీసుకుని చేశాను. ఇక్కడ కూడా స్టాండప్ కమెడియన్స్ కు ఆదరణ పెరిగితే హ్యాపీ.
► నటుడిగా ప్రతి సీన్ ను సెట్ లో ఇంప్రొవైజ్ చేసుకుంటా. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స్ అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. రేపు చేసే సీన్ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి పూర్తి క్లారిటీ తీసుకుంటా.
► ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. వచ్చే ఏడాది మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను కానీ నా ప్రయారిటీ ప్రస్తుతానికి తెలుగులో నటించడమే.
Comments
Please login to add a commentAdd a comment