‘జాతిరత్నలు’ సినిమాతో హీరో నవీన్ పొలిశెట్టి జాతకమే మారిపోయింది. తొలి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తోనే ఆకట్టుకున్న ఈ ‘జాతిరత్నం’, రెండో సినిమాతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమే కాకా, నవీన్‌కు ఎనలేని క్రేజీని తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీ అంతా తన వైపు తిరిగేలా చేసింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అంతేకాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారట.
నవీన్ యాక్టింగ్‌లో కొత్తదనం చూసి ముచ్చటపడిన ఓ బడా నిర్మాత.. అతనికి భారీ పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. నవీన్ మూడో చిత్రం తమ బ్యానర్‌లో తీస్తే.. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తానని ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే నవీన్ పొలిశెట్టి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను అధికారికంగా ఒప్పుకోలేదు. నచ్చిన కథ దొరికితేనే సినిమా చేద్దామని వేచిచూస్తున్నాడట. త్వరలో తన మూడో సినిమా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
చదవండి:
జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా!
‘బిగ్‌బాస్’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment