సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లనున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. నవీన్, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు.తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
ఇక ఇప్పుడు అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment