టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో ఆమె మళ్లీ ప్రేక్షకులను మెప్పించనున్నారు. యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నవీన్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలకు తిరిగి భారీగా సినిమాను ప్రమోట్ చేయగా.. హీరోయిన్ అనుష్క కూడా వినూత్నంగా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సారి అనుష్క కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు. అనుష్క సినిమా కోసం ఆయన చేసిన ఓ పని నెట్టింట ట్రెండ్ అవుతోంది.
(ఇదీ చదవండి: ‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ)
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో తాజాగా అనుష్క ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన వంటకం అయిన మంగుళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తయారీ విధానాన్ని అభిమానులతో ఇలా పంచుకున్నారు.
(ఇదీ చదవండి: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విటర్ రివ్యూ)
'చెఫ్ పాత్రలో చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను. దీంతో సోషల్ మీడియా ద్వారా ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలు పెడుతున్నాను. ఇందులో ప్రభాస్ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన... ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి.' అని ప్రభాస్‌ను అనుష్క ట్యాగ్ చేశారు.
ప్రభాస్ రియాక్షన్
అనుష్క విసిరిన ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్ వెంటనే ఇన్‌స్టాలో తన ఫేవరట్ రెసిపీని పోస్ట్ చేశారు. రొయ్యల పులావ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన తయారీ విధానాన్ని కూడా ఆయన షేర్ చేశారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు విసురుతున్నట్లు ప్రభాస్ చెప్పారు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ పోస్ట్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడంటే అనుష్క సినిమాకు భారీగా ప్రమోషన్ దక్కినట్లేనని వారు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment